బిగ్‌బాస్‌లో ఒక కంటెస్టెంట్‌ను పైకి లేపాలంటే వేరే కంటెస్టెంట్లపై దుష్ప్రచారాలు చేయాలి… అదీ సోషల్ మీడియాలో… తద్వారా కొందరి వోట్లు పెంచడం, ఇంకొందరి వోట్లకు కత్తెర పెట్టడం ఓ స్ట్రాటజీ… బిగ్‌బాస్ వోట్ల కోసం కంటెస్టెంట్లు ముందుగానే పీఆర్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని మరీ హౌజులోకి వెళ్తుంటారు… అదొక వ్యాపారం… సరే, ఎవరి కడుపునొప్పి వాళ్లది… కానీ ఈసారి కొత్త తరహా క్యాంపెయిన్స్ కనిపిస్తున్నాయి… ప్రాంతం, భాష, కులం, మతం… కన్నడ బ్యాచ్ తెలుగు కంటెస్టెంట్లను తొక్కేస్తున్నదట… […]
ఇందిర నాసికకూ ఓ కథ… అందులో ఓ వికృతకోణం… గాయత్రి అంటే మంట…
ఉక్కుమహిళను నిన్న ఆమె వర్ధంతి సందర్భంగా స్మరించుకున్నాం కదా…. ఉక్కుమనిషి అయితేనేం, ఉద్వేగాలు ఉండవా..? పైగా ఓ యువరాణిలా పెరిగింది, ఆభిజాత్యం కలిగిన స్త్రీ… తనలో కనిపించిన ఓ వికృతకోణం గురించి చెప్పుకోవాలంటే…. తన మొహం మీద తనకే ఓ ఆత్మన్యూనత, మరీ ప్రత్యేకించి తన ముక్కు పొడవు మీద…! వేరే స్త్రీలతో, ప్రత్యేకించి రాజకుటుంబాల నుంచి వచ్చి, అందమైన వేషభాషలతో బతికే వారితో పోల్చుకునేది… ఈర్ష్యపడేది… పలుసార్లు ప్లాస్టిక్ సర్జరీ గురించి ఆలోచించింది… 1967 ప్రాంతంలో […]
ఇప్పుడంటే రెడీమేడ్ సేమ్యా పొట్లాలు… కానీ అప్పట్లో ఆ తయారీయే వేరు…
ఎనుకటి రోజుల్లో ఈ రోజు.., రేపటి కోసం ఎంతో ఎదురుచూసేది… ఇప్పుడంటే సేమ్యా పొట్లాలు బయట అమ్ముతున్నారు కానీ ఒకప్పుడు వీటిని ఇండ్లలోనే చేసేవారు… మంచిగా కాలిన మట్టి కుండ తెప్పించి రోజూ మధ్యాహ్నం తీరిక చేసుకొని వీటిని చేసేవారు… పిండిని పాలతో బాగా ముద్ద చేసి. ఇంట్లో నెయ్యి. అంటే ఇంటి బర్రె పాలు దాలిలో బాగా కాగబెట్టి, అట్టు వోతే మీగడ కట్టాక, రాత్రి తొడేసి, ఉట్టికి బట్టకట్టే వారు… మర్నాడు చల్ల కవ్వంతో […]
క అంటే కిరణ్… క అంటే కాంతారా… క అంటే కర్మ… కాదు… ఇంకేదో..!!
ఒక సినిమా గురించి చెప్పుకోవాలి… దాని పేరు ‘క’… మొన్న బిగ్‌బాస్ వేదికగా ప్రమోషన్లకు వచ్చినప్పుడు నాగార్జున అడిగాడు… క అంటే ఏమిటి…? దానికి కిరణ్ లాస్ట్ క్లైమాక్సులో తెలుస్తుంది సర్ అన్నాడు… నిజమే… క అంటే కాంతారా ఏమో అనుకుంటాం చాలాసేపు… పోనీలే, కర్మ కావచ్చూ అనుకుంటాం కొద్దిసేపు… ఏమో హీరో పేరులో మొదటి అక్షరాన్ని పెట్టారేమో అనీ అనుకుంటాం… కానీ క అంటే ఏమిటో క్లైమాక్సులో నిజంగానే ఓ కాంతారాను చూపించారు దర్శక ద్వయం… […]
ఓ వీర జవాను భార్య కోణంలో కథనం… మెప్పించిన ‘అమరన్’…
అమరన్… ఈ సినిమా కథ ఓ అమరజవాను కథ… ఓ సాహసి కథ… మరి ఇందులో ఆ జవాను భార్య పాత్రకు ప్రాధాన్యం ఏముంటుంది..? సాయిపల్లవి తన పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేకపోతే దాని జోలికి పోదు కదా… పైగా తన పోర్షన్ ప్రాధాన్యాన్ని తగ్గించవద్దని ముందే దర్శకుడి నుంచి లిఖితపూర్వకంగా హామీ తీసుకున్నదీ అనే వార్త చదివాక ఆసక్తి ఏర్పడింది… సినిమాా చూస్తే ఆమె పాత్ర ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది… అశోకచక్ర, మేజర్ ముకుంద్ వరదరాజన్ […]
ఆకుల సోనియా..! ఆ మెంటల్ వర్మకు అచ్చంగా ఓ ఫిమేల్ రూపం..!!
సంక్షిప్తంగానే చెప్పుకుందాం… వోకే, 200 వర్డ్స్ వోన్లీ… ఆకుల సోనియా తెలుసు కదా… ది గ్రేట్, పర్వర్టెడ్ దర్శకుడు రాంగోపాలవర్మ హీరోయిన్… సరే, పర్లేదు, తన తాజా సినిమాల్లోని బూతు, అశ్లీలత, అసభ్యత, మన్నూమశానం ఏమీ లేవు ఆమె నటించిన అదేదో పిచ్చి సినిమాలో… బహుశా దిశ కావచ్చు… ఆమె గురించి ఎందుకు చెప్పుకోవాలీ అంటే… ఆమె కరాటే ఫైటర్, లాయర్, సోషల్ యాక్టివిస్ట్, యాక్ట్రెస్… వాట్ నాట్..? కానీ తింగరి బుర్ర… ఈ మాట కూడా […]
బుర్ర తక్కువ బిగ్‌బాస్..! ఈ సంచాలక్ ఎంపికలేమిట్రా బాబూ…!!
అందరికీ పిచ్చి పిచ్చి టాస్కులు ఇస్తూ… క్రియేటివిటీలో తోపులం మేం అని ఫీలయ్యే బిగ్‌బాస్ టీం బిత్తరపోయింది… తల దిమ్మెక్కిపోయింది అనడం కరెక్టేమో… ఇద్దరు సంచాలక్స్ తీరు చూసి నెత్తిన చేతులు పెట్టుకుని బావురుమంటున్నాడేమో… ఆపిల్స్ టాస్క్‌లో పృథ్విని సంచాలకుడిగా పెట్టారు… పెద్ద బ్లండర్… అంతకుముందే ఎవరినో ఆటలో నేను ఓడిపోయినా సరే, మిమ్మల్ని టార్గెట్ చేస్తాను అని అరిచాడు కదా… అసలే మెంటల్ కేసు.., కోపం, కూతలు, కేకలు, అసహనం అన్నీ ఉన్న విచక్షణారహితుడు… పైగా […]
తిరుమల లడ్డూ నాణ్యతకు ఇండియాటుడే సర్టిఫికెట్… కానీ..?
ఇండియాటుడే… ఓ జాతీయ మీడియా సంస్థ… పాపులర్ మీడియా… సర్వేలు, ఇతరత్రా ప్రయోగాలతో ఎప్పుడూ అదే మీడియా వార్తల్లో ఉంటుంది కూడా… అది పాత్రికేయ కోణంలోనే చేసిన ఓ తాజా ప్రయోగం మాత్రం మరీ టీవీ9 తరహాలో ఉండి నవ్వు పుట్టించింది… తిరుమల లడ్డూ వ్యవహారం కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం నిజం… జంతుకొవ్వుల కల్తీ నెయ్యితో లడ్డూల తయారీ నిజంగానే జరిగిందో లేదో… ఎవడి పాపమో, ఏ నికృష్టుడి నైచ్యమో తెలియదు, ఇప్పట్లో […]
విచిత్ర కథనం… విచిత్ర జీవితం… విచిత్రంగానే ప్రేక్షక తిరస్కారం…
హిందీలో సూపర్ హిట్ మూవీ దాగ్ రీమేకే 1978 లో వచ్చిన మన తెలుగు సినిమా విచిత్ర జీవితం . హిందీలో సూపర్ హిట్టయిన సినిమా అగ్ర తారలతో తీసినా తెలుగులో సక్సెస్ కాకపోవటం ఆశ్చర్యమే . పాటలు , మాటలు , చిత్రీకరణ అన్నీ బాగానే ఉన్నా మరెందుకనో సక్సెస్ కాలేదు . ఓ సాధారణ అమ్మాయి అబ్బాయి గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు . ఉద్యోగార్ధం వేరే ఊరు వెళతారు . ఆ యజమాని […]
భిన్నమైన కథ, సంక్లిష్టమైన కథ… బుర్రకెక్కడం కాస్త కష్టమైన కథ…!
నాగవంశీయే కదా ఈమధ్య విచిత్రమైన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటున్నది… కథలో లోపాలు చెబితే బహుమతి అంటాడు, తనే కథ అవసరం లేదంటాడు… రివ్యూలతో ఇంపాక్ట్ ఉండదు అంటాడు, ఫస్ట్ షో తరువాత ట్వీట్లతో ప్రభావం అంటాడు… ఈమధ్యకాలంలో నోటికొచ్చింది ఏదో చెప్పేస్తూ వార్తల్లో ఉండటం ఎలా అనే ఓ ప్రయోగం నిర్వహిస్తున్నట్టున్నాడు… తీసేవాడికి చూసేవాడు అలుసు అన్నట్టుగా… రాసేవాళ్లు దొరికారు కదాని ఏదో ఒకటి తిక్క తిక్క వ్యాఖ్యలు చేస్తూనే ఉంటాడు… ఆయనదే ఇప్పుడొచ్చిన లక్కీ భాస్కర్ […]
అవి సినిమా పాటల పోటీలా..? ఓ తరహా శ్రీదేవి డ్రామా కంపెనీలా..?!
తెలుగులో ఈరోజుకూ నాణ్యమైన సినీసంగీత టీవీ కార్యక్రమం అంటే పాడుతా తీయగా షో మాత్రమే గుర్తొస్తుంది… అంటే అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన షో… ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉన్న చాలామంది గాయకులు పాడుతా తీయగా షోలో పాడినవాళ్లే… పాట నేపథ్యం, గాయకుడి పాటలో చిన్న తప్పొప్పులు వివరించేవాడు బాలు… ఎక్కడా అతిగా పొగిడేవాడు కాదు, అలాగని హార్ష్ కామెంట్లు కూడా చేసేవాడు కాదు… ఈరోజుకీ ఆ వీడియోలే వినబుల్, చూడబుల్… అవి పోటీలు… కానీ స్వరాభిషేకంతోపాటు పలు దేశాలు […]
ఫాఫం తిరుమల వెంకన్న… టీవీ5 బీఆర్ నాయుడి చేతిలో పడ్డాడు…
ఓ మిత్రుడు…. ‘సార్, చంద్రబాబు చాలా బెటర్ సార్, బాగా మారాడు, బీజేపీ మద్దతు కదా, గతంలో హిందుత్వ మీద అనురక్తి లేకపోయినా, ఏదో షో చేసేవాడు, ఇప్పుడు ముసలోడయ్యాడు కదా, దేవుడి దయ కోరుకుంటున్నాడు… అందుకే లడ్డూ పవిత్రత మీద ఈ పోరాటం, ఈ ఆరాటం అన్నాడు’… కొన్నాళ్ల ముందు… ఫాఫం, చంద్రబాబును తక్కువ అంచనా వేశాడు అనుకున్నాను, జాలిపడ్డాను… ప్రపంచంలో ఎవరు మారినా చంద్రబాబు మారడు, నోరిప్పితే అబద్ధం, అడుగేస్తే అక్రమం… క్రెడిబులిటీ ఉండదు, […]
నిఖిల్… రాగద్వేషాలేమీ లేవు… ఆటలో దిగితే ‘అటవీ మృగమే…
నిఖిల్ గురించి ఒకసారి చెప్పాలి… అదేనండీ, బిగ్‌బాస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు… విష్ణుప్రియను మోసే మీడియా, సోషల్ మీడియా తన మీద ట్రోలింగ్ స్టార్ట్ చేశాయి… తను ఓ అటవీ మృగం టైపు అట… పానీపట్టు టాస్కులో ప్రేరణ, యష్మి పట్ల రూడ్‌గా బిహేవ్ చేశాడట… నిజానికి ఒక మాట చెప్పుకోవాలి ముందుగా… ఈసారి బిట్బాస్లో (అఫ్ కోర్స్ గత సీజన్లో కూడా…) కన్నడ బ్యాచ్ పర్ఫెక్ట్ గేమ్ ఆడుతున్నారు… మన తెలుగు ఘనులకన్నా మంచి తెలుగు […]
ఫాస్ట్ ట్యాగ్… మనల్ని పాత చీకటి యుగాల్లోకి ఫాస్ట్‌గా తీసుకెళ్లే ట్యాగ్…
FastTag…. అందరికీ తెలుసు… టోల్ టాక్స్‌ను ఆటోమేటిక్‌గా కట్ చేసుకునే ఓ దోపిడీ యంత్రాంగం… హార్ష్ అనిపిస్తోంది కదా… కానీ అదే రియాలిటీ… కాస్త లోతుల్లోకి వెళ్దాం… టోల్ గేట్ల దగ్గర ఆగి, క్యాష్ కట్టాల్సిన అవసరం లేకుండా… వేగంగా దోపిడీ చేసుకునే ఓ డిజిటల్ ఏర్పాటు… టోల్ టాక్స్ దోపిడీదార్లకు అదొక డిజిటల్ దారి… ఆగండాగండి, సోకాల్డ్ జాతీయవాదులూ… ఆగండి… డోన్ట్ బీ ఫూలిష్… తలతిక్క సంక్షేమ జనాకర్షక పథకాలు కాదురా బాబూ… ఆయుష్మాన్, పంటల […]
వేల కోట్ల అక్రమాలు, భారాలను విడిచి… నమస్తే కోటిన్నర కథ…
మావల్లే అంటే మా నుంచే తీవ్రమైన ప్రతిఘటన, నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో రేవంత్ రెడ్డి 20 వేల కోట్ల మేరకు కరెంటు చార్జీలు పెంచలేదు తెలుసా అంటున్నాడు మాజీ యువరాజు కేటీయార్… నవ్వొచ్చింది… అఫ్కోర్స్, బీఆర్ఎస్ ఎన్నికల్లో ఓడిపోయాక అత్యంత ప్రజాస్వామిక పార్టీ అయిపోయింది… గతంలో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని, ప్రజల వ్యతిరేకత మూటగట్టుకున్న ఆ పార్టీ హరీష్, కేటీయార్‌లు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా పరుగులు తీస్తున్నారు… ఏదో ఒకటి… ట్వీటాలి, ఉరకాలి, […]
పర్స్ కాజేసి… పల్స్ మింగేసి… పీనుగను తీసుకెళ్లమంటారు..!!
ప్రయివేటు ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రుల వైద్యం షాక్ ట్రీట్మెంట్ లాంటిది. అక్కడ జరగకూడనివి ఎన్నెన్నో, ఏవేవో జరుగుతుంటాయని తెలిసినా…అక్కడికి వెళ్లకుండా ఉండలేని పరిస్థితుల్లో పడిపోతాం. వెళ్లడం వరకే మన వంతు. వెళ్లిన తరువాత వంతుల వారీ డాక్టర్ల బారిన పడి…వారు రెఫర్ చేసే పరీక్షల బారిన పడి…వారు రాసే మందుల బారిన పడి…చివర బిల్లుల వలలో పడి…పరి పరి విధాలుగా పడడమే తప్ప…లేవడం ఉండదు. ప్రాణం ఎవరిదయినా ప్రాణమే. డబ్బు ఎవరిదయినా డబ్బే. అయితే డబ్బు ప్రాణాలను […]
మోహన్‌బాబును చూస్తుంటే, హఠాత్తుగా లేచి తన్నాలనిపిస్తుంది…
గ్లామర్+విషాద పాత్రలకు న్యాయం చేయటంలో సావిత్రి , వాణిశ్రీల తర్వాత తానే అని జయసుధ ఈ సినిమా ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది . కెరీర్ ప్రారంభంలో జ్యోతి కావచ్చు , తర్వాత కొద్ది కాలంలో ఈ శివరంజని కావచ్చు , పేరొచ్చాక నటించిన ప్రేమాభిషేకం , మేఘ సందేశం కావచ్చు , నేను పేర్కొనని మరి కొన్ని సినిమాలు కావచ్చు నా మాటను కన్ఫర్మ్ చేస్తాయి . 1978 సెప్టెంబర్ 27 న రిలీజ్ […]
ఇంద్రుడి భార్యకు ఓ పెంపుడు చిలుక… ‘విధిరాత’ అనే ఓ కథ…
విధి… డెస్టినీ… కర్మ… టైమ్… పేరు ఏదైనా సరే, అదే అల్టిమేట్… జీవితం మన చేతుల్లోనే ఉందనేది పాక్షిక సత్యమే… జీవితం ఆల్రెడీ ఎప్పుడో రాయబడి ఉందనేదే డెస్టినీ… అది ప్రజెంట్ డైనమిక్ కాదు, ప్రి-ప్రోగ్రామ్డ్… ఇది వివరించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కథలు… మతాధిపతులు, మేధావులు, ఫిలాసఫర్లు చెబుతూనే ఉంటారు… అర్థం చేయించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు… సంక్లిష్టమైన వివరణలు కాదు, సరళమైన ఉదాహరణలే ఎక్కువ ప్రభావశీలం… అలాంటిదే ఇది కూడా… సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది… ఈ […]
పులిహోర ఆటలు ఎక్కువైపోయి… అసలు ఆట బభ్రాజమానం భజగోవిందం…
వీడి దుంపతెగ…బిగ్‌బాస్ షో ఎవడూ చూడటం లేదనే నిజాన్ని గ్రహించి, హౌజులో లవ్ ట్రాకులు పెట్టడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడు ఫాఫం… హరితేజ, ప్రేరణలకు పెళ్లయింది… అవినాష్ అంతే… రోహిణి, టేస్టీ తేజల జోలికి వెళ్లే సాహసం ఎవరూ చేయరు… నబీల్ దూరం దూరమే… ఇక విష్ణుప్రియకు పృథ్వి కావాలి… పృథ్వికి నయని పవని కావాలి… యష్మికి నిఖిల్ కావాలి… నిఖిల్ ఎమోషన్లెస్, ఫాఫం సోనియా వెళ్లి పోయాక ఫీలింగ్లెస్ అయిపోయాడు, మొహంలో నవ్వే మరిచిపోయాడు… పృథ్వి దొరికింది […]
జనానికి కాదమ్మా విజయమ్మా… నీ బిడ్డ షర్మిలకు కదా చెప్పాల్సింది…
అమ్మా, విజయమ్మా… ఎప్పుడూ చేతిలో బైబిల్ పెట్టుకుని, దేవుడిని ప్రార్థిస్తూ కనిపించే నీ నుంచి చాలా విచిత్రమైన ఓ బహిరంగ లేఖ కనిపించడం ఆశ్చర్యంగా ఉంది… నిజాయితీగా కొన్ని విషయాలు చెబితే బాగుండేది… పదే పదే వైఎస్ గురించి చెబుతున్న తమరు అదే వైఎస్ కనబరిచిన ఓపెన్ మెండెడ్నెస్ చూపించలేకపోయారు… ఏ తెలంగాణనైతే విపరీతంగా ద్వేషించిందో అదే తెలంగాణను ఉద్దరిస్తానని నీ బిడ్డ షర్మిల బయల్దేరిందో అప్పుడే ఆమె, ఆమెకు మద్దతుగా ఉన్న తమరు తెలంగాణ జనంలో […]
- « Previous Page
- 1
- …
- 87
- 88
- 89
- 90
- 91
- …
- 442
- Next Page »