Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

వంగు, పండు, పువ్వు, పాఁయ్ పాఁయ్… ధారాళంగా సినిమా బూతు…

November 4, 2024 by M S R

ntr

NTR- రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన మరో సూపర్ డూపర్ హిట్ ఈ డ్రైవర్ రాముడు . రామకృష్ణ సినీ స్టూడియోస్ బేనరుపై 2-2-1979 న 35 సెంటర్లలో రిలీజ్ అయితే 14 సెంటర్లలో వంద రోజులు , 2 సెంటర్లలో సిల్వర్ జూబిలీ ఆడింది . ఈరోజుకీ కలెక్షన్ల సునామీయే . జుట్టున్న అమ్మ ఏ కొప్పయినా పెట్టుకుంటుంది . కధ ఉంటే మిగిలిన హంగులన్నీ ఏర్పడతాయి . ఏర్పాటు చేసిన వాటికి ఫలం ఉంటుంది . […]

వినదగునెవ్వరు జెప్పిన… వినకపోతే కొన్నిసార్లు ఇలా వెల్లకిలా…

November 4, 2024 by M S R

nike

. నో చెప్పడం ఈజీనే.. కానీ ఆ తర్వాత ? నో చెప్పడం చాలా కష్టమని అంటుంటారు. అది నిజమే. కానీ బడా వ్యాపార సంస్థలు చాలా ఈజీగా నో చెప్పేస్తుంటాయి. తమ వ్యాపార సామ్రాజ్యం ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. తామే కింగులమనే పొగరుతో.. వచ్చే ప్రతీ ప్రపోజల్‌ను.. కింద స్థాయి ఉద్యోగులు ఇచ్చే సలహాలను పక్కకు పెట్టి ఈజీగా నో చెప్తుంటాయి. ఇలా నో చెప్పి కంపెనీనే మూసేసుకున్న కొడాక్ సంస్థ గురించి చాలా సార్లు […]

ఎవరెంత ఏడుస్తున్నా సరే… ఆ కన్నడ బ్యాచ్‌కే ప్రేక్షకుల సపోర్ట్…

November 3, 2024 by M S R

bb8

ఈరోజు వీకెండ్ షో పెద్ద ఆసక్తికరంగా లేదు… అలాగని మరీ తీసికట్టు కూడా కాదు… ఈసారి సీజనే నిస్సారంగా ఉంది… ఈ ఒక్క వీకెండ్ షోను అనడానికి ఏముంది..? అనుకున్నట్టుగానే నయని పవని వెళ్లిపోయింది… ఏడుపుకు ఐకన్… క్రయింగ్ స్టార్… కానీ విచిత్రం ఏమంటే నవ్వుతూ వెళ్లిపోయింది… ఎవరినీ బాధపడవద్దనీ కోరింది… గత సీజన్‌లో ఒక వారమే ఉన్నా, ఈసారి ఎక్కువే ఉన్నా అనుకుంటూ హేపీగా నిష్క్రమించింది… నిజానికి ఆమెకు బిగ్‌బాస్ ఆట మీద ఓ స్ట్రాటజీ […]

నీరజ్ సక్సేనా నిర్ణయం విని నిర్ఘాంతపోయిన అమితాబ్ బచ్చన్..!!

November 3, 2024 by M S R

neeraj

సీనియర్ పాత్రికేయ మిత్రుడు షేర్ చేసిన ఓ పోస్టు చదివాక… ఆశ్చర్యమేసింది… కాదు, మొదట అనుమానమేసింది… ఎందుకు అంటే..? ఇంత మంచి వార్త తెలుగు మీడియా ఎందుకు ఆనలేదు, అంటే, ఎందుకు కనిపించలేదు… ఎక్కడా ప్రముఖంగా కనిపించలేదు అనేది ఆశ్చర్యం… అసలిది నిజమేనా అని అనుమానం… టన్నుల కొద్దీ పొలిటికల్ అఘోరీల బురదను, బూడిదను సమాజంలోకి పంప్ చేస్తున్న మన మీడియా గురించి తెలిసిందే కాబట్టి… ఆశ్చర్యానికి అర్థం లేదని కూడా అనిపించింది… అనుమాన నివృత్తి కోసం […]

ఇది గుంటూరోళ్ల సినిమా… కృష్ణ- శ్రీదేవి జోడీ విహారానికి ఆరంభం…

November 3, 2024 by M S R

krishna

ఇది గుంటూరు జిల్లా వాళ్ళ సినిమా . ఈ టైటిల్ని ఎంచుకున్నందుకు హీరో కృష్ణని , నిర్మాత దర్శకులను మెచ్చుకోవాలి . బుర్రిపాలెం నుండి బయలుదేరిన హీరో కృష్ణ తాను పుట్టిపెరిగిన ఊరి పేరు కలకాలం సినిమా ప్రపంచంలో నిలిచిపోయేలా ఈ టైటిల్ని ఎంచుకున్నారు . బుర్రిపాలెం గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన . అష్టకష్టాలు పడి ఈ సినిమాను దర్శకుడిగా పూర్తి చేసిన బీరం మస్తాన్ రావు  గుంటూరు వాడు . సినిమా ఔట్ డోర్ […]

డబ్బా పిల్లలు..! అమ్మ కడుపులకూ ఆల్టర్నేటివ్ మిషన్లు..!

November 3, 2024 by M S R

birthing pads

“స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?” అని ప్రశ్నించాడు ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్లమీద కూర్చుని కవి శేషప్ప. “తళుకు జెక్కుల ముద్దు బెట్ట కౌసల్య మును తపమేమి చేసెనో తెలియ!దశరధుడు శ్రీరామ రారాయని బిలువ మును తపమేమి చేసెనో తెలియ!” అని అంతటి అవతార పురుషుడైన రాముడి తళుకు చెక్కుల బుగ్గలమీద అల్లారుముద్దుగా ముద్దు పెట్టడానికి కౌసల్య; రారా రామా! అని కొడుకును పిలవడానికి దశరథుడు పూర్వజన్మల్లో ఎంత తపస్సు చేశారో! అని పరిశోధించాడు నాదబ్రహ్మ […]

అక్క, తమ్ముడూ, పుడింగి, మ్యాటర్… ఆ ఇంట్లో అన్నీ బూతులే…

November 2, 2024 by M S R

bb8

. పుడింగి అనేది తిట్టా..? పెద్ద తోపువా..? అనే అర్థం అంతే… సాధారణంగా కోపంతో అంటుంటారు… నయని పవని దాన్ని పెద్ద ఇష్యూ చేసింది ఎప్పటిలాగే… దాన్ని పట్టుకుని నాగార్జున వీకెండ్ షోలో వివరణ అడగడం, తప్పుపట్టడం, అదో పెద్ద ఇష్యూగా ప్రేరణను మందలించడం జస్ట్ నాన్సెన్స్… నయని పవనికి సారీ కూడా చెప్పించాడు… ఈసారి వీకెండ్ షో మొత్తం అలాగే ఉంది… చిన్న చిన్న ‘మ్యాటర్ లేని’ విషయాల్ని కూడా పెద్ద భూతద్దంలో చూపించి, దాదాపు […]

ఓ ఖాకీకలం రాసిన నవ్వుల కథలు… ఈ సమీక్షా అదే బాపతు…

November 2, 2024 by M S R

jaatiratnalu

. పోలీస్‌_రాసిన_నవ్వుల_కథలు! పాత సినిమాల్లో ఓ పాపులర్‌ సీన్‌ ఉంటది. హీరో ఫ్రెండు జగ్గయ్యనో, కథానాయకుడి బాబాయి గుమ్మడినో విలన్‌ గ్రూపువాళ్లు కత్తిపోటు పొడిచి పారిపోతుంటారు. ఫైట్‌లో వాళ్లను చెల్లాచెదురు చేసేసి, ‘భా…భా…య్హ్‌’ అంటూ అరుస్తూ ఆ పడిపోయినవాణ్ణి చేతుల్లోకి తీసేసుకుంటాడు హీరో. సరిగ్గా సదరు కత్తిని లాగేసే టైమ్‌కు ఠంచనుగా వచ్చేసే పోలీసులు అతడితో అనే మాట ‘యువార్‌ అండర్‌ అరెస్ట్‌’ అని. ఏం… మా గోపిరెడ్డి మాత్రం పోలీస్‌ కాదా? ఆమాత్రం డైలాగ్‌ చెప్పలేడా? […]

రుషికొండ ప్యాలెస్ చూసి బాబు గుండె చెరువైపోయి… బరువైపోయి…!!

November 2, 2024 by M S R

suvarna soudha

. గంటకు పైగా రుషికొండ భవనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం, తన స్వార్థం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా చేశారు. గతంలో ఎవరిని రుషికొండ దరిదాపుల్లోకి రానివ్వలేదు. గుండె చెదిరిపోయేలా నిజాలు బయటకు వస్తున్నాయి…  – సీఎం చంద్రబాబు……. ఇదీ తాజా వార్త ఆయన మాటలు… ‘‘ప్రజాస్వామ్యంలో, కలలో కూడా ఊహించలేం ఇలాంటి కట్టడాల్ని… జగన్ స్వార్థం, విలాసం కోసం ఈ ప్యాలెస్… అన్నింటికీ […]

‘‘అఘోరించిన న్యూసెన్స్ సమస్యను మహారాష్ట్రకు బదిలీ చేశారు… కానీ..?

November 2, 2024 by M S R

aghori

. ముందుగా అఘోరికి సంబంధించిన ఈ తాజా వార్త చదవండి… . రాష్ట్రంలో సంచలనాన్ని రేకెత్తిస్తున్న అఘోరీ మాత ఆత్మార్పణ కథ సుఖాంతంతో పోలీసులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుసనపల్లి గ్రామంలో గత మూడు రోజులుగా గృహ నిర్బంధంలో ఉన్న అఘోరి మాతను పోలీసులు బుధవారం తెల్లవారుజామున క్షేమంగా తెలంగాణ సరిహద్దులు దాటించి మహారాష్ట్రకు తరలించారు. అఘోరి మాత సరిహద్దులు దాటించన పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కొండగట్టు, వేములవాడ దేవాలయాలను దర్శించుకొని […]

ఖర్గే మంచి మాట చెప్పాడు… బీజేపీ కూడా అందిపుచ్చుకోవాలి…

November 2, 2024 by M S R

kharge

మొత్తానికి ఖర్గే ఓ మంచి మాట చెప్పాడు… కర్నాటక ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదు మరి, తెలంగాణ సిక్స్ గ్యారంటీల మేనిఫెస్టోను స్వయంగా విడుదల చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు మరి… అనే ప్రశ్నలకన్నా దేశవ్యాప్తంగా ఓ పాజిటివ్ మార్గంలో ఓ మంచి చర్చను లేవనెత్తినందుకు అభినందించాలి… సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రలోభాలు అంశంపై ఇంకాస్త దూకుడు పెంచాలి… తనేమంటున్నాడు..? రాష్ట్రాల బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్నికల హామీలు ఉండాలి, లేకపోతే ఆర్థికంగా దివాలా […]

మన గుండెలు రాళ్లు… నవ్వినా, ఏడ్చినా వాటికి పెద్ద ఫరక్ పడదు…

November 2, 2024 by M S R

neuroticism

ప్రపంచంలో చిత్ర విచిత్రమైన అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. కొన్ని చాలా సీరియస్. కొన్ని నాన్ సీరియస్. అలా అమెరికాలో జరిగిన ఒకానొక అధ్యయనం అమెరికాకు పరమ సీరియస్. మనకదే పరమ కామెడీ. సినిమాల్లో విషాద సన్నివేశాలకు ఏడ్చేవారిలో అకాల మరణ ప్రమాదం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనం తేల్చింది. చూస్తున్న సినిమా/నాటకం/దృశ్యం నిజం కాదని… కేవలం నటన అని… కల్పితమని తెలిసినా అందులో సన్నివేశాలకు పొర్లి పొర్లి ఏడ్చే ప్రేక్షకుల గుండె బలహీనమని… ఇలాంటివారి గుండె […]

కాపీ అనకూడదు… స్పూర్తి, ప్రేరణ, అనుసృజన అని పిలవాలి…

November 2, 2024 by M S R

m,usic

ఇమిటేషనా? ఇన్స్ పిరేషనా? ఒక మాతృకను ఆధారం చేసుకుని మళ్లీ సృజించడం అనేది రెండు రకాలుగా సాగుతుంది. ఒకటి యథాతథంగా అనుకరించడం దాన్ని పామర భాషలో కాపీ అంటారు. ఇక రెండోది మాతృకను చూసి ప్రేరణ పొంది సరికొత్తగా దాన్ని ఉపయోగించడం. దీన్ని అనుసృజన లేదా ప్రేరణ అంటారు. ఇలా తెలుగు సినిమాల్లో త్యాగరాయ కృతులతో పాటు బాగా ప్రచారం పొందిన సంగీత రచనల ప్రేరణతో వచ్చిన అపురూప గీతాల గురించి మాట్లాడుకుందాం … రఘువంశ సుధాంబుధి […]

ఆటలో అక్కాతమ్ముళ్ల ‘మ్యాటర్’ గొడవ… ఇదేంది నయని పవనక్కా..!!

November 2, 2024 by M S R

nayani

మ్యాటర్ లేదా..? ఈ రెండు పదాల వాక్యాన్ని టీవీలు బూతుగా మార్చేశాయి ఏనాడో… నిజానికి మామూలుగా వింటే, చదివితే, అంటే అది బూతు కాదు… చాలా సరళమైన, చాలా సాధారణమైన వాక్యం… కానీ మన టీవీలు బూతును ధారాళంగా జనంలోకి తీసుకురావడంలో ఎఫీసియెంట్ కదా… దాని అర్థమే మార్చేశారు… ఎవడినైనా పట్టుకుని, ఏరా నీకు మ్యాటర్ లేదా అనడిగితే… నీకు పొటెన్సీ లేదా..? నపుంసకుడివా..? అనే అర్థమే ఇప్పుడు… ఓ మగాడ్ని, అదీ ఓ షార్ట్ టెంపర్, […]

మన డిగ్రీలు, మన పీజీలు, మన డాక్టరేట్లు… కొన్ని చేదు నిజాలు…

November 1, 2024 by M S R

our degrees and reality

ఒక ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలో తెలుగులో యుజిసి ఫెలోషిప్‌తో పిహెచ్‌డి చేస్తున్న ఇద్దరు యువకులు మోహన్ , రమేష్ మొన్న ఒకరోజు మా ఆఫీస్‌కు వచ్చారు. మోహన్‌ది మా హిందూపురం. నాకు చాలాకాలంగా పరిచయం. వస్తూ వస్తూ తన మిత్రుడు మహబూబ్‌నగర్ రమేష్‌ను వెంటబెట్టుకు వచ్చాడు. సాహితీ విమర్శలో మోహన్ మునిగి తేలుతున్నాడు. తను ఈమధ్య రాసిన సాహిత్య వ్యాసాల జెరాక్స్ ప్రతులిచ్చాడు. నాకోసం కొన్ని పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. సాహిత్యం మీది నుండి చర్చ బతుకుదెరువు మీదికి […]

ఫాఫం సుమ… గంగ మరీ డర్టీ చంద్రముఖిగా మారిపోయింది…!!

November 1, 2024 by M S R

suma adda

ఛిఛీ… ఈ తిరస్కార, వ్యతిరేక, ఏవగింపు పదాన్ని వాడటానికి ఏమాత్రం సందేహించడం లేదు… అంతటి సుమ చివరకు నాలుగు డబ్బుల కోసం ఎంత దిగజారిపోతోంది అనిపించింది… పేరుకు పైకి శుద్ధపూస… ఎవడూ టచ్ చేయొద్దు, చేస్తే అక్కడే మొగుడికి వివరణ ఇచ్చుకునేంత సాధ్వీమణి… తీరా చూస్తే తాజా సుమ అడ్డా అనే అడ్డమైన షో చూస్తుంటే, అనవసరంగా ఈమెను మన తెలుగింటి ఆడపడుచుగా అనవసరంగా ఆదరించామా అనిపిస్తుంది… ఎవడు హర్టయినా సరే, అదే నిజం… తెలుగులో ఫ్లూయెన్సీ […]

మళ్లీ మళ్లీ స్మరించుకునే ఆత్మత్యాగం… తెలుగువారి విముక్తి ప్రదాత…

November 1, 2024 by M S R

potti sriramulu

చాలా మంది సోషల్ మీడియా వాల్స్ మీద కనిపిస్తున్న సమాచారమే ఇది… ఒరిజినల్ రచయిత ఎవరో తెలియదు… (ఆ రచయితకు ధన్యవాదాలు…) ఇప్పటి తరానికి పొట్టి శ్రీరాములు ఆత్మత్యాగం ఏమిటో తెలియాలి… తెలియాల్సిన అవసరం ఉందనిపిస్తోంది… ఒక ఆశయం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టడం అంటే ఏమిటో, రాజకీయాలు ఎలా ఉంటాయో కూడా తెలియాలి… అందుకే ఈ పోస్టును యథాతథంగా పంచుకోవడం… *** పొట్టి శ్రీరాములు గారు చనిపోయేటప్పటికి నాకు ఐదు సంవత్సరాల వయస్సు. మా ఇంటి […]

2025… అంతానికి ఇది ఆరంభం… ఈ జోస్యాలు నిజమేనా..?

November 1, 2024 by M S R

end

ఎడారుల్లో వరదలొస్తున్నాయి… కరువు ప్రాంతాల్లోనూ భారీగా వర్షాలు… హఠాత్తుగా కుండపోత, నగరాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది… మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం సాగుతూనే ఉంది… ఇజ్రాయిల్- పాలస్తీనా యుద్ధం ఇప్పుడు ఇరాన్, లెబనాన్ దేశాలకూ పాకింది… తాజాగా ఇజ్రాయిల్ మీద ఇరాన్ మళ్లీ దాడులు చేసింది… ప్రతీకారం తప్పదని ఇజ్రాయిల్ హెచ్చరించింది… తైవాన్ మీదకు చైనా ఉరుముతోంది… ఈ యుద్ధాలేమో మూడో ప్రపంచ యుద్దానికి ప్రారంభమనే జోస్యాలు వినిపిస్తుంటే… అసలు ప్రపంచ అంతానికి ఆల్రెడీ ఇది ఆరంభమనీ, […]

ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డ్ వరకూ… కథంతా దంచుడే దంచుడు…

November 1, 2024 by M S R

srimurali

శ్రీమురళి… తాజాగా విడుదలైన పాన్ ఇండియా కన్నడ సినిమా బఘీరాలో హీరో… శ్రీమురళి ఎవరనే వివరాలు సెర్చుతుంటే ఆసక్తికరం అనిపించింది తన నేపథ్యం… పక్కా సినిమా కుటుంబం తనది… కన్నడిగే కానీ, మనతోనూ తనకు బంధం ఉంది… మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడి కొడుకు ప్రశాంత్ నీల్… తెలుసు కదా… కేజీఎఫ్‌తో ఎక్కడికో వెళ్లిపోయాడు… ప్రశాంత్ నీల్ సోదరి పేరు విద్య… తనను లవ్ చేసి, పెళ్లి చేసుకున్నాడు శ్రీమురళి… అప్పుడప్పుడూ తెలుగు తెరపై కనిపించే ఆదర్శ్ […]

అప్పట్లో హీరో చెల్లెలు అంటే… లైంగిక దాడి బాధితురాలి పాత్రే…

November 1, 2024 by M S R

sridevi

అన్నాచెల్లెలు సెంటిమెంట్ సినిమా . టైటిల్ని బట్టే అర్థం అవుతుంది . మనదేశంలో అన్నాచెల్లెళ్ళ సెంటిమెంటుతో వచ్చిన సినిమాలు సాధారణంగా ఫెయిల్ కావు . అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి , ఓ అన్నా నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం , ఇలా ఎన్ని పాటలు ఉన్నాయో , ఎన్ని సినిమాలు వచ్చాయో ! 1979 లో వచ్చిన ఈ బంగారు చెల్లెలు సినిమా కూడా బాగుంటుంది . షిఫ్టింగులతో విజయవాడలో వంద రోజులు […]

  • « Previous Page
  • 1
  • …
  • 86
  • 87
  • 88
  • 89
  • 90
  • …
  • 442
  • Next Page »

Advertisement

Search On Site

Latest Articles

  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’
  • మొన్నటి మన గెలుపు వెనుక… నాటి లోకం మరిచిన పురూలియా కథ…
  • అక్షరాలా ‘ఆనంద భైరవమే… సమాజాన్ని ధిక్కరించిన ఓ గురువు కథ…
  • ఎవరినైనా ఒప్పిస్తావ్… రావిపూడీ, ఎంతైనా నువ్వు ఘటికుడవోయ్…
  • మొత్తానికి బంగ్లాదేశ్ దురాలోచన తెలిసింది… ఇండియా కళ్లు తెరిచింది…
  • ‘హద్దు’దూకిన సంపూర్ణ సందేహాస్పద ప్రేమకథ… అచ్చంగా ఓ తెలుగు టీవీ సీరియల్…
  • జిజ్ఞాసకు ముసలితనమేంటి..? కంప్యూటర్‌ భాషను రపారపా నమిలేశాడు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions