. సూపర్ స్టార్ కృష్ణ జయంతి కదా నిన్న… తన గురించి ఏదో వెతుకుతూ ఉంటే… ఓ పాట కనిపించింది, వినిపించింది… ఫాఫం అనిపించింది… రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అని ఓ సినిమా వచ్చింది 1976లో… నమ్మలేని విషయం ఏమిటంటే… దానికి దర్శకుడు బాపు… కాకపోతే పాటలు బాగుంటాయి… చిత్రీకరణలో కాదు, ట్యూన్లు, కంటెంటు… అందులోనూ రాకోయీ అనుకోని అతిథి పాట ఓ మరుపురాని పాటే… ఇది వింటుంటే మనసు పదే పదే మేఘసందేశం సినిమా […]
ఆ పదం వినగానే యూనిట్ మొత్తం కకావికలై పరుగులు తీసింది…
. Director Devi Prasad.C….. కోడిరామకృష్ణ గారు దర్శకుడైన తొలి నాళ్ళలో, తన సినిమాలు విడుదలైనప్పుడు, డిగ్రీ చదువుకొంటున్న ఓ అభిమాని “కోదాడ” నుండి రాసే ఉత్తరాల కోసం ఎదురుచూసేవారట. రంగురంగుల అక్షరాలలో సినిమాని అద్భుతంగా విశ్లేషిస్తూ హిట్టా ఫట్టా అనేది కూడా నిర్మొహమాటంగా రాసేవాడట. ఆ అభిమాని పేరు”కరణ్‌రాజ్”. తర్వాత కొన్నేళ్ళకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా గురువుగారి దగ్గర చేరినప్పుడే తను కూడా వొచ్చి చేరిపోయాడు. మితభాషి, అతి సున్నిత మనస్కుడు. అతని మాట […]
ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…
. Subramanyam Dogiparthi …. దర్శకేంద్రుడు NTRతో జస్టిస్ చౌదరి తీస్తే దర్శకరత్న ANRతో ఈ జస్టిస్ చక్రవర్తిని తీసారు … అందులో NTR , ఇందులో ANR ద్విపాత్రాభినయం చేసారు తండ్రీకొడుకులుగా . పెద్దపెద్దోళ్ళకు కూడా స్పర్ధ ఉంటుంది . తన తోటి వాడు సాధించినదానిని తానూ సాధించాలనే స్పర్ధే బహుశా దాసరి చేత ఈ జస్టిస్ చక్రవర్తిని తీయించి ఉంటుంది . ఆ స్పర్థ రాఘవేంద్రరావు, దాసరి మధ్య మాత్రమే కాదు… ఎన్టీయార్, ఏఎన్నార్ […]
మరో జలియన్ వాలాబాగ్… పాకిస్థాన్ ఆర్మీ ఘాతుకం… ఢాకా గుడి కథ..!!
. మాట్లాడితే చాలు, ఇందిరాగాంధీ నియంత అంటారు… పాకిస్థాన్‌ను చీల్చింది అంటారు… కానీ బంగ్లా విముక్తి పోరుకు ఆమె ఫుల్స్టాప్ పెట్టి, అమెరికా వంటి అగ్రదేశాన్నే ఎహెఫోవోయ్ అని ధిక్కరించి, నిలిచింది… కాబట్టే మనం ఇలా నిలబడగలిగాం… అది సరే, మరొక్కటి మాత్రం మన పత్రికల్లో ఎప్పుడూ చెప్పుకోం… మన సెక్యులర్ పాతివ్రత్యం చెడిపోతుందని మన మేధోవర్గం కూడా మాట్లాడదు… జలియన్ వాలాబాగ్ దుర్మార్గం గురించే చెప్పుకుంటాం, సేమ్, అలాంటి దుర్మార్గాన్నే పాకిస్థాన్ ఆర్మీ చేసిందని చదువుకోం, […]
ప్రపంచ సుందరి కిరీటపు ధగధగల వెనుక… కన్నీళ్లు, కష్టాలు…
. మిస్ వరల్డ్ పోటీలు ముగిశాయి… ఈసారి కిరీటం మిస్ థాయ్‌లాండ్ ఒపల్ సుచత చువాంగ్ శ్రీ గెలుచుకుంది… థాయ్‌లాండ్‌కు ఇది మొదటి మిస్ వరల్డ్ కిరీటం… పుకెట్‌కు చెందిన ఓ సాదాసీదా కుటుంబం నుంచి వచ్చిన ఈ 21 ఏళ్ల యువతి ఇప్పుడు తమ్మసాట్ యూనివర్శిటీలో డిగ్రీ చేస్తోంది… ఒక విషయం తప్పక చెప్పుకోవాలి… ఈ సుందరి వెనుక ఒక కన్నీటి కథ ఉంది. క్యాన్సర్‌తో పోరాడి గెలిచి ఈ స్థాయిలో నిలుచుంది. ఇప్పుడు క్యాన్సర్‌కి […]
‘‘అబ్బో, ఆమె చాలా కాస్ట్లీ అట, ఎక్కువ డిమాండ్ చేస్తుందంటున్నారు…’’
. 1997 ద్వితీయార్ధంలో నేను విజయవాడ వార్త రిపోర్టర్‌గా పనిచేస్తున్న సందర్భమది.. దర్శకరత్న దాసరి నారాయణరావు ఈటీవీ, ఈనాడు పత్రికలకు ఎవ్వరూ సినిమా అడ్వటైజ్మెంట్స్ ఇవ్వకూడదంటూ నిర్ణయం తీసుకున్నారు… అప్పట్లో దాసరి వర్సెస్ రామోజీ వేడిగా నడిచేది కదా… తరువాత చాన్నాళ్లకు గానీ సద్దుమణగలేదు… సరిగ్గా ఆ నిర్ణయం తీసుకున్న రోజు సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల దంపతులు విజయవాడ ఐలాపురం హోటల్లో బస చేశారు. దాసరి నిర్ణయంపై అప్పుడు ఎఫ్డిసి చైర్మన్‌గానో, ‘మా’ గౌరవ అధ్యక్షుడిగానో (ఈ రెండింటిలో ఏదో […]
ఫిక్సేనా..? ‘ఈసాల కప్ నమ్దే’ నిజమేనా..? ఈ జోస్యం ఫలిస్తుందా..?
. అవును, ఐపీఎల్ అంటే ఎప్పుడూ ఫిక్సింగ్ ఆరోపణలే… అప్పటిదాకా అద్భుతంగా ఆడుతున్న జట్లు హఠాత్తుగా చేతులెత్తేస్తాయి, మరీ గల్లీ క్రికెట్ ఆడేస్తాయి… మంచి పర్ఫార్మర్స్ కూడా వైడ్స్, లూజ్, టాస్ బాల్స్ వేస్తుంటారు.. బ్యాటర్లు చేజేతులా వికెట్లు సమర్పించుకుంటారు.,. క్యాచ్ డ్రాపులు, మిస్ ఫీల్డింగులు కనిపిస్తుంటాయి… ఇదేకాదు, దేశవ్యాప్తంగా ఓవర్లవారీగా, బాల్స్వారీగా కూడా బెట్టింగులు నడుస్తుంటాయి వందలు, వేల కోట్లలో… సో, ఐపీఎల్ అంటేనే ఓ పెద్ద మాయాజూదం… ఆడించే బిగ్‌బాస్ ఎవరు…? ఎప్పటికప్పుడు ఏదో […]
ఈమె సోనియాని మించిన హక్కుదారు..!? అడుగడుగునా ఓవరాక్షన్..!!
. ప్రాంతీయ పార్టీలకు, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వంటి వ్యక్తి కేంద్రిత పార్టీలకు ఇలాంటి చిక్కులు ఏవీ ఉండవు… బీఆర్ఎస్కు హైకమాండ్ అంటే జస్ట్, ఓన్లీ పర్సన్, కేసీయార్… ముందస్తుకు వెళ్దామా, ఛల్, వోకే… నరేంద్రనో, విజయశాంతినో తరిమేద్దామా, డబుల్ వోకే… ఎవడెవడు తలెగరేస్తున్నాడో చూసి తందామా, ట్రిపుల్ వోకే… మంచో చెడో ఎవడూ మాట్లాడడు, శుక్రమహర్దశ నడిచినన్ని రోజులూ నడుస్తుంది… 3, 4 నెలలు ఫామ్ హౌజులో పడుకుని గాయబ్ అయిపోయినా నడుస్తుంది… కాంగ్రెసో, బీజేపీయో, […]
రియల్ సూపర్‌స్టార్ కృష్ణను సరిగ్గా ఆవిష్కరించిన కథనం ఇది..!!
. Shankar G ….. సినిమా హీరోగా స్థిరపడటానికి నటనే వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. సినిమా రంగంలో కొండంత నటన తెలిసినా అవగింజంత అదృష్టం ఉండాలంటారు కానీ కృష్ణ అనే నటుడుకి కొండంత అదృష్టమే అండగా ఉంది. నటుడి రూపం, నవ్వు, అందం, నడక, హీరోయిజం ఏదైనా కావచ్చు చూసేవాళ్ళను సమ్మోహితులను చేయటానికి. ఆ నటుడిని చూడటం ఒక వ్యసనంగా మారుతుంది. ఆ వ్యసనం అతడు నటించిన సినిమా కథ బావుందా లేదా అన్నది అనవసరం… […]
మొక్కు కోడెల ఉసురు… కలుక్కుమనిపించే మరణాల వార్తలు…
. ఓ వార్త చదువుతుంటే కలుక్కుంది… అది వేములవాడ కోడెల వార్త… ఒకేరోజు 8 కోడెలు మరణిస్తే గుట్టుచప్పుడు కాకుండా ఏదో వాగులో ఆలయ అధికారులు ఖననం చేయించారనే వార్త… ఎవరో రోజూ పదుల సంఖ్యలో కోడెలు మరణిస్తున్నట్టు రాశాడు… ఆ సంఖ్య అతి కావచ్చు, అబద్ధం కావచ్చుగాక, కానీ ప్రాబ్లం మాత్రం ఉంది… నిజమే… ఆ గోశాలలు కిటకిట… వచ్చిన కోడెలు వచ్చినట్టుగా వాటిల్లోనే కుక్కుతున్నారు… భక్తుల మొక్కుల రూపంలో వందల్లో వస్తున్న వాటిని ఏం […]
‘మిస్ బిహేవ్’ అంటే… మిస్ వరల్డ్ వివాదం రేవంత్ మెడకు చుట్టడమా..?!
. ప్రజెంట్ జర్నలిజం ట్రెండ్ వేరు… అదే దర్యాప్తు చేస్తుంది, అదే విచారిస్తుంది, అదే తీర్పు చెబుతుంది… అవసరమైతే కథకు ఉపకథల్ని, తనకు ఉపకరించే కథల్ని పుట్టిస్తుంది… తీరా చూస్తే ఆలూ లేదు, చూలూ లేదు… కొడుకు పేరు మీడియా అని… ఎస్, మిస్ ఇంగ్లండ్ బాధపడింది నిజం… ఎవరో అసభ్యంగా ప్రవర్తించారనో, రూమ్‌కు రమ్మన్నారనో ఆమె ఆరోపించలేదు… గెస్టులను ఎంటర్టెయిన్ చేయడానికి తామను తోలుబొమ్మల్లా ప్రదర్శించారు, మేమేమైనా కోతులమా అనడిగింది… ఆమె ఆవేదనలో అర్థముంది… ఆమె […]
నాటి జతొజడ జమజచ్చ జంట… ప్లెయిన్, ఫెయిర్ మూవీ…
. రాజేంద్ర ప్రసాద్ ఏదో ఓ పాత్రలో నటిస్తూనేే ఉన్నాడు… చిన్నాచితకా పాత్రలతో సహా… కానీ అర్చన చాన్నాళ్లయింది తెర మీద కనిపించక… అప్పుడెప్పుడో లేడీస్ టైలర్ సినిమాలో జతొజడ, జమజచ్చ అంటూ అల్లరి చేశారు… డ్యూయెట్లు, రొమాన్స్ లేకపోయినా ఆ జంట అప్పుడు బాగానే అనిపించింది… మళ్లీ ఇన్నేళ్లకు, అంటే దాదాపు నాలుగు దశాబ్దాల తరువాత… ముసలోళ్లయ్యాక మళ్లీ జతకలిశారు… వయస్సుకు తగిన పాత్రలే… ఇద్దరూ ఆ పాత్రలకు న్యాయం చేశారు… హుందాగా…! ఎమోషన్స్ బేస్డ్ […]
మూడు ‘నందుల’ ముచ్చటైన ‘ఉషాకిరణం’… కాంచనగంగ…
. Subramanyam Dogiparthi ….. మూడు నంది అవార్డులను గెలుచుకున్న మంచి సినిమా 1984 లో వచ్చిన ఈ కాంచనగంగ సినిమా . ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి వ్రాసిన ప్రేమ దీపిక నవల ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకు వి మధుసూదనరావు దర్శకుడు . రెండవ ఉత్తమ చిత్రంగా ఉషాకిరణ్ వారికి , ఉత్తమ పాటల రచయితగా వేటూరి వారికి , రెండవ ఉత్తమ కధా రచనకు సులోచనారాణి గారికి నంది […]
ఉహుహుహు… మనవాళ్లు వణికే చలిలోనూ వేడి పుట్టించగలరు సుమీ…
. Bharadwaja Rangavajhala…………. చలి చంపుతున్న ఛమక్కులో…. చలి తత్వ గీతమాలిక చలికాలం అంటేనే రొమాంటిక్ కాలం అని అర్ధం. సినిమా డ్యూయట్లలో రొమాన్స్ కే పెద్ద పీట కనుక కవులు, దర్శకులు కూడా చలిపాటలకే కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ వరసలో తెలుగు సినిమాల్లో వచ్చిన వెచ్చదనాల వెతుకులాటల గీతాల గురించి లెచ్చర్ చెప్తున్నానన్నమాట … రగ్గులు కప్పుకుని వినండి … చలిని అడ్డం పెట్టుకుని సాహిత్య విలువల్ని దెబ్బతీయకుండానే ఆహ్లాదకరమైన రొమాన్స్ అందించడం […]
అయ్యా, రేవంతం సారూ… ఈ కేరక్టర్లను అస్సలు పట్టించుకోవద్దు సుమీ…
. అనుకుంటాం గానీ… చిన్నాచితకా నటులు, దర్శకులు, నిర్మాతలు ఏదో 90 వేసి వచ్చి, కడుపులో ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను సినిమా వేదికల మీద కక్కేస్తుంటారు గానీ… అంతకుమించి పిచ్చి కూతలకు నిజానికి పెద్ద తలకాయలే ప్రసిద్ధం… పక్కా ఉదాహరణ ఏమిటంటే..? ది గ్రేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీ మోహన్… ఎస్, తనను ఓ నటుడిగానో, ఓ హీరోగానో గుర్తించాల్సిన పనిలేదు, తనకు అంత సీన్ కూడా లేదు… జస్ట్, అలా వచ్చాడు, ఇలా హీరో అయ్యాడు… […]
ఫాఫం తెలుగు సినిమా… దిల్ రాజు రాగద్వేషాల గుప్పిట్లో అవార్డులు….
. ముందుగా ఓ చిన్న డిస్‌క్లెయిమర్……. ఒక ముఖ్యమంత్రో, ఒక సినిమా మంత్రో పెద్దగా అవార్డుల జోలికి వెళ్లరు… మా ఆబ్లిగేషన్స్ ఇవీ అని చెప్పరు… కానీ మధ్యమార్తాండులు డీల్ చేస్తుంటారు అన్నీ… ఎస్, ఒక దిల్ రాజు… పక్కా సినిమా వ్యాపారి, బోలెడు రాగద్వేషాలు… సిండికేట్లు… ఒక జయసుధ… మహానటిని మించిన నటి… సరే, ఇక గద్దర్ అవార్డుల జోలికి వెళ్దాం ఓసారి… గత సంవత్సరానికి మొత్తం అన్ని విభాగాల్లోనూ అవార్డులు ప్రకటించిన జ్యూరీ 2014 […]
ఔరా.., ఇది విశ్వనాథ్ సినిమాయేనా..? అత్యంత నిరాసక్తంగా…!!
. Subramanyam Dogiparthi ……… సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా జగమెరిగిన చేంబోలు సీతారామ శాస్త్రి (భరణి కలం పేరు) మొదటి సినిమా అందరూ అనుకునే సిరివెన్నెల కాదు … 1984 లో కె విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన ఈ జననీ జన్మభూమి సినిమా . టైటిల్సులో Ch సీతారామ శాస్త్రి (భరణి) అని వేసారు . శాస్త్రి గారు మంచి పాటే వ్రాసారు . గంగావతరణం మీద . రస వాహినీ స్వాగతం జీవరసధుని స్వాగతం , […]
హే భైరవా, హే గరుడా… ముగ్గురు హీరోయిన్లు మూడు సహాయక పాత్రలు…
. ముగ్గురూ కాస్త దేహపుష్టి ఉన్నవాళ్లే… అందరూ ఓ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నవాళ్లే… మీడియం రేంజ్ హీరోల స్థాయి నుంచి మనీ గ్యారంటీ హీరోల రేంజ్‌కు పెరగలేకపోతున్నవాళ్లే… ముగ్గురూ కలిసి భైరవం అన్నారు… ఏమైంది..? “భైరవం” ముగ్గురు ఆప్త మిత్రులు — వరద (నారా రోహిత్), గజపతి (మంచు మనోజ్), సీను (బెల్లంకొండ శ్రీనివాస్) — చుట్టూ కథ తిరుగుతుంది. ఒక రాజకీయ నాయకుడు ₹1000 కోట్ల విలువైన దేవాలయ భూమిని లక్ష్యంగా చేసుకోవడంతో వీళ్ల […]
ఖలేజా ఫ్లాప్‌కు ప్రధాన బాధ్యుడు దర్శకుడు, నెక్స్ట్ నిర్మాతలే…!!
. ఈరోజే కదా మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా చిత్రం రీరిలీజ్… చాలామంది చాలారకాలుగా ఆ సినిమా ఫ్లాప్ కావడానికి కారణాలేమిటో విశ్లేషించారు ఇన్నాళ్లూ… కానీ సి.కల్యాణ్ చెప్పిన విశ్లేషణ భిన్నంగా ఉంది… అది సరైందిగా అనిపించలేదు కూడా… ఈ సినిమాకు తను సహనిర్మాత… హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశంలో సీ కల్యాణ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఓసారి చూస్తే… ‘‘ఈ సినిమాపై భారీ అంచనాలను కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పెట్టుకొన్నారు… […]
దిక్కుమాలిన పాత్రికేయం… మన ‘‘గొప్ప’’ టీవీ యాంకర్లు నయమేమో..!!
. అయిపోయింది … భారత జర్నలిజంలో అతిపెద్ద పేర్లలో ఒకరైన రాజ్‌దీప్ సర్దేశాయ్‌ను ఇండియాటుడే యాజమాన్యం పీకిపారేసింది, లేెకపోతే ఏమిటా పిచ్చి కూతలు..? అని మొన్నటి నుంచీ సోషల్ మీడియాలో చాలా పోస్టులు కనిపించాయి… నిజంగా ఇండియాటుడే ఆ పనిచేసిందా…? చేయలేదు… అంటే డిడ్ నాట్, కెనాట్… అందుకే తన పేరు ఇంకా కనిపిస్తూనే ఉంది, పనిచేస్తూనే ఉన్నాడు… అంత బలహీనమైన యాజమాన్యమా..? ఇప్పుడిది మరో చర్చ… అసలే ఉద్రిక్తతల వేళ, గతంలో ఏవో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రెండు […]
- « Previous Page
- 1
- …
- 41
- 42
- 43
- 44
- 45
- …
- 379
- Next Page »