ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ ఐయామ్ ఎ డిస్కో డ్యాన్సర్ జిందగీ మేరా గాన ఈ పాట రాగానే ధియేటర్లో పూనకాలు లోడింగ్ ఆ పూనకాలు తెచ్చుకున్నవాడిలో నేనూ ఒకడ్ని డిస్కో డ్యాన్సర్ విజయవాడ శాంతి ధియేటర్లో వచ్చింది మామూలుగా మనకూ హిందీకి ఆమడ దూరం అప్పట్లో హిందీ ట్రై చేద్దామని సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీసుకుని అదృష్టవశాత్తూ స్టాంపు మార్కులతో బయటపడ్డా హిందీకి పాస్ మార్కులు ఇరవై మాత్రమే అవడం నా అదృష్టం కాక ఇంకేవిటి? […]
మొట్టికాయలు కాదు… నోటికి ఏదొస్తే అది మాట్లాడవద్దనే ఓ రకమైన ‘అభిశంసన’…
గెలుపు హ్యాంగోవర్లో ఉన్నాడేమో… ఇక నేనేది చెప్పినా చల్తా అనే భ్రమలకు గురయ్యాడేమో… ఇంకా జగన్‌ను జనబాహుళ్యానికి దేవుడి పేరుతో దూరం చేయాలనే వ్యూహంతోనేమో… నిజంగా పార్టీ మీటింగులో ఆ క్షణాన హఠాత్తుగా బుర్ర మ్యూట్‌లోకి వెళ్లిపోయిందేమో… కారణాలు ఏమైనా గానీ… చంద్రబాబుకు మొట్టికాయలు సుప్రీంకోర్టులో..! కనీసం దేవుడిని మీ రాజకీయాలకు దూరంగా ఉంచండి, కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీయకండి, ఒక సీఎం హోదాలో ఉండి ఏమీ ఆధారరహిత వ్యాఖ్యలు..? అసలు కొవ్వుల నెయ్యి వాడనే లేదని […]
కొన్ని కథలు మలయాళ, బెంగాలీ ప్రేక్షకులకు మాత్రమే… మనకు ఎక్కవు..!!
ఇరవయ్యో శతాబ్దం మొదటి రోజుల్లో దేశంలో సంచలనం కలిగించిన భవాల్ రాజా కేసు ఆధారంగా వచ్చిన సన్యాసి రాజా అనే బెంగాలీ సినిమాకు రీమేక్ 1977 లో వచ్చిన మన రాజా రమేష్ సినిమా . బెంగాలీలో ఉత్తమ కుమార్ , సుప్రియాదేవి నటించారు . బెంగాలీలో సూపర్ హిట్ మూవీ . 126 రోజులు ఆడింది . మన తెలుగు సినిమాలో అక్కినేని , వాణిశ్రీ , జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించారు . అయితే […]
చీర చిరిగిపోద్ది…! ఒరేయ్, యాణ్నుంచి వచ్చార్రా మీరంతా..? వెగటు సంగీతం..!!
థంబ్ నెయిల్స్ మాయలో పడి చెప్పడం లేదు… నిజంగానే షాక్ తిన్నట్టయింది… బాహుబలి వంటి హైబడ్జెట్ చిత్రాల్లో కూడా పాడుతున్న కీరవాణి శిష్యరత్నం, కాస్త పద్దతిగా కనిపించే రమ్య బెహరా నోటి వెంట ఆ డైలాగ్ వినడం నిజంగా షాకే… అదీ ఓ మ్యూజిక్ కంపిటీషన్ రియాలిటీ షోలో… జీతెలుగులో ఆల్రెడీ సీరియళ్లను భ్రష్టుపట్టించారు తెలిసిందే కదా… మాటీవీకి పోటీ ఇవ్వలేక ఎదురీదుతోంది… ఆ ఈటీవీ దరిద్రపు ప్లానింగ్ పుణ్యమాని వేరే దిక్కులేక జనం మాటీవీతో పాటు […]
…. అందుకే ఆమె మరణానికి సంతాపంగా మన క్రికెటర్ల సంతాప ప్రకటన..!
తిరుగులేని శక్తిగా ఎదిగిన కరేబియన్లను మట్టి కరిపించి.. 1983లో ప్రపంచ కప్ గెల్చిన భారత జట్టును కనీసం సన్మానించుకునే పరిస్థితిలో కూడా నాటి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ లేదంటే నమ్మగలరా..? నమ్మితీరాలి. ఇవాళంటే బీసీసీఐ ఐసీసీనే శాసించే స్థాయికి రావొచ్చుగాక! కానీ, నాడు బీసీసీఐ పరిస్థితి దయనీయమే. అలాంటి సమయంలో బీసీసీఐకి ఓ ప్రఖ్యాత గాయకురాలి అవసరం పడింది. ఆమె సాయమే గండం గట్టెక్కేందుకు ఊతమైన కథ మీకు తెలుసా..? ఎవరా గాయకురాలు… ఏంటా కథ..? […]
మరణించీ… మళ్లీ పచ్చగా చిగురించిన నా పాత టీవీ… ఇప్పటికీ అదే ఠీవి..!!
మరణానంతరం కూడా సేవలందిస్తోంది నా శ్యాంసంగ్ కంపెనీ టీవీ .. బతికున్నంతకాలం మాకు ఎన్నో వార్తల్ని, సినిమాలను, పాటలని, సీరియల్స్ ని చూపించి ఒక దశాబ్దం పాటు మాకు సేవలందించిన మా శ్యాంసంగ్ టీవీ జీవిత కాలం ముగిసిపోయాక కూడా ..తన శరీరం మీద మొక్కల్ని పెంచి కూరగాయల్ని ఆకుకూరల్ని అందిస్తోంది .. ఏమిచ్చి నా శ్యాంసంగ్ టీవీ రుణం తీర్చుకోగలను .. చావు తర్వాత కూడా కూరగాయల్ని పండించి మాకు సేవ చేస్తున్న ఈ టీవీ […]
అయ్యా, టీజీ సేటు గారూ… దయచేసి మీ శుష్క ప్రవచనాలు మానేస్తారా..?
కొందరు నాయకులు భలే తమాషాగా మాట్లాడతారు… జనం నవ్వుకుంటారనే సోయి కూడా లేకుండా మాట్లాడతారు… చాలామంది నాయకులు అంతే… టీజీ వెంకటేష్ కూడా అంతే… తనకు రాజకీయం కూడా వ్యాపారమే… తన వృత్తి కూడా వ్యాపారమే… రాజకీయం అంటే తనకు అంగట్లో దొరికే ఓ సరుకు మాత్రమే… అందుకే తను బీజేపీలోకి జంపయ్యాడు… కొడుకేమో టీడీపీ… పైగా ఇప్పుడు శ్రీమాన్ చంద్రబాబు గారి కేబినెట్లో అమాత్యవర్యుడు… బాబు దయామయుడు, మీ తత్వానికి తగిన ఇండస్ట్రీస్ పోర్టుఫోలియో ఇచ్చాడు… […]
మనకు ఉగ్రవాదంతో కాదు… వాటికి ఊతంగా నిలిచే పార్టీలతోనే అసలు డేంజర్…
ఓ స్టోరీ చదవండి… ఇజ్రాయిల్ ఏ రేంజులో తన శతృవుల మీదకు పంజాలు విసురుతుందో అర్థమవుతుంది… మిత్రుడు పొట్లూరి పార్థసారథి కథనం … చిక్కుముడి వీడింది! ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ May 19,2024 న అజర్ బైజాన్ సరిహద్దులో హెలికాప్టర్ కూలిపోవడం వలన చనిపోవడం తెలిసిందే! అయితే హెలికాప్టర్ ప్రమాదం మీద ఇప్పటి దాకా మిస్టరీగా ఉండేది! కానీ ఇబ్రహీం రైసీ కూడా పేజర్ వాడేవాడు! ఆరోజు హెలికాప్టర్ ప్రమాదం జరిగిన రోజు కూడా […]
అందమైన ఆ సీత పక్కన… ఆ రాముడు నప్పలేదు… వెరసి అప్పట్లోనే ‘ఆదిపురుష్’…
మరో సీతా కల్యాణం . సీతా కల్యాణానికి కొనసాగింపే ఈ సీతారామ వనవాసం . బాపు గారి సినిమాకు పేరు , అవార్డులన్నా వచ్చాయి . కమలాకర కామేశ్వరరావు గారి ఈ సినిమాకు పేరు ఏమయినా వచ్చిందేమో కాని , డబ్బులు, అవార్డులు మాత్రం రాలేదు . సినిమా అంత నాసిదేమీ కాదు . అయినా నిర్మాత పింజల సుబ్బారావుకు ధన ప్రాప్తి ఉన్నట్లుగా లేదు . రెండు సినిమాలలోనూ శ్రీరాముడిగా రవి నటించారు . సీతా […]
‘హైడ్రా’లజీ..! ఆ నిర్వాసిత రైతుల గగ్గోలు ఏనాడైనా మీడియాలో కనిపించిందా..?
అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతుల ఉద్యమం ఏళ్ళ తరబడి మీడియాలో నడిచింది. కానీ భూములిచ్చేది లేదని మొరాయించి ప్రభుత్వంతో యుద్ధం చేసిన రైతుల గురించి అసలు తెలుసా? హైడ్రా కూల్చేసిన ఒకటి రెండు నిర్మాణాల దగ్గర గగ్గోలు రోజూ కనిపిస్తోంది. ఇదే తెలంగాణాలో మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి రిజర్వాయిర్లను వ్యతిరేకించిన వేలాది నిర్వాసితుల యుధ్దం ఏ మీడియాలో అయినా కనిపించిందా? మీడియా మేనేజ్మెంట్ అనేది కేవలం ప్రధాన స్రవంతికే కాదు సోకాల్డ్ సోషల్ […]
నిజమే… ఎవరో హిందీ సినీరచయిత చెప్పినట్టు… రేఖ అంటేనే ఓ విభ్రమ..!!
మామూలుగా మన చుట్టూ మహిళలకు 70 ఏళ్లు వచ్చాయంటే… బామ్మలు, మామ్మలు… కాళ్ల నొప్పులు… ఆయాసం, అనారోగ్యం, మొహంపై ముడతలు… వయస్సయిపోయి ఇహలోకం నుంచి ఇక ఎప్పుడు విముక్తి అన్నట్టుగా మాటలు, చూపులు, అడుగులు… నిస్తేజం అలుముకుని, నిర్వేదంగా సాగే నిర్లిప్త జీవనాలు కనిపిస్తుంటాయి కదా… కానీ ఆమె… 69 ఏళ్ల వయస్సు… అమృతం తాగిందో ఏమో… వయస్సు ఎక్కడో ఆగిపోయింది… ఈ వయస్సులోనూ అనార్కలి డ్రెస్ వేసుకుని, అబూదాబిలో జరిగిన సినిమా అవార్డుల ఐఫా వేదిక […]
సోనియా వెళ్లిపోయింది… హుందాగా… జస్ట్, నాగ్ మొహాన ఓ నమస్కారం పడేసి…
ఆమె బిగ్‌బాస్ షోకు రావడమే తప్పు… మనం రెండు వారాల ముందే చెప్పుకున్నాం… అన్నట్టుగానే అక్కడ ఉండలేకపోయింది… ఆమె ఆ షో కల్చర్‌కు సూట్ కాదు… అందుకే ఎలిమినేట్ అయిపోయింది… ఆమెకు ఆ షోలో ఏ స్ట్రాటజీతో ఆడాలో కూడా తెలియదు… ఆమె సోషల్ మీడియా టీం కూడా హుందాగా ఓ పద్ధతిలో వోట్లు అడిగిందే తప్ప ఎక్కడా గీత దాటలేదు… మెచ్యూర్డ్… కరాటే తెలుసు, కలరి తెలుసు, లా గ్రాడ్యుయేట్, ఎన్జీవోతో ప్రొ కన్సర్న్ యాక్టివిటీ… […]
హెజబొల్లా చీఫ్ ఇలా ఖతమయ్యాడు… బాంబుల దెబ్బకు భూకంపం వచ్చింది…
. ఇజ్రాయేల్ Vs హెఙబొల్లా part 4 హెజ్బొల్లా చీఫ్ హాసన్ నజారల్లా ( Hassan Nasrallah ) బాంబు దాడిలో చనిపోయాడు! ‘‘దక్షిణ లెబనాన్ లోని దహియే (Dahiyeh ) సబ్ అర్బన్ ప్రాంతంలో ఉన్న హెజ్బొల్లా ప్రధాన కేంద్రం మీద ఇజ్రాయేల్ జరిపిన వైమానిక దాడిలో నజారల్లాహ్ చనిపోయినట్లు ఇజ్రాయేల్ చీఫ్ అఫ్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపాడు! లెబనాన్ రాజధాని బీరూట్ మధ్యలో ఉన్న హెజ్బొల్లా హెడ్ క్వార్టర్ మీద దాడి చేయాలని […]
లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణ సాధ్యమే… కానీ ఎన్ని బతుకులు పణంగా..!!
. మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్… మూసీ నదిని పూర్తిగా ప్రక్షాళన చేసి.. దాని పునరుద్దరణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. నార్సింగి ప్రాంతంలో హైదరాబాద్‌లోకి ప్రవేశించిన మూసీ.. గౌరెల్లి బ్రిడ్జీ దగ్గర సిటీని దాటేస్తుంది. ఈ మధ్యలో ఉన్న దాదాపు 55 కిలోమీటర్లు మేర మూసీని ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం కూడా మూసీని శుద్ధి చేస్తామని.. నది మీద పలు చోట్ల […]
కాలం విలువైందంటే ఏమో అనుకున్నాం… మరీ ఇన్ని వందల కోట్ల విలువైందా!
. సంపన్నుల స్వర్గం నిరుపేదల నరకం ఏడు కోట్ల వాచి పన్నెండు కోట్ల కారు నీరింకిన నేలలు, తడారిన గొంతులు కరువుదీరా పాడుకోవడానికి విద్వాన్ విశ్వం 1957లో రాసిన కావ్యం- పెన్నేటి పాట. కోటి గుండెల కంజరి కొట్టుకుంటూ పెన్న ఇరుగట్ల జనం వినిపించే విషాద గానమిది. యాభై ఏళ్ల వరుస కరువులకు వందల ఎకరాల సంపన్న భూస్వామి నారపరెడ్డి కొడుకు రంగారెడ్డి…రంగడు అయి చివరికి రామిగాడు అయి…పశువుల కొట్టంలో కూలీ చేసుకుని బతికే దయనీయమైన కథ […]
నెత్తుటి వారసత్వమే… అదీ మగ పెత్తనమే… అన్ని పార్టీలదీ అదే తోవ..!!
ఒక దేవెగౌడ, ఒక రేవణ్ణ, ఒక ప్రజ్వల్… ఒక కరుణానిధి, ఒక స్టాలిన్, ఒక ఉదయనిధి… ఒక బాల్ ఠాక్రే, ఒక ఉద్దవ్ ఠాక్రే, ఒక ఆదిత్య ఠాక్రే… జస్ట్, ఉదాహరణలు… భారతదేశంలో ఫుల్ రైట్, ఫుల్ లెఫ్ట్ పార్టీలు మినహా ఇక అన్ని జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలూ కుటుంబ ఆస్తులే… నాలుగో తరంలో ప్రజ్వల్ కొడుకు రెడీ కావల్సిందే… వేరే వాడు రాడు, రానివ్వరు… మన దేశ పార్టీల జన్యులక్షణం అస్సలు అంగీకరించదు… వాళ్లే… […]
ఏడాది కూడా నిండలేదు… రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అప్పుడే జనాగ్రహం…
అన్నీ నిజాలే… ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చిన కొత్త పలుకులోని అంశాలు, అభిప్రాయాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉన్నవే… ఏడాది గాక మునుపే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది జనంలో… సహజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెరిగే వ్యతిరేకతతో ‘ఆ కేసీయారే నయం’ అనే తరహాలో బీఆర్ఎస్ పుంజుకుంటోంది… బీజేపీకి సరైన సారథి లేడు… కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెరుగుతున్న వ్యతిరేకతను కూడా అది అందిపుచ్చుకోలేకపోతోంది… అదే పాత నాయకత్వం… ఊదు కాలదు, పీరు లేవదు… బీఆర్ఎస్కు […]
శ్రీనివాస్… ఆ పేరులోనే ఏదో జోష్… స్పిరిట్యుయల్ ఎమోషన్… ఓ లుక్కేయండి…
ఆ దేవదేవుడికి వేయి నామాలు. అందుకే విష్ణువును… విశ్వం, విష్ణు, వశాట్కర, భూతకృద్, ప్రభు, ప్రభవా, శ్రీమాన్, కేశవ, ఆదిత్య, పుష్కరాక్ష, హృషీకేశ, పద్మనాభ, కృష్ణ, అమరప్రభు, వెంకటేశ్వర, వెంకటరమణ, శ్రీనివాస… మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి మరికొన్ని, విన్నవి కొన్ని, విననివి మరికొన్ని నామాలతో ఎవరికి తోచినట్టుగా వారు కొలుస్తూనే ఉంటారు. సహస్రాధిక నామధేయుడు మరి… అయితే, ఈ పేర్లలో ప్రధానంగా మనకు కృష్ణ, విష్ణు, వెంకటరమణ, గోవింద, వెంకటేశ్ వంటివాటితో పాటు… ఎక్కువలో ఎక్కువగా […]
అయోధ్య ప్రాణప్రతిష్ఠపై రాహుల్ అపహాస్యం… నాచ్ గానా ఈవెంట్ అట..!!
రాహుల్ గాంధీ అంతే… విదేశాలకు వెళ్లి భారత దేశాన్ని పలుచన చేసే వ్యాఖ్యలు చేస్తాడు… హిందూ మతం మీదా విషమే… ప్రత్యేకించి అయోధ్య మీద ఎప్పుడూ కాంగ్రెస్‌కు విద్వేషమే… వ్యతిరేకతే… ఎన్నికలొస్తే మాత్రం ఓ జంధ్యం ప్రదర్శిస్తూ, నేను బ్రాహ్మడిని, హిందువును అంటూ గుళ్లు తిరుగుతూ హిందూ వోట్ల కోసం నాటకాలు… ఇప్పుడు అయోధ్య మీద మళ్లీ విషం… వెటకారం… అపహాస్యం… తిరుమల లడ్డూ వివాదం ఇంకా ఒకవైపు పెరుగుతూనే ఉంది… జగన్ ఇష్టారాజ్యం వ్యాఖ్యలు చేస్తూనే […]
డయాబెటిక్ రైస్… మన తెలంగాణ సోనాయే ఉండగా ఈ ఫిలిప్పీన్స్ డప్పు దేనికి..?!
నమస్తే తెలంగానలో ఓ స్టోరీ కనిపించింది… అయిదు కాలాల వార్త అంటే… చాలా ప్రయారిటీ ఇచ్చినట్టే… అదీ ఓ పార్టీ కరపత్రంలో..! ఈమధ్య కొన్ని జాతీయ, అంతర్జాతీయ స్టోరీలు కనిపిస్తున్నాయి… సొల్లు సోది రాజకీయ వార్తల నడుమ బెటర్ రిలీఫ్… అయితే..? ఈ స్టోరీ సారాంశం ఏమిటంటే..? ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇర్రి) శాస్త్రవేత్తలు మధుమేహానికి చెక్ పెట్టే వరి వంగడం కనిపెట్టారట… వాటిని త్వరలో భారత్‌కు కూడా తీసుకొచ్చి, ఇక్కడ విస్తారంగా పండించేందుకు […]
- « Previous Page
- 1
- …
- 85
- 86
- 87
- 88
- 89
- …
- 494
- Next Page »