Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Iam Not a Chor… కలకలం రేపుతున్న విజయ్ మాల్యా పాడ్ కాస్ట్..!!

June 13, 2025 by M S R

vijay

. [[  రమణ కొంటికర్ల  ]]     …….. అది 2016, మార్చ్ 2… యూనైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ చైర్మన్.. అప్పటివరకూ రాజ్యసభ సభ్యుడు.. ఎరువులు, రియల్ ఎస్టేట్, విమానయానం వంటి వ్యాపారాలతో పాటు.. ఈసారి 2025 ఐపీఎల్ కప్ గెల్చిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ యజమాని.. కింగ్ ఫిషర్ బీర్ల తయారీతో దేశంలో కింగ్ మేకర్ లా తయారైన విజయ్ మాల్యా ఇండియాను వదిలివెళ్లిన రోజు. అప్పట్నుంచీ వేల కోట్ల రూపాయలు భారతీయ బ్యాంకులకు కుచ్చుటోపీ […]

సినారె… ఇది తన ముఖచిత్ర ఆవిష్కరణ… మరో భిన్న చిత్రం..!

June 12, 2025 by M S R

sinare

. సీ. నారాయణరెడ్డి గుర్తుండి పోయేట్టు నాకు తెలియవచ్చింది (అప్పటికి కొన్ని సినిమా పాటలు మాత్రమే విన్నాను) ఆయన “పీహెచ్.డీ. “ఆధునికాంధ్రకవిత్వం సంప్రదాయములు ప్రయోగములు”. తరువాతి నాళ్లలో దానిపైనే పీహెచ్. డీ. వచ్చింది! కొన్ని వాస్తవ పరిస్థితులు తెలిశాక నాకు పీహెచ్.డీ. లన్నా , ఎమ్. ఫిల్ ల్లన్నా హాస్యాస్పదమై పోయింది; రోత కలిగింది. కానీ ఈ ఆధునికాంధ్రకవిత్వం సంప్రదాయములూ ప్రయోగములు అందుకు మినహాయింపు. తెలుగులో వచ్చిన గొప్ప పీహెచ్.డీ. అది. “అంతకడివెడు పాలపై ఒక్కింత మీగడ […]

పాకిస్థాన్‌కే ‘ట్రంపు’ కార్డు…! అతనెప్పుడూ ఇండియాకు ‘అమిత్రుడే’…

June 12, 2025 by M S R

usa

. పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు… పాకిస్థానీ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్‌ను అమెరికా తన ఆర్మీ డే ఉత్సవాలకు ఆహ్వానించిందనేది వార్త… ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు… ట్రంపుకీ పాకిస్థాన్‌కూ నడుమ బలమైన ఆర్తిక, హార్దిక సంబంధాలున్నయ్… ట్రంపు ఎప్పుడూ ఇండియాకు అమిత్రుడే… మోడీ వెళ్లి కౌగిలించుకున్నా, తనకు ప్రచారం చేసినా… ట్రంపు చెబుతున్నట్టుగానే వింటున్నా సరే… ఎప్పుడూ ట్రంపు ఇండియాకు దోస్త్ కాదు… పైగా మనకు నష్టదాయకుడు… కాస్త వివరంగా చెప్పుకుందామా..? ట్రంపు ఎంతటి డబుల్ […]

దేవనపల్లి కవితకు తత్వం బోధపడిందా..? డాడీ దగ్గరకు పరుగు..!!

June 12, 2025 by M S R

kcr

. నేను కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులూ కేసీయార్ కుటుంబానికి కాంగ్రెస్‌లోకి ఎంట్రీ లేదు… అసలు తెలంగాణ ప్రథమశత్రువు కేసీయార్ కుటుంబమే… అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి…! డాడీ కోపంతో ఉన్నా సరే, ఏదో ఝలక్కులు ఇద్దామని ట్రై చేసి, విఫలమై, తన ఒరిజినల్ బలమేమిటో తెలుసుకున్న కవిత… ధిక్కార పతాకాన్ని అర్జెంటుగా కిందకు దింపేసి, మళ్లీ ఫామ్ హౌజుకు వెళ్లి, ఏదో దూరాన్ని పూడ్చుకునేందుకు ప్రయత్నించింది… కేసీయార్ అస్సలు దేకలేదు… ఈ రెండూ వేర్వేరు వార్తలు… ఆమె […]

గజం 3 లక్షలు…! ఎస్, హైదరాబాదులోనే… అదీ అధికారిక వేలంలోనే..!!

June 12, 2025 by M S R

hyd real

. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించిందని ఇటీవల చాలా చర్చలు జరుగుతున్నాయి… ఢమాల్, ఇప్పట్లో ఇక ఇది పుంజుకోదు అనీ… హైడ్రాను, కూల్చివేతల్ని, మార్కెట్ డౌన్‌ఫాల్‌నీ, ఇంకా ఏవేవో కారణాలు చూపిస్తున్నారు… కానీ దేశవ్యాప్తంగానే రియల్ ఎస్టేట్ మందకొడిగా ఉంది… అయితే, హైదరాబాదులో ఏమైనా రెంట్ వాల్యూ తగ్గిందా..? ఆల్రెడీ జనం యాక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రేట్లు ఏమైనా తగ్గాయా..? తక్కువకు, […]

పవన్ కల్యాణ్ ప్రచారవాహనం పేరు వారాహి కదా… గుర్తొచ్చింది..!!

June 12, 2025 by M S R

varahi

. మిత్రుడు #రవివానరసి పోస్టు ఒకటి డిస్టర్బింగుగా ఉంది… ముందుగా ఆ వార్త ఏమిటంటే..? తిరుచానూరు పరిధిలోని, మండ్లపూడి గ్రామం… స్వర్ణముఖి నది ఒడ్డున ఓ ప్రాచీనాలయం… అందులో దేవత వారాహి అమ్మవారు… రాత్రికి రాత్రే ఆ గుడిని నేలమట్టం చేసేసి, కనీసం ఆనవాళ్లు కూడా లేకుండా చేసి… అమ్మవారి విగ్రహాన్ని స్వర్ణముఖి నదిలోకి విసిరేశారు… అదీ ఉత్సవ విగ్రహం… మరి మూలవిగ్రహం..? తెలియదు… ఏపీ ప్రభుత్వమే చెప్పాలి… లేదా సనాతన ధర్మరక్షకుడు పవన్ కల్యాణ్ చెప్పాలి… […]

కృష్ణ అంటే ఏమిటో వంద కథలు చదవనక్కర్లేదు… ఈ ఒక్కటీ చాలు…

June 12, 2025 by M S R

sravan

. ముందుగా ఓ కథ వంటి సంఘటన చదువుదాం… కథ అనడం ఎందుకంటే… పిల్లికి బిచ్చం వేయని, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలని వాళ్లుండే సినిమా ఫీల్డులో ఇలాంటి ‘‘నిజమైన హీరోలు’’ ‘‘మనసున్న కథానాయకులు’’ కూడా ఉంటారా అని మనకు డౌట్ వస్తుంది కాబట్టి… 2015లో ఆంధ్రజ్యోతిలో శ్రావణ్ అనే పేరుతో ఓ ఆర్టికల్ వచ్చింది… అందులోనే వివరాలున్నాయి కాబట్టి… సంక్షిప్తంగా, సూటిగా అందులో ఏముందో చూద్దాం… ‘‘తెలంగాణలోని మానుకోట నుంచి 1973లో ఓ కుర్రాడు […]

గురిచూసి కొడితే అసలు పెద్ద తిమింగలాలు కదా దొరికిపోవాల్సింది…

June 12, 2025 by M S R

పార్టీ

. ఎస్వీబీసీ సలహాదారు, అరసవిల్లి దర్శన వివాదం, శ్రీకాకుళం గుళ్లో షూటింగు, టీడీపీ ప్రచారం పట్ల విముఖత, అదేదో పాటలో కంటెంటు వివాదం… మంగ్లీ వివాదాలు, తాజాగా కేసు, ఆమె వివరణ గట్రా కాసేపు పక్కన పెడదాం… ఎందరు గంజాయి సేవిస్తూ పట్టుబడ్డారు, అక్కడికక్కడ ఎలా నిర్ధారించారనే ప్రశ్నలూ వదిలేద్దాం కాసేపు… కానీ చెబుతున్న ప్రధాన నేరాలు (?) ఏమిటి..? అనుమతి లేకుండా మద్య సేవనం, విదేశీ మద్యం, డీజే అనుమతి… ఇవే కదా.., ఇక్కడ అనేక […]

వాడెవడో అవమానించాడు… కానీ తనలో ఓ గెలుపు కసిని రగుల్కొలిపాడు…

June 12, 2025 by M S R

success

. ( రమణ కొంటికర్ల )…  తల్లితో కలిసి బస్సులో ప్రయాణిస్తోంది షాలినీ. ఆ సమయంలో ఎవడో ఓ వ్యక్తి తన కాస్త అసహ్యంగా బిహేవ్ చేశాడు. తను, తన తల్లి శుభలతా అగ్నిహోత్రి ఓ సీటులో కూర్చుంటే.. ఓ అపరిచిత వ్యక్తి వాళ్ల తల దగ్గరే చేయి పెట్టి డిస్టర్బ్డ్ గా వ్యవహరిస్తున్నాడు. చేయి అక్కడి నుంచి తీసేయాలని.. ఆ తల్లీ, కూతుళ్లిద్దరూ పలుమార్లు చెప్పినా వినకపోగా.. ఆ నువ్వేమైనా డిప్యూటీ కలెక్టరా నీ మాట వినేందుకంటూ […]

తిమింగలాలే..! దొరికేదే 0.005 శాతం… నిజంగా శిక్షించగలిగేది జీరో..!!

June 12, 2025 by M S R

corruption

. కాలేశ్వరం ఎస్‌ఈ శ్రీధర్ అట… 150 నుంచి 200 కోట్ల అక్రమ సంపాదన… ఏసీబీ దాడులు, కేసు… కాలేశ్వరం ప్రాజెక్టుకు పనిచేసిన ఎవడిని తాకినా కోట్లు రాలుతున్నయ్… దాడులు, కేసులు, ఆస్తుల వెల్లడి, నాలుగు మీడియా వార్తలు, రెండు రోజులు హడావుడి… తరువాత..? ఏమీ జరగదు… చూస్తూ ఉండండి… బయటికి వచ్చేస్తాడు, ఏమైనా జైళ్లలో మగ్గేది ఉందా ఇలాంటోళ్లు..? అలా వందల కోట్లు పట్టుబడిన ఎందరు అక్రమార్కులు, అవినీతిపరులు జైళ్లలో ఉన్నారో చెప్పండి… ఏమో, చెప్పలేం, […]

టైటిల్‌లోనే పెద్ద గందరగోళం… సినిమా విజయం భజగోవిందం…

June 12, 2025 by M S R

gollapoodi

. Subramanyam Dogiparthi …….. ఎస్ పి భయంకర్ ఒక పేరు కాదు . ఎస్ పి పాత్ర ANR , భయంకర్ పాత్ర కృష్ణంరాజు . ఇదేదో భయంకర్ అనే ఎస్పీ సినిమా అనుకొని కన్ఫ్యూజ్ అయ్యారు ఆరోజుల్లో . సినిమా రంగంలో సుదీర్ఘ అనుభవం కల వి బి రాజేంద్రప్రసాద్ స్వంత సినిమా . ఆయనే దర్శకుడు . పైగా మళయాళంలో హిట్టయిన పోస్టుమార్టం సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . ఈ […]

నలంద, తక్షశిల వదిలేయండి… ఇప్పుడు ఎక్కడున్నాం మనం..?!

June 12, 2025 by M S R

versity

. Jagannadh Goud…… అన్నా, మన IIT లు ప్రెపంచకంలో చాలా టాప్ కదా..? అది సరే… కానీ ఎవరన్నారు..? మాకు పాలు పోసే పుల్లయ్య అంటే విన్నాను… అంతేనా, ఇంకా ఎవరూ అనలేదా..? కూరగాయలు అమ్మే సుబ్బారావు, యూట్యూబ్ లో కన్నమ్మ, జాకబ్, యూసఫ్, సమీర్ శర్మ ఇలా చాలా మంది చెప్పారు…. అంతేనా, ఇంకా ఎవరూ చెప్పలేదా..? ఎందుకు చెప్పలేదు, చాలా మంది సినిమా వాళ్ళు, క్రికెటర్స్ ఇంకా పేరు గాంచిన రాజకీయ నాయకులు […]

ఆహా… అదీ శేఖర్ కమ్ముల అంటే… సరదాగా సాగిన ఓ ఆంగ్ల గీతం…

June 12, 2025 by M S R

kubera

. పీపీపీ డుమ్ డుమ్… ఈ పాట రిలీజ్ చేశారు కదా… డైరెక్టర్ శేఖర్ కమ్ముల కొత్త సినిమా కుబేర నుంచి… ఇంట్రస్టింగు ఉంది… సరదాగా, వెరయిటీగా… శేఖర్ టేస్టుకు తగినట్టుగా… ఆ సినిమాలో ధనుష్ బిచ్చగాడిగా చేస్తున్నాడా..? 3000 కోట్ల రష్మిక నటిస్తున్నదా..? నాగార్జున కూడా ఉన్నాడా..? ఇవేవీ పెద్దగా ఆకర్షించలేదు… ఎందుకంటే, ఇదెప్పుడో స్టార్టయినట్టుంది… అకారణ, అనవసర జాప్యం… ఫాఫం… ఇక్కడ పాపం అన్నది శేఖర్ కమ్ముల గురించే… రెండు పుష్కరాల క్రితం అమెరికాలో […]

ఫాఫం మంగ్లి… బాగా న్యూట్రల్ కళాకారిణి… కాస్త నమ్మండయ్యా…!!

June 11, 2025 by M S R

. కొన్నాళ్లుగా మంగ్లి ప్రస్థానాన్ని గమనిస్తున్నాం కదా… ఆమె తన బర్త్ డే పార్టీ చేవెళ్ల దగ్గర ఏదో రిసార్టులో జరుపుకుంది… ఏకంగా గంజాయి, డ్రగ్స్ పార్టీ అట… విదేశీమద్యం గట్రా, పోలీసులు దాడి చేసి, కేసు పెట్టారు… 9 మందికి గంజాయి పాజిటివ్ అట… ఎక్కడి నుంచి ఎదిగింది మంగ్లీ… ఎటు పోతోంది..? ఒకప్పుడు అందరమూ ఆమెను సమర్థించినవాళ్లమే… ఓ మామూలు బంజారా పల్లెలో పుట్టి, సంగీతం నేర్చుకుని, వీ6లో ఓ చిన్న కొలువులో చేరి… […]

ప్రశ్న… వద్దంటే ఊరుకోదు… టైమ్ వస్తే వెంటాడుతుంది… ఇలా…

June 11, 2025 by M S R

kcr

. నిన్నే కదా మనం చెప్పుకున్నది… ప్రతిపక్షం ప్రధానంగా ప్రశ్నించబడుతున్న విశేషం గురించి కదా… ఈ సినిమాలో క్లైమాక్స్ కేసీయార్ ప్రశ్నించబడే సీన్… అసలు ఓ కమిషన్ ఎదుట, వాళ్ల ప్రశ్నలకు కేసీయార్ జవాబులు చెప్పడం అనే సీన్ ఊహించుకుంటేనే అదొక పెద్ద విశేషం… ఎందుకు..? తను ప్రశ్నను సహించడు కాబట్టి… ప్రశ్న వినడానికి కూడా ఇష్టపడడు… అంతకుముందు ఏమో గానీ, తను అధికారంలోకి వచ్చాక ఆ ప్రశ్నను సహించలేనితనం పీక్స్‌కు చేరింది… అది ఎంతలా అంటే..? […]

తుడరుమ్ సరే… సినిమాను మించి జార్జ్ పాత్ర హైలైట్ అవుతోంది…

June 11, 2025 by M S R

prakash verma

. ఆల్రెడీ పాత్రల్లో జీవించే నటులు, అప్పటికే ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నవారి సినిమాల్లో.. అప్పుడే అరంగేట్రం చేసేవారు ఒకింత ఆందోళనతో కూడిన భయానికి గురవుతారు. కానీ, అరంగేట్రంలోనే.. టాప్ మోస్ట్ నటులను పూర్తిగా మరిపించేలా నటించడమంటే…? ఈ మధ్య వచ్చిన తుడరుమ్ సినిమా ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతున్న మూవీ. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్రైమ్ థ్రిల్లర్ గా జియో హాట్ స్టార్ లో ఉన్న ఈ సినిమాలో.. చాలామందికి తెలిసిన ప్రధాన […]

చినాబ్ వంతెన… ఆమె కృషిని మనం ఎందుకు అభినందించాలంటే..?

June 11, 2025 by M S R

chinab

. రవి వానరసి…   దూరం నుంచి చూస్తే, అది హిమాలయాల అంచుల్లోంచి ఉద్భవించిన ఓ అద్భుతమైన కళాఖండంలా కనిపిస్తుంది. వేల అడుగుల లోతైన లోయపై, సన్నని పట్టు దారంలా సాగిపోతున్న ఆ ఉక్కు నిర్మాణం, కేవలం ఒక వంతెన కాదు. అది మనిషి సంకల్పానికి, అత్యాధునిక ఇంజినీరింగ్‌కి, ప్రకృతి సవాళ్లను అధిగమించే ధైర్యానికి నిలువెత్తు నిదర్శనం. ఆ అద్భుతమే చీనాబ్ రైల్ వంతెన! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్ వంతెనగా చరిత్రలో నిలిచిపోయే ఈ నిర్మాణం వెనుక, […]

కటకటాల రుద్రయ్యలాగే ఇదీ ఓ తరహా కుంతీపుత్రుడి కథ…

June 11, 2025 by M S R

sarada

. అప్పటికి కృష్ణంరాజు, విజయశాంతి, సుమన్… అందరికీ క్రేజ్ ఉంది… పైగా కృష్ణంరాజు హిట్ సినిమాలైన  కటకటాల రుద్రయ్య బాపతు కుంతీపుత్రుడి కథను కాస్త, భక్త కన్నప్ప ట్రీట్‌మెంట్ కాస్త రంగరించి, ఏదో కమర్షియల్ సినిమా చుట్టేశారు… కానీ పెద్దగా జనానికి ఎక్కలేదు… అసలు కృష్ణంరాజు, విజయశాంతి జంటే నప్పలేదు… కథ కూడా ఎటెటో పోతుంది… వెరసి జనం వద్దనేశారు… ఆ సినిమా పేరు రారాజు… (తరువాత గోపీచంద్ హీరోగా కూడా ఇదే టైటిల్‌తో ఓ సినిమా […]

అభ్యుదయ ప్రత్యగాత్మ… అర్థం కాలేదా..? వివరంగా చదవండి ఓసారి..!

June 11, 2025 by M S R

pratyagatma

. Bharadwaja Rangavajhala ….. సరదాగా డైరక్టర్ ప్రత్యగాత్మ గురించి మాట్లాడుకుందామే … ప్రత్యగాత్మ… టాలీవుడ్ లోనూ బాలీవుడ్ లోనూ కొంచెం హిట్లు, కొద్దిగా ఫ్లాపులూ తీసిన దర్శక కథకుడు. తీసింది తక్కువ చిత్రాలే అయినా… అధిక శాతం సక్సస్ రేట్ ఉన్న డైరక్టర్ ఆయన. కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి, ఆ తర్వాత జర్నలిస్ట్ గా జ్వాల అనే పత్రిక పెట్టి … సంపాదకత్వం వహించి, ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించారు ప్రత్యగాత్మ. అన్నట్టు సోవియట్టు రష్యా […]

కాలమహిమ… ఒకప్పుడు బాబు గారి కొమ్మినేని… మరి ఇప్పుడు..?!

June 11, 2025 by M S R

కొమ్మినేని

. కొమ్మినేనిలో బాబును చూసుకున్న కాంగ్రెస్ నేతలు… సిఎల్పి కార్యాలయంలోకి కొమ్మినేని శ్రీనివాస్ రాగానే కాంగ్రెస్ నాయకులు అతనిలో చంద్రబాబును చూసుకునే వారు . ఇప్పటి వారికి నిజమా అని ఆశ్చర్యం కలుగవచ్చు కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెండు దశాబ్దాల క్రితం ఇది రోజూ కనిపించిన దృశ్యమే … బాబు ప్రభుత్వం కొమ్మినేనిపై చివరకు sc st కేసు పెట్టి అరెస్ట్ చేయడం చూస్తే … కొమ్మినేనిలో ఒకప్పుడు అందరూ బాబును చూసుకోవడం నిజమా అనిపిస్తుంది … […]

  • « Previous Page
  • 1
  • …
  • 55
  • 56
  • 57
  • 58
  • 59
  • …
  • 382
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • మునుగోడుకు సపరేట్ ముఖ్యమంత్రి, సొంత ఎక్సయిజు రాజ్యాంగం..!!
  • మీకు సుగర్ ఉందా..? వేడివేడిగా లాగించకండి…! బాగా చల్లారనివ్వండి..!!
  • చిదంబరం ‘తప్పుల ఒప్పుకోలు’ ప్రకటనలు… అసలు మర్మమేమిటో…
  • Good Classmates..! ఆ క్లాస్‌మేట్ ఆత్మ ఆనందపడి ఉంటుంది…
  • అదే జగన్ ప్లేసులో తనుంటే… ఆ సీఎస్‌ను చంద్రబాబు ఏం చేసేవాడు..?
  • దిక్కుమాలిన ఎలిమినేషన్…! మరిక ప్రజాభిప్రాయం దేనికిరా భయ్..!?
  • ‘ఎ’ తెలుగు…’యాన్’ టెల్గూ…’ది’ తెగులు… ‘థి’క్కుమాలిన యాడ్…
  • నడిరాతిరి వేళా నీ పిలుపు… ఇలాంటి ఓ హిందీ పాటే ఓ ఉత్సవం…
  • ఈ తూరుపు, ఆ పశ్చిమం సంగమించిన ఈ శుభవేళ…!
  • జామ ఆకులు తెగ తింటున్నారు… పచ్చి, ఎండు, పొడి… అన్నీ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions