పెద్ద సారు ఎన్నడూ లేనిది, ప్రగతి భవన్ తలుపులు తెరిచి, అఖిలపక్షాల్ని, దళిత ప్రజాప్రతినిధుల్ని పిలిచి భేటీ వేసినప్పుడే అర్థమైపోయింది… ఏదో కొత్త కథకు శ్రీకారం చుడుతున్నాడని…! కేసీయార్ ప్రతి అడుగు వెనుక ఓ రాజకీయ ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది… లేకపోతే ఇటు పుల్ల అటు పెట్టేదే లేదు… అయితే తను సీఎం అయ్యాక ఎన్నెన్నో ఉపఎన్నికల్ని ఉఫ్ అని ఊదేసిన ఆయన హుజూరాబాద్ ఉపఎన్నిక అనేసరికి ఎందుకంత బెంగపడుతున్నడో ఎవరికీ అర్థం కావడం లేదు… నిజంగా […]
మోడీ సర్కారు *స్పైవార్*… ప్రైవసీకి సమాధి… ఐతే రియాలిటీ ఏమిటి..?!
ఏదేని రాష్ట్రంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగినా సరే, నేషనల్ మీడియాకు సరిగ్గా ఆనదు… అదే ఢిల్లీలో గానీ, ముంబైలో గానీ చిన్న ఇష్యూను కూడా పది భూతద్దాలు పెట్టి మరీ చూపిస్తుంది… పెగసాస్ గురించి దివైర్ న్యూస్ సైట్, ఇతర మీడియా ఉమ్మడిగా చేస్తున్న హంగామా అలాగే అనిపిస్తోంది… పెగసాస్ కథేమిటీ అంటారా..? అది ఇజ్రాయిల్‌లో NSO అనే సంస్థ రూపొందించిన ఒక టూల్… లేదా స్పైవేర్… దాని ఆధారంగా ఎంత సెక్యూర్డ్ ఫోన్ అయినా […]
ఖగోళానికి ఆమె భగవద్గీతను, గణేషుడి బొమ్మనూ ఎందుకు తీసుకెళ్లింది..!?
కొద్దిరోజులుగా మనం స్పేస్‌లోకి వెళ్లిన వాళ్ల గురించి చెప్పుకుంటున్నాం కదా… ఈ ఒక్కటీ ఓసారి చదవండి… ‘‘2003లో కొలంబియా స్పేస్ షిప్ ప్రమాదంలో మన కల్పనా చావ్లా సహా మరికొందరు ఆస్ట్రోనాట్స్ మరణించారు… తరువాత నాసా కార్యకలాపాలు ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు అయిపోయింది… కానీ తేరుకుని, 2006లోనే మరో టీం రెడీ చేశారు… అందులో మన సునీతా విలియమ్స్ కూడా ఉంది… ఓ ఉద్రిక్తత… కొలంబియా ప్రమాదం నేపథ్యంలో అందరిలోనూ ఓ భయం… సునీత భయపడలేదు, భయపడేవాళ్లు ఖగోళయాత్రకు […]
మంగ్లి తప్పు ఏమీ లేదు..! ఎందుకీ ఏడ్పులు..? ఓసారి పూర్తిగా చదవండి ఇది…!!
మంగ్లీ..! తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు… ఆమధ్య ‘సారంగదరియా’ పాటతో ఆమె ఎక్కడికో వెళ్లిపోయింది… తన గొంతులో ఏదో మాయ ఉంది… మనల్ని మైమరిపించే ఏదో మత్తుంది… అది ఆమెకు దేవుడిచ్చిన వరం… ఈమధ్య ఏదో బోనాల పాట పాడింది… యూబ్యూటులో చూస్తే 43 లక్షల దాకా వ్యూస్ ఉన్నయ్… మామూలు విషయం కాదు… కానీ అకస్మాత్తుగా ఓ వివాదం… ఆమె మీద… ఏమనీ అంటే… ‘‘ఆమె రాయలసీమ బిడ్డ, తెలంగాణతనం తెలియదు, గ్రామీణదేవతలనూ వదల్లేదు […]
ఏం బాబూ..? బాబు తెచ్చిన అప్పులకు హెరిటేజ్ ఆస్తులు తాకట్టు పెట్టాడా..?!
‘‘వెనుజులా దేశానికి జగన్ లాంటి వాడే అధ్యక్షుడై ప్రజలకు డబ్బు పంచిపెట్టాడు. ఫలితంగా సిరిసంపదలతో తులతూగిన ఆ దేశం ఇప్పుడు అప్పులపాలై ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. పొట్టకూటి కోసం మహిళలు వ్యభిచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌కు అటువంటి పరిస్థితి రాకూడదని కోరుకోవడంలో తప్పు లేదుగా!’’……. రాధాకృష్ణ తాజా ఆణిముత్యాల్లాంటి రాతలు ఇవి… ఒక రాజ్యం దివాలా తీస్తే ఇక ఆ మహిళలు వ్యభిచారం చేయాల్సిందే అనే మానసిక స్థితి, భావదారిద్య్రం పట్ల ఆయనకు నా సానుభూతి..! […]
అయ్యా, జగన్ సారూ..! సామాజిక న్యాయం సరే… సామాజిక ప్రయోజనం మాటేంటి..?!
జగన్ ఏపీ సాహిత్య అకాడమీ అధ్యక్షురాలిగా నియమించిన మహిళ ఆంధ్రా సాహిత్య అభిమానుల్లో ఎవరికైనా తెలుసా..? ఆల్ రెడీ లక్ష్మిపార్వతి అధ్యక్షురాలిగా ఉన్న తెలుగు అకాడమీ ఉద్దరించింది ఏమిటి..? తెస్కృత అకాడమీగా పేరుమార్చి, రెండు భాషలూ పేకముక్కలే అని సూత్రీకరించడమేనా..? దృశ్య కళల అకాడమీ, చరిత్ర అకాడమీ, సంగీత నృత్య అకాడమీ, నాటక అకాడమీ వంటి రకరకాల సంస్థల పేర్లు కనిపిస్తున్నాయి జాబితాలో… అసలు అవి గతంలో ఉన్నాయా..? ఉంటే ఏం చేసేవి..? ఏం చేయాలి..? సంసృతికి […]
స్పేస్‌లోకి అందరూ వెళ్తున్నారు… మరి మన సంగతేంటి..? ఎక్కడ ఆగిపోయాం..?!
ఏదైనా కమర్షియల్ రాకెట్ ప్రయోగించినా సరే… ఇస్రోకు మంచి కవరేజీ ఇస్తుంది మన మీడియా… గుడ్… రోజూ చదివే వేల క్షుద్ర వార్తలతో పోలిస్తే మేలు… కానీ మొన్న బుధవారం ఒక ప్రయోగం జరిగింది కానీ మీడియాకు పెద్దగా పట్టలేదు, ఎందుకో మరి… నిజానికి దానికి ప్రాధాన్యం ఉంది… ప్రపంచమంతా స్పేస్ టూరిజం గురించి, స్పేస్ రీసెర్చుల గురించి మాట్లాడుకుంటోంది ఇప్పుడు… మొన్న బ్రాన్సన్ స్పేస్ ప్రయాణం, త్వరలో జెఫ్ బోజెస్ ప్రయాణం… అసలు మనం ఎక్కడున్నాం..? […]
చైనా సరిహద్దుల్లో ఏదో జరుగుతోంది..? ఆ ‘ప్రముఖుల’తో భేటీల మర్మమేమిటో..?!
మామూలు పరిస్థితులే కాదు… సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఉద్రిక్తత, చైనాతో సరిహద్దు ఘర్షణ వంటి సందర్భాల్లో కూడా మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకోలేదు… వాస్తవ పరిస్థితులేమిటో, తమ ప్రభుత్వం ఏం చేస్తున్నదో చెప్పే ప్రయత్నం ఏమీ చేయలేదు… దాడులకు ముందు చెప్పాల్సిన పనిలేదు, కొన్ని రహస్య ఎత్తుగడలుంటయ్… కానీ ఉద్రిక్తతలు చల్లారాకనైనా విపక్షాలకు పరిస్థితులేమిటో వివరిస్తే బాగుండేది… వాళ్లూ ప్రజలను రిప్రజెంట్ చేసేవాళ్లే కదా… ఉగ్రవాద దాడులు, సరిహద్దు ఘర్షణల సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన, […]
కుడి ఎడమగా కన్పించినా సరే… చూసేయండి, ఆ కుడీఎడమా ఒకటే…!!
రివ్యూయర్ :: Prasen Bellamkonda………… జీవితం నీకు రెండో అవకాశం ఇవ్వదు అనే నిజాన్ని అబద్దం చెయ్యడానికి టైం లూప్ అనే ఊహాత్మాక శాస్త్రీయ సంభవాన్ని కేంద్రం చేసుకుని ఓ కధ అల్లుకుంటే అదే కుడి ఏడమైతే వెబ్ సిరీస్… ఆహా ఓటిటి కంటెంట్ మీద ఉన్న అపనమ్మకంతో నిర్లిప్తంగానే ‘కుడి ఏడమైతే ‘ చూడడం మొదలెడితే… అలా లాక్కెళ్లిపోయింది కన్ఫ్యూజింగ్లీ గ్రిప్పింగ్ గా… నిజంగా ఇది ఆహా తరహా వెబ్ సిరీస్ కాదు… నాకైతే నచ్చింది… […]
నారప్ప..! అనంతపురం యాసను నరికేశాడే… అంతా కృతకమైన భాష…!!
నారప్ప అనే సినిమా తీశారు కదా, త్వరలో ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు… అందులో వెంకటేష్ హీరో… అసురన్ అనే తమిళ సినిమాకు ఇది రీమేక్… ఇది అందరికీ తెలిసిందే కదా… ట్రెయిలర్ రిలీజ్ చేశారు మొన్న… రెండు రోజుల్లోనే కోటి వ్యూస్ ఉన్నయ్… సో, నిర్మాతలూ హేపీ… ట్రెయిలర్ చూస్తుంటే సీన్లు బాగానే చిత్రీకరించారనీ, అవసరమైన ఎమోషన్లు, సీన్ల నాణ్యత గురించి దర్శకుడు కాస్త తపించాడనీ తెలుస్తూనే ఉంది… ఎటొచ్చీ భాష విషయంలోనే అసంతృప్తి… మనస్సులు చివుక్కుమనిపించేలా […]
మన స్పేస్ ఐకన్స్ విశ్వమానవులు..! వాళ్ల పెళ్లిళ్లకు కూడా ఏ ఎల్లలూ లేవు..!!
సునీతా విలియమ్స్… ప్రొఫెషనల్ వ్యోమగామి… అనేకసార్లు స్పేస్‌వాక్ కూడా చేసింది… ఏడుసార్లు స్పేస్ వాక్ చేసిన మహిళ, 50 గంటల సుదీర్ఘ స్పేస్ వాక్ సమయం ఆమె పేరిట ఉన్న రికార్డులు… ఆమె తండ్రివి ఇండియన్ రూట్స్, గుజరాత్… ఆయన పేరు దీపక్ పాండ్యా… ఆయన భార్య పేరు ఉర్సులిన్ బోనీ… ఆమె రూట్స్ స్లొవేనియా దేశానివి… ఆ ఇద్దరి సంతానమే సునీతా… ఈమె పెళ్లి చేసుకున్నది కూడా అమెరికన్నే… ఆయన పేరు మైఖేల్ విలియమ్స్… ఆమెకు, […]
మోడీ సర్కారు అసలు సమస్య… రెండు తెలుగు రాష్ట్రాల సర్కార్లు మరో సమస్య…
నిజం… కేంద్ర జలశక్తి శాఖకు ఓ సోయి లేదు, ఓ దిశ లేదు… సేమ్, కరోనా మీద కార్యాచరణలాగే… దేవుడా… ఈ ప్రభుత్వానికి పాలన అంటే ఏమిటో తెలియచేయి స్వామీ అని ఆ రాముడిని వేడుకోవడమే..! అంతర్రాష్ట్ర నదీజలాలపై ఈరోజుకూ మోడీ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు అనేది నిజం… ప్రస్తుతం కృష్ణా, గోదావరి బోర్డులకు సర్వాధికారాలు ఇస్తూ గెజిట్ నోటిఫై చేయడం తాజా ఉదాహరణ… అదేమిటి..? అత్యుత్తమ పరిష్కారం కదా అంటారా..? అదెలా..? రాష్ట్రాలను విభజిస్తున్నాం […]
స్పేస్లోనికేనా..? ఛలో నేను రెడీ..! చదవాల్సిన పాఠం ఈ 82 ఏళ్ల బామ్మ..!
ఏమని చెప్పేది..? ఆమె జీవితం మనకు నేర్పించే ఎన్ని పాఠాలను ఒక్కచోట పేర్చేది..? అందుకే సూటిగా కథే చెప్పుకుందాం… ఆ కథే పట్టుదల, సంకల్పం, ఆరోగ్యం, నిరీక్షణ, పిచ్చిప్రేమ, పాజిటివ్ దృక్పథం వంటి ఎన్నో పదాలకు అర్థాలను చెబుతుంది… ఆమె పేరు వాలీ ఫంక్… వయస్సు 82 ఏళ్లు… అమెరికన్… ఈ వయసులో ఆమె అంతరిక్షంలోకి ప్రయాణించే ఓ స్పేస్ క్యాప్సూల్‌కు పైలట్ కాబోతోంది… ఆమెను ఆస్ట్రో టూరిస్ట్ అనకూడదేమో… పోనీ, ఆస్ట్రో పైలట్ అందాం… ఈ […]
విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
నిన్న లగడపాటి రాజగోపాల్ శ్రీమతి జానకి ఫేస్బుక్లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్ ఇంట్రస్టింగుగా అనిపించింది… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ […]
భేష్ నిమిషా..! ఈ టైక్వాండో బ్లాక్బెల్టర్ మళ్లీ ఇరగదీసేసింది..!!
అదేమిటో గానీ… మన తెలుగువాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదు మొర్రో అని మనం ఏడుస్తుంటాం… కానీ వర్తమాన సవాళ్లకు దీటుగా… హీరోలే పరమార్థంగా బతికే మన ఇండస్ట్రీలో తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న కేరళ ప్రతిభను చూడాలి… వావ్… బ్లాకీస్, నో ప్రాబ్లం… మొహమంతా మొటిమలు, గుంతలు, నో ప్రాబ్లం… డీగ్లామరైజ్డ్ రోల్స్, నో ప్రాబ్లం… కొత్త చరిత్రలు లిఖిస్తున్నారు… హేట్సాఫ్… నిజానికి తెలుగు ఇండస్ట్రీ కూడా అంతే కదా… సినిమాలు అంటే తమిళ లేదా […]
జూనియర్, రాంచరణ్, ఆలియా జాన్తానై… రాజమౌళే హీరో… ఆ మేకింగ్ వీడియో…
ఆర్ఆర్ఆర్… బాహుబలి తరువాత రాజమౌళి తీస్తున్న మరో అత్యంత భారీ చిత్రం… జక్కన్న వంటి విశేషణాల్ని నేను తగిలించను… సినిమా ఇండస్ట్రీలో జక్కన్నతనం అదృష్టాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది… స్ప్రింగు తాడిచెట్లు వంటి జానపద కథ తరహా కంటెంటుును ప్రేక్షకులు బాహుబలిలో ఆమోదించలేదా..? వేల కోట్లు కురిపించలేదా..? కాకపోతే రాజమౌళిని ఎందుకు మెచ్చుకోవాలంటే… అందరు దర్శకుల్లాంటివాడు కాదు… సాహసి… తను కొన్ని సీన్లు కలకంటాడు… అవి అలాగే వచ్చేవరకూ కష్టపడతాడు… అఫ్ కోర్స్, గతంలో తన […]
రోడ్డు గుంతల్లో ధగధగ మెరుపులు… చినుకు పడితేనే వణికే విశ్వనగర ఖ్యాతి…
ఆయన పేరు… Gangadhara Tilak Katnam …. ప్రతి సిటిజెన్, ప్రతి రిటైర్డ్ ఎంప్లాయీ ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి… నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కొరకు పరితపించే వ్యక్తి… ఎప్పుడో ఓరోజు… రోడ్డు పక్కన నిలబడి ఉంటే, రోడ్డు మీద గుంత కారణంగా ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయిన విషాదాన్ని ప్రత్యక్షంగా చూశాడు… ఆ తరువాత ఆ రిటైర్డ్ రైల్వే ఉద్యోగి బతుకు పంథాయే మారిపోయింది… తను, తన శ్రీమతి… ఒకటే పని… పొద్దున్నే రోడ్డెక్కడం, ఎక్కడ గుంత […]
‘‘దేవుడున్నాడు… ఇక వాడిదే భారం..!’ ఆస్తికత్వం వైపు మనిషి మొగ్గు..!!
దేవుడిని మనిషి సృష్టించాడా..? మనిషిని దేవుడు సృష్టించాడా..? అసలు దేవుడంటే ఎవరు..? మన పుట్టుకకు పరమార్థం ఏమిటి..? జన్మంతా తపస్సు చేసినా మనకు సమాధానం కష్టం… పెద్ద పెద్ద రుషులు ఏళ్ల తరబడి ఏ హిమాలయాల గుహల్లోనో తలకిందులుగా వేలాడినా జవాబు దొరకడం లేదు… అంతటి సంక్లిష్టమైన ప్రశ్నలు ఇవి… కొన్నేళ్లుగా గమనిస్తే గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలకు భక్తుల రద్దీ పెరుగుతోంది… అంటే జనంలో భక్తి బాగా పెరుగుతున్నట్టేనా..? దేవుడిని నమ్మనివాళ్ల సంఖ్య తగ్గిపోతున్నట్టేనా..? గతంకన్నా […]
అనుకున్నట్టు జరిగితే… శిరీషకన్నా ముందే ఈయనకు చప్పట్లు కొట్టేవాళ్లం..!!
ఆయన పేరు చారి… తన స్వస్థలం మన మహబూబ్‌నగర్… అప్పట్లో ఉస్మానియా యూనివర్శిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్‌గా చేసేవాడు… తక్కువ వయస్సులోనే కన్నుమూశాడు… ఆయన కొడుకు పేరు శ్రీనివాసచారి… కష్టమైనా సరే, ధైర్యంగా శ్రీనివాసచారిని తల్లి, అత్త పెంచారు, చదివించారు… ఉస్మానియా యూనివర్శిటీ కాలేజీలో ఇంజనీరింగ్ చేశాడు… సక్సెస్ కోసం వెతుకులాటలో… చదువు అయిపోగానే అమెరికా వెళ్లాడు… అమెరికా వస్తాననే ఇంట్రస్టు చూపించిన చాలా మంది బంధువులకు, స్నేహితులకు సాయం చేశాడు… అయోవాలోని సెడార్ ఫాల్స్‌లో ఉండేవాడు… పెగ్గీ […]
అనుకోకుండా ఆ విమానం కెప్టెన్‌ను చూసి ఆ ఎంపీ ఆశ్చర్యపోయాడు..!!
నిజంగా ఇంట్రస్టింగు వార్తే… రీసెంట్ వార్తే… ఢిల్లీ నుంచి చెన్నైకి ఓ విమానం బయల్దేరబోతోంది… ఒకాయన వచ్చి మొదటి వరుస సీట్లలో ఆసీనుడయ్యాడు… కాసేపటికి మాస్క్ ధరించిన కెప్టెన్ వచ్చాడు… ‘‘బోర్డింగ్ అయిపోయింది, ఇక బయల్దేరదాం… మీ అందరినీ క్షేమంగా చెన్నైకి తీసుకెళ్లడం నా బాధ్యత… రిలాక్స్‌గా కూర్చొండి’’ అని సహజంగానే విమానం బయల్దేరేముందు చెప్పే మాటలు చెప్పాడు… రెడీ టు టేకాఫ్… సదరు కెప్టెన్ మాటలు వింటుంటే బాగా పరిచయం ఉన్న గొంతులా ధ్వనిస్తోంది, కానీ […]
- « Previous Page
- 1
- …
- 414
- 415
- 416
- 417
- 418
- …
- 481
- Next Page »