. Ashok Kumar Vemulapalli ……. బ్లూటిక్కు వోళ్ళ కష్టాలు “ బ్లూ టిక్కు తీసుకుంటే కంటెంట్ మీద రెవెన్యూ షేరింగ్ ఇస్తా అన్నాడు ఎలాన్ మస్కు బాబాయ్ .. నెలకి వెయ్యిరూపాయలు దొబ్బేసి బ్లూ టిక్కు (ప్రీమియమ్) తీసుకున్నా.. తీరా తీసుకున్నాక 500 మంది ప్రీమియం ఫాలోవర్స్ అంటే బ్లూటిక్కు ఉన్నోళ్ళు కావాలన్నాడు.. బాబ్బాబు.. నన్ను ఫాలో చేసి నన్ను కోటీశ్వరుడ్ని చేయండని రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్లూటిక్కులోళ్లని బతిమాలుకున్నాను .. ధర్మం చేయండి బాబయ్యా అన్న […]
బంగారం ధరతో పోటీపడే మామిడి… రంగు రుచి వాసన అన్నీ స్పెషలే..!!
. Raghu Mandaati …….. థాయిలాండ్లో ప్రత్యేకమైన ఆతిధ్యాన్ని అందుకోగలిగాను ముఖ్యంగా భోజనం పూర్తయ్యాక గొప్ప విలాసవంతమైన విందు చివరగా ఒక ఐస్ క్రీమ్ తో లేదా ఫ్రూట్ బౌల్ తో పూర్తవుతుంది. ఫ్రూట్ బౌల్ తీసుకొని తిన్నాను. ఒక విధంగా అద్భుతాన్ని రుచి చూసాననే చెప్పాలి. అయితే ఆ గుప్పెడు ఫ్రూట్ బౌల్ ఖరీదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు.. నిజం.. అది చూసి నోట మాట రాలేదు. ఎందుకంత ఖరీదు అనే ప్రశ్న, […]
గద్దర్ అవార్డులు, రేవంత్‌రెడ్డి వైఖరి పట్ల టాలీవుడ్ అసంతృప్తి..!!
. దీంట్లో పెద్దగా సందేహించడానికి ఏమీ లేదు… రేవంత్ రెడ్డి ఇవ్వాలనుకునే గద్దర్ అవార్డులకు ప్రతిఘటన ఇది… టాలీవుడ్ రేవంత్ రెడ్డి పట్ల ఏమాత్రం సానుకూలంగా ఉండటానికి ఇష్టపడటం లేదు… కొత్త పంథాలో తనను ధిక్కరిస్తోంది… టాలీవుడ్ అంటే జస్ట్, చంద్రబాబు బ్యాచ్… ఇక ఎవరు సీఎం అయినా సరే, దానికి పట్టదు, పట్టించుకోదు, అందరికీ తెలుసు… జగన్, రేవంత్ రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, రోశయ్య… ఎవరైనా సరే, చివరకు రేప్పొద్దున పవన్ కల్యాణ్ సీఎం అయినా సరే […]
మెప్పించని అజిత్ పట్టుదల..! ప్రేక్షకులకు కనెక్ట్ కావడం కష్టమే బాసూ..!!
. సినిమా బయట రియల్ హీరో అజిత్… చాలా అంశాల్లో… తాజాగా వరించిన పద్మభూషణ్ కూడా..! రీల్ హీరోగా కూడా తమిళంలో బాగా పాపులర్… కానీ కొన్ని కథలకు, కొందరు దర్శకులకు గుడ్డిగా తలూపి పొరపాటు చేస్తాడు… భంగపడతాడు… పట్టుదల అనే కొత్త సినిమా కూడా అలాంటిదే… అసలు ఇలాంటి సినిమా ఒకటి వస్తుందని తెలుగు ప్రేక్షకుడికి తెలియదు పెద్దగా… బజ్ కూడా లేదు… చాలా తమిళ సినిమాలకు అలవాటే కదా… అడ్డదిడ్డంగా తెలుగులోకి డబ్ చేసి, […]
ప్రేక్షకుడు కో‘బలి’… మతిలేని హింస… మాటకు ముందూవెనకా బూతు…!!
. Ashok Pothraj ……. “కోబలి” (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తెలుగు) ఈ టైటిల్ గతంలో అంటే 2017లో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓకే చేసి పోస్టర్ రిలీజ్ చేసారు. అప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ అయింది. తర్వాత ఎందుకో ఆ సినిమా ఆగిపోయింది. ఇక్కడ ఒక విశేషమైన విషయం చెబుతాను. 23/24 ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ తెగ సూటిపోటి మాటలతో రాజకీయంగా ఎక్కువగా ప్రసంగాలు […]
టీవీ ప్రీమియర్ల పనైపోయింది… ఇకపై తోపు సినిమాలూ ఎవడూ దేకడు..!!
. ఎస్, సినిమాల ప్రీమియర్లను ఎవడూ దేకడం లేదు టీవీల్లో… ఆ సుదీర్ఘ యాడ్స్… సినిమా వచ్చినంతసేపూ టీవీ ముందే కూర్చోవల్సి రావడం… దానికి బదులు ఓటీటీలో వచ్చేదాకా ఆగి, ఎంచక్కా ఆపుతూ, వెనక్కి వెళ్తూ, రిపీట్ సీన్స్, మనకు ఇష్టమున్న టైములో… ఇష్టమున్న రోజున సినిమా చూడటమే ప్రస్తుతం ప్రేక్షకుల ప్రయారిటీ… ఎటొచ్చీ దిక్కుమాలిన ఓటీటీ రేట్లను సబ్‌స్క్రయిబ్ చేయలేని వాళ్లే టీవీల్లో సినిమాలను చూస్తున్నారు… మరీ దరిద్రం ఏమిటంటే, ఈమధ్య ఓటీటీలు కూడా పే […]
ఫాఫం రేవంత్ సర్కారు..! పాజిటివ్ రిజల్ట్ బదులు ఉల్టా నెగెటివిటీ..!!
. నిజమే… తెలంగాణ కాంగ్రెస్, ప్రభుత్వవర్గాల్లోనే ఓ చర్చ సాగుతోంది… ఎలాగూ అవకతవక పాలన విధానాలతో ప్రభుత్వం మీద క్రమేపీ వ్యతిరేకత పెరుగుతోంది… బీఆర్ఎస్ ప్రతి ఇష్యూను అవకాశంగా తీసుకుంటూ ముప్పేట దాడి చేస్తోంది… మీడియా, పాలిటిక్స్, ఎత్తుగడలు, గాలి పోగేసి రాద్ధాంతం, సోషల్ మీడియా, మీమ్స్, రీల్స్… వాట్ నాట్..? ప్రభుత్వ పనితీరు, విధానాల మీద ఒక ప్రతిపక్షం ఎలా దూకుడుగా విరుచుకుపడొచ్చో హరీష్, కేటీయార్ చేసి చూపిస్తున్నారు… కేసీయార్ ఫామ్ హౌజు దాటని రాజనీతిజ్ఞరాహిత్యం […]
ఇద్దరు హీరోయిన్లను చంపేసినా సరే, మహిళలు దాసరిని క్షమించారు..!!
Subramanyam Dogiparthi ………. శ్రీవారి ముచ్చట్లు . కాదు . శ్రీవారి ఇక్కట్లు . సాధారణంగా 1+2 సినిమాల్లో ఒక హీరోయిన్ని లేపేస్తారు . దాసరికి బాలచందర్ పూనారో ఏమో ఇద్దరు హీరోయిన్లను లేపేసారు . పాపం ! ముగింపు సీన్లో ఎయన్నార్ ఇద్దరికి కలిగిన ఇద్దరు పిల్లల్ని ఉయ్యాలల్లో ఊపుతూ మనకు బై చెపుతారు . అయితే ఈ సినిమా గొప్ప ఏమిటంటే ఇద్దరు హీరోయిన్లు చనిపోయినా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయింది . మహిళా […]
గోవుమాలక్ష్మికీ కోటి దండాలు..! దీని బ్లడ్డు, ఎగ్గూ, బ్రీడ్ ఇంటర్నేషనల్..!!
. శివుడు ఎంత పాతవాడో చెప్పలేక అన్నీ తెలిసిన వేదాలే చేతులెత్తేశాయి. అలాగే ఆయన వాహనమయిన బసవడు ఎంత పాతవాడో చెప్పడం కూడా చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రస్తావనల్లో ఆవు/ ఎద్దు ధర్మదేవతకు ప్రతిరూపం. ధర్మం నాలుగుకాళ్లతో సవ్యంగా నడవడం అన్నమాట ఇందులోనుండే పుట్టింది. కొత్త ఇల్లు కట్టుకుని ఒక శుభ ముహూర్తాన తెల్లవారకముందే మనం ఇంట్లోకి శాస్త్రోక్తంగా అడుగుపెట్టడానికంటే ముందు ఆవు అడుగు పెట్టాలి. ఆవు తోక పట్టుకుని వెనుక మనం వెళ్లాలి. ఆవు లోపలికి […]
ఏపీ టీడీపీ కేడర్‌లో సింగర్ మంగ్లీ రచ్చ… కేంద్ర మంత్రి వద్ద నో ఆన్సర్..!!
. వైసీపీ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని జనం మొన్నటి ఎన్నికల్లో బలంగా తిరస్కరించారు… చివరకు తెలుగుదేశం కూటమి కూడా అంత ఫలితాన్ని అంచనా వేయలేదు… సరే, ఈ కూటమి ప్రభుత్వంలోకి వచ్చింది… వర్తమాన రాజకీయాలను బట్టి ఏం జరుగుతుంది..? అప్పటిదాకా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ముఖ్యులు, ఆ పార్టీ మద్దతుదారులు, ఆ పార్టీ ప్రభుత్వానికి వీరవిధేయులుగా పనిచేసిన అధికారులు గట్రా తమ ప్రాధాన్యాన్ని కోల్పోతారు… లేదా పాత అక్రమాలకు సంబంధించి కేసుల పాలవుతారు… కొందరు ఉన్నతాధికారులు […]
ఒక ప్రయాగరాజ్… ఒక కర్నూలు… ఒక న్యాయరాజధాని..!!
. ముందుగా చిన్న వివరణ… హైకోర్టు బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేయడం వేరు… హైకోర్టునే కర్నూలుకు తరలించడం వేరు… కేవలం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల, హైకోర్టు కక్షిదారులు ఏపీ రాజధాని దాకా రానవసరం లేదు… కర్నూలు చుట్టూ తిరిగితే చాలు… మరి దీనివల్ల కర్నూలు న్యాయ రాజధాని అవుతుందా..? దీంతో కర్నూలు అదనంగా అభివృద్ది చెందడానికి ఆస్కారం కల్పిస్తుందా..? అప్పట్లో ఎవరో అన్నారు కదా… నాలుగు జిరాక్స్ షాపులు పెరుగుతాయి అని… అంతేనా..? […]
వాణీ జయరాం..! అనితర సాధ్యం ఆ స్వరయానం… మూవీ నైటింగేల్…!
. Bharadwaja Rangavajhala……. అన్ మాచ్డ్ నైటింగేల్ ఆప్ ఇండియా… ఏ పాటైనా పాడేయడమే కాదు… ఎవరీవిడ అని చూడాలనిపించే క్యూరియాసిటీ కలిగించిన గాయని తను. పేరు వాణీ జయరామ్… 2023 పద్మభూషణ్ పురస్కారం… అనితర సాధ్యమైన భారతీయ సుస్వర గానం… మొన్నటి నాలుగున ఆమె వర్ధంతి… రెండేళ్ల క్రితం అనుకోని పరిస్థితుల్లో మనని వదిలి వెళ్లిపోవడం …. విషాదం …. నువ్వే నువ్వమ్మా … సరిగమా… నీ సరి ఎవరమ్మా..? క్లాసికల్లైనా… జానపదమైనా… జాజ్ బీటైనా మరేదైనా… […]
రైల్వే నిధులపై అశ్విని వైష్ణవ్ అతి తెలివి… పెగలని తెలుగు గొంతులు…
. ఏపీ మేధావుల సంఘం నేత Chalasani Srinivas లాగా బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద, ఓ తీవ్ర వ్యతిరేక భాష, భావజాలంతో… ఉభాజపా వంటి పదాల్ని వాడుతూ రాయలేను గానీ… రైల్వే బడ్జెట్ మీద తను వ్యక్తపరుస్తున్న పాయింట్లతో ఏకీభవిస్తున్నాను… కొంత డైల్యూట్ చేసి చెప్పుకుందాం…. ‘‘తెలంగాణకు రైల్వే బడ్జెట్ లో రికార్డు కేటాయింపులు, బొనాంజా అంటా..! పెరిగిందేమో కోటి, గుజరాత్ కి పెరిగింది ఏకంగా 8743 కోట్లు… అయినా సరే మీడియా అడ్డంగా […]
డబ్బే లైఫ్ కాదు, డబ్బు లేనిదే లైఫ్ లేదు… ధ్రువ్ రాఠీ, భలే చెప్పావు బ్రో…
. బుద్ధా మురళి…. డబ్బు దేవుడు కాదు, దేవుడి కన్నా తక్కువా కాదు … డబ్బు గురించి బాగా నచ్చిన మాట .. డబ్బు గురించి మనకు రెండు రకాల వాదనలు వినిపిస్తాయి … డబ్బే జీవితం కాదు .. డబ్బు లేనిదే జీవితం లేదు .. రెండూ నిజమే రెండూ అబద్దమే .. డబ్బు లేనిదే జీవితం లేదు అనేది అక్షర సత్యం . అయితే డబ్బు ఒక్కటే జీవితానికి సరిపోదు … ఎక్కువ డబ్బు ఉంటే […]
రేడియో షోలలో విశేష ప్రతిభ… వికృత నేరగుణం మరో కోణం…
. గుదిమెళ్ల రాజశేఖర్… అంటే ఎవరికీ తెలియదు… ఆర్జే శేఖర్ బాషా అంటే అందరికీ తెలుసు… తన పేరు కూడా వినిపిస్తున్న సోకాల్డ్ మస్తాన్ సాయి వందల బ్లూవీడియోల దుమారం వార్తలు చదువుతూ ఉంటే… ప్రతిభకూ గుణానికీ ఏమాత్రం సంబంధం లేదు అని..! గతంలో ఎప్పుడూ పెద్దగా ఇతని గురించి సెర్చ్ చేసింది లేదు కానీ మొన్నటి బిగ్‌బాస్‌లో ఓ కంటెస్టెంట్… నీలి మరకలు పడిన అక్రమవర్తనుడిని ఆ షోకు ఎలా, ఎందుకు ఎంపిక చేశారో ఏ […]
పెరుగుతున్న జనవ్యతిరేకతలో… పాలనలో తొలిసారి రేవంత్ ముద్ర…
. ఛ, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏవీ 42 శాతం రిజర్వేషన్లు, ఢాం ఢూం అంటూ కేటీయార్ ఎగిరాడు… సహజం… ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, పాలకపక్షం ఏం చేసినా బొక్కలు వెతకాలనే ధోరణి… నాన్సెన్స్, అబ్సర్డ్… 42 శాతం రిజర్వేషన్ల బంతిని కేంద్రం కోర్టులోకి పంపించేసి, చేతులు దులుపుకున్నాడు రేవంతుడు… కామారెడ్డి డిక్లరేషన్‌కు పాతర అని నమస్తే తెలంగాణ రెండు టన్నుల విషాన్ని కుమ్మేసింది… సహజం… యథా బీఆర్ఎస్, తథా నమస్తే… అసలు ఈ […]
ఆ అమ్మాయి అంబులెన్స్ వైపు చూస్తూ ఎందుకు ప్రార్థించింది..!?
. మనసును కదిలించిన ఓ మంచి సంఘటన…!! ***************************** ఉదయాన్నే వివిధ పనులు…. వృత్తులకు వెళ్లే వారి హడావుడి రోడ్లపై ఉంది. ఉరుకుల, పరుగుల జీవితంలో….. పొద్దున్నే …. ప్రజల సంచారం …. అధికంగా కనిపిస్తుంది. వాహనాల రద్దీ అధికంగా ఉంది. ఈలోగా….. ఓ … అంబులెన్స్ …. కుయ్.. కుయ్.. మంటూ రోడ్డుపై వేగంగా వెళ్తుంది. దాన్ని గమనించిన వాహనదారులు పరుగు పరుగున పక్కకు జరుగుతున్నారు. మంగళవారం నాడు ఉదయం పూట…. పాత బస్టాండ్ మీదుగా […]
Take A Bow… ఎంత మంచివాడవురా… ఎన్ని నోళ్ల పొగుడుదురా…
. ( రమణ కొంటికర్ల )… మనం చూసిన అతి పెద్ద విపత్తుల్లో కరోనా ఒకటైతే.. సునామీ మరొకటి. అలాంటి సునామీ నుంచి బతికి బట్టకట్టిన ఓ అమ్మాయికి.. నాటి సునామీ సమయంలో ఎందర్నో మృత్యుఒడి నుంచి తప్పించిన ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఇటీవలే పెళ్లి జరిపించారు. పెళ్లి జరిగేవరకూ ఆ ఐఏఎస్ అధికారి దంపతులే ఆ అమ్మాయికి గాడ్ ఫాదర్, మదర్ గా నిల్చారు. ఆ కథ వినాలంటే ఓసారి నాగపట్నంలో నాటి సునామీ కాలం 2004కు […]
వెరీ డిఫరెంట్ ‘డార్క్’ మూవీ కథ… మన ‘జ్ఞానానికి’ పరీక్ష కూడా…
. Ashok Pothraj ……… బ్లాక్ (డార్క్) తెలుగు ….. రంగం ఫేం జీవా అండ్ ప్రియా భవానీ శంకర్ ఇద్దరు నటించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ తెలుగులో డార్క్ పేరుతో అనువాదం జరిగింది. అక్టోబర్ 2024లో తమిళంలో విడుదలైన ఈ చిత్రానికి జి.కె.బాలసుబ్రమణి దర్శకుడు. ఐతే ఈ సినిమా “కొహెరెన్స్” అనే హాలీవుడ్ చిత్రానికి అనువాదం. కేవలం రూ. 5 కోట్లతో రూపొందించిన ఈ చిత్రం తమిళంలో 50 కోట్ల మేరకు భారీ వసూళ్లు […]
ఆది మీమాంస..! కేసీయార్, రేవంత్… ఎవరు నిజంగా రెయిజింగ్..?
. Narukurti Sridhar …….. ‘ఆది మీమాంస ‘ ( success is never ending … failure is never final ) ‘ఆది మీమాంస ‘ అని ఒక ఒరియా మూవీ ఉంది . 1991 లో జాతీయ అవార్డు పొందిన చిత్రం . ఆదివారం మధ్యాహ్నం దూరదర్శన్ లో వచ్చినప్పుడు చూసినట్లు గుర్తు . మోహన్ గోఖలే … నీనా గుప్తా … అప్పట్లో ఈ మూవీ నాకు ఎంతగా నచ్చిందంటే నా […]
- « Previous Page
- 1
- …
- 64
- 65
- 66
- 67
- 68
- …
- 414
- Next Page »