తెలుగు కథకే అవమానం… కాదు, కాదు… చిన్నతనం… తెలుగు కథకులందరికీ తలవంపులు… అంత పెద్ద ఈనాడు సంస్థ కథల పోటీ పెడితే ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందడానికి అర్హత సంపాదించిన కథ ఒక్కటంటే ఒక్కటీ లేదట… 1500 కథలు పోటీపడితే, అందులో ఫస్ట్, సెకండ్ ర్యాంక్ కథలు కనిపించక… చివరకు న్యాయమూర్తులే అల్లాడిపోయి, వాళ్లే తలదించుకున్నంత పనైపోయి… నో టాప్ టు ర్యాంక్స్ అని విచారవదనాలతో ప్రకటించాల్సి వచ్చింది… ఈ పోటీ పేరు ‘ఈనాడు’ కథావిజయం… అది […]
సారంగదరియా సరే… మరి ఈ బేట్రాయి స్వామి దేవుడి ఖూనీ మాటేమిటి..?!
అయిపోయిందిగా… సారంగదరియా పాట వివాదం చల్లబడిందిగా… తరతరాలుగా పాడుకునే జానపదగీతాలపై హక్కెవరిది అనే బలమైన చర్చకు దారి తీసింది ఆ వివాదం… నిజానికి సారంగదరియా పాట రొమాంటిక్… దాన్ని అదే ట్యూన్లో, ఆదే టోన్‌లో దర్శకుడు సాయిపల్లవి మీద చిత్రీకరించుకున్నాడు… ఆ పల్లవి మాత్రమే వాడుకున్నాడు, మిగతాది సుద్దాల సొంత రాతే… జానపద గీతాలను ఇష్టమొచ్చినట్టుగా వాడుకుని, ఖూనీ చేయడం తెలుగు ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు… ఆఖరికి భక్తిపాటలను కూడా, వాటి అర్థాన్ని వదిలిపెట్టేసి, వెకిలి వేషాలతో […]
కనుక కామ్రేడ్స్… మనవి ఎప్పుడూ తోక విప్లవపోరాటాలే… ఇదే ప్రజాతంత్రం…
Gurram Seetaramulu……………. ముప్పై మూడో పాయింట్, నాలుగున్నర వ్యూహం, నలభై నాలుగు పాయింట్, ఐదున్నర ఎత్తుగడ ప్రకారం ఈసారి మహా ఉత్క్రుష్టమైన ఎన్నికల్లో రెండు ఇప్లవ జాతీయ పార్టీలు (చిపిఐ, చిపిఎం) మిగతా అలగా జాతీయ పార్టీల ద్రోహాలను పరిగణనలోకి తీసుకొని, ఇరవయ్యో శతాబ్ద రాజకీయ పునరుజ్జీవ అంశ అయిన నోముల నర్సింహయ్య సుతుడు అయిన భగత్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది… చిటికెలు చిటికెలు… పోయిన ఎన్నికల్లో నూటా పందొమ్మిది స్థానాలలో పోటీ చేసిన […]
మాస్క్ ధరిస్తే అరిష్టమట… ఏదేదో కూశాడు ప్రశాంత్ భూషణ్… ఇజ్జత్ పోయింది..!
దేశంలోకెల్లా పెద్ద పేరున్న పెద్ద లాయర్… సుప్రీంకోర్టు లాయర్… పెద్ద పెద్ద కంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి, రూపాయి జరిమానాతో తప్పించుకోగల రేంజ్… ప్రొ-సొసైటీ, ప్రొ-పూర్ అనే పేరున్న లాయర్… పేరు ప్రశాంత్ భూషణ్… అయితేనేం..? అప్పుడప్పుడూ విచిత్రమైన వ్యాఖ్యల్ని ట్వీట్ జారుతుంటాడు… ఆ ట్వీట్ పెట్టేముందు అది అవసరమా, లేదా, తన హోదాకు తగినట్టు ఉంటుందా, లేదా వంటివి ఏమీ ఆలోచించడు… ఇప్పుడు కూడా అలాగే నిర్లక్ష్యంగా ఓ ట్వీట్ పెట్టాడు… తీరా ఏం జరిగింది..? దేశమంతా […]
మంచు లక్ష్మి..! వచ్చింది, తనూ ఓ పార్టిసిపెంటు… అంతే, వెళ్లిపోయింది..!!
జీవాడు కాస్త ముందుగానే కూస్తున్నాడు ఈమధ్య… పండుగకన్నా రెండురోజుల ముందే ‘ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం’ అని ఓ ఉగాది స్పెషల్ ప్రసారం చేసేశాడు… ఫాఫం, పండుగ రోజు ప్రసారం చేస్తే ఈటీవీ, మాటీవీ వాళ్ల పండుగ స్పెషల్స్‌తో పోటీపడాలి… రేటింగులు దొబ్బే ప్రమాదం ఉంది… దాంతో నాలుగు గంటల కమర్షియల్ కమ్ ఫెస్టివల్ స్పెషల్ షోను నిన్న ఉదయం కుమ్మేశాడు… అయిపోయింది… ఎటొచ్చీ అది చూస్తున్నంతసేపూ ఓ విశేషం కాస్త అబ్బురంగా అనిపించింది… మంచు లక్ష్మి… […]
…. నేను కవిని కానన్నవాణ్ని కత్తితో పొడుస్తా… అడ్డొస్తే కరోనానైనా ఖతం చేస్తా…
ఉగాది కవితా! నీవెక్కడ? ——————- తెలుగు ఉగాదులు, సంవత్సరాల పేర్లు తెలుగులా ఇంగువకట్టిన గుడ్డ. ఉన్నాయనుకుంటే ఉంటాయి. లేవనుకుంటే లేవు. ఉన్నా లేనట్లే. లేకపోయినా ఉన్నట్లే. అందుకే బహుశా కృష్ణశాస్త్రి- “నాకుగాదులు లేవు; ఉషస్సులు లేవు” అన్నాడేమో తెలియదు. పెద్ద బాలశిక్షను కక్షగట్టిన పెద్ద శిక్షగా భావించి యాభై ఏళ్ల కిందటే శిక్షించి అటకెక్కించాము. ఇప్పుడు అరవై తెలుగు సంవత్సరాల పేర్లు గూగుల్ చెబితే ఉన్నట్లు. లేకుంటే ఆ సంవత్సరాలకు ఎప్పుడో సంవత్సరీకాలు జరిగినట్లు. వికారి పోయి, […]
పవన్ కల్యాణ్ టైం బాగున్నట్టే ఉంది… మాదాసు ప్రభావం నుంచి విముక్తి..!!
ఒక వార్త… జనసేన పార్టీకి మాదాసు గంగాధరం రాజీనామా… మూడు పేజీల లేఖలో సంచలన వ్యాఖ్యలు… జనసేనకు మరో షాక్… ఇలా సాగిపోయింది ఆ వార్త… పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు… అదెప్పుడో పడిపోయే వికెట్టే… ఏడాదిగా తను అసలు యాక్టివ్గానే లేడు… పైగా జనసేన నుంచి ఒక్కొక్కరే నిష్క్రమిస్తున్న కాలంలో, ఈ మాదాసు ఇంకా అక్కడే పవన్ కల్యాణ్‌ను పట్టుకుని వేలాడతాడని ఎవరూ అనుకోలేదు… అది జరిగే పని కూడా కాదు… ఎట్ లాస్ట్, జరిగిపోయింది… కాకపోతే […]
ఫాఫం నాగ్అశ్విన్..! అసలైన ‘జాతిరత్నం’ తనే..! మరీ జబర్దస్త్ తరహా టేస్ట్..!!
ఫాఫం నాగ్ అశ్విన్..! ఏమాత్రం సంకోచం లేకుండా చేస్తున్న వ్యాఖ్య ఇది… కొండ మీద ఉన్నవాళ్లు హఠాత్తుగా దిగువ ఉన్న బురదలోకి పడిపోవడం అనేది పెద్ద కొత్తేమీ కాదు, అలా చాలామందిని చూశాం… అశ్విన్ అతీతుడేమీ కాదు… ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చూశాక తన మీద ఉన్న సదభిప్రాయం కాస్తా జాతిరత్నాలు చూశాక ఆవిరైపోయింది… పోతుంది… పోయేలా చేసుకున్నదీ ఆయనే… అఫ్ కోర్స్, తను ఈ జాతిరత్నాలు అనబడే ఓ పెద్ద జబర్దస్త్ ఎపిసోడ్‌కు నిర్మాత మాత్రమే… […]
ఓహ్… చంద్రబాబు స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పటి నుంచీ ఇంతేనా…!!
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కడుపులో ఉన్నది కక్కేస్తాడు… పలుసార్లు హిపోక్రటిక్, డిప్లొమాటిక్ వికారాలేమీ ప్రదర్శించడు… కనీసం ఆ పార్టీకి అలవాటైన పడికట్టు పదాల్ని కూడా వాడడు… ఎవడో ఏదో అనుకుంటాడనే భావన కూడా రానివ్వడు… ఇప్పుడేం చెప్పాడంటే..? పరోక్షంగా… చంద్రబాబు తన విద్యార్థి జీవితం నుంచీ కులం పర్టిక్యులర్ రాజకీయాలే ప్రదర్శించాడనీ… ఈ కమ్మ-రెడ్డి వైరం దశాబ్దాల క్రితమే తిరుపతిలో చూసిందేననీ చెబుతున్నాడు… ఓహ్, అంటే ఇదేమీ కొత్త కాదన్నమాట… ఓహ్, ఈ రెడ్డి రాజకీయాల్ని […]
గుప్తనిధి అంటే..? లెక్కల్లో చూపని సంపద కాదు… దాచిపెట్టిన పాత సంపద…
గుప్త నిధులన్నీ ప్రభుత్వానివే! ——————- జనగామ జిల్లా పెంబర్తి దగ్గర పొలాన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం తవ్వుతుండగా లంకె బిందె దొరికింది. అందులో బంగారముంది. అయితే- ఈ లంకె బిందెలో ఉన్నది బంగారమయినా, వజ్ర వైఢూర్యాలయినా తాజాగా భూమి యజమాని అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారికి కానీ, ఆ భూమిని తరతరాలుగా సాగు చేస్తూ మొన్ననే అమ్ముకున్న రైతుకు కానీ చేతికి దక్కేది మన్ను మశానమే. ఆ మన్ను కూడా కొన్ని యుగాల తరువాతే దక్కుతుంది. […]
రెడ్లు..! షర్మిల రాకతో మళ్లీ అదే చర్చ..! ప్రశ్నించే బాణాలు ఇంకొన్ని…!!
షర్మిల రాజకీయ పార్టీ ఇంకా ప్రకటించనేలేదు… పేరు కూడా పెట్టలేదు… అప్పుడే కొంత ప్రభావం కనిపిస్తోంది… ఆమె ఖమ్మం సభ చెప్పుకోదగిన రీతిలో విజయవంతం కావడమే కాదు… ఆమె ప్రభావం ఏయే పార్టీపై ఎంత ఉండనుందనే చర్చకు అప్పుడే తెరలేచింది… ప్రత్యేకించి తెలంగాణ రాజకీయాల్లో రెడ్లు అనే ఫ్యాక్టర్ మళ్లీ చర్చల్లోకి వచ్చింది… తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ రెడ్లదే ఆధిపత్యం… తెలుగుదేశం వచ్చాక కమ్మల ప్రభావం పెరిగి, రెడ్ల ఆధిపత్యానికి, అధికారానికి బీటలు పడటం స్టార్టయింది… రాష్ట్ర […]
YS Sharmila..! షర్మిల రాజకీయాలపై టీఆర్ఎస్ నిశ్శబ్ధం దేనికి..?
ఎవరు వద్దనుకున్నా, ఎవరు కోపగించుకున్నా, ఎవరు స్వాగతించినా, ఎవరెలా రియాక్టయినా సరే… షర్మిల పార్టీ తెలంగాణలో చర్చనీయాంశం…! ఓ మిత్రుడి ప్రశ్న ఏమిటంటే…? అప్పట్లో జగన్‌కు వ్యతిరేకంగా మానుకోటలో పెద్ద ఎత్తున రాళ్లదాడికి దిగి, తెలంగాణలో తిరిగితే మర్యాద దక్కదు అని తిరగబడిన తెలంగాణవాదులు ఇప్పుడు షర్మిల పార్టీ పట్ల మౌనంగా ఉన్నారేమిటి..? ‘‘ఆమె వీరసమైక్యవాది వైఎస్ బిడ్డ, జగన్ సోదరి, ఆంధ్రా… తెలంగాణ పట్ల పల్లెత్తు మాటను సానుకూలంగా మాట్లాడలేదు సరికదా తెలంగాణ వ్యతిరేక శిబిరం… […]
Virginity Test..! మనం ఆ శీల @ శిలాయుగంలోనే ఆగిపోయాం… ఇదీ ఉదాహరణ…
మన భ్రమ… మనం ఖగోళాన్ని జయిస్తున్నామనీ… మనం నీచమైన పాత సంప్రదాయాల్ని బద్ధలు కొట్టుకుంటూ… వేగంగా ముందుకు దూసుకుపోతున్నామనీ… నవీనయుగంవైపు అడుగులు వేస్తున్నామనీ అనుకుంటున్నాం… శుద్ధ అబద్ధం…. మన అడుగులు కేవలం జిమ్‌లో కనిపించే ట్రెడ్‌మిల్‌పై మాత్రమేననీ… ఎంత చెమటలు పట్టినా మనం అక్కడే ఉండిపోయామనీ మనకు అర్థం కాదు, కావడం లేదు… ఆడ మనిషి రజస్వల అయితే ఇంకా ఊరి బయట గుడిసెల్లో ఉంచేస్తున్న రోజుల్లోనే ఉండిపోయామనీ… ఇప్పటికీ ఆడ పిల్లలకు వర్జినిటీ టెస్టులు చేసే […]
గుళ్లకు విముక్తి…! అసలు తప్పుచేసిందే బీజేపీ… అదేమీ ముక్తిప్రదాత కాదు…
హిందూ దేవుళ్లపై, గుళ్లపై, ఆస్తులపై, ఆగమాలపై, ఆదాయంపై, ఆచారవ్యవహారాలపై…. కోర్టులు, బ్యూరోక్రాట్లు, లీడర్ల నిర్ణయాలు, తీర్పులేమిటి..? ఒక గుడిలో ఏ పూజ ఎలా ఉండాలో కోర్టులు నిర్దేశిస్తుంటయ్… దేవుడిని ఆదాయవనరుగా ఎలా మార్చాలో లీడర్లు ఆలోచిస్తుంటరు… తమ ఆదాయం పెంచుకోవడానికి అవినీతి అధికారులు ప్రయాసపడుతుంటరు…….. మఠాలు, పీఠాలు నడిపేవాళ్లకు మాత్రం.., ఆధ్యాత్మికరంగంలో కృషిచేసేవాళ్లకు మాత్రం హిందూ గుళ్లపై కనీసం అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ కూడా ఉండదు…… ఇదేకదా కొందరి వాదన… అందుకే కదా ఈ దిక్కుమాలిన పెత్తనాల […]
Family Food..! కబుర్లు నంజుకుంటూ… ప్రతి బుక్కనూ ఆస్వాదిస్తూ…
ఇంట్లో అందరూ కలిసి తింటేనే ఆరోగ్యం! ——————- ఇంట్లో వారందరూ కలిసి కూర్చుని ఒకేసారి తింటే ఆరోగ్యమని బ్రిటన్ లో ఒక పరిశోధన తేల్చింది. ఇంగ్లీషు వాడు చెబితేనే ఏదయినా మనం వింటాం కాబట్టి- అందరూ కూర్చుని ఒకేసారి తినడంలో ఉన్న సౌలభ్యమేమిటో ఆలోచించాలి. నిజానికి భారత దేశంలో మొన్నటిదాకా అన్ని ప్రాంతాల్లో ఇలా తినడమే ఉండేది. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నారు. అర్బన్ లైఫ్, వేగం, ఉద్యోగాల ఉక్కిరి బిక్కిరి, డైనింగ్ టేబుళ్ల నాజూకు, టీ వీ […]
పవన్‌దీప్ అంటేనే ఉర్రూతలూగించే ఓ పాట… ఇంతకీ ఎవరితను..?
ఒక పాపులర్ టీవీ షోలోని ఒక కంటెస్టెంటుకు కరోనా సోకితే… అది జాతీయ స్థాయి ప్రముఖ మీడియా సైట్లన్నింటిలోనూ వార్త అయ్యింది..! నిజానికి అది వార్తే… ఎందుకంటే ఆ వ్యక్తి సంపాదించిన పాపులారిటీ అది… ఎగిసిపడుతున్నఓ నవ సంగీత కెరటం తను… పేరు పవన్‌దీప్ రాజన్… వయస్సు పాతికేళ్లు… ఊరు ఉత్తరాఖండ్‌లోని చంపావత్… పవన్ సోనీటీవీ ప్రిస్టేజియస్ మ్యూజిక్ కాంపిటీషన్ షో ఇండియన్ ఐడల్‌కు ఎంపికయ్యాక తన పేరు తెరపైకి ప్రముఖంగా వచ్చింది… ఉత్తరాఖండ్ అప్పటి ముఖ్యమంత్రి […]
బస్తర్ గురు..! పెద్దయ్య..! జవాన్‌ను వాపస్ తీసుకొచ్చిన ఈ వృద్ధుడెవరో తెలుసా..?!
దట్టమైన అడవులు… గుట్టలు… వందల మంది మావోయిస్టులు, సాయుధ బలగాల మధ్య కాల్పులు… యుద్ధం… దండకారణ్యానికి ఈ సమరం కొత్తేమీ కాదు… రాజ్యానికీ, తిరుగుబాటుకూ నడుమ నిత్యసమరమే అక్కడ… మొన్న కూడా యుద్ధం జరిగింది… 23 మంది జవాన్లు ప్రాణాలు వదిలారు… 31 మందికి గాయాలు… నలుగురైదుగురు నక్సలైట్లు కూడా మరణించారు… ఎందరికి గాయాలయ్యాయో తెలియదు… కానీ రాకేశ్వర్ సింగ్ అనే ఒక జవానును బందీగా తీసుకెళ్లారు మావోయిస్టులు… అంతటి ఉద్రిక్త సమరప్రాంతంలో దొరికిన ‘వర్గశత్రువు’ను మావోయిస్టులు […]
వావ్, వకీల్ సాబ్..! ‘పింక్ ఒరిజినల్ రివ్యూ’ అంటే ఇదీ..!!
……. by…. Prasen Bellamkonda………….. ఇవాళెందుకో పింక్ సినిమా గురించి మాట్లాడాలనిపిస్తోంది. పింక్ సినిమాలో ఏమేం ఎందుకు లేవో, అవి లేనందుకు అది ఎందుకు బాగుందో చెప్పాలనిపిస్తోంది. పింక్ లో అమితాబ్ కు పాపం కోర్టులో బల్లలు ఎత్తేయడం కుర్చీలిరగ్గొట్టడం తెలియదు, గడియారాన్ని మారణాయుధం చేయడం తెలియదు.. అయినా బాగుంది. పింక్ లో అమితాబ్ బాత్రూంలనూ మెట్రో ట్రయిన్ లనూ మల్ల యుద్ద భూములుగా మార్చడు.. అయినా అదేంటో మరి, బాగుంది. పింక్ లో అమితాబ్ అనాధల […]
Drunken Corona..! వైరస్ అయినా, మనిషి అయినా… ‘అక్కడే విజృంభించేది’…
విన్నారా? బార్ల వల్ల కరోనా వ్యాపిస్తోందని హై కోర్టు చెబుతోంది! ——————– రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏటా ఇరవై వేల కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా మద్యం అమ్ముడవుతోంది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు మద్యం అమ్మకాల్లో టాప్. మొత్తం దేశంలో అమ్ముడుబోయే మద్యంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 45 శాతం. బహుశా మరో రెండేళ్లల్లో 50 శాతం కావచ్చు. ఉత్తరాదిలో పంజాబ్ టాప్. అలాగని తెలుగు రాష్ట్రాల వినియోగం తక్కువ చేయాల్సిన పనిలేదు. ఎవరి చుక్కలు వారివి. […]
ఆ ఫ్లాష్‌బ్యాక్ కథలో సెట్ కాలేదు… లేకపోతే సినిమా మరో రేంజ్లో ఉండేది…
మనం తరచూ చెప్పుకునేదే… గాంధీ, బుద్ధుడి మీద బయోపిక్ సినిమాలు తీసినా సరే… మన హీరోలు దుడ్డుకర్రలు పట్టాల్సిందే… డాన్సులాడాల్సిందే… అవును మరి, ఎంతటి ఉదాత్తమైన కథైనా సరే, సగటు సినిమా హీరో ఇమేజీకి తగినట్టుగా అది మారాల్సిందే… మారి తీరాల్సిందే..! ఇప్పుడూ అంతే..!! నంబర్ వన్ అమితాబ్ రక్తికట్టించిన కోర్టు డ్రామా… ఆ కథలోని ఎమోషన్, జనానికి కనెక్టయ్యే మెయిన్ ప్లాట్… పింక్ అనే ఆ హిందీ సినిమాకు బలం… కథను నిజాయితీగా ప్రజెంట్ చేశారు… […]
- « Previous Page
- 1
- …
- 436
- 437
- 438
- 439
- 440
- …
- 482
- Next Page »