ముందుగా ఆంధ్రజ్యోతిని ఒక విషయంలో ప్రశంసించాలి… తన ఎడిటోరియల్ లైన్, తన పొలిటికల్ ఫేవరిటిజం ఎలా ఉన్నా సంపాదకీయ పేజీని మాత్రం ‘తటస్థంగా’ ఉంచుతుంది… వీలైనంతవరకూ… యజమాని రాసే కొత్తపలుకులు, కావాలని రాయించే ప్రత్యేక ఎడిట్ ఫీచర్లు, కొన్ని వ్యాసాలు పక్కన పెడితే… సమాజంలోని అన్ని సెక్షన్ల అభిప్రాయాల్ని అచ్చేస్తుంది… ఒకే ఇష్యూ మీద భిన్నాభిప్రాయాల్ని ప్రచురిస్తుంది… కానీ ఇతర పత్రికలు తమకు నచ్చేవి, తమకు ఉపయోగపడేవి, తమ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నవి మాత్రమే ప్రచురిస్తాయి… పైగా […]
చావుడప్పు..! కాసులుంటేనే కైలాసానికి… కాదంటే లోలోపల ‘కుళ్లిపోవడమే…
శవానికీ భరించలేనంత నొప్పి… శోకం… నిజమే… కావల్సిన రెమ్‌డెసివర్ మందు దొరకదు… బ్లాక్… మాఫియా… దొంగలు… హాస్పిటల్లో బెడ్ దొరకదు… పైరవీలు, ఒత్తిళ్లు, ప్రలోభాలు… బెడ్ దొరికినా ఆక్సిజన్ దొరకదు… ఆక్సిజన్ దొరికినా కావల్సిన ఇంజక్షన్లు దొరకవు… అంతకుముందు టెస్టింగ్ కిట్స్ దొరకవు… రిజల్ట్స్ రావు… చివరకు చస్తే గౌరవప్రదమైన అంత్యక్రియలూ దక్కవు… ఖర్చుకు భయపడి శవాల్ని వదిలేసి వెళ్తున్నారు శవాల బంధువులు… ఇదీ ఈనాడు ఫస్ట్ పేజీ స్టోరీ… పరిస్థితి తీవ్రత ప్రజెంటేషన్‌లో అంతగా ప్రతిఫలించలేదు […]
ఆ జర్నలిస్టును ఎయిమ్స్‌లో చేర్చండి… సీజే జస్టిస్ రమణ ధర్మాసనం ఆదేశం…
‘‘తక్షణం ఆ కన్నన్ అనబడే విచారణ ఖైదీని ఉత్తరప్రదేశ్ నుంచి తరలించండి, ఢిల్లీలో ఎయిమ్స్ లేదా మరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రిలో గానీ చేర్చండి… ఆయన ఆరోగ్యం కుదుటపడ్డాక తిరిగి మధుర జైలుకు పంపిద్దాం గానీ…’’ ఇదీ సుప్రీం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం ఆదేశం… సంకెళ్లతో మంచానికి పశువులా తన భర్తను కట్టేశారనీ, తిండీతిప్పలు సరిగ్గా లేవనీ, కరోనా సోకినా పట్టించుకునే దిక్కు లేదని కప్పన్ అనే కేరళ జర్నలిస్టు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించిన […]
గూగుల్ తాతలు… ఫేస్బుక్ భాషానువాదాలు… ఇదేం ఖర్మరా దేవుడా..?
ఫేస్ బుక్ అనువాదాన్ని నమ్మితే… ఇంతే సంగతులు! (S.Ramu)….. ఈ మధ్యన ఫేస్ బుక్ మనం తెలుగులో ఏదైనా రాసి పెడితే…. అది రాకుండా దానంతట అది ఇంగ్లిషులోకి అనువదించి పెడుతోంది. ‘Show Original’ అన్న మాటను నొక్కితే తప్ప తెలుగు లిపి కనిపించదు. ఈ అనువాదం సంగతి ఏమిటా? అని చూస్తే నాకు మతిపోయింది. ముందుగా ఫేస్ బుక్ నుంచి సంగ్రహించిన ఈ స్క్రీన్ షాట్ చూడండి. 1992లో ఈనాడు జర్నలిజం స్కూల్ లో నా […]
ఇంతకీ నువ్వెవరు..? నీ అసలు పేరేమిటి..? నీ గోత్రమేమిటి..? నీ కథేమిటి..?
భద్రాద్రి రాముడికి తండ్రి లేడా? అని ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో ఒక ఆలోచనాపరుడు లోతయిన వ్యాసం రాశాడు. ఇలాంటి వివాదాలు మంచివి కాదు- అని బాధపడుతూ ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకుడు అదే ఎడిట్ పేజీలో సుదీర్ఘమయిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. యాజమాన్య విధానాలతో సంబంధం లేకుండా భిన్నవాదనలను వినిపించే జ్యోతి ఎడిట్ పేజీని ముందు అభినందించాలి. ఈ రెండు వాదనల్లో ప్రధానమయిన విషయం ఏమిటో చూసి తరువాత చర్చలోకి వెళదాం. ఒక వాదన:- ————- […]
నకిలీలు, కొరత, బ్లాక్ మార్కెట్, అడ్డగోలు రేట్లు… ఇదీ రెమ్‌డెసివర్ మాఫియా…
ఆక్సిజన్ మాత్రమే కాదు, వేక్సిన్లే కాదు… డాక్టర్లందరూ ఆధారపడుతున్న యాంటీ వైరల్ డ్రగ్ రెమ్‌డెసివర్ ఇంజక్షన్లు ఇప్పుడు మరో ప్రధాన సమస్య… ప్రభుత్వాలకు ఎలాగూ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కంట్రోల్ లేదు, డ్రగ్ మాఫియా మీద అసలే లేదు… ఏదో అలా జనం కోసం ‘కఠిన చర్యలు తప్పవు’ అని ప్రెస్మీట్లలో చెబితే సరి… రెమ్‌డెసివర్ డ్రగ్ దోపిడీ ఎన్నిరకాలుగా సాగుతున్నదంటే… 1) హాస్పిటల్సే చౌకగా తెప్పించుకుని అడ్డగోలు రేట్లకు రోగులకు ఎక్కించేయడం… రోజుల తరబడీ ఇస్తున్నారు… […]
చీఫ్ జస్టిస్ రమణ ఏం చెప్పబోతున్నట్టు..? ఆ జర్నలిస్టు కేసుపై అందరి దృష్టి…!!
జస్టిస్ ఎన్.వి.రమణ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యాక, తన నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చిన ఓ ఇంట్రస్టింగు కేసు ఓ జర్నలిస్టుది… కాస్త వివరాల్లోకి వెళ్లాలి, ఎందుకంటే… బహుముఖంగా చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్న కేసు ఇది… అందుకే అందరి ఆసక్తీ దీనిపై కేంద్రీకృతమైంది… సీజే ధర్మాసనమే విచారిస్తోంది… ఆ జర్నలిస్టు పేరు సిద్దిక్ కప్పన్… కేరళలోని మల్లపురం తనది… ఢిల్లీలో పనిచేస్తున్నాడు… ఆమధ్య యూపీలోని హత్రాస్ అత్యాచారం కేసు బాగా సంచలనం సృష్టించింది తెలుసు కదా, […]
రామోజీరావు మరో ప్రయోగం… పోగొట్టుకున్నచోటే కొత్త వెతుకులాట…
ప్రయోగాలు రామోజీరావుకు కొత్తేమీ కాదు… ప్రత్యేకించి మీడియా, వినోదరంగానికి సంబంధించి చాలా ప్రయోగాలు చేసి ఉన్నాడు… వాటి సాఫల్య వైఫల్యాల మాటెలా ఉన్నా ఒకేసారి 12 చానెళ్లను ప్రారంభించడం టీవీ సర్కిళ్లను ఆశ్చర్యపరిచింది… ఇది సరైన స్టెప్పేనా అని ఆశ్చర్యపోయేలా చేసింది… విషయం ఏమిటంటే..? బాలభారత్ పేరిట పలు భాషల్లో బాలల ప్రత్యేక చానెళ్లను ఒకేసారి ఈటీవీ లాంచ్ చేసింది… అది చేయగలదు, దాని సాధన సంపత్తి, ప్లానింగు పక్కాగా ఉంటయ్… గతంలో కూడా ఒకేసారి డజను […]
బాబ్బాబు, కాస్త ధర తగ్గించుకోవా ప్లీజ్… వేక్సిన్ కంపెనీలకు మోడీ సలాం…
దేశం నలుమూలల నుంచీ వ్యతిరేకత పెల్లుబుకుతున్నా సరే… మోడీ నుంచి వీసమెత్తు స్పందన లేదు… వేక్సిన్ ధరలపై ఆయా తయారీ కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా ధరల్ని ప్రకటిస్తున్నా సరే, మోడీ సర్కారు కిక్కుమనలేకపోతోంది… దాసోహం అన్నట్టుగా వ్యవహరిస్తోంది… ధరలపై నా నిర్ణయం ఇదీ అని ప్రకటించలేక, అడ్డగోలు ధరల్ని ప్రకటించిన కంపెనీలను ఏమీ అనలేక… బాబ్బాబు, కాస్త ధరలు తగ్గించుకో బ్రదర్ అని సుల్తాన్ బజార్ బేరాలకు దిగింది… ‘అందరూ తిడుతున్నారు, మీరే కాస్త దయచూపి ఎంతోకొంత […]
RT-PCR పరీక్ష కూడా తప్పు చెబుతోంది… ఇంకేం చేయాలి సార్..?
…………. Jagannadh Goud………………. మూడవ భాగం: కరోనా ప్రశ్నలు – సమాధానాలు 51. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ధైర్యంగా ఉండటం ఎలా.? • మంచి పోషకాహారం తీసుకోవాలి. కొన్ని రోజులు డి విటమిన్, సి విటమిన్, జింక్ మరియూ B12 సప్లిమెంటల్ టాబ్లెట్స్ వాడటం మంచిది. • అవకాశం ఉన్నవాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవాలి. • తగినంత విశ్రాంతి, నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. • బయటికి వెళ్ళినప్పుడు డబల్ మాస్క్ (లోపల సర్జికల్ మాస్క్, బయట క్లాత్ […]
ఐవర్‌మెక్టిన్…! పశువుల మందు మనుషులకూ సై… భలే కిట్, భలే వార్త…
అభినందించాల్సిన వార్త ఇది… వర్తమాన వ్యవహారాలపై నిశిత పరిశీలన, సమాచార సేకరణ, సరైన ప్రజెంటేషన్ అవసరం ఏ జర్నలిస్టుకైనా… ఎంతసేపూ పాలకభజన కాదు కదా… నిజానికి ఇది ఫస్ట్ పేజీ వార్త… ఎందుకంటే..? కరోనా చికిత్సకు సంబంధించి ఫీల్డులో ఏం జరుగుతున్నదో గమనించి రాసిన వార్త… వాస్తవానికి వార్తలు అంటే ఇవే… ఈ వార్త ఓసారి చదవండి… జింక్, ఐవర్ మెక్సిన్, డాక్సీ సైక్లిన్ తదితర మాత్రలతో కూడిన ఓ కిట్ పాపులరైంది… మైల్డ్ లక్షణాలుంటే అయిదారు […]
అంబానీ కుడిభుజం సన్యాసదీక్ష… అన్నీ వదిలేసి, నిర్వాణమార్గంలోకి…
‘‘ప్రకాష్ షా… దేశాన్ని శాసించే ముఖేష్ అంబానీ బాల్యమిత్రుడు, తన కంపెనీ వైస్ ప్రెసిడెంట్, తన కుడిభుజం… జీతం ఏటా 70 కోట్లు… వయస్సు డెబ్భయ్ దాటి… మొన్న 25వ తేదీన ఈ భౌతిక సుఖాలు, హోదాలు గట్రా అన్నీ వదిలేశాడు… అకస్మాత్తుగా సన్యాసదీక్ష స్వీకరించాడు… ఇప్పుడాయన పేరు నూతన్ మునిరాజ్… ఇక తన బాట నిర్వాణపథమే… మహాప్రస్థానమే…….’’ ఇంట్రస్టింగుగా ఉంది కదా… ఈ ట్వీట్ ఓ జాతీయవాది ట్వీట్లో కనిపించింది… కానీ ఎవరూ పెద్దగా స్పందించలేదు, […]
మెచ్చితిమి పట్నాయకా..! నిశ్శబ్దంగా, నిజాయితీగా ‘ప్రాణవాయువు’ అందిస్తున్నవ్…
బేసిక్‌గా నాయకులందరూ ఒకే టైపు అనుకుంటాం… పార్టీలు వేరు కావచ్చునేమో గానీ… దాదాపు అందరి తత్వాలూ ఒకేరకం, కాస్త అటూఇటూగా అనేదే చాలామందిలో ఉన్న భావన, నమ్మకం… కానీ కొందరు ఉంటారు… అందరు అనబడే ఆ జాబితా నుంచి విడదీసి చూడాలి… విడిగానే చూడాలి… ఎందుకంటే… వాళ్లు కాస్త మెచ్చుకోదగిన కేరక్టర్లు కాబట్టి… వారిలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ పేరు కూడా కచ్చితంగా ఉండాలి, ఉంటుంది… తను అసలు పెద్దగా ప్రచార తెర మీద కనిపించడు… […]
కరోనా కాదు… ధైర్యం సడలితే చాలు, ఆ భయమే మింగేస్తుంది… బహుపరాక్…
చిరంజీవి ఇప్పుడేమీ కాకపోవచ్చు… కానీ తను నటుడిగా బాగా బతికిన రోజులనాటి ఒక్క విషయం చెప్పుకోవాలి… 1984 కాలం కావచ్చు… మహానగరంలో మాయగాడు అనే ఓ సినిమా వచ్చింది… తనే హీరో… ఓ ఎపిసోడ్లో ధనం, ధాన్యం, సంతానం, వీరం వంటి అష్టలక్ష్ములున్నా సరే, ధైర్యలక్ష్మి లేకపోతే అందరూ వేస్ట్ అనే ఓ నీతివాక్యం బోధిస్తుంది అది… నిజం… భయం లేకపోవడం, ధైర్యంగా ఉండటం, పోరాడటమే జీవితాన్ని గెలిపిస్తుంది… కరోనా కాలం నేర్పిస్తున్నదీ అదే… నేర్చుకోవాల్సింది కూడా […]
Ad Infinitum..! తెలుగు సినిమాయే… ఓ సైన్స్, క్రైం, సస్పెన్స్ థ్రిల్లర్… కానీ…!?
ఆశ్చర్యం వేసింది… అసలు ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది..? మామూలు సోది, సొల్లు చిత్రాలకే బోలెడంత ప్రమోషన్ యాక్టివిటీ ఉంటుంది కదా… ఈ సినిమాను చడీచప్పుడు లేకుండా ఎందుకు రిలీజ్ చేశారు..? సినిమా బాగుంటే జనం చూస్తారు కదా అనే ధీమాయా..? కానీ కనీస స్థాయి పబ్లిసిటీ అయినా అవసరం కదా… నిజమే, ఈమధ్య మీడియా మీట్లు, స్పెషల్ ఇంటర్వ్యూల ‘‘ఖర్చు’’ విపరీతంగా పెరిగింది సరే.., పోనీ, సోషల్ మీడియాను వాడుకోవచ్చు కదా… థియేటర్ల నుంచి ఎప్పుడు […]
కెవ్వు గావుకేకారుపు..! ‘అతి’కే అతితనం నేర్పే నాటి తెలుగు మూవీ సీన్లు…
…. By……. Gottimukkala Kamalakar………… అదో పూరిగుడిసె..! ఆ పక్కనే కార్ పార్కింగ్ లో ఓ ఎర్ర కాడిలాక్, ఇంకో పసుపురంగు షెవర్లే పార్క్ చేసున్నాయి. గుడిసె ముందు జాగ్రత్తగా మోన్ చేసిన లానూ, పూల మొక్కలూ ఉన్నాయి. ఇవాళ నీళ్లుపోయకపోవడం వల్లో, ఇంకెందువల్లో పూలమొక్కలు దీనంగా చూస్తున్నాయి. గుడిసె ముందు జనం జాతరలోలా మూగి ఉన్నారు. మగాళ్లు నీరుకావి ధోవతీ మీద పొందూరు చొక్కా, దానిమీద కోటూ వేసుకుని, దానిమీదింకో తువ్వాలేసుకుని బెక్కుతూ ముక్కులు […]
Destiny..! ఆరోజు తరుముకొస్తే అంతటి శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!
కరోనాకు దూరంగా ఉండి, అంతా బాగానే ఉందిలే అని మనం అనుకుంటున్నాం… కానీ లేదు… హోం ఐసొలేషన్, హోటల్ ఐసొలేషన్, క్వాంరటైన్, హాస్పిటల్ బెడ్, ఐసీయూ… ఎక్కడో ఓచోట కరోనా నుంచి బయటపడటానికి ఆరాటపడుతున్న రోగులు, వాళ్లు బంధువులు, ఆవిరైపోతున్న ఆస్తులు, అడ్డగోలు అప్పులు… వాళ్లకు ఏమీ బాగాలేదు… ఇది సొసైటీలో నెగెటివిటీని నింపే ప్రయత్నం కాదు… నిజం… నిష్ఠురంగా ఉన్నాసరే నిజం… సర్కార్లు ఎప్పుడూ ఇంతే… సమాజమూ ఇంతే… ఒక సమయం వస్తుంది… ఆ టైం […]
కోవాగ్జిన్‌తో పోయేదానికి రెమ్‌డెసివర్ అవసరమా..? అర్థం కాలేదా..? చదవండి…!!
వేక్సిన్ వేసుకున్నా సరే, మా పక్కింటామెకు కరోనా వచ్చింది… వేక్సిన్ వేసుకుంటేనే మా చుట్టాలమ్మాయికి కరోనా వచ్చింది… కరోనా రాదనే గ్యారంటీ లేనప్పుడు వేక్సిన్ దేనికి మరి..?… ఇలా ఇప్పటికీ చాలామందిలో అపోహలు… చివరకు ప్రజలకు నిజాలు చెప్పాల్సిన వైద్య ఆరోగ్య సిబ్బందిలోనే బోలెడుమంది వేక్సిన్‌కు దూరంగా ఉన్నారు… అదుగో అక్కడ అలా, ఇదుగో ఇక్కడ ఇలా అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఈ అపోహల్ని మరింత ప్రచారం చేస్తున్నారు… కొందరైతే మందు మానేయాలట […]
పేరుకే ఫ్రంట్ లైన్ వారియర్స్..! కరోనా క్షతగాత్రుల్లో ఫస్ట్ లైన్ జర్నలిస్టులదే…
సెకెండ్ వేవ్ లో… కొడిగడుతున్న జర్నలిస్టు దీపాలు ——————– శ్రీకారం రామ్మోహన్ మొదట జర్నలిస్టు. తరువాత ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ ఉద్యోగంలోకి వెళ్లారు. మంచి రచయిత. రాసినవి చాలా తక్కువే అయినా- రాసినవన్నీ మంచి రచనలే. 1996 ప్రాంతంలో “శుభం” అని ఒక కథ రాశారు. ఆ కథ ప్రారంభంలో జర్నలిస్టుల జీవితానికి అద్దం పట్టే గొప్ప సత్యాన్ని ఆవిష్కరించారు. “లోకం నిద్రపోయేవేళ- లోకాన్ని నిద్రలేపడానికి వారు మేల్కొని ఉంటారు. లోకం మేల్కొన్నవేళ వారు నిద్రపోతారు” ఆయన […]
టీకా ధరల దందా..! అలుసు దొరికిందిగా… అడ్డంగా కుమ్మేయండి బ్రదర్…
ఎస్… ఖచ్చితంగా ఒక టీకా తయారీ ఖర్చు చాలా చాలా తక్కువ… అందుకే భారత్ బయోటెక్ సీఎండీ ఎల్లా కృష్ణ తనే స్వయంగా ఒక మాటన్నాడు… కేటీయార్ సమక్షంలోనే… ఇది మన హైదరాబాదీ కంపెనీ… ఒక మంచినీళ్ల సీసాకన్నా తక్కువ ధరకు నాణ్యమైన వేక్సిన్ అందిస్తాను అన్నాడు ఆయన… వేక్సిన్ల తయారీలో ఏళ్ల అనుభవం ఉంది, కరోనాకు ఓ స్వదేశీ వేక్సిన్ వస్తుంది కదాని అందరూ ఆనందపడ్డారు… తీరా ఏమైంది..? వాటర్ బాటిల్ ధర కాదు, ఫుల్ […]
- « Previous Page
- 1
- …
- 432
- 433
- 434
- 435
- 436
- …
- 482
- Next Page »