మొత్తం 19 మంది… అందులో 10 మందీ లేడీ కంటెస్టెంట్లే… ఒకరు ఎక్కువో తక్కువో నిష్పత్తి సరిగ్గా మెయింటెయిన్ చేశారు అనుకుందాం… కానీ ఇప్పుడు ఏం జరిగింది… ఏడు వారాలు గడిచేసరికి, సగం షో పూర్తయ్యేసరికి… ఏడుగురు ఎలిమినేట్ అయిపోతే అందులో ఆరుగురు ఆడ లేడీసే… ఫటాఫట్ వికెట్లు పడిపోయాయి… జస్ట్, ఒకటే మగ వికెట్ పడిపోయింది… ఒక్కసారి ఆ హౌజు వైపు చూస్తే ఇప్పుడు ఎనిమిది మంది మగపురుషులు… నలుగురు స్త్రీలు… అరేయ్, ఏంట్రా ఇది..? […]
పాడుతా తీయగా..! చివరకు ఈ షోను కూడా భ్రష్టుపట్టిస్తారన్నమాట..!!
పాడుతా తీయగా…. తెలుగు టీవీలో సంగీత ప్రధానమైన తొలి రియాలిటీ షో… దాన్ని కొట్టిన షో మరొకటి రాలేదు… రాదు కూడా… కారణం :: ఎస్పీ బాలు… పిల్లల దగ్గర్నుంచి, పెద్దల దాకా ఎందరో ఔత్సాహిక గాయకుల ఎదుగుదలకు అది వేదిక… ఎందుకు మెచ్చుకోవాలీ అంటే… బాలు దాన్ని నిర్వహించిన తీరు..! ఎవరినో గెస్టుగా పిలిచేవాడు, పాడుతున్నవాళ్ల తప్పుల్ని చెప్పేవాడు సున్నితంగా, సరిదిద్దేవాడు, ఆ పాట రచయిత గురించి వీలైతే చెప్పేవాడు, సంగీత దర్శకుడి గురించి ప్రస్తావించేవాడు, […]
హిందూ సంస్థల్లో అన్యమతస్తులకు కొలువులు… ఓ ఇంట్రస్టింగ్ కేసు…
ఓ ఆసక్తికరమైన వార్త ఇది… ఏపీ సర్కారుకో, టీటీడీ ధర్మకర్తల బోర్డుకో ఏమాత్రం నచ్చకపోవచ్చు.., తమిళనాడు ప్రభుత్వ స్పూర్తిని పాటించడం కూడా ఇష్టం ఉండకపోవచ్చు… విషయం ఏమిటంటే..? 37 ఏళ్ల ఓ ముస్లిం సొహెయిల్ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ వేశాడు… ‘‘అయ్యా, చెన్నైలోనే ఉన్న Arulmigu Kapaleeswarar Arts and Science College లో ఓ ఆఫీసు అసిస్టెంట్ పోస్టుకు నేను అనర్హుడిని అన్నారు, ఇంటర్వ్యూకు రానివ్వలేదు, అదేమంటే నువ్వు హిందువు కావు అన్నారు, ఒక […]
హవ్వ… అంతటి ఎస్పీ బాలును సింగర్ జానకి అంత మాటనేసిందా..?
‘‘సీఎంకు బీపీ లేస్తే ఇక కేడర్ అంతా కర్రలు పుచ్చుకుని బజార్న పడి విధ్వంసకాండకు పూనుకోవాలా..? ఎవడో ఓ మూర్ఖనాయకుడు తనకు అలవాటైన ఉన్మాదభాషలో సీఎంను తిడితే, ఇక కేడర్ ఎవడు దొరికితే వాడిని బాదేయాలా..? దాన్ని సీఎం సమర్థిస్తాడా..? ఇదేం రాజధర్మం..? రేప్పొద్దున రాజకీయ ప్రేరేపిత దాడులు ఏం జరిగినా బీపీ అనేది ఓ సమర్థన అవుతుందా..?’’ అని గట్టిగా అడగగలిగిన గొంతు ఇప్పుడు ఏపీలో లేదు… ఎంతటి తీవ్ర ఒత్తిళ్లున్నా సరే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ […]
బోషిడీకే తిట్టు కథ సరే… ఈ బాస్టడ్స్ స్టోరీ తెలుసా మీకు..?
………. By…. Nancharaiah Merugumala…………….. ఇందిరాగాంధీని ‘మదర్ ఆప్ దీజ్ బాస్టడ్స్’ అని హైదరాబాద్ బసంత్ టాకీస్ సభలో వర్ణించిన అరుణ్ శౌరీని ఏం చేశారు? ––––––––––––––––––––––––––––––––––––– ‘బన్సీలాల్ ఈజే బాస్టడ్. వీసీ శుక్లా ఈజే బాస్టడ్. భజన్ లాల్ ఈజే బాస్టడ్. గవర్నర్ రామ్ లాల్ ఈజే బాస్టడ్ అండ్ సంజయ్ గాంధీ ఈజ్ ఆల్సో ఏ బాస్టడ్. ప్రైమ్ మినిస్టర్ మిసెస్ ఇందిరాగాంధీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ దీజ్ బాస్టడ్స్,’ అన్న […]
ఒర్లీ ఒర్లీ… ‘అతి’ చేసినందుకు… ప్రియ చెంప పగిలిపోయింది… క్లీన్ బౌల్డ్….
ఎంత గేమ్ ప్లాన్ ఉన్నా సరే… బిగ్‌బాస్‌లో సూత్రం ఏంటంటే..? ‘అతి’ చేయొద్దు… సరిగ్గా అక్కడే ప్రియ తప్పులో కాలేసింది… అందరినీ రెచ్చగొట్టింది… ఒక్కొక్కరినీ ఎక్స్‌పోజ్ చేస్తున్నాను అనుకుంది… కానీ ఎక్కడ తప్పు చేసిందీ అంటే..? ‘ఒర్లుతున్నావు’ అనే పదం దగ్గర తన తెలంగాణ వ్యతిరేకతను బయటపెట్టుకుంది… దాంతో ఒక్కసారిగా ఆమె మీద ఉన్న సదభిప్రాయం కాస్తా ఆవిరైపోయింది… అందుకే జనంలో వ్యతిరేకత పెరిగిపోయింది… వోట్లు తక్కువ పడ్డయ్… యానీ మాస్టర్ బయటికి వెళ్లాల్సింది కాస్తా ప్రియకు […]
తెల్లారిలేస్తే ఈటల జపమేనా సారూ..? ఐనా రేవంత్, ఈటల కలిస్తే తప్పేంటట..!!
‘‘ఎహె.., ఈ హుజూరాబాద్ ఎన్నిక మాకో లెక్కా..? అంత పెద్ద జానారెడ్డినే ఓడించినం, ఈ ఈటల ఎంత..?’’ అని కదా మొన్నామధ్య ఇదే కేటీయార్ చెప్పుకొచ్చాడు… కానీ ఆచరణ పూర్తిగా కంట్రాస్టు… కేసీయార్, కేటీయార్, హరీష్, టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ ఈటల పనిమీదే ఉన్నారు… తెల్లారిలేస్తే ఈటల జపం తప్ప మరొకటి లేదు… నిద్ర నుంచి ఒక్కసారిగా లేపినా సరే, వెంటనే ఆ నిద్ర కళ్లతోనే ఈటల దుర్మార్గుడు, ఈటల మోసగాడు, ఈటల ప్రజాద్రోహి […]
రాజువయ్యా… కృష్ణంరాజువయ్యా…! బాగా నచ్చిన వార్త… కారణమేంటంటే..?
చిన్న వార్త… చదవడానికి చాలా చిన్న వార్త… పత్రికలకు, టీవీలకు అది అసలు వార్తలాగే కనిపించలేదు… అంత చిన్న వార్త… కానీ నచ్చాల్సిన వార్త, మెచ్చాల్సిన వార్త… వాడు మీసం తగ్గించాడు, వీడు గడ్డం పెంచాడు, వాడు కిలోంబావు బరువు పెరిగాడు, వీడి వెంట్రుకల్లో ఒకటి తెల్లగా కనిపించింది వంటివి కూడా మనోళ్లకు వార్తలే… ఖర్మ… కానీ నిజంగా అభినందించాల్సిన వార్త ఇది… విషయం ఏమిటంటే..? ఒకప్పటి హీరో, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు కుటుంబం తమ ఇంట్లో […]
వావ్… సర్దార్ ఉధం… బడియా ఏక్‌ధమ్… సినిమా సూపర్ తీశావు భాయ్…
ఈ సినిమా మీకు అస్సలు నచ్చదు… ఇందులో హీరో ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ హీరోయిన్ పాదాల దగ్గర పాకుతూ, దేకుతూ, పొర్లిగింతలు పెట్టడు… డిష్యూం అనే సౌండ్ కూడా రాకముందే పది మంది రౌడీలు అర్జెంటుగా అంతరిక్షంలోకి ఎగిరిపోరు… ప్చ్, మీకు హిందీలో వచ్చిన తాజా సినిమా ‘సర్దార్ ఉధం’ నచ్చనేనచ్చదు… వెకిలి పంచ్ డైలాగుల్లేవు, అసహజమైన డ్యూయెట్లు లేవు… అన్నింటికీ మించి డాన్స్ పేరిట కోతిగెంతుల్లేవు… రేకుడబ్బాలో రాళ్లు […]
రాజు గారమ్మాయి..! గుడ్ టేస్ట్, ప్రజెంటేషన్ పూర్… సినిమా లక్షణాలే వేరమ్మా..!!
రాంకో గ్రూప్ ఆడపడుచు… సత్యం గ్రూపు కోడలు… తను స్వతహాగా ఓ స్పిన్నింగ్ మిల్ ఎండీ… కాల్ హెల్త్ సర్వీసెస్ కొత్త ఆలోచనకు ప్రేరణ… అడుగు తీసి అడుగేస్తే విలాసం, సంపద, వైభోగం… కానీ ఆమె అభిరుచి వేరు… సర్టిఫైడ్ స్కూబా డ్రైవర్… శాస్త్రీయ నృత్యకారిణి… నాట్యం అంటే ఆమెకు పిచ్చి… నిశృంఖల అనే ఓ డాన్స్ స్కూల్ పెట్టింది… డాన్స్ మీద ఏదో మలయాళీ సినిమాలో నటించింది… నాట్యం పేరిట ఏదో షార్ట్ ఫిలిమ్ కూడా […]
పెద్ద కోళ్లఫారాలు… వాటి కింద ఓ భారీ సొరంగం… ఇంకా లోపలికెళ్తే…?
………… By….. పార్ధసారధి పోట్లూరి………….. Mossad Vs ISI…. రెండు అత్యంత ప్రమాదకర గూఢచార సంస్థల మధ్య జరిగిన సమరంలో పాకిస్థాన్ కి చెందిన ఐఎస్ఐ పైచేయి సాధించింది..! మొదటిది ఇజ్రాయెల్ కి చెందిన MOSSAD అయితే రెండవది పాకిస్థాన్ ISI… ఈ కధనం పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి. దానికి సంబంధించిన వ్యక్తి పేరు AQ ఖాన్ గురించి. ఈ నెల 17 వ తేదీన తన 85 వ ఏట చనిపోయాడు aq ఖాన్ […]
అచ్చోసిన ఆం‘బూతులు..! సమర్థన తిట్టడంకన్నా నీచం..!!
సంస్కారరహిత రాజకీయాలు, దిక్కుమాలిన బూతుల భాష, దిగజారుడు ఎత్తుగడలు ఆంధ్రా రాజకీయాల్లో అసాధారణం ఏమీ కాదు… వీళ్లు దేవుడిగా కొలిచే ఆ ఎన్టీయారే ఓసారి అసెంబ్లీలో శాసనసభ్యురాలు నన్నపనేని మీద ప్రయోగించిన పరమ ముతకతిట్టు ఎందరికి గుర్తుందో తెలియదు గానీ… అప్పట్లో పెద్ద రచ్చే అయ్యింది..! బోషిడికే అనే హిందీ పదానికి అర్థం జగన్‌మోహన్‌రెడ్డే స్వయంగా చెప్పేవరకు చాలామందికి తెలియదు కానీ ఎన్టీయార్ వాడిన బూతు అచ్చ తెలుగు, అది అందరికీ అర్థమయ్యే తెలుగు… ఆనాటి నుంచి […]
వచ్చీరాగానే ఓ సీనియర్ నడ్డిమీద తన్నింది… కామెడీ రూటే మారుతోంది…
ఆర్టిస్టులు దొరుకుతారు, కానీ వాళ్లతో పర్‌ఫామెన్స్ తీసుకునే తెలివితేటలు టీవీచానెళ్ల క్రియేటివ్ టీమ్స్ దగ్గర ఉండాలి, అప్పుడే ఆర్టిస్టులకు పేరు, డబ్బు, చానెళ్లకు రేటింగ్స్, యాడ్స్, డబ్బు… ఈటీవీ వాడికి జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు కాబట్టి, వాళ్లనే శ్రీదేవి డ్రామా కంపెనీ, రెచ్చిపోదాం బ్రదర్, ఢీ, స్పెషల్ ఫెస్టివల్ షోలలో వాడేసుకుంటాడు… సరే, ఎంత కొంత అదనంగా డబ్బొస్తున్నది కాబట్టి ఆ ఆర్టిస్టులంతా సంతోషంగా ఉన్నారు… పైగా ఆ సచ్చిపోదాం, సారీ, రెచ్చిపోదాం బ్రదర్ అనే షో […]
100 కోట్ల టీకాలు..! మూడింట రెండో వంతు కవరైనట్టే..! ఇంకా ఉంది..!!
Sarve Bhavantu Sukhinah, Sarve Santu Niramaya…. అంటే… ‘అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి’… ఈ దిశలో మోడీ ప్రభుత్వం సాధించిన 100 కోట్ల వేక్సినేషన్‌ను మెచ్చుకోవచ్చు… ప్రపంచంలో ఇంత భారీ సంఖ్యలో టీకాలు వేసిన దేశం చైనా తరువాత భారతే… నిజానికి కరోనా హయాంలో మోడీ ప్రభుత్వపు డ్రగ్ అప్రూవల్ పాలసీలు, డ్రగ్ రేట్ పాలసీలు, మొదట్లో వేక్సిన్ అడ్డగోలు ధరల ఖరారు, రాష్ట్రాలపై భారం, ఆక్సిజెన్ కొరత, కీలకమందుల బ్లాక్‌మార్కెటింగ్, వేరే […]
సునీల్ చెత్రి..! భేష్ హీరో… నీకు ముచ్చట కాంప్లిమెంట్స్… Our Hyderabadi…!
మన హైదరాబాదీయే… ఏదైనా ఘనత సాధించినప్పుడు కనిపించాలి కదా…! మెయిన్ స్ట్రీమ్‌లో ఓ చిన్న వార్తో రావాలి కదా… తుచ్ఛమైన రాజకీయ నాయకుల బూతులకు, ఒకడి మీద ఒకడు చేసుకునే దాడులకు ఇచ్చే ప్రయారిటీ మిగతావాటికి ఎందుకు దక్కదు..? మన ఖర్మ అంటారా..? సరే..! సునీల్ చెత్రి… ఇదీ తన పేరు… సికింద్రాబాదులో పుట్టాడు… ఫుట్ బాల్ ప్లేయర్… ప్రస్తుతం తన ప్లేసు ఏమిటో తెలుసా..? అంతర్జాతీయ గోల్స్ సాధించిన క్రీడాకారుల జాబితాలో సెకండ్ జాయింట్ నేమ్… […]
మీ సేఫ్ గేమ్స్ పాడుగాను… ఆటలోని మజాను చంపేస్తున్నార్రా బాబూ…
బిగ్‌బాస్ అంటేనే ఓ ఆట… ఎంత స్క్రిప్టెడ్ అయినా సరే, ఆ బిగ్‌బాస్ టీం అనుకున్నట్టుగా ఇంప్లిమెంట్ కాకపోవచ్చు… టీం ప్లాన్లు ఎదురుతన్నొచ్చు… కారణం సింపుల్… కంటెస్టెంట్ల తత్వాలు..! ఆ తత్వాల నడుమ పోటీయే బిగ్‌బాస్… గెలుస్తారా, ఓడిపోతారా, నామినేట్ అవుతారా, ఎవిక్ట్ అయిపోతారా, రీఎంట్రీ ఉంటుందా, సీక్రెట్ రూమా, జైలా, కెప్టెనా… ఏమైనా జరగనీ… కానీ ఆడాలి… తోటి కంటెస్టెంట్లను రెచ్చగొట్టాలి, బతిమిలాడాలి, జట్టుకట్టాలి, తగాదా పెట్టుకోవాలి… అన్నీ ఉంటయ్ గేమ్ ప్లాన్‌లో…! కోపాలుంటయ్, ఆవేశాలుంటయ్, […]
ఏపీలో ట్రిపుల్ ఎక్స్ సంస్కార రాజకీయాలు..! పచ్చిగా చెప్పాలంటే ‘‘బోసిడీకే పాలిటిక్స్…
వాడెవడో బోసిడీకే అని తిట్టాడుట… (ఈమాటను ఇలాగే రాయాల్సి వస్తున్న ఖర్మకు నా కలం మీద నాకే జాలేస్తోంది… కానీ ఇప్పుడు ఏపీలో చర్చ, గొడవ, ఉద్రిక్తత, దాడులు, రాజకీయాలు అన్నీ ఆ పదం మీదే కదా… రాయాల్సిన అనివార్యత…) తిడితే తిట్టాడు, వాడి సంస్కారం అది, సింపుల్‌గా లేపుకొచ్చి, ట్రిపుల్ ఆర్‌కు, అచ్చెన్నాయుడు చేసిన ‘కస్టడీ మర్యాదలు’ ఇంకాస్త గట్టిగా చేసి ఉంటే సరిపోయేది కదా… చేయరు, తిట్టడం వెనుకా ఓ ప్లాన్, ఆ తిట్టును […]
సీఎంలందు ఈశాన్య సీఎంలు వేరయా… నిన్ను మెచ్చితిమి సంగ్మా…
మనకు తెలిసిన ముఖ్యమంత్రులు… ప్రతిపక్షాలపై బూతులు, దాడులకు ప్రోత్సాహాలు, అక్రమాలు, ఆర్జన, వేల కోట్ల డీల్స్… చాలామంది… పేర్లు అనవసరం..! కానీ వాళ్లకు వ్యక్తిగత జీవితాలు లేవా..? ఉంటే గింటే మందు, పొగ, గెస్ట్ హౌజ్ రాసకార్యాలు, ఇతర విలాసాలు మాత్రమేనా..? ఇంకే అభిరుచులూ ఉండవా..? ఎప్పుడైనా అనిపించిందా ఇలా..? ఒక చిన్న వీడియో చూశాక నాకైతే అనిపించింది… మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లో చేరితే, అదీ వారస రాజకీయాల్లో మునిగితే, ఇక సగటు భారతీయ రాజకీయ నాయకుడిలా […]
KCR మీద తెలంగాణ అగ్గిఫైర్..! YCP ఎమ్మెల్యేలపై భుగభుగ..! నిజమేనా..?!
543 నియోజకవర్గాలు… 30 వేల మంది… అంటే, ఒక్కో నియోజకవర్గానికి 55 మంది… ఉజ్జాయింపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తొమ్మిదీపది మంది… అందులోనూ ప్రధానంగా నగరవాసులు… ఫోన్లకు, ఆన్‌లైన్‌కు అనువుగా ఉన్నవాళ్లు…… ఒక్కో అసెంబ్లీ సీటుకు పది మంది వ్యక్తం చేసే అభిప్రాయాలు, మొత్తం 90 కోట్ల మంది వోటర్ల మనోభావాలకు అద్దం పడతాయా..? ఈరోజు, నిన్న మెయిన్ స్ట్రీమ్ సైట్లు, పత్రికలు ప్రచారంలోకి తీసుకొచ్చిన IANS-Cvoter గవర్నెన్స్ సర్వే చూడగానే తలెత్తిన ప్రధానమైన ప్రశ్న ఇది..! […]
ఇదీ ‘మా’ రేంజ్..! ఈ లెటర్ ‘హెడ్లు’ చూస్తేనే అర్థమైపోతుందిగా…!!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్… అలియాస్ మా… పట్టుమని వేయి వోట్లు లేని ఈ అసోసియేషన్ ఎన్నికలు కులరొచ్చును కెలికీ కెలికీ కంపు కంపు చేశాయి… ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి రాయబడుతూనే ఉంది… మొన్న ఏపీ రాజకీయాల్లో కులసమీకరణాలకు, భావి పరిణామాలకు ఇవే సంకేతాలు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొస్తే, నిన్న కన్నడ-తెలుగు చారిత్రక బంధాలకు ఎలా గండిపడ్డాయో ఏబీకే రాసుకొచ్చాడు… అంటే పెద్ద పెద్ద కలాలు సైతం స్పందించి ఆ ఎన్నికలకు ఓ విశేష ప్రాధాన్యాన్ని […]
- « Previous Page
- 1
- …
- 421
- 422
- 423
- 424
- 425
- …
- 450
- Next Page »