ముందుగా ఒక వార్త చదవండి… ముంబై నుంచి వచ్చింది వార్త… గోవాలోని ఓ కోర్టు ఓ అసాధారణ షరతు విధించింది బెయిల్ ఇవ్వడానికి…18 ఏళ్ల ఓ యువకుడు… ఓ హత్యాయత్నం కేసులో ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టయ్యాడు… బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు… సహజమే కదా… బెయిల్ దరఖాస్తు చేసుకుంటే అదనపు సెషన్స్ జడ్జి బెయిల్ కోసం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడానికి అంగీకరించారు… పాస్‌పోర్ట్ సమర్పించాలనేది కూడా అందులో ఒకటి… అన్నీ సరేగానీ, నాకు […]
పూజా ఖేద్కర్… ఈమె అష్టావక్ర కాదు… యూపీఎస్సీ పరీక్షలే ఓ డొల్ల యవ్వారం..!!
పూజా మనోరమ దిలీప్ ఖేద్కర్… ఐఏఎస్… ప్రస్తుతం ట్రైనీ… ఈమెను నేను మనసారా అభినందిస్తున్నాను… ఆమె తలతిక్క పోకడలకు కాదు, మన ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు ఎంపికల విధానం ఎంత డొల్ల వ్యవహారమో పూజ స్పష్టంగా లోకానికి తెలియజెబుతోంది గనుక… ఇప్పటికైనా ఓ మంచి మార్పు అవసరమని ఆమె మంచి పాఠం చెబుతోంది గనుక… 1) ఆమె తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించింది… 2) ఆమె ఆడి కారు మీద 27 వేల చలాన్లు […]
రాహుల్ ద్రవిడ్ గొప్ప సంస్కారం… సీఎం నితిశ్ వింత నమస్కారం…
ద్రవిడ్ సంస్కారం… నిన్న పత్రికల్లో రెండు మంచి వార్తలు. లోపలెక్కడో అప్రధాన వార్తలుగా వచ్చినా… విషయప్రాధాన్యం ఉన్న వార్తలు. రాహుల్ ద్రవిడ్ పెద్ద మనసు రాహుల్ ద్రవిడ్ క్రీడాకారుడిగా ఎన్ని మ్యాచులాడాడు? ఎన్ని ఓడాడు? ఎన్ని మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించాడు? ఎన్ని గెలుపుల్లో అతడి వాటా ఎంత? లాంటి చర్చల స్థాయిని ఏనాడో దాటేశాడు కాబట్టి ఇప్పుడు ఆ క్రీడా చర్చలు అనవసరం. పోతపోసిన సంస్కారంగా, మన పక్కింటి మధ్యతరగతి మనిషిగా ద్రవిడ్ ను చూసి నేర్చుకోవాల్సింది […]
శంకర్ సార్, ఇది 2024… తమరు మర్చిపోయి ఇంకా 1996లోనే ఆగిపోయారు…
భారతీయుడు-2… ఈ ప్రాజెక్టు అప్పుడెప్పుడో స్టార్ట్ చేస్తే ఎక్కడో ఆగిపోయింది… అసలే లైకా ప్రొడక్షన్స్… శంకర్, కమలహాసన్ వదిలేశారు దాన్ని… తిరిగి పట్టాల మీదకు తీసుకొచ్చి, ఎలాగోలా చుట్టేసి జనం మీదకు వదిలారు… జస్ట్, శంకర్ ఓ పనైపోతుంది అన్నట్టుగా హడావుడిగా పూర్తి చేశాడు… అరెరె, చేయలేదు, భారతీయుడు-3 కూడా ఉంటుందట… ఓరి దేవుడా..?! నిజానికి ఇది ఆ సినిమా సమీక్ష కూడా కాదు, సమీక్ష అవసరం లేదు దీనికి..! భారతీయుడు ఫస్ట్ పార్ట్ వచ్చి 28 ఏళ్లు… […]
అప్పట్లో ఈ చంద్రముఖి… సౌందర్య, జ్యోతిక, శోభనల్ని మించి ఎన్నోరెట్లు..!
వాణిశ్రీ జైత్రయాత్రలో మరో మైలురాయి 1974 లో వచ్చిన ఈ కృష్ణవేణి సినిమా . వాణిశ్రీ నట విరాట రూపాన్ని చూపిన మరో సినిమా ఇది . ఈ సినిమాలో ఆమె పాత్ర మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న పాత్ర . ఏవోవో హెల్యూసినేషన్స్ ఆమెను వెంటాడుతూ ఉంటాయి . చంద్రముఖిలో జ్యోతిక పాత్ర వంటిది . జ్యోతికే చాలా బాగా చేసింది . జ్యోతిక కన్నా వాణిశ్రీ ఈ సినిమాలో ఇంకా గొప్పగా నటించింది . […]
నిజమేనా బాబు గారూ… తెలంగాణ జనం యాక్సెప్ట్ చేస్తుందా..?!
పూర్తిగా కొట్టిపారేయలేం… రాజకీయ పరిణామాల ఊహాగానాల కథనాలు ఏదో ఒక్క పాయింట్ మీద ఆధారపడి సాగుతుంటయ్… నిన్నోమొన్నో చంద్రబాబే అన్నాడు కదా,.. టీటీడీపీ బలోపేతం కోసం నేను వారానికోరోజు వస్తా, లోకేష్ మరోరోజు, అవసరమైతే బ్రాహ్మణి, భువనేశ్వరి, అండగా బాలయ్య అని… గతంలో కూడా బ్రాహ్మణికి టీటీడీపీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్లు వచ్చినట్టు గుర్తు… సరే, అప్పట్లో అచ్చెన్నాయుడిని ఆంధ్రాకు అధ్యక్షుడిని చేసినట్టు… (చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు, లోకేష్ జాతీయ కార్యదర్శి కదా) ఎవరైనా తెలంగాణ నాయకుడిని […]
అయ్యారే… కాలమెంత కఠినము, ఎంతటి దురవస్థ ప్రాప్తించెనో కదా…
కాలమహిమ… టైమ్, డెస్టినీ, గ్రహచారం ఏమైనా పిలవండి… కేసీయార్ పార్టీ ఉత్థానపతనాలూ ఉదాహరణే… ఇక పార్టీని నడపలేను, వైఎస్ ఈ పార్టీని ఇక బతకనివ్వడు అని బాధపడుతూ, మహాకూటమి పరాజయంతో ఇల్లు కదలని కేసీయార్‌కు వైఎస్ మరణంతో దశ తిరిగింది… జగన్మోహన్రెడ్డిని నిలువరించడానికి కాంగ్రెస్ పరోక్ష సహకారం, వ్యూహంతో తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ లేపితే… కేసీయార్ మళ్లీ హీరో అయ్యాడు… కానీ సమైక్యాంధ్ర లాబీయింగుతో తెలంగాణ ఆగిపోయి, ఇక కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కేసీయార్ అన్నిరకాలుగా రెడీ […]
సామాన్యుల బతుకుచిత్రాలు… ఆ చేతివేళ్లతో అలా అసామాన్య చిత్రీకరణ…
సామాన్య సౌందర్యశాస్త్రం… మొక్కజొన్న కంకులు అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి జీవితంలో చెప్పుకోదగ్గ సందర్భం, కళ్ళలో మైమరపు ఉంటుందని ఊహించగలమా ? వేడి వేడి టీ అమ్మే మహిళ ముఖం చల్లటి నవ్వులు చిందిస్తుందా? ఏ రోజు కారోజు సైకిల్ రిపేర్లు చేసుకుంటూ జీవితం గడిపే బడుగు వ్యక్తి ముఖంలో అనితర మందహాసం ఎలా సాధ్యం? వీళ్ళే కాదు… కూరగాయలు అమ్ముకునే వ్యక్తి, చిందరవందరగా ఈగల మధ్య చేపలమ్ముకునే వ్యాపారి, చెరుకురసం అమ్ముకునే అతను… వీళ్ళందరూ మనందరికీ చిరపరిచితులే. […]
ఆయన సినిమాల టాక్స్ ఆఫీసరు… ఆయన రిక్షా వెంబడి మా పరుగులు…
చిన్నప్పటి నుండి సినిమాలంటే మహా పిచ్చిగా ఉండేది. సినిమా అంటే, మా నాన్న తన్నే వాడు. ఇప్పటిలాగా అప్పట్లో అడ్వాన్స్ బుకింగులు ఉండేవి కావు. ఏ సినిమాకైనా బుకింగ్ కౌంటరు ముందు యుద్ధం చేయాల్సిందే, చొక్కాలు చింపుకోవాల్సిందే, చొక్కా చింపుకున్నందుకు ఇంట్లో తన్నులు తినాల్సిందే. సాధారణంగా నెలకు ఒక ఇరవై రోజులైనా అమ్మతోనో, నాన్నతోనో తన్నులు తప్పేవి కాదు. మా చెల్లెలు క్లాస్ మేట్ సుజాత అని ఒకామె ఉండేది. వాళ్ళన్నయ్య బాబురావు అని వరంగల్ సేల్స్ […]
చంద్రబాబుకే లేని ప్రేమాభిమానాలు రేవంత్‌రెడ్డికి దేనికో..!!
ఇదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో వచ్చిన చిక్కు… భారతీయుడు-2 సినిమాకు ఆంధ్రలోనే అదనపు ఆటలు, అదనపు రేట్లకు పర్మిషన్ దొరకలేదట… సినిమా కుటుంబానికి చెందిన సీఎం, డిప్యూటీ సీఎం ఉన్న ఆ రాష్ట్రమే ఆ దరఖాస్తును తిరస్కరిస్తే… మరి తెలంగాణ ప్రభుత్వం ఆ తమిళ సినిమాకు (తమిళ సినిమాయే, తెలుగులోకి కేవలం డబ్డ్ వెర్షన్ మాత్రమే వస్తోంది…) ఎందుకు అడ్డగోలు రేట్ల పెంపుదలకు పర్మిషన్ ఇచ్చినట్టు… ఎందుకు అదనపు షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు..? అసలు […]
అచ్చ తెలంగాణ పదాలతో అల్లిక… ఓ పల్లె ప్రేమికుడి నయా ప్రేమమాలిక…
పైలం పిలగా అని ఓ కొత్త సినిమా… ఏదైనా ఓటీటీలో వస్తుందేమో… మంచి బయర్ దొరికితే థియేటర్లలోకి కూడా రావచ్చునేమో… ఒక పాట రిలీజ్ చేశారు… ఓ మిత్రుడు షేర్ చేశాడు… ప్రజెంట్ ట్రెండ్ తెలంగాణ స్లాంగ్ కదా, ఇదీ అదే అన్నాడు… అలా వినబడ్డాను… కాజువల్‌గా వింటుంటే… తరువాత కనెక్టయింది… కారణం… అచ్చ తెలంగాణ పదాలు ప్లస్ ఉర్దూ పదాలు కొన్ని సరైన చోట్ల పడ్డయ్… అఫ్కోర్స్, ఓ తెలంగాణ ప్రాంత ప్రేమికుడి ఎక్స్ప్రెషన్ అది… […]
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ… ఒంటరి హనీమూన్..!!
నాతో నాకే పెళ్లి… నాతో నేనే హనీమూన్ కు… “జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని మింటికి కంటిని నేనై జంటను […]
నీతిబోధ సరే… మరి ఈ అక్రమం మాటేమిటి జీరో టాలరెన్స్ భారతీయుడా..?!
ఒక విమర్శ కనిపించింది ఆన్లైన్లో… తెలుగువాళ్లు భారతీయుడు-2 సినిమా చూడాలంటే 350 చెల్లించాలి ఒక్కొక్కరికి… సరే, పాప్ కార్న్, సమోసా, సాఫ్ట్ డ్రింక్స్, పార్కింగు మన్నూమశానం సరేసరి… తమిళనాడులో (తమిళ సినిమా) చూడాలంటే 190 చెల్లిస్తే సరి… అఫ్కోర్స్, ఇతర దోపిడీలు అక్కడా ఉంటాయి… నిజమే కదా… అసలు టికెట్ల రేట్లు పెంపునకు ఎందుకు ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలి..? ఇదీ అసలు ప్రశ్న… పేరుకు భారతీయుడు సినిమా అవినీతి పట్ల జీరో టాలరెన్స్ అట… మరి ఈ […]
పంకీ… రిచ్చెస్ట్ అంబానీ ఇష్టపడే ఓ వెరయిటీ అరటి అట్లు..!!
అంబానీ ఇల్లే వేల కోట్లు… ఆస్తి లక్షల కోట్లు… కొడుకు ప్రీవెడ్డింగ్ ఖర్చు వందల కోట్లు… పెళ్లికయ్యే ఖర్చు లెక్కలేనన్ని కోట్లు… అన్నీ కోట్ల ముచ్చట్లే… అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి 2500 వంటకాలు అట… ఇన్ని వంటకాలు అనే వార్తే ఆశ్చర్యాన్ని, నవ్వును కలిగించింది… జస్ట్, తన సంపద ప్రదర్శనే తప్ప… అందులో పెళ్లి గెస్టులు ఎన్ని తింటారు..? తినడం మాట అటుంచితే ఎన్ని టేస్ట్ చేయగలరు..? ప్రత్యేకించి తనింట పెళ్లికి వచ్చే అతిథులందరూ […]
ఓహ్… శ్రీమాన్ మోహన్‌బాబు గారి మొదటి సినిమా పేరు అదేనా..?!
హిందీ ఆరాధన చూడనివారికి బాగా నచ్చే సినిమా 1974 సంక్రాంతికి రిలీజయిన ఈ కన్నవారి కలలు సినిమా . ఆరాధన సినిమా ఓ మాస్టర్ పీస్ . కుర్రకారుని ఓ ఊపు ఊపింది . శక్తి సామంత ఎంత గొప్పగా తీసారంటే , రాజేష్ ఖన్నాని ఆకాశంలో కూర్చోబెట్టారు .కలెక్షన్ల సునామీని సృష్టించింది . మా నరసరావుపేట సత్యనారాయణ టాకీసులో వారం రోజులు ఆడితే నేను ఆరు రోజులు చూసా . అప్పట్లో హిందీ సినిమాలు మా […]
ప్రణీత్ యవ్వారంతో ‘మా’లో కదలిక… సీరియస్ హెచ్చరిక జారీ…
మొత్తానికి యూట్యూబ్ అష్టావక్రుడు ప్రణీత్ హన్మంతు వెకిలి కామెడీ కంటెంట్ చాలామందిలో చలనం తెప్పిస్తోంది… గుడ్, మంచిదే… తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు వీడియో ఒకటి కనిపించింది… అందులో తను చాలా సీరియస్ హెచ్చరిక జారీ చేశాడు ఆ అసోసియేషన్ తరఫున… మామూలుగా తను ఏం మాట్లాడతాడో తనకే తెలియదు కొన్నిసార్లు, తన మాటల్ని కూడా సోషల్ మీడియా వెటకారం చేస్తుంటుంది… కానీ ఈ వీడియో మాత్రం హుందాగా, మా వంటి ఆర్టిస్టుల […]
అసలు ఎవరు ఈ ప్రణీత్ హన్మంతు..? పవర్ఫుల్ కుటుంబ నేపథ్యం..!!
డార్క్ కామెడీ పేరుతో పసిపిల్ల మీద నీచాతినీచమైన కామెంట్లు చేసిన ప్రణీత్ హనుమంతు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి కొడుకు. పేర్లు అవసరం లేదు. కులం పేరు కూడా అవసరం లేదు. తల్లి తండ్రి బాగా చదువుకున్న కుటుంబం అని ఆయన తండ్రి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా చెప్పుకున్నాడు. Powerfull ex DGP మనమడు అట… డార్క్ కంటెంటు పేరుతో దేశ గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన వాడు ప్రణీత్ . తన ఇద్దరు కొడుకులూ హై స్పిరిటెడ్ […]
ఈ సోషల్ వికృతులు… ప్రణీత్ హనుమంతులు ఎక్కడ పుడతారు..?
ప్రణీత్ హనుమంతు అంశం కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో మనం చేసే ప్రతి కామెంట్ చాలా విలువైనదిగా మారుతుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి. అతని టాపిక్ కంటే ముందు స్త్రీ పురుష సంబంధాల గురించి ఒక కీలక విషయం చెప్పాలి. ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ మరో పురుషుడు/పురుషుల పట్ల, అలాగే ప్రతి పురుషుడు మరో స్త్రీ/స్త్రీల పట్ల లైంగిక ఆకర్షణకు లోనవుతారని నేను నమ్ముతాను. అది వివాహ వ్యవస్థ బయట కూడా జరగొచ్చు. […]
హరీషుడూ… ఎవరా ముసలినక్క… ఏమిటీ ముసుగులో గుద్దులాట..?!
ఒకాయన… టాలీవుడ్ దర్శకుడు… ఏదో ఓ హిట్ తన ఖాతాలో పడే ఉంటుంది… పేరు హరీష్ శంకర్… బహుశా ధర్మపురి బ్రాహ్మణ అగ్రహారంలో పుట్టుక అనుకుంటాను… మిరపకాయ్, గబ్బర్ సింగ్ , దువ్వాడ జగన్నాథం ఎట్సెట్రా పేర్లు తన ఖాతాలో వికీపీడియాలో కనిపిస్తున్నయ్… గుడ్, ఓ తెలంగాణ దర్శకుడు… వంగా సందీప్‌రెడ్డి, సంకల్ప్‌రెడ్డి తదితరుల జాబితాలో తనూ చేరాడు, గుడ్… అసలే ఆంధ్రా డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అది… వేరే ప్రాంతీయులు ఎదిగితే అడుగంటా తొక్కేసే బ్యాచుల […]
కేటీయార్ నీ బాంచెన్… నువ్వు జర్నలిస్టుల గురించి మాట్లాడకే జెర..!!
ఏమో… విశాఖపట్నం డెక్కన్ క్రానికల్ ఆఫీసు బోర్డును తగులబెట్టి, నిరసన ప్రకటించిన తెలుగుదేశం కేడర్ అనే వార్త ఆశ్చర్యాన్ని కలిగించింది… ఇదేకాదు, ఓయూలో, బల్కంపేట గుడి దగ్గర జర్నలిస్టుల మీద తెలంగాణ పోలీసుల దాష్టికం కూడా సేమ్ ఆశ్చర్యం… ప్రభుత్వాలు మారితే… పోలీసులకు ఇక హఠాత్తుగా అపరిమిత అధికారాలు వస్తుంటాయి… బహుశా అధికారంలో ఉన్నవాళ్లను పరీక్షించడం కోసం చేస్తారేమో అలా…. లేకపోతే వాళ్ల తత్వమే అది కాబట్టి ప్రదర్శిస్తారేమో… విశాఖపట్నం స్టీల్ ప్లాంటు విషయంలో టీడీపీ కూటమి […]
- « Previous Page
- 1
- …
- 75
- 76
- 77
- 78
- 79
- …
- 458
- Next Page »