. ఆనంద్ మహింద్రా… మహింద్రా గ్రూపు చైర్మన్… తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి… తన కార్ల వ్యాపారమేదో తాను చూసుకోవడమే కాదు, సమాజగతి మీద కూడా స్పందిస్తుంటాడు… సోషల్ మీడియాలో యాక్టివ్… తనకు ఆసక్తిగా అనిపించినవి షేర్ చేసుకుంటాడు… తను సాయం చేయగల ఇష్యూస్‌లో ఇన్వాల్వ్ అవుతాడు… విశిష్టంగా కనిపించే ఓ భిన్నమైన వ్యాపారి… ఇప్పుడు సోషల్ మీడియాలో తన కార్లకు సంబంధించి కనిపించిన ఓ పోస్టుకు తనే రియాక్టయ్యాడు… తను ఇచ్చిన రిప్లయ్ ఈమధ్యకాలంలో అత్యుత్తమం […]
అంటే అన్నామంటారు గానీ… ఈ యాడ్ పరమార్థం ఏమిటి సార్..?!
. ఒక ప్రపంచంలోకెల్లా అత్యధిక ధనవంతుడైన, ప్రభావమంతమైన హిందూ దేవుడి గుడికి పాలకమండలి అధ్యక్షుడయ్యాడు ఆయన… వోకే… కారణాలు ఇక్కడ అప్రస్తుతం… పక్కా రాజకీయ పదవి… మన గుళ్లు రాజకీయ క్రీడల్లో చిక్కిన ఫలితం… పోనీలే పాపం… ఎవడెవడో నాస్తిక చక్రవర్తులు కూడా భ్రష్టుపట్టించే దుర్మార్గాలు చేశారు, ఈయన నయం కదా అంటారా..? సరే… అంగీకరిద్దాం… తనను చూసి కాదు… మన గుళ్ల పరిస్థితి చూసి..! సరే, అయ్యాడు… అక్కడ సగటు భక్తుడికి, వోకే, వోకే, ఆ […]
వాడు… 100 కాదు, 10000 కోట్లు సంపాదించినా మనం పీకేదేమీ లేదు…
. సిగ్గుపడదాం… నిజంగానే ఓ సమూహంగా, ఓ సమాజంగా మూకుమ్మడిగా సిగ్గుపడదాం… అలా సిగ్గుపడటానికి నామోషీ అక్కర్లేదు… మనం సిగ్గుపడటానికి పక్కాగా అర్హులం… మాదచ్చోద్ ప్రభుత్వ విధానాలు… వాటికి పుట్టిన బ్యూరోక్రాట్టు… తోడుగా పుట్టిన రాజకీయ నాయకులు… సవతి పుత్రులుగా ఉన్నతాధికారులు… ఎవరూ తక్కువేమీ కాదు… ఈ వ్యవస్థలో బతుకుతున్నందుకు ఉమ్మడిగా సిగ్గుపడదాం… ఎహె, సిగ్గుపడడానికి ఏముంది, ఇది లోకసహజం, అధికారులు, నాయకులు, మీడియా, లీగల్ సిస్టం ఎవరు సంపాదించడం లేదూ అంటారా… ఎస్, అందుకే అందరమూ […]
రష్యాకు తలబొప్పి… సిరియాపై తిరుగుబాటుదారుల పట్టు…
. WW3 అప్డేట్ 5… సిరియా మళ్ళీ సంక్షోభంలోకి వెళ్ళబోతున్నది! సిరియాలోని రాజధాని డమాస్కస్ తరువాత రెండో పెద్ద నగరం అయిన అలెప్పీ తిరుగుబాటు దారుల చేతిలోకి వెళ్లిపోయింది! వాణిజ్యపరంగా కీలకమైన అలెప్పో నగరం మూడురోజులలోనే ప్రభుత్వ తిరుగుబాటుదారుల వశం అయ్యింది! టర్కీ సైన్యం సిరియా తిరుగుబాటు దారులకి అండగా నిలబడి దాడులు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది! బ్రిక్స్ లో చేరడానికి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన విజ్ఞప్తిని భారత్ వీటో చేస్తే, అది పుతిన్ సమర్థించాడు అనే […]
పుట్టుక, చావుల మైలతో గుడి పూజారి అర్చన వృత్తికి వెళ్లొచ్చా..?
. నిజానికి వర్తమాన వార్తాసరళి నడుమ ఇది పెద్ద వార్తగా అనిపించదు… కానీ భక్తి విశ్వాసులకు చదవగానే ఒకింత ఆసక్తి… తెలంగాణలోని ఓ ప్రధాన ఆలయ అర్చకుడు అనుమతి లేకుండా ఇటీవల దుబయ్ వెళ్లొస్తే గుడి ఉన్నతాధికారగణం తనపై యాక్షన్‌కు సిద్ధమైందనే ఓ సమాచారం విన్న వెంటనే ఈ వార్త కనిపించి, కొంత ఇంట్రస్ట్ అనిపించింది… వార్త ఏమిటంటే..? అయోధ్యలో అర్చనలు చేసే పూజారులు ఎవరైనా సరే తమ ఇళ్లల్లో పుట్టుకలు, మరణాలు సంభవిస్తే మందిరంలోకి రావద్దు […]
తన మొదటి సినిమా క్వాలిటీపై కనీసం చిరంజీవి దృష్టిపెట్టాలి కదా…
. చిరంజీవి నటించిన మొదటి సినిమా . 1979 లో వచ్చిన ఈ పునాదిరాళ్ళు సినిమా చిరంజీవికి అద్భుతమైన పునాదిని వేసింది . పల్లెటూర్లలో పెత్తందార్ల దాష్టీకం మీద కుప్పలకుప్పలు సినిమాలు ఈ సినిమా ముందూ వచ్చాయి , తర్వాతా వచ్చాయి . సినిమా సక్సెస్ అయ్యేది కానిదీ ఆడియన్సుకు ఎలా ప్రెజెంట్ చేసారు అనేదాన్ని బట్టి ఉంటుంది . ఆడియన్సుకు పట్టేలా ఈ సినిమాను ప్రెజెంట్ చేసారు . టైటిల్సులోనే నిర్మాతలు సినిమా ఉద్దేశం చెప్పేసారు […]
ఢిల్లీ సహకరించకపోతే… తెలంగాణ పోలీసులు చేయగలిగిందేమీ లేదు…
. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎవరు..? ఆదేశించిన కేసీయారా..? అక్షరాలా అమలు చేసి, స్వప్రయోజనాల కోసం అరాచకానికి తెగబడిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బందా..? ఫోన్ ట్యాపింగులు చేయించని ప్రభుత్వం లేదు… ఉండదు… కానీ ఆ ట్యాపింగు వ్యవస్థను సెటిల్మెంట్లకు, వసూళ్లకు, దందాలకు, చివరకు సినిమా తారల్ని లొంగదీసుకోవడానికి కూడా వాడిన పాపం కేసీయార్‌కు తగిలింది… అదంత తేలికగా మాసిపోయే పాపమూ కాదు… వస్తున్న వార్త ప్రకారం… ప్రభాకరరావు అమెరికాకు చికిత్స […]
అసలైన అంశాలు మింగేసి… ఏడాది పాలన మీద ఇదేం విశ్లేషణ సార్…
. అసంపూర్ణంగా హామీల అమలు… అనుభవరాహిత్యం ప్రభావాలు… ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కోవడంలో సమన్వయలోపాలు గట్రా రేవంత్ రెడ్డి ఏడాది పాలనకు సంబంధించి ఎన్ని చెప్పుకున్నా సరే… లగచర్ల, దిలావర్పూర్ ప్రజల తిరుగుబాటును ప్రస్తావించకపోతే అది అసంపూర్ణం, అర్థ విశ్లేషణ మాత్రమే… ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ వ్యాసం చదివాక అనిపించింది ఇదే… హైడ్రా దూకుడు మొదట్లో ఉన్నంత ఇప్పుడు లేదు… మూసీ పేదల ఇళ్ల కూల్చివేతపై మొదట కనిపించిన కాఠిన్యం ఇప్పుడు లేదు… బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ పరిధుల్లో ఆల్రెడీ నిర్మించిన […]
ఓర్నీ… మీ దుంపల్తెగ… మీరెక్కడ తయారయ్యార్రా బాబూ…
. బూతు ప్రసిద్ధ జబర్దస్త్ షో గురించి పదే పదే చెప్పుకోనక్కర్లేదు… అదలాగే వారానికి రెండురోజులు బూతును ఇళ్లల్లోకి ధారావాహికంగా ప్రసారం చేస్తూనే ఉంటుంది… మొదట్లో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్త భిన్నంగా, పద్ధతిగానే అనిపించింది… కానీ దాన్ని మరో జబర్దస్త్ షో చేసేశారు విజయవంతంగా… ద్వంద్వార్థాలు, వెకిలితనం, వెగటు హాస్యంతో ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఒకటి అసహ్యం అనిపించింది… ఏదో తాడుతో ఆడే ఆట… అక్కడున్న టీవీ సెలబ్రిటీలను ఆడిస్తున్నారు… ఆటో రాంప్రసాద్ […]
అమ్మా నయనతారా… ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు..!!
. సాదా సీదా ఫెయిరీ టేల్… నయనతార – బియాండ్ ఫెయిరీ టేల్ నయనతార నెట్ ఫ్లిక్స్ చిత్రం చూస్తే ఏమనిపించింది? చాలామందికి ఏ మసాలాలూ లేని మామూలు సినిమా అనిపించింది. ఒకప్పుడు సినీతారల జీవితాల గురించి ఎంత ఆసక్తి ఉన్నా, వారు చెప్పేవే బయటకి వచ్చేవి. పబ్లిసిటీ అవసరం కాబట్టి అప్పుడప్పుడు అక్కరలేని స్టోరీలు కూడా వండి వార్చేవారు. అవి కూడా సినిమా పత్రికలలోనే. వారి కుటుంబం, పిల్లలు చాలా అరుదుగా కనిపించేవారు. సోషల్ మీడియా ప్రవేశంతో […]
ఇరాన్‌కు రష్యన్ జెట్ ఫైటర్స్… యుద్దం ఇంకా ముదురుతోంది…
. WW3 అప్డేట్ 4… రష్యా 12 సుఖోయ్ Su – 35 ఫైటర్ జెట్స్ ను ఇరాన్ కి అందచేసింది! ఇది పెద్ద విషయమే! పోయిన సంవత్సరం ఇరాన్ తనకి Su – 35 ఎయిర్ సూపీరియారిటి ఫైటర్ జెట్స్ కావాలని అడిగింది! అఫ్కోర్స్! పుతిన్ కి కూడe ఇరాన్ సురక్షితంగా ఉండడమే కావాలి! కానీ Su -35 లని వీలున్నంత తొందరగా ఇరాన్ కి ఇవ్వడం పుతిన్ కి సాధ్యం కాదని యూరోపు దేశాలు భావించాయి! కానీ […]
డబుల్ ఎలిమినేషన్..! టేస్టీ తేజకు తప్పదు… తోడుగా పృథ్వి కూడా..!?
. టేస్టీ తేజ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నాడు… ఇదీ ఓ ముందస్తు వార్త,.. పర్లేదు, హోప్లెస్… ఇప్పటికే లేటయింది… ఒకటే ఇరిటేషన్… తనకే కాదు, తనను చూసేవాళ్లకు కూడా… అసలు ఎందుకు తీసుకొచ్చారో ఆ షో క్రియేటివ్ టీమ్‌కే తెలియాలి… తను ఏదీ సరిగ్గా ఆడలేడు… స్థూలకాయం సహకరించదు… రోహిణి కూడా అంతే, కానీ ఆమె ఫైట్ చేయగలదు… ఎంటర్టెయిన్ చేయగలదు… మంచి టైమింగ్… తేస్టీ తేజ మెంటాలిటీ కూడా షోకు సూట్ కాదు… నిన్న […]
19 భాషల్లో పాటలు… అనితరసాధ్యం… సిసలైన పాన్ఇండియా సింగర్…
. పంథొమ్మది భాషలు 20 వేల పాటలు… వేలాది భక్తి పాటలు, ప్రైవేటు ఆల్బమ్స్… నిజానికి ఈ సంఖ్య కాదు వాణిజయరాం గాత్రమాధుర్యాన్ని, విశిష్టతను పట్టించేది… ఆమె పాడిన పాటలు ఆమె ఏమిటో చెబుతాయి… 11 సంగీత ప్రధానమైన పాటలున్న స్వాతికిరణం సినిమా కోసం విశ్వనాథ్ నిర్మొహమాటంగా ఆమెనే ఎంచుకున్నాడు… ఆమె పాటంటే, పాడే పద్ధతి అంటే అందరికీ అంత నమ్మకం… ఆ గొంతులో ఆ శ్రావ్యత… ఆనతి నీయరా హరా… శివానీ, భవానీ… తెలిమంచు కురిసింది… […]
సీఎం సార్… సినిమా టికెట్ల రేట్లను మార్కెట్‌కు వదిలేస్తే పోలా..!!
. మార్కెట్లో కిలో బియ్యం ధర ఎంత..? రేషన్ బియ్యం జస్ట్, కిలోకు రూపాయి… అన్నపూర్ణ కార్డు ఉంటే ఫ్రీ… బయట కావాలన్నా 11 రూపాయలు ధర… సన్నబియ్యం సోనా మశూరి కావాలంటే 55, సుగర్ ఫ్రీ అనే డొల్ల ప్రచారమున్న బియ్యమైతే 70, 80… జైశ్రీరాం, హెచ్ఎంటీ అయితే ఒక ధర… లాంగ్ గ్రెయిన్ ఒక ధర, బాస్మతి మరో ధర… బ్రాండ్‌ను బట్టి వేర్వేరు… చివరకు మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయనే బ్లాక్ రైస్ ఎట్సెట్రా […]
వెండితెర వెలుగు జిలుగుల వెనుక కనిపించని చీకటి శక్తులు..!
. సినిమా రంగం అన్నది ఒక విచిత్రమైన మాయామోహ జలతారు వంటిది. దాని ఆకర్షణ నుండి తప్పించుకోవడం సామాన్యులకు చాలా కష్టం. అందుకే, వేలాది మంది విద్యావంతులు, బీటెక్, యంటెక్, మెడిసిన్, పిహెచ్.డి లు ఇంకా, అనేక రంగాల్లో నిపుణలయిన వారు, తమ తమ కెరీర్లలో, ఉచ్ఛ స్థితిలో ఉన్న వారు, ఈ సినిమా అనే ఆకర్షణలో పడి, ఏళ్ళ తరబడి అవకాశాల కోసం కృష్ణానగర్ వీధుల్లో, కళ్ళల్లో ఆశలు నింపుకుని, ఏ నాటికైనా తామొక ప్రభంజనం […]
మలినమైన ఆ శారద దేహం గంగలో స్వీయ నిమజ్జనం…
. ఇది అచ్చంగా శారద సినిమా . మూడోసారి ఊర్వశి అవార్డును శారదకు తెచ్చిపెట్టిన సినిమా . మొదటి రెండు ఊర్వశి అవార్డులు మళయాళ సినిమాల్లో నటించినందుకు వచ్చాయి . మూడోది మాత్రం 1979 లో వచ్చిన ఈ నిమజ్జనం తెలుగు సినిమాలో నటించినందుకు వచ్చింది . గూడ్స్ బండి స్పీడులో నడుస్తుంది సినిమా . ఆరోజుల్లోనే డబ్బులు రాలేదు . అవార్డులు మాత్రం బాగా వచ్చాయి . ఇప్పటి తరం వారు చూడలేరేమో ! తండ్రి […]
లగే_చర్ల… దిలా_వార్‌పూర్… ఇంతకీ ఓడింది ఎవరు..? గెలిచింది ఎవరు..?
. మహాభారతంలో వినిపించే ఓ ప్రశ్న జగత్ ప్రసిద్ధం … ద్రౌపది కురుసభకు వేసిన ప్రశ్న… ధర్మరాజు తనను జూదంలో ఓడిన విషాదంపై వేసిన ప్రశ్న… నన్నోడి తన్నోడెనా..? తన్నోడి నన్నోడెనా..? లగచర్లలో భూసేకరణ రద్దు అనే వార్తలో సర్కారు నిర్ణయం చదివాక చటుక్కున మెదిలిన ప్రశ్న అదే… నిజానికి స్థూలంగా భూసేకరణ మొత్తం రద్దు అని కాదు… ఫార్మా కోసం భూసేకరణ రద్దు, కానీ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ఉంటుంది… దానికి విడిగా వేరే భూసేకరణ […]
నిజమే… నమస్తే తెలంగాణకు యాడ్స్ ఎందుకు ఇవ్వకూడదు..?!
. రైతుపండుగ పేరిట పత్రికల్లో కనిపించిన సర్కారీ యాడ్స్ ఆశ్చర్యాన్ని కలిగించాయి… కేసీయార్ ప్రభుత్వానికి రేవంత్‌రెడ్డి సర్కారుకూ పెద్ద తేడా లేమీ లేదు ఈ విషయంలో అనిపించింది… కొన్ని డిజిటల్ పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు… అసలు ఈ యాడ్స్ ఇచ్చే విధానంలో ఏముందో, ఏలినవారికి ఏమర్థవుతున్నదో దేవుడికే తెలియాలి.,. డిజిటల్ పేపర్లను కూడా ప్రభుత్వం పత్రికలుగా గుర్తిస్తున్నదని అధికారికంగానే చెప్పినట్టేనా..? ఈమేరకు రూల్స్ ఏమైనా మార్చబడ్డాయా..? జగన్ పిరియడ్‌లో ఏపీలో పత్రికల బాపతు వెబ్సైట్లకు కూడా […]
జనం వోట్లే అంతిమం… అసలు ఆచరణలో ఈమాట ఉత్త డొల్ల…
. జనం ఫోఫోవయా, ఇక చాలు అంటున్నారు… కానీ ఇంట్లోనే జరిగిన ఓ పిచ్చి పోటీలో, వెంట్రుక మందంలో గెలిచాడు… ఇంటివాడు నువ్వు తోపు, ఉండాల్సిందే అంటాడు… తనే మరోవైపు జనం వద్దంటే పీకేస్తా అంటాడు… ఏది కరెక్టు..? ఎవరు కరెక్టు..? బిగ్‌బాస్ ఉన్న మూర్ఖత్వాల్లో ఇదీ ఒకటి… నిన్నటి అవినాష్ కథా ఇదే… గత సీజన్లో అంబటి అర్జున్ కథా ఇదే… ఏమైందంటే..? హౌజులో ఉన్నవాళ్లలో అవినాష్ ఖచ్చితంగా ఓ వినోదిస్టు… పర్ఫామర్… తనొక్కడే ఏమీ […]
అద్రి మారుతోంది… అది మన గుట్టగా కనిపిస్తోంది… ఆకర్షిస్తోంది….
. మన దరిద్రపు రాజకీయ వ్యవస్థలో… ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో… అది ప్రతిపక్షంలోకి వెళ్లిపోయి, వేరే పార్టీ అధికారంలోకి వస్తే…. సాధారణంగా నెగెటివ్ ధోరణిలో వెళ్తుంది… పాత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఆలోచిస్తుంది… ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు పంపించడానికి ప్రయత్నిస్తుంది… నేనిక్కడ విస్తృత పరిధిలోకి వెళ్లడం లేదు, ఈ స్పేస్ సరిపోదు… తెలంగాణకు సంబంధించి..! యాదగిరిగుట్టకు సంబంధించి… దానికి చిన జియ్యర్ మోస్ట్ కంట్రవర్షియల్ కేరక్టర్ (నేనిక్కడ పీఠాధిపతి వంటి విశిష్ఠ విశేషణాలేవీ […]
- « Previous Page
- 1
- …
- 63
- 64
- 65
- 66
- 67
- …
- 490
- Next Page »