హిందీలో బ్లాక్ బస్టర్ యాదోం కి బారాత్ ఆధారంగా 1975 లో తెలుగులో వచ్చిన ఈ అన్నదమ్ముల అనుబంధం సినిమా కూడా బ్లాక్ బస్టరే . కమర్షియల్ గా వీర సక్సెస్ అయింది . నేనయితే హిందీ సినిమా కూడా రెండు సార్లు చూసా . మన తెలుగు సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం పాటలే . హిందీ ట్యూన్లనే ఉపయోగించుకోవటం వలన పాటలు సూపర్ హిట్టయ్యాయి . ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే […]
ఇది నా బాడీ… మెయింటైన్ చేస్తా, ప్రదర్శిస్తా… సిగ్గు పడేదేముంది..?
సింబా అని ఓ సినిమా… చిన్న చిన్న నటులతోనే తీయబడిన ఓ చిన్న సినిమా అయి ఉంటుంది… అనసూయ ప్రధాన నాయిక, జగపతిబాబు ఓ మెయిన్ కేరక్టర్ అట… ట్రైలర్ లాంచ్‌కు కూడా ఓ మీడియా మీట్ నిర్వహించాడు నిర్మాత… సరే, తనిష్టం… కాకపోతే ఆ మీట్లో అడగబడిన కొన్ని ప్రశ్నలు, చెప్పబడిన కొన్ని జవాబులు ఆసక్తినే కాదు, ఆశ్చర్యాన్ని కూడా రేకెత్తించాయి… అనసూయ అంటే తెలుసు కదా… తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లు… అంతే, […]
అబ్బో మేడం గారు… అప్పట్లో మమ్మల్ని ఏమని అడిగిందో తెలుసా..?
అవి తెలంగాణా స్వరాష్ట్రంగా ఏర్పడిన తొలినాళ్లు! నన్ను దేశరాజధాని ఢిల్లీ నుంచి తిరిగి హైదరాబాదుకు బదిలీ చేసిన రోజులు! సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ కార్యకలాపాల బాధ్యతలు అప్పగించిన తరుణం! 2014 సాధారణ ఎన్నికల్లో ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ విజయ దుంధుభి మోగించి ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన సమయం! సీఎం కేసీఆర్ కూడా సచివాలయానికి రావడం మొదలైన సందర్భం! ఆరోజు ఆయన సెక్రటేరియట్ వచ్చి అప్పుడే వెళ్ళిపోయారు! సరిగ్గా, సాయంత్రం అంటే అసుర సంధ్యవేళ […]
ఒంటరితనం… ఈ విపత్తే రాబోయే రోజుల్లో అతి పెద్ద ప్రమాదకారకం..!!
తను ఎవరో… ఎక్కడివాడో తెలియదు… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది, ఏదో షార్ట్ న్యూస్ షేర్ చేస్తూ… విషయం ఏమిటంటే..? హైదరాబాదులోని తెల్లాపూర్‌లో కిరణ్ అనే ఒక యువ ఉద్యోగి సూసైడ్ చేసుకున్నాడు… తను ఓ సూసైడ్ నోట్ కూడా రాశాడు… అందులో ‘‘నా చిన్నప్పటి నుంచీ కష్టాలే, నచ్చిన చదువు చదవలేదు, నచ్చిన బట్టలు కాదు, నచ్చిన తిండి తినలేదు… కనీసం నచ్చిన జాబ్ కూడా లేదు… నాకు ఎవరి నుంచీ సపోర్ట్ లేదు, […]
ఎవరికీ అర్థం కాని ఏదో జ్వాలను పాటలో భలే తగిలించావ్ బ్రదర్…
కంగువా అనే తమిళ డబ్బింగ్ సినిమాలో శ్రీమణి ఓ పాట రాశాడు… ఆది జ్వాల అని మొదలవుతుంది… అసలు డబ్బింగ్ పాటల్లో నాణ్యత చూడకూడదు… ఏవో ఆ ట్యూన్లలో కొన్ని తెలుగు పదాలు ఇరికించి వదిలేస్తారు… తమిళ నిర్మాతలు కూడా తమిళ భాషలో పాటలు, సంగీతం, సాహిత్యం గురించి ఏమైనా పట్టించుకుంటారేమో గానీ వేరే భాషల్లో ఏం రాస్తున్నారో కూడా పెద్దగా పట్టించుకోరు… ఈ పాట కాస్త నయం… దేవిశ్రీ ప్రసాద్ కూడా ఓ మంచి ట్యూన్ […]
ఇలాంటి షీరోచిత సినిమాలే వాణిశ్రీని టాప్ స్టార్‌గా నిలిపాయి..!!
కె రామలక్ష్మి మార్కు సినిమా . ఈ అభిమానవతి సినిమాకు కధ ఆమెదే . ఆమె వ్రాసిన కరుణ కధ అనే నవల ఆధారంగా డూండీ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా . డైలాగులు కూడా ఆమే వ్రాసారు . మరి ఇంకా ఏదయినా సినిమాకు కూడా డైలాగులు వ్రాసారేమో నాకు తెలియదు . రామలక్ష్మి గారి హీరోయిన్ ఎలా ఉండాలో ఈ సినిమాలో హీరోయిన్ అలాగే ఉంటుంది . షీరో వాణిశ్రీయే . ఆత్మాభిమానాన్ని ఎన్ని […]
ముద్ద కర్పూరం..! ఇంటింటి ఔషధం..! శ్వాస సమస్యలకు సంజీవని..!!
ఒక చుట్టపాయన రీసెంటుగా అమర్నాథ్ యాత్రకు వెళ్లొచ్చాడు… తనకేమో బీపీ, భార్యకేమో ఆస్తమా… ఇద్దరూ మొన్నామధ్య కరోనా బాధితులే… అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం పడిందన్నమాటే కదా… మరి అమర్నాథ్ యాత్రలో ఆ ఎత్తు ప్రదేశంలో మీకు ఆక్సిజన్ తక్కువై ఇబ్బంది కాలేదా అనేది నా ప్రశ్న… . ఇబ్బందే అయ్యింది, ఎందుకు కాదు..? వెళ్ళేటప్పుడు ముద్ద కర్పూరం తీసుకుపోయాం, ట్రావెల్ ఏజెన్సీ వాళ్లు ముందే చెప్పారు… బాగా పనిచేసింది, శ్వాస కష్టమనిపించినప్పుడు దాని వాసన చూడటమే… […]
బీజేపీ మతవాదాన్ని ప్రతిఘటించడానికి… లెఫ్ట్ నాస్తికవాదానికి సడలింపులు…
The New Indian Express లో ఓ వార్త ఆసక్తికరం అనిపించింది… లోకసభ ఎన్నికల్లో ఫలితాల్ని సమీక్షించుకున్న కేరళ సీపీఎం ఇకపై హిందూ ధర్మ కార్యక్రమాల్లో బాగా పాల్గొనాలనీ, గుళ్ల కమిటీల్లోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని, హిందూ వ్యతిరేకతను తగ్గించుకోవాలనీ నిర్ణయించిందట… తిరువనంతపురంలో జరిగిన మూడు రోజుల లీడర్షిప్ సమ్మిట్‌లో ఈమేరకు విస్తృతంగా చర్చ జరిగిందని వార్త… మొదటి నుంచీ సీపీఎం మతపరమైన కార్యక్రమాలకు దూరం.., హేతువాదాన్ని, నాస్తికత్వాన్ని ప్రమోట్ చేయడం పార్టీ సిద్ధాంతం… 2013లో జరిగిన […]
సరే, సరే… మీ చావు మిమ్మల్ని చావనివ్వం… చావు మిషన్‌పై నిషేధం…
“జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ । తస్మాదపరిహార్యేఽర్థే న త్వం శోచితుమర్హసి” పుట్టిన వారికి మరణం తప్పదు. మరణించినవారికి మళ్లీ పుట్టుక తప్పదు. కాబట్టి ఈ అనివార్యమైన దాని కోసం దిగులుపడవద్దు. భగవద్గీతలో ఈ శ్లోకం చాలా ఫేమస్. చావు పందిట్లో సౌండ్ బాక్స్ లో ఘంటసాల పాడిన భగవద్గీతను మొదట ఎవరు వాడారోకానీ…ఆ క్షణం నుండి భగవద్గీత ఆత్మలకు, అంతరాత్మలకు, దశదిన కర్మలకు, శవ యాత్రలకు, సంతాప సభలకు, సామూహిక […]
ధర్మవ్యాప్తి..! అమెరికాలో వేలాది మందితో ‘సామూహిక గీతాపఠనం…!
కొందరు పీఠాధిపతుల తీరు చూశాం కదా… ఎంతసేపూ రాజకీయ బురద ఒంటికి దట్టంగా పూసుకుంటూ, తమ ధార్మికవ్యాప్తి విధిని ఏమాత్రం పట్టించుకోకుండా గడిపే తీరును… కొంతమందికి సంపాదనే పరమావధి… ఇంకా..? ఇంకా..? ఓ మిత్రుడు పంపించిన వార్త బాగనిపించింది… అదేమిటంటే..? ‘‘అమెరికాలోని చికాగో నగరంలో నౌ ఎరినా స్టేడియం వేదికగా పది వేల మందికి పైగా భగవద్గీతను కంఠస్థం చేసిన భక్తులు ఒకే కంఠంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు… భక్తులతో పాటు ఇల్లునాయిస్ గవర్నర్ జూలియానా […]
ఆ ఇద్దరి కంచాల్లో ధమ్ బిర్యానీ…! మిగతా విస్తళ్లలో పచ్చడి మెతుకులు..!!
బంగారంపై సుంకం తగ్గింపు, స్మగ్లింగు తగ్గుతుంది, ధరలు తగ్గుతాయి… మొబైల్స్ ధరలు తగ్గుతాయి… ఇంకా ఏమేం తగ్గుతాయి..? ఏమేం పెరుగుతాయి అనే చర్చ, ఆసక్తి ప్రతి బడ్జెట్ సమయంలోనూ ఉండేదే… కేపిటల్ గెయిన్స్ మీద ఏకంగా 12.5 శాతం పెంపుతో స్టాక్ మార్కెట్లో రక్తకన్నీరు… స్టాండర్డ్ డిడక్షన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు కూడా నిరాశ… ఎంతోకాలంగా చూస్తున్నదే కదా… నిర్మల సీతారామన్ జనానికి కనెక్టయ్యే ఏ బడ్జెట్‌నూ ప్రవేశపెట్టలేదు, పైగా ఆమెది వరుస బడ్జెట్ […]
ఆలు లేదు చూలు లేదు… అప్పుడే ప్రభాస్ హీరోయిన్ సజల్ అలీ అట…
అసలు ఎవరు హీరోయిన్ అనేది కాదు ప్రశ్న… ప్రభాస్ పూర్తి చేయాల్సిన చాలా పెద్ద ప్రాజెక్టులున్నాయి చేతిలో… వేల కోట్ల ప్రాజెక్టులు అవి… రాజా సాబ్ వదిలేస్తే… సాలార్, కల్కి సీక్వెల్స్, స్పిరిట్… ఇవన్నీ ఎంతకాలం పడతాయో చెప్పలేం… కొత్తగా రాఘవపూడి హను దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడని వార్తలు… (కన్నప్పలో తన పార్ట్ షూటింగ్ అయిపోయిందట…) ఫౌజీ అనే వర్కింగ్ టైటిల్ అనుకున్నారట… పీరియాడిక్ డ్రామా ఓ యాక్షన్ ఓరియెంటెడ్ అట… మైత్రీ మూవీ మేకర్స్‌తో […]
ఆ పాత టీవీ సీరియల్… కమలా హారిస్ భవితను జోస్యం చెప్పిందా..?!
కమలా హారిస్… జో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నాక, తనే స్వయంగా కమలను తమ పార్టీ అభ్యర్థిగా ప్రతిపాదించాక, ఆమె రేసులోకి వచ్చింది… ఇంకా ఖరారు కాకపోయినా, ఆమెకు బలమైన మద్దతు లభిస్తోంది కాబట్టి ఆమే ట్రంపును ఎదుర్కోబోయే మహిళ కాబోతోంది… గెలిస్తే ఓ చరిత్ర… ఐతే గెలుస్తుందనీ, పగ్గాలు చేపడుతుందనీ చెబుతూ అమెరికన్లు ఓ కథను ప్రచారంలోకి తీసుకొచ్చేశారు… ఇంట్రస్టింగు… దాదాపు ఇరవై ఏళ్లకు మునుపే… ఓ యానిమేటెడ్ టీవీ సీరియల్ ఆమె ప్రెసిడెంట్ కావడాన్ని […]
ఆల్వేస్ ‘లాగిన్’..! ఐటీ మనుషులా..? రోబోలా..? వేరే జీవితమే ఉండొద్దా..!!
రోజుకు 25 గంటలు పని చేద్దామా? దాదాపు తొంభై ఏళ్ల కిందటి తెలుపు- నలుపు మూగభాషల హాలీవుడ్ సినిమా- “మాడరన్ టైమ్స్”. 1936లో విడుదలైన ఈ చిత్రానికి రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో- ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్. పారిశ్రామిక విప్లవంతో మనిషి యంత్రంలో యంత్రంగా ఎలా మారిపోయాడన్నది సినిమా కథ. యంత్రాలు చేయబోయే విధ్వంసం గురించి కూడా తమాషాగా చూపించాడు. హోటల్ కు వచ్చిన కస్టమర్లు టేబుల్ ముందు కూర్చోగానే ఒక ప్లేటును యంత్రం ముందుకు […]
మన తిన్నడి కథలోకి ఏకంగా ఘటోత్కచుడి వారసులు కూడా వచ్చేశారు..!!
అనుకుంటున్నదే… సినిమా వాళ్లకు తాము రాసిందే చరిత్ర… అసలు చరిత్ర ఇది కాదు కదా అంటే అస్సలు ఊరుకోరు, మస్తు రీసెర్చ్ చేశాం అంటారు… ఏమైనా వ్యతిరేకంగా చెప్పబోతే క్రియేటివ్ లిబర్టీ, సినిమా కోసం కొంత ఫిక్షన్ యాడ్ చేయక తప్పలేదు అంటారు… ఆది నుంచీ అంతేగా… మొన్నటి ఆర్ఆర్ఆర్ రాజమౌళి కథ వరకూ… చెప్పొచ్చేది మంచు కన్నప్ప గురించి… అందులో మంచు విష్ణు, మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయకుమార్, మోహన్‌లాల్, శరత్‌కుమార్ ఎట్సెట్రా వివిధ భాషల స్టార్స్ […]
భైరవ త్రినయని..! అదే రోజా, అదే జైబాలయ్య మంచం సీన్… దింపేశాడు…!!
అసలు ఆ సీరియల్ ఎలా చూడబుద్దయింది నీకు, ఛల్, రిమోట్ ఇవ్వు అని కసిరింది ఇంటావిడ… నిజమే కదా… ఆ చెత్తన్నర సీరియల్ లేడీస్‌కే చిరాకు పుట్టిస్తోంది, మగపురుష్ కు ఎలా నచ్చుతుంది..? నచ్చదు, కానీ టీవీ సీరియళ్లు ఎలా ఉండకూడదో చెప్పడానికి అదొక ఉదాహరణ కదా… చూడకపోతే ఎలా..? ఏదో ఒకటి రాయాలి కదా, దరిద్రమైన సీరియళ్ల పోకడ గురించి… అవునవును, అంతేలే… ఏక్‌సేఏక్ వెబ్ సీరీస్ వస్తున్న ఈ కాలంలో ఇంకా ఆ దిక్కుమాలిన […]
అందం అంటే..? గోక్కునే స్మితలు కాదు… ఇదీ అసలైన అందం..!!
కేసీయార్ ప్రసంగాలు వినీ వినీ… పాత సీఎం ఆఫీసులో కార్యదర్శిగా చేసిన స్మిత సభర్వాల్‌కు గోకుడు మీద ఇంట్రస్టు పెరిగినట్టుంది బహుశా… దివ్యాంగుల రిజర్వేషన్లతో ఎందుకు గోక్కుంటున్నట్టు..? దిక్కుమాలిన సంవాదం… పైగా తన కామెంట్స్‌ను సమర్థించుకుంటూ మళ్లీ మళ్లీ ట్వీట్లు… మళ్లీ నెటిజనం నుంచి ఛీత్కారాలు… ఏం పనిలేనట్టుంది ఆమెకు… ఎప్పటిలాగే అలవాటైన రీల్స్, ఫోటోలు పెట్టుకోక ఎందుకమ్మా ఈ గోకుడు జబ్బు..? ఒకావిడ చాలెంజ్ చేసింది, CSB IAS అకాడమీ చీఫ్ బాలలత… *ఇద్దరమూ సివిల్స్ […]
రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నాడని కాదు… ఎలా కనిపిస్తున్నాడనేదీ ముఖ్యమే…
ఓ సోషల్ పోస్టును ప్రతిపక్ష శిబిరం సోషల్ మీడియాలో పుష్ చేస్తోంది… సదరు సోషల్ పోస్టు ఏమిటీ అంటే..? ‘‘సచివాలయం దగ్గర పొట్టి శ్రీరాములు, తెలుగు తల్లి విగ్రహం… అడిగి అడిగి అలిసిపోయాను’’ అని ఫిబ్రవరిలో ‘తెలుగు తీపి’ పేరిట ఎవరో కేకేమోహన్ పేరిట పోస్టు… మళ్లీ తాజాగా ‘‘ముఖ్యమంత్రి @revanth_anumula గారూ దయచేసి సచివాలయం ఎదురుగా తెలుగు తల్లి విగ్రహాన్ని తిరిగి వెంటనే ప్రతిష్ఠించండి’ అని మరో పోస్టు… నిష్పాక్షిక న్యాయం చేయడమే కాదు, నిష్పాక్షికంగా […]
వార్నీ… తమిళనాడు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా డిబేట్లు…!!
బిడెన్ అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకుని, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ను తదుపరి అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదించడంతో ఒక్కసారి మన దేశంలోనూ, ప్రవాస భారతీయుల్లోనూ నెటిజనం చర్చ డిఫరెంట్ దారిలోకి మళ్లింది… మరీ మన తెలుగు నెటిజనం అయితే ఇది డెమొక్రాట్లు వర్సెస్ రిపబ్లికన్లు అన్నట్టు గాకుండా తమిళనాడు వర్సెస్ ఆంధ్రా అన్నట్టుగా చిత్రీకరించేస్తున్నారు… నిజానికి వీళ్లిద్దరి నడుమ పోలిక సరి కాదు… కాకపోతే ఇద్దరివీ ఇండియన్ రూట్స్ కాబట్టి మనం ఓన్ చేసుకుంటున్నాం… చర్చల్లోకి […]
డేటా ముందేసుకుని ఒక్కడే రెండు రోజుల అధ్యయనం… తరువాతే విరమణ…
నిజానికి జో బిడెన్‌కు అధ్యక్ష పోటీ నుంచి విరమించుకోవాలని లేదు… వృద్ధాప్య సమస్యలు చుట్టు ముట్టాయి, వయస్సు 81 దాటింది… మాట తడబడుతోంది, మెదడు కూడా సహకరించడం లేదు… ఐనా మరోసారి ఎన్నికవ్వాలనే ఆశ మాత్రం బలంగానే ఉంది… అందుకే పార్టీకి విరాళాలిచ్చేవాళ్లు, సీనియర్లు, ఇతర నాయకుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సరే, తను పోటీలో ఉంటాననే చెబుతూ వచ్చాడు… ట్రంపు మీద గెలవాలంటే తనకే సాధ్యం అనీ నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు… నిజానికి పార్టీ డెలిగేట్స్ నుంచి […]
- « Previous Page
- 1
- …
- 69
- 70
- 71
- 72
- 73
- …
- 458
- Next Page »