Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సైబర్ రేప్స్..! ఈ సోషల్ పిశాచాలు చిన్నారులనూ వదలడం లేదు..!!

December 5, 2021 by M S R

abhishek

సోషల్ మీడియా ట్రోలర్స్ ఓ పిశాచజాతి… దానికి ఉచ్చంనీచం, మంచీచెడూ, నీతి-రీతి వంటివేమీ ఉండవు… నిలువెల్లా ఉన్మాదం నింపుకుని, ఫేక్ ఐడీలతో రకరకాల బూతులతో, హీనమైన బెదిరింపులతో దాడి చేసే ఓ రాక్షసగణం అది… సెలబ్రిటీలే కాదు, ఈ ప్రేత గణం ఎవరినీ వదిలిపెట్టదు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది కరోనాలో డెల్టా వేరియంట్..!! రీసెంటుగా మీడియాలో పెద్దగా చర్చకు రాని విషయం ఒకటుంది… అది అభిషేక్ బచ్చన్ ఆక్రోశం… ఎందుకంటే..? ఈమధ్య అభిషేక్, ఐశ్వర్యల జంట […]

ప్రియాంక అలియాస్ పింకీ ఔట్…! లక్కీగా కాజల్, సిరి బతికిపోయారు..!!

December 4, 2021 by M S R

priyanka

బిగ్‌బాస్ సీజన్ ముగింపుకొస్తోంది… హీట్ పెరుగుతోంది… తాజాగా ప్రియాంక అలియాస్ పింకీ ఎలిమినేట్ అయిపోయింది… బిగ్‌బాస్ టీం మరో జంటను విడదీసింది… టికెట్‌టుఫినాలె పోటీలో శ్రీరాంచంద్రతో ఓడిపోయిన మానస్‌కు ఇది ఇంకో షాక్… ఇప్పుడిక మిగిలింది ఆరుగురు… ఆ వెగటు రొమాన్స్ పండిస్తున్న సిరి, షన్ను జంటను వోట్లతో సంబంధం లేకుండా హౌజు బయటికి తన్ని తరిమేస్తే బాగుండునని ప్రేక్షకజనం కోరుకుంటున్నారేమో గానీ, షన్ను అంటే బిగ్‌బాస్ టీంకు మస్తు లవ్వు… ఆ షన్ను తోక సిరి […]

కథ అదుపు తప్పి… ఎక్కడో కూలిపోయిన స్కైలాబ్… నిత్యా, బ్యాడ్ లక్…

December 4, 2021 by M S R

nitya

త్వరలో చచ్చిపోతాం అనే భావన మనిషిలో విపరీతమైన మార్పులకు దారితీస్తుంది… ఒక కుదుపు… కరోనా మరణాల సీజన్‌లో చూశాం కదా… ఎన్ని ఉద్వేగాలు, ఎన్ని కన్నీళ్లు, ఎన్ని బాధాకర అనుభవాలు… కుటుంబాలకు కుటుంబాలే కుప్పకూలాయి… కరోనా విపత్తు, ప్రభుత్వాల నిర్లక్ష్యం, ఫార్మా మాఫియా విశ్వరూపం, ఆసుపత్రుల నిలువుదోపిడీ… బంధాలు కకావికలం… అలాంటిది ఒక ఊరు, ఒక సమాజం, ఒక ప్రాంతం ధ్వంసం అయిపోతుంది అంటే అప్పుడు చెలరేగే ఎమోషన్ల మాటేమిటి..? ఉంటామో, పోతామో అన్నట్టుగా… ఉన్నప్పుడే తిందాం, […]

‘స్మార్ట్’గా బుక్కయిపోతున్నం… ప్రైవసీ ఓ భ్రమ… మన కాల్స్ కూడా ఓపెన్…

December 4, 2021 by M S R

ai ads

ఒక కొత్త నంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకున్నా… తరువాత కాసేపటికే ఆ పేరు, అకౌంట్ ఫేస్‌బుక్‌లో ‘people you may know’ జాబితాలో పదే పదే కనిపించింది… ఈమధ్య ఏదో పని అవసరమై ఒక వ్యక్తితో చాలాసార్లు ఫోన్‌లో మాట్లాడాల్సి వచ్చింది… అంతకుముందు పరిచయం కూడా లేదు… ఆ వ్యక్తి పేరు, అకౌంట్ ఫేస్‌బుక్ ‘యు మే నో’ జాబితాలోకి వచ్చేసింది… ఏదైనా ఊరికి వెళ్తున్నారా..? మీకు ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు సమీపంలోని మిత్రుల వివరాలు అందుతూనే ఉంటయ్… […]

ఓహో… ఈ ఒమైక్రాన్ వైరస్ పుట్టుకకూ ఓ కొత్త కథ ఉందన్నమాట..!!

December 4, 2021 by M S R

amicron

ఒమైక్రాన్… దీనికి అంత సీన్ లేదురా నాయనా… అని ఎందరు చెప్పినా మన మీడియా వినదు… మన ప్రభుత్వాలు వినవు… అసలు సమయాల్లో కరోనాను అడ్డుకునే తెలివి లేదు, జనాన్ని ఆదుకున్న ఔదార్యం-సామర్థ్యం లేవు గానీ… ఇప్పుడు తెగ భయపెట్టేస్తున్నారు… ఆంక్షలు, జరిమానాలు, తెగ హడావుడి… మళ్లీ బూస్టర్ల డోసుల పేరిట అడ్డగోలు ధరలకు వేక్సిన్లను జనానికి కుచ్చేయాలనే దందా… WHO చెబుతోంది, ఇప్పటికి ప్రపంచంలో ఒమైక్రాన్ వల్ల ఒక్క మరణం లేదని..! మెలికలుగా, చుట్టలుగా అల్లుకున్న […]

ఫ్యాక్షన్లు లేవ్… కక్షల్లేవ్… దిగజారుడు పాలిటిక్స్ అసలే లేవ్… అందరికీ ఇష్టుడే..!!

December 4, 2021 by M S R

rosaiah

ఎనభై ఎనిమిదేళ్ల వయస్సులో కొణిజేటి రోశయ్య కన్నుమూశాడు..! నిజానికి చాన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం కుదురుగా లేదు… వార్ధక్యంతోపాటు వచ్చే సమస్యలే… ప్రతిసారీ ఒక ప్రశ్న కదలాడుతూ ఉంటుంది మన మెదళ్లలో…! ఆయన ఎన్‌జీరంగా శిష్యుడు, ఫిఫ్టీస్‌‌లోనే కామర్స్‌లో డిగ్రీ.., ఆంధ్రా ఉద్యమం… సబ్జెక్టును సరిగ్గా అర్థం చేసుకుంటాడు, చదువుతాడు, పరిస్థితులకు సరిగ్గా అన్వయిస్తాడు… కాస్త వ్యంగ్యాన్ని రంగరించి, ప్రత్యర్థుల మీదకు వదిలేస్తాడు… ఇక జవాబు ఏమివ్వాలో తెలియక ఎదుటోడు గిరగిరా కొట్టుకోవాలి… 15 సార్లు ఉమ్మడి తెలుగు […]

‘గుడ్డు’ డెసిషన్… ఒప్పుకోరు కొందరు… అదీ మాంసమేనట, వద్దట… రచ్చ..!!

December 4, 2021 by M S R

egg

గుడ్డు శాకాహారమా..? మాంసాహారమా..? మళ్లీ చర్చ ముందుకొచ్చింది… నిజానికి కోడి ముందా..? గుడ్డు ముందా..? అనే చర్చ ఉన్నన్నిరోజులూ… ఈ శాకాహారమా, మాంసాహారమా అనే చర్చ కూడా బతికే ఉంటుంది… ఇప్పుడు కథేమిటంటే..? కర్నాటక ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది… మధ్యాహ్నభోజనంలో భాగంగా పిల్లలకు గుడ్డు ఇవ్వాలనేది ఆ నిర్ణయం… వారానికి మూడు గుడ్లు… అది కూడా కేవలం ఏడు జిల్లాల్లోనే… ఎందుకంటే..? ఆ జిల్లాల్లో పిల్లల పౌష్ఠికాహార స్థాయి బాగా తక్కువగా, రక్తహీనత ఎక్కువగా ఉందట… […]

ఆ రెండు సిరివెన్నెల పాటలు… రాసిందొకటి- కథాసందర్భం మరొకటి…

December 4, 2021 by M S R

telugu song

ఇప్పుడంతా సిరివెన్నెల పాటల మీద దుమారం నడుస్తోంది కదా… నిజానికి మనమూ చెప్పుకున్నాం… సినిమా పాట దాన్ని రాసే కవి కోసం కాదు, తన సొంత ఘోష కూడా కాదు… సినిమాలో ఒక సందర్భం కోసం, కథానుగుణంగా రాయబడే పాట… దర్శకుడి టేస్ట్, కథ డిమాండ్, హీరో ఇమేజీ, సీన్ ఇంపార్టెన్స్, సంగీత దర్శకుడి సహకారం వంటివి చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి తప్ప ఏ సినిమా కవీ తన కవిత్వాన్ని గుమ్మరించడం కోసం రాయడు సినిమా పాట… […]

హమ్మయ్య… మళ్లీ నాగబాబుకు నవ్వే కొలువు దొరికింది…

December 3, 2021 by M S R

nagababu

హమ్మయ్య… ఎట్ లాస్ట్… చిరంజీవి తమ్ముడు నాగబాబుకు మళ్లీ ఓ కొలువు దొరికింది… అదే నవ్వే ఉద్యోగం… కామెడీ షోలో జడ్జిగా కూర్చుని, పకపకా నవ్వడమే… కామెడీ స్టార్స్ అని మాటీవీలో ఓ కామెడీ షో వస్తుంది తెలుసు కదా… నిన్నమొన్నటిదాకా శేఖర్ మాస్టర్ ఒక జడ్జిగా ఉండేవాడు… ఆ ప్లేసు ఖాళీ అయినట్టుంది… తనే ఇక భరించలేక పారిపోయాడో, మళ్లీ ఈటీవీ వాళ్ల ఢీ షో రారమ్మని పిలిచిందో జంప్… ఆ కుర్చీలోకి నాగబాబు చేరిపోయాడు… […]

తమరి బొంద, బోకె… ఆలూ లేదు, చూలూ లేదు… ముప్పు పేరు ఒమిక్రాన్ అట..!!

December 3, 2021 by M S R

omicron

అదుగో ఒమిక్రాన్…. వచ్చె, వచ్చె… అయిపోయింది, అంతా అయిపోయింది, ఇక సత్తెనాశ్… అదుగో రెండు కేసులు, హైదరాబాద్ కూడా వచ్చేసిందట… ఈ నీచ్ కమీన్ మీడియా చేస్తున్న దుర్మార్గం, సమాజాన్ని ప్యానిక్ చేస్తున్న దారుణం అంతా ఇంతా కాదు… దిక్కుమాలిన జర్నలిజానికి అజ్ఞానం తోడయితే ఎంత నష్టమో ఒమిక్రాన్ వార్తలే చెబుతున్నయ్… అన్నింటికన్నా నీచం ఏమిటంటే అప్పుడే రాష్ట్రాల వైద్యారోగ్య బాధ్యులు కూడా ఆ రేంజులో మాట్లాడుతుండటం… కొత్తగా ఆంక్షలు, జరిమానాలు అంటూ బెంబేలెత్తించడం… అరాచకానికి అసలైన […]

అదే సీన్… రెండు పాటలు… ఒకటి తండ్రి, మరొకటి కొడుకు… కానీ ఎంత తేడా…

December 3, 2021 by M S R

telugu song

ఆమధ్య తెలుగు పాట గురించి… సందర్భోచితం గురించి… పాత్రోచితం గురించి… సహజత్వం గురించి… ఏదేదో చెప్పుకుంటూ ఆగిపోయినట్టున్నాం కదా… అంతేకదా మరి… ఎహె, ఊరుకొండి సార్, తెలుగు సినిమా పాటల్లో విలువలు, ప్రమాణాల గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది..? సొట్టలు పడిన సత్తురేకు డబ్బాలో గులకరాళ్ల మోతలా ఓ ట్యూన్, చిత్రవిచిత్ర పదాల్ని అందులో పేర్చేయడం అంటారా..? అలాగని అన్నీ ఒకేగాటన కట్టేసి తీసిపారేయలేం కదా… సహజత్వం, పాత్రోచితం, సందర్భోచితాల గురించే తీసుకుంటే… పర్ సపోజ్, ఓ జానపదుడు, […]

Marakkar… తారాగణం, ఖర్చు, చిత్రీకరణ… అత్యంత భారీతనం…

December 3, 2021 by M S R

marakkar

గ్రాండియర్..! కొన్ని ఇంగ్లిష్ సినిమాలు చూస్తుంటే ఈ చిత్రీకరణ, ఈ పర్‌ఫెక్షన్, ఈ భారీతనం మనవాళ్లకు ఎందుకు చేతకావు అనిపిస్తుంది కొన్నిసార్లు… బాహుబలి వంటి అట్టముక్కల సెట్టింగులు, గ్రాఫిక్కుల మాయలు, కొబ్బరి చెట్ల స్ప్రింగు అస్త్రాలు వదిలేయండి కాసేపు… దాని మార్కెట్ ఇంటర్నేషనల్, కానీ క్వాలిటీలో అంత సీన్ లేదు… పోనీ, ప్రాంతీయ సినిమా ఖర్చు, పెట్టుబడి, తిరిగి వచ్చే డబ్బు పరిమితం కాబట్టి, ఆ లెక్కల్లో భారీతనం రిస్క్ అనుకుందాం… అది కూడా గతం… ఇప్పుడు […]

‘లైంగిక బాధితురాలి’కే శిక్ష..! ఇదెక్కడి న్యాయం కామ్రేడ్స్..?!

December 3, 2021 by M S R

cpim

అందరికీ నీతులు చెప్పేవాళ్లు… అందరికన్నా నీతిమంతులుగా ఉండేందుకు ప్రయత్నించాలి..! ముందుగా కేరళలోని ఓ కేసు ఏమిటో చదవండి… నిన్న తిరువల్ల పోలీసులు 39 ఏళ్ల సి.ఇ. సాజి అనే వ్యక్తిని అరెస్టు చేశారు… ఆయన అధికార పార్టీ సీపీఎం సభ్యుడు… తనపై కేసు ఏమిటయ్యా అంటే..? తమ పార్టీకే చెందిన ఓ మహిళ నగ్న వీడియోను ఆన్‌లైన్‌లో సర్క్యులేషన్‌‌లో పెట్టాడు… అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది… ఈ కేసులో సాజితోపాటు మరో పదకొండు మంది నిందితులు, […]

బాదడమే తెలిసిన కరెంటోళ్లు… వసూలైన ఛార్జీలు వాపస్ ఇస్తున్నారహో…

December 3, 2021 by M S R

true up

ప్రజాశక్తిలో ఓ సింగిల్ కాలమ్ బాక్స్ కనిపించింది… సీపీఎం సాగించిన పోరాటం, ప్రయత్నంతోనే కరెంటోళ్లు ఇన్నాళ్లూ వసూలు చేసిన వేల కోట్లను మళ్లీ వాపస్ ఇస్తున్నారు అనేది వార్త… ఇది తమ పోరాట ఫలితమే అని ఓన్ చేసుకుంటున్నారు… తప్పేమీ లేదు, అర్హులే… నిజం, వాళ్లే ఆ ట్రూఅప్ చార్జీల వెంట పడ్డారు… అందుకే ఈ ఆందోళనతో ఏమొస్తుంది, ఈ పోరాటంతో ఏమొస్తుంది అనే నిస్పృహ అక్కర్లేదు… ఈ దుర్మార్గపు ప్రభుత్వాలు, వ్యవస్థల మీద పట్టు వదలని […]

అమెరికా అయితేనేం… అఖండ జాతరలు… కొబ్బరికాయలు, పూనకాలు…

December 3, 2021 by M S R

us akhanda

అవును, ఎందుకు మారాలి..? ఛట్, రోమ్‌లో రోమన్‌లా ఉండాలనేది ఉత్త దండుగ మాట… మనం ఎక్కడున్నా మనలాగే ఉంటాం… అంగారక గ్రహం మీదకు వెళ్లినా, అక్కడ సరికొత్త నాగరికతల్ని నిర్మించుకున్నా సరే… మనం మనమే… మన మూలాల్ని, మూల సంస్కృతిని కాపాడుకోవాలి… అంతేకదా… అక్కడా థియేటర్లు ఉండాలి… అక్కడ మన హీరోల సినిమాల్ని రిలీజ్ చేయాల్సిందే… ఎంత రేట్లయినా సరే పోయాల్సిందే… తెర ముందు డాన్సులు వేయాల్సిందే… కార్ల ర్యాలీలు, జెండాలు, హంగామా ఉండాల్సిందే… థియేటర్ ముందు […]

తొక్కుడు, నరుకుడు… మధ్యలో ఈ తొక్కేమిటో, నాకుడేమిటో బోయపాటికే ఎరుక…

December 2, 2021 by M S R

akhanda

అందుకే మరి అప్పుడప్పుడూ కొందరు దర్శకుల తెలివితక్కువతనం, పైత్యం మీద చిరాకెత్తేది… తెలివితక్కువతనంలో బోయపాటి కూడా తక్కువోడేమీ కాదు… అఖండలో ఓ సీన్ ఏమిటంటే..? కలెక్టర్ కేరక్టర్ శరణ్య (ప్రజ్ఞా జైస్వాల్)ను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ పల్లెటూరిలో పుట్టించాడు కథకుడు… అసలు ఆ కలెక్టర్ పాత్ర తెలంగాణలోనే ఎందుకు పుట్టాలి..? ఎందుకంటే సినిమా తెలంగాణలోనూ కూడా నడవాలి, తెలంగాణను ఇగ్నోర్ చేసినట్టు ఉండకూడదు, అసలే ఈమధ్య ట్రెండ్ తెలంగాణ పాటలు, పదాలు, పాత్రలు… పైగా తెలంగాణలోనే […]

ఫాఫం పీకేను నమ్మిన మమత… ప్రధాని పీఠంపై అంతులేని ఆశలు…

December 2, 2021 by M S R

mamata

పెద్ద పెద్ద రాజకీయ పండితులు అవసరం లేదు… మమతకు ప్రధాని పీఠంపై కన్నుపడింది, ఆశ పెరిగింది, చాన్స్ కనుచూపు మేరలో లీలగా కనిపిస్తోంది… మొన్నటి గెలుపుతో ధీమా పెరిగింది… పీకే మీద భరోసా కుదిరింది… కాంగ్రెస్ రాహుల్‌తో ఇక వేస్టని తేల్చేసుకుంది… ఇక ఆట మొదలెట్టింది… అసలు ఈ ఆట నుంచి కాంగ్రెస్‌ను డిలిట్ చేయాలని అనుకుంటోంది… శరద్ పవార్‌ను కలిసింది… కూటమి కడదాం అని చెప్పింది, తనూ సరే అన్నాడు… (ఒకవైపు కాంగ్రెస్‌తో కలిసి మహారాష్ట్రలో […]

రాజీవ్ కనకాల… చచ్చిపోదాం బ్రదర్… ఈ జోకులేమిటి భయ్యా…

December 2, 2021 by M S R

gobbemma

ఐనా మన అమాయకత్వం గానీ… రామోజీరావు ఎందుకు మారతాడు..? మల్లెమాల ఎందుకు మారతాడు..? అసలే ఎంత బూతైనా సరే, జనం జబర్దస్త్ చూస్తున్నారు, అదే ఈటీవీని నిలబెడుతోంది… అంతే, అన్నీ అలాగే ఉంటే సరి… ఈటీవీ ప్లస్ ఎవడూ చూడటం లేదుగా… రెచ్చిపోదాం బ్రదర్ అని ఓ కామెడీ అనబడే మరో జబర్దస్త్ మార్క్ షో ప్రసారం చేస్తున్నారు కదా… జబర్దస్త్ కమెడియన్లు ప్లస్ కొత్తవాళ్లతో కలిపి పిచ్చి ప్రయోాగాలు చేసి ప్రేక్షకుల్ని చావదొబ్బేస్తున్నారు… ఆ జబర్దస్త్‌లో […]

అదే గనుక జరిగితే… మరి రేవంత్‌రెడ్డి పరిస్థితేమిటి..? ఓ పెద్ద ప్రశ్న..!!

December 2, 2021 by M S R

revanth

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌రెడ్డి కేంద్ర బిందువు అవుతున్నాడా..? నిజానికి రాజకీయాల్లో పొద్దున ఉన్న సిట్యుయేషన్ మాపు ఉండదు, ఈరోజు లెక్క వేరు, రేపటి లెక్క వేరు… పరిస్థితులు ఎటు నుంచి ఎలా తన్నుకొస్తాయో ఎవరూ అంచనా వేయలేరు… ఒక దశలో తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయడానికి సిద్ధమై, కాంగ్రెస్ చేతకానితనంతో అది అమలు జరగక… ఇక ఏడేళ్లుగా కేసీయార్ రాష్ట్రంలో రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని తొక్కీ తొక్కీ నారతీసి, చీరి చింతకుకట్టి, కుళ్ల బొడిచాడు… ఇక నాకు […]

జై బాలయ్య… కన్నెర్ర చేస్తే తెర నిండా నెత్తురే… కత్తిపడితే ఖైమాయే…

December 2, 2021 by M S R

akhanda

బాలయ్య సినిమాకు ఓ నిర్ణీత ఫార్ములా ఉంటుంది… అది అందరికీ నప్పదు… అది బాలయ్యకే ప్రత్యేకం… వేరే హీరోలకు ఆ ‘అతి’ అస్సలు సూట్ కాదు… చేయలేరు కూడా… అభిమానులకు కూడా బాలయ్య అలా కనిపిస్తేనే పండుగ… కథానాయకుడు, మహానాయకుడు, శాతకర్ణి ఎవరికి కావాలి..? బాలయ్య అంటే ఓ సింహ, ఓ లెజెండ్… అంతే… తెర మీద బాలయ్య అలాగే కనిపించాలి… కథాకాకరకాయ జాన్తా నై… హీరోయిన్ ఎవరైనా పర్లేదు, విలన్ ఎవరున్నా డోన్ట్ కేర్… హీరో […]

  • « Previous Page
  • 1
  • …
  • 412
  • 413
  • 414
  • 415
  • 416
  • …
  • 450
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions