కోట్ల మందిని నవ్విస్తూ… తెలుగు టీవీ కార్యక్రమాలకే తలమానికంలా నిలిచిన మా అభిమాన జబర్దస్త్ షో మీద అప్పుడప్పుడూ సెటైర్లు వేస్తున్నవ్, నీ మొహం, నీకసలు టేస్టుందా..? మా రామోజీరావు టేస్టుకే వంక పెట్టేంత సీనుందా నీకు..? అని సీరియస్‌గానే అడిగాడు ఓ ఫేస్బుక్ మిత్రుడు ఇన్ బాక్సులో…! తన దృష్టిలో ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన కామెడీ అంటే మల్లెమాల ప్రొడక్షన్స్ వాళ్ల ఈ సబ్ స్టాండర్డ్ ఉత్పత్తే… సర్లె, ఒక్కొక్కరి టేస్టు ఒక్కో విధము… […]
స్పేస్‌లోకి నేమ్స్…! ఉత్త స్పేస్ వేస్ట్ టాస్క్..! ప్యూర్ ఫాయిదా లెస్ పని..!!
నానో శాటిలైట్… అంటే మరీ సూక్ష్మ ఉపగ్రహం… వచ్చే 28న ఇస్రో ప్రయోగించబోయే ఓ రాకెట్ ద్వారా పలు ఉపగ్రహాలతోపాటు అది కూడా కక్ష్యలోకి వెళ్లబోతోంది… సో వాట్ అంటారా..? ఉంది..! దీని పేరు సతీష్ ధావన్ నానో శాటిలైట్… గుడ్, భారతీయ స్పేస్ రీసెర్చ్ విషయంలో గొప్ప పేరు, ఆ పేరు పెట్టుకోవడంలో తప్పులేదు… ఇది స్పేస్ కిడ్స్ అనే సంస్థ ప్రయోగించబోయే రెండో ఉపగ్రహం… గతంలో కూడా కలాంశాట్ పేరిట ఓ నానో శాటిలైట్‌ను […]
ఒక కోడలు మోసిన అవమాన భారం! మనం ఎప్పటికీ మారం…!!
మధ్యప్రదేశ్ లో ఒక మహిళను అనాగరికంగా శిక్షించారని, హింసించారని, అవమానించారని ఒక వార్త. భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తుండగా అత్తింటివారు ఆమెపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. ఒక యువకుడిని ఆమె భుజంపై ఎక్కించి శిక్షగా మూడు కిలోమీటర్లు నడిపించారు. అలా మోయలేని బరువు మోస్తూ నడుస్తున్నప్పుడు కూడా ఒళ్లు వాచేలా కొట్టారు. చివరికి ఆ కోడలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమెను హింసించిన అత్తింటివారిలో కొందరిని అరెస్టు చేశారు. కేసు సహజంగా […]
నిలువెత్తు నిబ్బరం..! ఈ రాథోడ్ మీసానికి మన జెండాకున్నంత గర్వం..!!
నిజానికి ఇది ఓ పాత కథ… కొన్ని నిత్యస్ఫూర్తి కథల్లాగే ఇదీ ఎప్పుడు చదివినా చాలామందికి కొత్త కథే… అప్పుడెప్పుడో ఓ వింగ్ కమాండర్ రాసుకున్న ఓ నిజ అనుభవం… తనను కదిలించిన ఓ అంశాన్ని షేర్ చేసుకుంటే దాదాపు పదేళ్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ కథ కనిపిస్తూనే ఉంది… కంటతడి పెట్టిస్తూనే ఉంది… మళ్లీ ఎందుకు చెప్పుకోవడం అంటారా..? ఏదో పాత ఇంగ్లిష్ కాపీని గూగుల్ ట్రాన్స్లేటర్లో పెట్టి, అందులో ఉత్పత్తయిన చెత్తను యథాతథంగా […]
RGV చెంపదెబ్బ ఫిలాసఫీ..! వివాద ప్రేమికుడు కదా… అంతా తనిష్టమే..!!
రాం గోపాల్ వర్మ చెంపదెబ్బ ఫిలాసఫీ… వర్మ తన జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను వ్యాసరూపంలో చెప్పిన పుస్తకమే “చెంపదెబ్బ ఫిలాసఫి”. ఏకబిగిన చదివిన తరువాత వచ్చిన కొన్ని ఆలోచనలను పంచుకోవడమే ఈ వ్యాస ఉద్దేశ్యం. ప్రతి మనిషీ కొందరికి శత్రువుగా, కొందరికి మిత్రునిగా కనపడతారు. కానీ, వర్మ మాత్రం కొందరికి కొరకరాని కొయ్యగా కనపడతాడు. నేను శివ సినిమా చూసి “వీడేందిరా బాబు, ఇట్ట దీసిండు” అని ఆశ్చర్యపోయిన. తను అన్ని బాదరబందీలను వదిలించుకొని నా ఇష్టం […]
ఓ పాత కథ… కొత్తగా మళ్లీ పోస్టు… కానీ ఎందుకింత వైరల్ అయ్యింది..?!
నిజానికి ఇది అనేకసార్లు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి ఉంటుంది… ఏదో వాట్సప్ గ్రూపులో ఇంగ్లిషులో ఉన్న కంటెంటు చూసి, ఆసక్తిగా, సంక్షిప్తంగా… తెలిసీతెలియని నా అనువాద జ్ఞానంతో బాగా కుస్తీపడి, ఏదో ఆత్మానందం కోసం ఫేస్బుక్లో పోస్ట్ చేశా… సమయానికి ఫోటో కూడా దొరకలేదు… కానీ కొన్ని వందల లైకులు, షేర్లు… అదే మళ్లీ వందల వాట్సప్ గ్రూపుల్లోకి చేరి విపరీతంగా సర్క్యులేటైంది… అనేకమంది తమ పేర్లతో షేర్లు చేసుకున్నారు… పాతదే కదా… అంత […]
యూటీ హైదరాబాద్..! ఏమిటీ ఒవైసీ వ్యాఖ్యల వెనుక రాజకీయ మర్మం..?!
యూటీ… కేంద్రపాలిత ప్రాంతం… ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న మాట… అసలు ఏమిటీ దీని కథ..? మజ్లిస్ బాస్ ఎందుకు దీన్ని తెర మీదకు తీసుకొస్తున్నాడు..? ఆశిస్తున్న ప్రయోజనం ఏమిటి..? ఒవైసీ వ్యాఖ్య చేసిన వెంటనే టీఆర్ఎస్ ఎందుకు అందుకుని, బీజేపీ మీదకు మాటల దాడికి దిగింది..? ఒక సమీకరణాన్ని ఊహించొచ్చు… టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమ పార్టీ… ఎప్పుడైతే అది ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయిందో యూటీ (ఉద్యమ తెలంగాణ) బ్యాచును పక్కకు తోసేసి బీటీ (బంగారు […]
జ్యోస్యాలు, ముహూర్తాలు ఎవరైనా చెబుతారు… ఈయనది డిఫరెంట్ ట్రెండ్…
ఎన్నికలు వచ్చాయంటే జ్యోతిష్కులకు ఫుల్ గిరాకీ… పైకి ఏం చెప్పినా చాలామంది నాయకులు నామినేషన్ల దగ్గర నుంచి ప్రచారం ప్రారంభం, ముగింపు దాకా మంచి ముహూర్తం చూపించుకుని గానీ కదలరు… వీలయితే ఆలోపే ఏదైనా మంచి యాగమో, పూజో చేయించుకుంటారు… పార్టీలో సెకండ్ కేడర్ కాదు, సాక్షాత్తూ పార్టీల అధినేతలకే ఈ నమ్మకాలు ఎక్కువ… మంచి ముహూర్తంలో పని మొదలు పెట్టడం మంచిదే… అందులో ఎవరికీ పెద్ద అభ్యంతరం ఏమీ లేదు గానీ… తమిళనాడులో ఓ జ్యోతిష్కుడు […]
సోకాల్డ్ ది గ్రేట్ కన్నయ్యలనూ కాపాడుకోలేని కమ్యూనిస్టుల దురవస్థ…!!
బహుశా ఒకటీరెండేళ్ల క్రితం… ఢిల్లీ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అంటే ఓ సంచలనం… అసలు ఆ యూనివర్శిటీయే పెద్ద యాంటీ నేషనల్ పోకడలకు కేంద్రం అనేది బీజేపీ ఆరోపణ… ఆ యూనివర్శిటీలోని పెడ పోకడల్ని చెప్పాలంటే ఇక్కడ స్పేస్ సరిపోదు గానీ… వాళ్లకు హీరో ఈ సారు… ఈ సారు బీహార్‌లో అప్పటికే పీజీ చేశాడు, కానీ పార్టీ అవసరాల కోసం జేఎన్‌యూలో చేరాడు… ఏదో పనికిమాలిన సబ్జెక్టు మీద పీహెచ్డీ… […]
‘ముడి’ చమురు ఘాటెక్కువ కదా..! జస్ట్, కాసిన్ని నీళ్లు కలుపుతున్నారు…!!
పెట్రోల్ గంగా జలం! ——————– అరవై ఏళ్ల కిందటి తెలుపు నలుపు చిత్రం గుండమ్మ కథ. తెలుగు సినిమాకు శాశ్వత పరిమళ గంధాన్ని అద్దిన చిత్రం. విలువల వలువలు కట్టిన చిత్రం. ప్రతి పాటలో సంగీత సాహిత్యాలు తెలుగు తేనెలు చిలికిన చిత్రం. అందులో హాస్య నటుడు రమణా రెడ్డి చేత మాటల రచయిత డి వి నరసరాజు చెప్పించిన మాట- “పాలల్లో నీళ్లు కాక, పెట్రోల్ కలుపుతారా? చిక్కటి పాలు తాగితే అరగక కడుపు మందంతో […]
బన్నీ సినిమాలో సుడిగాలి సుధీర్ గెస్ట్ రోల్… రోజా భలే చెప్పిందిలే…
టీవీలో సుడిగాలి సుధీర్‌ను చూస్తుంటే ఎందుకు ప్లజెంటుగా ఉంటుంది..? ఆఫ్టరాల్ టీవీ స్టార్ అని తీసిపారేయకండి… తను తెలియని తెలుగు ఇల్లు లేదు… బుల్లితెర సూపర్ స్టార్ తను… (సీరియల్ నటుల కథ వేరు…) తన పాపులారిటీ చూసి తోటి ఆర్టిస్టులే ఈర్ష్యపడుతూ ఉంటారు… తన స్కిట్లు, షోలలో బ్యూటీ ఏమిటంటే..? తన మీదే సెటైర్లు పడుతుంటయ్, వేసుకుంటాడు, అమాయకంగా మొహం పెడతాడు, అందరు ఎన్నిరకాలుగా తనపైనే పంచులు వేస్తున్నా సరే, హేపీగా యాక్సెప్ట్ చేస్తాడు… చివరకు […]
దటీజ్ హరీష్..! TRS అయోధ్య పంచాయితీలో భలే ట్విస్ట్ ఇచ్చాడు..!!
మిగతా టీవీలు, మిగతా పత్రికలకు ఈ వార్త ప్రాముఖ్యత అర్థమైందో లేదో తెలియదు గానీ… ఈనాడు మెయిన్ పేజీలో కనిపించింది… భలే పట్టుకుంది ఈ వార్తను…! ‘‘మంత్రి హరీష్ రావు అయోధ్య రాముడికి లక్ష రూపాయల విరాళం ఇచ్చాడు… ఈ విరాళం ఇవ్వడం తన అదృష్టం అన్నాడు… రామజన్మభూమి తీర్థ ట్రస్టు ప్రతినిధులు ఆయన్ని కలిసి అడిగిన వెంటనే ఆయన స్పందించాడు…’’ ఇదీ వార్త సారాంశం… దానికి ఒక ఫోటో… అంతే… సైజు రీత్యా పెద్ద వార్తేమీ […]
నిర్లక్షపు మంటలంటుకుని ఈనాడు రచనా సామర్థ్యం ఆత్మహత్య చేసుకుంది..!!
కొన్నేళ్లుగా ఈనాడును పీడిస్తున్న క్షుద్ర అనువాద వైరస్‌ను మినహాయిస్తే… ఈనాడు యాజమాన్యం మొదటి నుంచీ భాష, శైలి, వాక్యనిర్మాణం, విషయ వ్యక్తీకరణ అంశాల్లో నిక్కచ్చిగా ఉండేది… దాని రాజకీయ పోకడలు, ఇతర దరిద్రాలు ఎలా ఉన్నా, ప్రొఫెషనల్ అంశాల్లో సీరియస్‌నెస్ ఉండేది… వార్త చదివి జనం నవ్వుకునేలా ఉండకూడదనే పాలసీ విషయంలో రాజీపడేది కాదు… ఇప్పుడుందో లేదో తెలియదు గానీ గతంలో క్వాలిటీ సెల్ ఉండేది… పత్రికలో వచ్చే తప్పుల్ని పట్టుకునేది… మంచి మెచ్చుకుంటూనే, తప్పులు జరిగినచోట […]
ఫాస్టాగ్..! ఫాస్ట్ వైరాగ్యానికి ట్యాగ్… వేగంగా తోలు తీయడం కూడా..!!
ఫాస్ట్ ట్యాగ్ వేదాంతం! ——————– హిందూ సనాతన ధర్మం మూల స్తంభం- పునర్జన్మ. ఆ స్తంభంలో సిమెంటు, ఇనుము, ఇసుక, ఇటుక, కంకరలు- పాప పుణ్యాలు. పొరపాటున ఇది ఆధ్యాత్మిక- వేదాంత ప్రస్తావన అనుకుని చదవడం ఆపకండి. ఇది టోల్ గేట్లలో మన తోలు వలిచే ఫాస్ట్ ట్యాగ్ గురించి. వేదంలో నిజానికి ఎంత వెతికినా ఫాస్ట్ ట్యాగ్ కనిపించదు. వేదంలో అన్నీ ఉన్నాయిష…అని ఎగతాళి చేసినా- నిజానికి వేదంలో ఉన్నవే బయట ప్రపంచంలో ఉంటాయి. బయట […]
త్రిపుర విప్లవదేవుడు… ఏపీ తెలుగుదేశం లోకేష్ దేవుడు… సేమ్ సేమ్…
ఎందుకో గానీ… నారా లోకేష్‌ను చూస్తుంటే… పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి, అకస్మాత్తుగా సుప్రీం స్టార్, సూపర్ హీరో అయిపోవాలనుకునే వారస హీరోలు గుర్తొస్తారు… నటనలో బేసిక్స్ తెలియకుండానే తెర మీదకు వచ్చి వీరంగం వేసి, ప్రేక్షకుల మెదళ్లు తినే బ్యాచు అన్నమాట… ఆ హీరోలు అప్పుడప్పుడూ చెబుతుంటారు… బ్యాక్ గ్రౌండ్ కేవలం ఎంట్రీకి, ఇంట్రడక్షన్ వరకే, మిగతాది మా మెరిటే అని… మెరిట్ అంటే ఏమీ లేదు, నాలుగు పిచ్చి గెంతులు, తిక్క […]
అంతర్జాతీయ పార్టీగా బీజేపీ..! నవ్వొద్దు… మా విప్లవదేవుడి మీదొట్టు…!!
త్రిపుర సీఎం… బిప్లబ్ దేబ్…. పలకడానికి కష్టంగా ఉందా…? నిజమే, కష్టమే, తనను అర్థం చేసుకోవడంలాగే తన పేరు కూడా…. తన పేరు విప్లవ్ దేవ్… బెంగాలీ భాషలో వ ఉండదు కదా, బ అని పలకాలి కదా… ఇదీ అంతే… జనం నవ్విపోతారు అనే సోయి కూడా లేకుండా, గతంలో పలుసార్లు అనేక అంశాల్లో తన అపరిమిత జ్ఞానసంపదను జాతికి ప్రదర్శించాడు కదా, ఈసారీ అంతే… ‘‘మా అమిత్ షా నేపాల్, శ్రీలంకల్లోకి కూడా బీజేపీని […]
ఐశ్వర్యమస్తు..! ఈ పెళ్లికి ఈ దీవెనే కరెక్టు… ఎందుకో చదవండి…!!
ఒక ఫోటో నచ్చింది ఈరోజు… వార్తల్లోకెక్కిన ఫోటోయే… కర్నాటకలో జరిగిన ఓ పెళ్లి ఫోటో… వరుడు ఎవరంటే..? 2019 జూలైలో సూసైడ్ చేసుకున్న కాఫీ కేఫ్ డే సిద్ధార్థ హెగ్గే కొడుకు అమర్త్య హెగ్డే… తను మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకుడు ఎస్.ఎం.కృష్ణ బిడ్డ కొడుకు… వధువు ఎవరంటే..? కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఏమాత్రం అదృష్టం వరించినా సిద్ధరామయ్య స్థానంలో ముఖ్యమంత్రి అయి ఉండేవాడు… ఇప్పటికీ కర్నాటకలో పవర్ ఫుల్ లీడర్ డీకే […]
ఏబీఎన్ రాధాకృష్ణకు వీజీగా నాలుగైదు పులిట్జర్లు ఒకేసారి ఇచ్చేయొచ్చు..!!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రధాని, రాష్ట్రపతి… అవసరమైతే పుతిన్, జిన్‌పింగ్, జో బైడెన్ ఇళ్లల్లోనూ తన సొంత స్పై ఇయర్ బగ్స్, కెమెరాలు పెట్టేయగలడు… తను చెప్పినట్టు కంటికి కనిపించనివీ, చెవికి వినిపించనివీ బోలెడు వార్తలు పట్టుకోగలడు… అవసరమైతే క్రియేట్ చేయగలడు… అదే జర్నలిజం అనీ మైకు గుద్ది వాదించగలడు… కానీ తనకు తెలియకుండానే జర్నలిజాన్ని అంతకుమించి ముందుకు తీసుకెళ్లి, కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్న తీరు మాత్రం అద్భుతం… ఈ ప్రక్రియ, ఈ ప్రయోగాలకు నాలుగైదు పులిట్జర్లు ఈజీగా […]
30 కార్ల పార్కింగు స్పేస్ కొన్నదామె… గడుసుదే, విలువ తెలిసిన తెలివి…
నిలువలేని కారుకు విలువ లేదు! ——————– నటుడు సల్మాన్ ఖాన్ కు దేవుడిచ్చిన చెల్లెలుంది. ఆ అమ్మాయిని అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. ఆ అమ్మాయి ఈమధ్య బాంబేలో ఒక డూప్లెక్స్ అపార్ట్ మెంట్ కొన్నది. ఒకరకంగా సల్మాన్ కుటుంబం డెవెలప్ మెంట్ కు ఇచ్చిన నిర్మాణమది. అందులో తన చెల్లికి సల్మాన్ రెండంతస్థులను కలుపుతూ ఒక డూప్లెక్స్ ఇంటిని బహుమతిగా ఇచ్చినట్లున్నాడు. ఆ ఇంటి రిజిస్ట్రేషన్ కు స్టాంప్ […]
గగన నివాసాల్లో సేంద్రియ సాగు..! అత్యంత విలువైన కూరగాయలు..!!
ఆకాశ హర్మ్యంలో ఆర్గానిక్ కూరలు! ——————- హైదరాబాద్ విశ్వనగరం కాబట్టి అంతర్జాతీయ స్థాయి జీవన ప్రమాణాలు అక్కడక్కడా తొంగి చూస్తుంటాయి. విశ్వనగర పౌరులుగా అది మనం పులకించాల్సిన అంశమే కానీ- బాధపడాల్సిన విషయం కాదు. ఆకాశాన్ని తాకే భవనాలు విశ్వనగరానికి మొదటి కొండ గుర్తులు. ఈమధ్య హైదరాబాద్ అన్ని వైపులా ఇరవై, ముప్పయ్, నలభై, యాభై అంతస్థుల భవనాలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పైపైకి దూసుకుపోతున్నాయి. ఫోర్త్ ఎస్టేట్ అయిన పత్రికల్లో ప్రతి శనివారం రియల్ ఎస్టేట్ ప్రత్యేక […]
- « Previous Page
- 1
- …
- 449
- 450
- 451
- 452
- 453
- …
- 482
- Next Page »