నిజానికి ఇదొక చిక్కుముడి… ఏమిటీ అంటారా..? ‘‘మంత్రాలయం మఠం భూములు అమ్ముతారా..? భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా..? దాతలు ఇచ్చిన ఆస్తులను నడిబజారులో వేలం వేస్తారా..? అమ్ముకోవడం కోసమా మీకు ఆస్తులు ధారబోసింది..? దాతలు ఇచ్చే ఆస్తులకు మీరు ధర్మకర్తలే గానీ యజమానులు కారు, ప్రజలు వ్యతిరేకించారని తిరుమల ఆస్తుల అమ్మకం ఆపేశారు… మరి మంత్రాలయం ఆస్తుల్ని అమ్ముకుంటున్నారు ఎందుకు..?’’ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు… మంచి ప్రశ్నే… ఈ జగన్ ప్రభుత్వమే ఆమధ్య హిందుత్వవాదుల విమర్శలతో వెనక్కి […]
ఫాఫం హైపర్ ఆది… చివరకు ఆవిధంగా నేలబారు కామెడీ…
ఫాఫం హైపర్ ఆది… ఆ కామెంట్ చేయడానికి ఒకటికి పదిసార్లు బాధపడాలి మనం… ఎందుకంటే..? మంచి స్పాంటేనిటీ, పంచులు, ఎనర్జీ, టైమింగు ఉన్న కమెడియన్ తను… తెలుగు టీవీ ప్రోగ్రాములకు సంబంధించి కామెడీ టైమింగు అద్భుతంగా ఉన్న టాప్ ఫైవ్‌లో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, ఆటో రాంప్రసాద్, గెటప్ సీనులతోపాటు హైపర్ ఆది ఉంటాడు… అలాంటి వాడిని ఫాఫం అని జాలిపడుతున్నాం అంటే… రీజనింగు ఉండాలి కదా… ఉంది, ఉంటుంది… ఈటీవీ వాడు ఓ ప్రొమో […]
స్టోరీ ఆఫ్ ది డే…! పుట్టెడు బాధ- పుట్టింటి కోసం మెట్టింటి చోరీ…
అత్త సొమ్ము! కోడలు దొంగతనం!! ——————— ఈనాడులో తగిన ప్రాధాన్యంతో అచ్చయిన వార్త ఇది. ఆలోచనాపరులు సీరియస్ గా తీసుకోవాల్సిన వార్త ఇది. అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు తలకు మించిన భారమవుతున్నా ఆ భారాన్ని తగ్గించుకోలేకపోతున్న దుస్థితికి అద్దం ఈ వార్త. తన పెళ్లి కోసం తల్లి దండ్రులు చేసిన లక్షల అప్పులను తీర్చడానికి దారి తప్పి దొంగగా మారి మనముందు ముద్దాయిగా బోనులో నిలుచున్న అమ్మాయి వార్త ఇది. ఆ అమ్మాయి మీద సానుభూతి పుట్టేలా […]
మందు సొమ్ము పైసా కూడా వద్దట… శెభాష్ లావణ్య త్రిపాఠీ…
ఒక వార్త భలే నచ్చేసింది… అదేమిటయ్యా అంటే… మన హీరోయిన్… అవును, మన తెలుగు హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ఉంది కదా… ఓ ఆల్కహాల్ బ్రాండ్ ప్రమోషన్‌కు నో చెప్పిందట… వావ్… నాలుగు డబ్బులు వస్తాయంటే ఏ పనికైనా రెడీ అనే మన హీరోయిన్లు, డబ్బులొచ్చే ఓ పనికి బ్లంట్గా నో చెప్పేయడమా..? ఇంట్రస్టింగు… అందుకే ఈ వార్త నిజమో అబద్ధమో గానీ… నిజమైతే బాగుండును అనిపించేలా నచ్చింది… అవును… డబ్బులకు ఏమాత్రం కక్కుర్తి లేకుండా, ఇలాంటి […]
పీకలేరు… ఉంచలేరు… అభిజిత్ గేమ్‌తో బిగ్‌బాస్ మైండ్ గల్లంతు..!
నిజమే… ఈ మాట అనడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు… బిగ్‌బాస్ పదే పదే అభిజిత్ గేమ్‌తో ఓడిపోతూ… తన మెదడును కోల్పోతున్నాడు… కోపగించి అభిజిత్‌ను పీకేయలేడు… ఉంచితే రోజుకో కొత్త తల్నొప్పి… ఎంతసేపూ తను చెప్పింది అందరూ చేయాలనే సంకుచిత, అనాలోచిత ఆవేశమే తప్ప బిగ్‌బాస్ అడుగుల్లో ఓ స్ట్రాటజీ లేదు, ఓ మెచ్యూరిటీ లేదు… బిగ్‌బాస్ టీం సభ్యులూ, ఎక్కడ దొరికారు బాబూ మీరు..? ప్రత్యేకించి ఈరోజు షో చూసిన ప్రతి ఒక్కరికీ బిగ్‌బాస్ షో నిర్మాతల […]
కంగనా వ్యవహారంలో శివసేన సర్కారుకు బాంబే హైకోర్టు చురకలు…
సంజయ్ రౌత్ తెలుసు కదా… మహారాష్ట్ర ఉద్దవ్ ఠాక్రే కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, వ్యూహకర్త, శివసేన అధికార పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, ఎంపీ… మహావికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు దిశలో తను ఎంత కీలకమో… ఆ ప్రభుత్వానికీ సినీనటి కంగనా రనౌత్కూ నడుమ అగాధాన్ని పెంచింది కూడా తనే… ఇష్టారాజ్యంగా కామెంట్స్ చేశాడు… చివరకు ముంబై హైకోర్టు కూడా తనను తప్పుపట్టింది… ఒక పార్లమెంటేరియన్‌కు ఇలాంటివి తగవు అని చెప్పింది తాజా ఆర్డర్లో… అంతేకాదు, తను […]
ఉద్యోగులూ హోల్డాన్… జెర ఠైరో… తొందరపడితే బుక్కయిపోతారు…
ఉద్యోగులు రాజకీయ ప్రచారం చేయవచ్చా…!? ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో కొందరు ఇటీవల కాలంలో అవగాహనా రాహిత్యంతోనో లేక అత్యుత్సాహంతోనో రాజకీయ పార్టీలకు బహిరంగంగా మద్ధతు ప్రకటనలు చేస్తూ… మితి మీరి వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది. తాము ప్రభుత్వ ఉద్యోగులమని… నిబంధనల ప్రకారమే వ్యవహరించాలన్న సోయే వారిలో లేకుండా పోయింది. ప్రస్తుతం జరుగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బాహాటంగా రాజకీయ పార్టీలకు మద్ధతు పలుకుతూ లేదా విమర్శిస్తూ పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. మనకేం అవుతుంది? […]
యశస్వి-రీతూ…! ప్రేమ ఎంత మధురం… వయోభేదమా..? జానేదేవ్…!!
……. జీతెలుగులోనే ఓ సీరియల్ వస్తుంది… ప్రేమ ఎంత మధురం… ఇదే టీవీ, జీ మరాఠీలో వచ్చిన తులా పహ్తేరే, తరువాత జీకన్నడలోకి రీమేక్ అయిన జోతే జోతేయాలి సీరియల్‌కు ఇది తెలుగు రీమేక్… హీరో వెంకట శ్రీరాం ఓ నడివయస్సు వ్యాపారి… హీరోయిన్ వర్ష డిగ్రీ చదివే ఓ యంగ్ ‘కోల్గేట్’ మోడల్ వంటి దరహాసిని… ఇద్దరి నడుమ బోలెడంత వయోభేదం, కానీ ప్రేమ… అదీ కథ… సీన్ కట్ చేయండి… దీనికి పూర్తి భిన్నమైన […]
నకల్ మార్నే కో భీ అకల్ చాహియే… బీజేపీకి టీఆర్ఎస్ అనవసర చురకలు…
नकल मारने को भी अकल चाहिए। నకల్ మార్నే కో భీ అకల్ చాహియే… హిందీలో పాపులర్ సామెత… అంటే కాపీ కొట్టడానికి కూడా కాస్త తెలివి ఉండాలి… లేదా కాపీ కొట్టడం కూడా ఓ కళ… ఈ మాటను నిన్న టీఆర్ఎస్ సోషల్ శ్రేణులు బాగా పాపులర్ చేశాయి… ఎందుకంటే, బీజేపీ విడుదల చేసిన గ్రేటర్ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు… ఒక లేడీ టాయిలెట్, ఒక డంపింగ్ యార్డు, ఒక వుమెన్ పోలీస్ స్టేషన్, […]
మొహం కూడా చూపించుకోలేని రచయిత… మీకర్థమైంది నిజం కాదు…
ముందుగా వాట్సప్ గ్రూపుల్లో కనిపించిన ఈ సమాచారం చదవండి, తరువాత చెప్పుకుందాం… తెలుగులో ఇంతదాకా ఫొటో ప్రచురణకి విముఖులైన ఏకైక రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. గత ఏభై యేళ్ళుగా వదలకుండా దాదాపు రోజూ రాసే ఏకైక తెలుగు రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. రచనల మీద జీవిస్తున్న ఏకైక నవలా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. పిల్లల పేర్ల పుస్తకాల్లో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం మల్లాది వెంకట కృష్ణమూర్తి పిల్లల పేర్ల పుస్తకం. 2020కి 2 […]
కరోనా వ్యాప్తికీ నైతిక ప్రవర్తనకూ లంకె… ఒక ఇంట్రస్టింగ్ స్టడీ…
కొందరెందుకు కరోనా జాగ్రత్తలు పాటించరంటే! ———————- ప్రపంచం ముందు ఇప్పుడున్న అతి పెద్ద సమస్య కరోనా. భారత్ తోపాటు అయిదారు దేశాల్లో కరోనాకు వ్యాక్సిన్ ప్రయోగశాలల్లో ఇంకా పరీక్షల దశలోనే ఉంది. పోలియో టీకాలా వంద శాతం పనిచేసేవి మాత్రం ఇంకా తయారయినట్లు లేదు. మరో నాలుగయిదు నెలల్లో కనీసం డెబ్బయ్ అయిదు శాతమయినా పనిచేసే కరోనా వ్యాక్సిన్ రావచ్చు. 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో అందరికీ టీకా వేయడం కూడా పెద్ద యజ్ఞమే. […]
ఈ బిగ్‌బాస్ సీజన్ మొత్తమ్మీద తొలిసారి రక్తికట్టిన ఎపిసోడ్..!!
…… అప్పట్లో వెంకటేష్ హీరోగా వచ్చిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా గుర్తుందా..? అందులో బ్రహ్మానందం పాత్ర… గొప్ప ధైర్యవంతుడుగా తనకుతాను మహా బిల్డప్ ఇచ్చుకుంటాడు… కోతలు కోటలు దాటుతాయి… ఓ పిల్ల, తను ఒక రోలర్ కాస్టర్ ఎక్కుతారు… బ్రహ్మీ అందరినీ వెక్కిరిస్తూ ఉంటాడు… ఇదో లెక్కా..? పెద్దపెద్దవే చూశాను అని చెబుతుంటాడు… తీరా అది స్టార్టయి వేగం పుంజుకున్నాక మనవాడి ధైర్యసాహసాలు నిలువునా జారిపోతయ్… కళ్లు మూసుకుని, ఆపండ్రోయ్, మీకు దండం పెడతాను కాపాడండ్రోయ్… […]
భాష గొట్టుగా ఉన్నచో ప్రమాణం తప్పును… అల్కటి భాష అన్నింటా మేలు…
భాష అనే నేను…! ——————— న్యుజిలాండ్ లో కొత్తగా ఎన్నికయిన భారత సంతతి ఎంపి మొదట న్యూజిలాండ్ స్థానిక భాష మౌరిలో ప్రమాణం చేసి, తరువాత సంస్కృతంలో కూడా ప్రమాణం చేశాడు. గుజరాత్ లో జరిగిన స్పీకర్ల సదస్సులో చట్టసభల్లో ప్రజాప్రతినిథుల భాష హుందాగా ఉండాలని భారత రాష్ట్రపతి సూచించారు. ఈ రెండు వార్తలకు ఎలాంటి సంబంధం లేదు- భాష అన్న ఒక్క విషయంలో తప్ప. ఎప్పుడో స్వాతంత్య్రం వచ్చినప్పుడు మనం రాసిపెట్టుకున్న పదవీ స్వీకార ప్రమాణ […]
వెలుగు Vs నమస్తే… తెలంగాణ తెరపై మీడియా సంస్థల డిష్యూం డిష్యూం…
…… మనం చెప్పుకున్నదే కదా… తెలుగునాట మీడియా వార్ ఎలా నడుస్తున్నదో… ఏపీలో యెల్లో వర్సెస్ నాన్-యెల్లో మీడియా… తెలంగాణలో పింక్ వర్సెస్ ఆరెంజ్ మీడియా… క్లారిటీ కావాలా..? యెల్లో మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 ఎట్సెట్రా… నాన్ యెల్లో మీడియా అంటే సాక్షి… జగన్ విసిరే యాడ్స్‌తో రాజీపడి అవసరార్థం భజన చేసే ఆంధ్రప్రభ, ప్రజాశక్తి ఎట్సెట్రా ఎప్పటికప్పుడు రంగులు మార్చే కేటగిరీ… ఈమధ్య పోలవరంపై యెల్లో మీడియా రాతల బట్టలు విప్పిన సాక్షి […]
ఆ చప్పుడేందీ, ఆ స్పీడేందీ … అసలు ఈ బండి ఎక్కడిదిరా బాబోయ్…
ఇది మరీ పాత మోడల్ అంబాసిడర్ బండి లెక్క సాలిడ్‌గా ఉంది… కాదు, కాదు, పాత బుల్లెట్ బండి ఇది, ఆ చప్పుడే డిఫరెంట్ కొడ్తంది…. ఇదెక్కడి బండిరా బాబోయ్, ఊహించని డ్యాష్లిస్తోంది…….. ఓ డివిజన్‌కు కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఓ నాయకుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గురించి చేసిన సరదా కామెంట్ ఇది… తన ఇంటి పేరు బండి కదా… నిజంగానే బండి సంజయ్ ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓ డిబేటబుల్ […]
శెభాష్ ఆంధ్రజ్యోతీ…! ఇంకా పాత్రికేయం నీలో బతికే ఉన్నట్టుంది…!
…. ముందుగా ఆంధ్రజ్యోతికి అభినందనలు… ఈ పాలిటిక్సులో పడి పత్రికలు, టీవీలు ఇక వేరే జీవనాన్ని పట్టించుకోవడమే మానేశాయి… నాయకుల పిచ్చి వాగుళ్లను హైలైట్ చేయడమే పనిగా పెట్టుకున్నాయి… ఏపీలో కులసమరం, తెలంగాణలో గ్రేటర్ సమరం… ఇక జనం కష్టాలకు మీడియాలో స్పేస్ ఎక్కడిది..? కానీ… కానీ… ఈ హెక్టిక్, పొలిటికల్, కమర్షియల్ యాక్టివిటీలోనూ అన్నదాత అరిగోసను ఫస్ట్ పేజీలో హైలైట్ చేసినందుకు… పాత్రికేయం ఆత్మహత్య చేసుకుంటున్న ఈ గడ్డు రోజుల్లో, ఇంకా సదరు పత్రికలో అది […]
కేబీసీ… ఏడు కోట్ల విలువైన ఆ అత్యంత గొట్టు ప్రశ్న తెలుసా మీకు..?
ప్రస్తుత 12వ సీజన్ కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో వరుసగా… ముగ్గురు మహిళలు వారానికొకరు కోటి రూపాయల చొప్పున గెలుచుకున్న ముచ్చట చెప్పుకున్నాం కదా… నజియా నసీం, మోహితశర్మ… నిన్న అనుప దాస్… ముగ్గురూ ఉద్యోగులే… వారిలో అనుప దాస్ టీచర్… మోహిత శర్మ ఐపీఎస్ అధికారి, నజియా నసీం ప్రైవేటు కంపెనీ కమ్యూనికేషన్స్ ఎంప్లాయీ… వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు నేపథ్యాలు… సరే గానీ… ఈ షోలో మొదట తేలికపాటి ప్రశ్నలుంటయ్… అల్కటి ప్రశ్నలు… తరువాత ప్రైజ్ […]
డీగో మారడోనా… ఈ ఫుట్‌బాల్ మాంత్రికుడికి మరోవైపు బోలెడన్ని డార్క్ షేడ్స్…
డీగా మారడోనా… అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయర్… అంతేనా..? కాదు..! ఆ ఆటను ప్రేమించేవాళ్లకు మారడోనా ఓ అద్భుతం… అలాంటి ఆటగాడు మళ్లీ పుట్టడు… అంతే… ఆ కాళ్లలో ఏదో మహత్తు ఉంది… తను ఓ బంతి మంత్రగాడు… అందుకే ఆ పాదాలు పరుగులు తీస్తూనే బంతిని ఆదేశిస్తాయి… బంతి కదలికల్ని నిర్దేశిస్తాయి… ఇలా చెప్పుకుంటారు ఫుట్‌బాల్ ప్రేమికులు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ శతాబ్దపు అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు మారడోనా… ప్రత్యేకించి 1986 ప్రపంచకప్పులో ఇంగ్లండ్ మీద […]
అభిజిత్ Vs బిగ్‌బాస్… ఓ విడ్డూరపు గేమ్‌లో ఇప్పటికైతే విజేత అభిజితే…
బిగ్‌బాస్‌తో అభిజిత్ ఆడుకుంటున్నాడా..? అభిజిత్‌తో బిగ్‌బాస్ ఆడుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు జవాబు సరిగ్గా చెప్పగలిగినవారికి వచ్చే బిగ్‌బాస్ సీజన్లో నేరుగా ఎంట్రీ ఇచ్చేయొచ్చు… నవ్వొస్తున్నదా..? నిజంగానే నవ్వులాట యవ్వారంగా మారింది బిగ్‌బాస్ ధోరణి… జనం నవ్వుకునేట్టుగా మారింది… బిగ్‌బాస్ ఏ సీజనైనా, ఏ భాషైనా సరే… కంటెస్టెంట్ల నడుమ పోటీ ఉంటుంది… కానీ బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్ మాత్రం బిగ్‌బాస్‌కూ అభిజిత్కూ నడుమ పోటీ సాగుతోంది… నిజంగా అభిజిత్ పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నాడు… అందరిలాగా బిగ్‌బాస్ […]
ఎక్కడ నెగ్గాలో కాదు… ఎక్కడ తగ్గాలో సరిగ్గా తెలిసి, ఎదిగి… చివరకు…
1980-81… ఓ శీతాకాలం సాయంత్రం… పార్లమెంటు సభ్యుల నడుమ ఓ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది… గుజరాత్, భరూచ్ నుంచి వచ్చిన యువ ఎంపీ అహ్మద్ పటేల్ బ్యాటింగులో ఇరగదీసేస్తున్నాడు… సెంచరీకి దగ్గరయ్యాడు… మరోవైపు మాధవరావు సింధియా… అహ్మద్ పటేల్ బ్యాటింగు చేస్తుంటే ఇక వేరే ప్లేయర్లకు ఆడటానికి ఏమీ ఉండదు… సింధియా సరదాగా నవ్వుతూ మొత్తం నువ్వే ఆడితే మరి మేమేం చేయాలి భయ్యా అన్నాడు… ఆ తరువాత బంతికే పటేల్ బౌల్డ్ అయ్యాడు… కావాలనే… […]