ఓ వార్త… గూగుల్‌లో సెర్చ్ చేస్తే… బిగ్‌బాస్8 తెలుగు సీజన్ విజేత ప్రేరణ అని కనిపిస్తోందనే ఆ వార్త సారాంశం… హవ్వ, ప్రేరణ విజేత కావడం ఏమిటమ్మా, పైగా లేడీ కంటెస్టెంట్ గెలవడం ఏమిటో అని బుగ్గలు బాగా నొక్కుకుని మరీ హాశ్చర్యపోతున్నారట నెటిజనం… తనెవరో రాసుకొచ్చారు… నవ్వొచ్చింది… అది బిగ్‌బాస్ అట… ఎవరైనా గెలవొచ్చు… ప్రేరణకు ఏం తక్కువ..? గతంలో గెలిచిన పల్లవి ప్రశాంత్‌కన్నా చాలా నయం కదా… నిజానికి ప్రస్తుత సీజన్‌లో సోకాల్డ్ కన్నడ […]
ఇది జగన్ బెయిల్ రద్దు కుట్రేనా..? ఎవరు వ్యూహకర్తలు, ఎవరు పాత్రధారులు..?!
జగన్ చేసింది తప్పా..? ఒప్పా..? మరీ ఆస్తుల కోసం చెల్లిని, తల్లిని కూడా మోసగిస్తాడా..? ఇచ్చిన మాట తప్పుతాడా..? చెల్లిని మోసగత్తె అంటాడా..? చివరకు తండ్రి చెప్పింది కూడా పాటించకుండా ద్రోహం చేస్తాడా..? ఇచ్చిన షేర్లను కూడా వాపస్ తీసుకుంటాడా..? ….. ఇలా జగన్ వ్యతిరేక శిబిరాలు రెచ్చిపోయి ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాయి… సహజంగానే ఎప్పటిలాగే వైసీపీ సోషల్ శిబిరం సరిగ్గా డిఫెండ్ చేయలేక చేతులెత్తేసింది… షర్మిల వర్సెస్ జగన్ ఆస్తి వివాదాలు, పంచాయితీల గురించే కాదు, […]
ముగ్గురు దోస్తులు కలిసుంటారు, విడిపోతారు, కలుసుకుంటారు… కథ ఇంతే.., కానీ..?
. స్నేహమేరా జీవితం…! దిల్ చాహ్తా హై…! ఆకాష్, సమీర్, సిద్దార్థ్ ముగ్గురు స్నేహితులు. కలిసుంటారు, విడిపోతారు, కలుసుకుంటారు. సినిమా కథ ఇంతే..! కానీ…., ఆ మూడు గంటల మూడు నిమిషాల సినిమాలో ఓ మూడు నిండు జీవితాల చరిత్రంతా ఉంటుంది..! విడిపోవన్న భరోసా ఉన్న బంధాలు చాలా ధృడంగా ఉంటాయి. ప్రపంచం మొత్తానికీ వాళ్ల స్నేహపు గాఢత తెలుసు. ఐనా ఒకర్నొకరు వెక్కిరించుకుంటారు; ఎగతాళి చేసుకుంటారు; “చంపేస్తారొరేయ్..!” అంటూ బెదిరించుకుంటారు. ఒకరికోసం ఒకరు అలవోకగా చావడానికి […]
మేవాడ్ కోటల్ని వదిలి ద్వారకను చేరి…. ఆ కృష్ణుడి మెడలో పూలహారమైంది…
. కృష్ణుడే మైమరచి విన్న మీరా భజనలు అన్నమయ్య, పురందరదాసులాంటి వాగ్గేయకారులు మాట్లాడినదంతా భక్తి పారవశ్య సాహిత్యమే. ప్రతి మాటా ఒక కీర్తనే. ప్రతి కీర్తన ఒక మహాగ్రంథంతో సమానం. సామాన్యులు భజనగా పాడుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు అర్థం తెలుసుకుని పొంగిపోవచ్చు. అర్థాన్ని ఆచరణలో పట్టుకున్నవారు అద్వైత సిద్ధి పొందవచ్చు. తమ జీవితకాలంలో అన్నమయ్య, పురందరదాసులు ఎన్ని వేల కీర్తనలు రాశారో లెక్కే లేదు. వారు సృష్టించిన భక్తి సాహిత్య సముద్రాల్లో కాలగతిలో మనకు దొరికింది చెంబుడో […]
డౌటేముంది..? ఆ కమలహాసన్‌కన్నా మన చంద్రమోహనుడే బాగా చేశాడు..!!
చంద్రమోహన్ నట విశ్వరూపానికి ప్రతీక 1978 లో వచ్చిన ఈ పదహారేళ్ళ వయసు సినిమా . శ్రీదేవిని స్టార్ హీరోయిన్ని చేసి జయప్రద , జయసుధల సరసన నిలబెట్టిన సినిమా . రాఘవేంద్రరావు ప్రభంజనాన్ని కొనసాగించిన సినిమా . సినిమా విడుదలయిన ఆల్మోస్ట్ అన్ని కేంద్రాలలో వంద రోజులు అడి సూపర్ డూపర్ హిట్టయిన సినిమా . తమిళంలో హిట్ సినిమా 16 వాయతినిలెకు రీమేక్ మన పదహారేళ్ళ వయసు సినిమా . తమిళంలో శ్రీదేవి , […]
రూపాయి ప్రాంక్ చేయమంటే… గంగవ్వ ఏకంగా పదిరూపాయల యాక్షన్ చేసింది…
. అర్ధరాత్రి బిగ్‌బాస్ హౌజులో గంగవ్వకు హార్ట్ ఎటాక్ వచ్చింది… అర్జెంటుగా మెడికల్ టీం హౌజులోకి వెళ్లింది… కంటెస్టెంట్లు అందరూ షాక్‌కు గురయ్యారు… తను చేసిన వ్యాఖ్యలతోనే గంగవ్వ మనస్తాపం చెంది గుండెపోటుకు గురైందేమోనని విష్ణుప్రియ మరింత షాక్‌కు గురైంది… అని మొదట్లో వార్తలు… తరువాత కాసేపటికి… నో, నో… ఆమె ప్రాంక్ చేసింది అని కొందరు… అబ్బే, బిగ్‌బాసోడే టాస్క్ ఇచ్చి చేయమన్నాడు అని మరికొందరు… అబ్బబ్బ, గంగవ్వ యాక్టింగ్ ఇరగదీసిందని ఇంకొందరు రకరకాలుగా రాసుకొచ్చారు… […]
అప్పట్లో రామోజీరావుపై మండలి గుస్సా కథ ఆంధ్రప్రభకు తెలియనట్టుంది..!!
. ఎలాగూ మీడియా వార్తలు, సంస్థలు, వివాదాల గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఈమధ్య… అన్ని పత్రికల మీదా ఓ లుక్ వేస్తుంటాం కదా… నిన్న ఆంధ్రప్రభ, నేటి ఆంధ్రప్రభ చదవబడ్డాను అలాగే… గతంలో ఢిల్లీ నుంచి ఎవరో ప్రత్యేక ప్రతినిధి అంటూ సంపాదకీయ వార్తలు కనిపించేవి ఫస్ట్ పేజీలో… నిజానికి అవి ఎడిట్ పేజీలో రావాల్సినవి… సరే, వాళ్ల పేపర్ వాళ్లిష్టం… ఇప్పుడు నెట్‌వర్క్ పేరిట వస్తున్నాయి… బండి సంజయ్ రావాలి, బీజేపీ శ్రేణుల డిమాండ్ అని […]
గుట్ట గుడిలోకి ఓ శునకం..! ఐతేనేం..? సంప్రోక్షణ అవసరమా ఆచార్యా..?!
. పొద్దున్నే ఈనాడులో కనిపించిన ఒక వార్త… కనీకనిపించనట్టుగా పరిచారు గానీ అది ఆలోచనల్లో పడేసింది, ఆశ్చర్యానికీ గురిచేసింది… విషయం ఏమిటంటే..? ఒక శునకం యాదగిరిగుట్ట గుళ్లోకి భక్తులతోపాటు ధర్మదర్శనం క్యూలో నుంచి ప్రవేశించింది… తరువాత దాన్ని అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లి బయట వదిలిపెట్టారు… ఓ అరగంటపాటు దర్శనాలు ఆపేసి సంప్రోక్షణ క్రతువు నిర్వహించారు… సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామనీ, ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్తలు, కట్టుదిట్టాలు ఏర్పాటు చేస్తామనీ ఈవో భాస్కర్‌రావు చెప్పారు…….. ఇదీ […]
మీడియాలో మీడియా వ్యవహారాలే వార్తాంశాలు… టోటల్లీ బదనాం మీడియా…
తెలుగునాట, మీడియా-రాజకీయం కలగలిసిపోయిన వాతావరణంలో… మీడియా వ్యవహారాలే మీడియా వార్తాంశాలు అవుతున్నాయి ఈమధ్య…! మీడియా విధేయతలు, పొలిటికల్ లైన్స్ మాత్రమే కాదు… పొలిటికల్ పార్టీల మౌత్ పీసులుగా మారినందువల్ల, తద్వారా స్వార్థ ప్రయోజనాలు సాధించుకునే ప్రయత్నాలే పాత్రికేయంగా మారుతున్నందున..! రాజకీయేతరంగానూ మీడియా ప్రముఖులు, మీడియా సంస్థలు వార్తాంశాలు అవుతున్నాయ… సాక్షిపై ఆంధ్రజ్యోతి కేసు, కేంద్రానికి ఫిర్యాదు, వాలంటీర్లకు ఇచ్చే పత్రిక చందా డబ్బుల జీవో రద్దు, కేబుల్ ఆపరేటర్లను బెదిరించి కొన్ని చానెళ్ల ప్రసారాలపై అంకుశం, సాక్షి […]
జగన్- షర్మిల ఆస్తుల పంచాయితీలో మరో ట్విస్ట్… నో రాజీబేరాలు..?
. నిన్ననే కదా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ కథనం అని ఫస్ట్ పేజీలో రాసుకొచ్చాడు… ఏమని..? ‘మొన్నటి ఎన్నికల దెబ్బతో జగన్ వణికిపోతున్నాడు… కేంద్రంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం… అసలే కేసులు, ఏం కక్ష సాధిస్తారో అనే భయంతో దిగివస్తున్నాడు… కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి వీలుగా… ఇన్నాళ్లూ తీవ్రంగా తనతో ఆస్తి పంపకాల కోసం పోరాడుతున్న చెల్లితో రాయబేరాలు మొదలుపెట్టాడు, దాదాపు కొలిక్కి వచ్చినట్టే… తను కాంగ్రెస్ వైపు చేరకుండా ఆమె అడ్డుపడుతుందనే […]
ఎన్టీయార్ సమర్పించిన సినిమా… ఐనా సరే… జస్ట్, ఓ అతిథి పాత్రలో హుందాగా…
. దారి తప్పిన బాలల్లారా , దగాపడిన యువకుల్లారా ! చెడు అనవద్దు , చెడు వినవద్దు , చెడు కనవద్దు , ఇది బాపూజీ పిలుపు , ఇదే మేలుకొలుపు . అద్భుతమైన సాహిత్యం , యస్ జానకి మెలోడియస్ వాయిస్ . సి నారాయణరెడ్డి విరచిత ఈ పాట 1978 జనవరి 13 వ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజయిన ఈ మేలుకొలుపు సినిమా లోనిదే . విద్యా సంస్థల ఫంక్షన్సులో , ప్రజాహిత […]
ఇక ప్రతి జంట 16 మందిని కనాలేమో … కనండి కానీ తమిళ పేర్లే పెట్టాలి…
. జనాభాను నియంత్రించారుగా! ఇక మీకు ఎంపీలెందుకు? దక్షిణాదికి తీరని ద్రోహం కేంద్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికలప్పుడు ప్రకటించిన లెక్కల ప్రకారం మన దేశంలో 90 కోట్ల మంది ఓటర్లు. 2024 ఎన్నికల నాటికి 97 కోట్ల ఓటర్లు. అంటే 140 కోట్ల జనాభాలో ఈ 97 కోట్ల ఓటర్లను తీసేస్తే మిగతావారు ఓటు హక్కు వయసు రాని పిల్లలు. ఓటు హక్కున్నవారిలో సగటున అరవై నుండి డెబ్బయ్ శాతం మంది మాత్రమే ఓటు వేస్తుంటారు. […]
రోజురోజుకూ నిస్సారంగా బిగ్‌బాస్ షో… ఆటలో ఎవరికీ ఆసక్తి కూడా లేనట్టుంది…
హఠాత్తుగా ఈ ప్రచారం ఎందుకు స్టార్టయిందో తెలియదు… గంగవ్వకు రాత్రి గుండెపోటు వచ్చింది బిగ్‌బాస్ హౌజులో… డాక్టర్లు అర్జెంటుగా హౌజులోకి వెళ్లి చికిత్స అందించారు… విష్ణుప్రియ బాగా టెన్షన్ పడింది… హౌజ్‌మేట్లలో కలవరం… ఇదీ సోషల్ మీడియాలో ప్రచారం… తూచ్… అబ్బే, అది ప్రాంక్ అట అని మళ్లీ ప్రచారం… తీరా లైవ్ చూసినా… ఈరోజు టీవీ ప్రసారం చూసినా ఏమీ లేదు… 1) గంగవ్వకు సింపతీ కోసం హైవిలేజ్‌షో ఈ నాటకం ఆడాల్సిన పనిలేదు… ఆల్రెడీ […]
సాక్షి వర్సెస్ ఆంధ్రజ్యోతి యుద్ధం కాదు… సాక్షి ఊపిరి తీయడమే చంద్రబాబు లక్ష్యం..?
ఏపీ పాలిటిక్స్ అంటే… పార్టీల నడుమ పోరాటం మాత్రమే కాదు… అది కులాల మధ్య పోరాటం… అన్నింటికీ మించి మీడియా సంస్థల నడుమ పోరాటం… బయటికి ఏం ముసుగులతో కనిపించినా సరే..,. సాక్షి, సాక్షి టీవీ, ఎన్టీవీ, టీవీ9, టెన్ టీవీ ఎట్సెట్రా జగన్ వైపు అట… ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5, మహాన్యూస్ ఎట్సెట్రా చంద్రబాబు వైపు అట… వాళ్లు అధికారంలో ఉంటే వీళ్ల చానెళ్లు చూడనివ్వరు… వీళ్లు అధికారంలో ఉంటే వాళ్ల చానెళ్లు […]
ఇల్లు ఇల్లే… అది తాజ్‌మహల్‌కన్నా ఎక్కువే… ఒక భరోసా… ఒక చిరునామా…
. మా ఇంటి కథ :మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైనది… జర్నలిస్ట్ జ్ఞాపకాలు – మా ఇల్లు తాజ్ మహల్ కన్నా అందమైంది .. బాగుంటుంది . – సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం మిత్రుడికి సీరియస్ గా చెప్పిన మాట . బహుశా ఆరవ తరగతి చదువుతున్నప్పుడు సికింద్రాబాద్ శివాజీ నగర్ లో చాలా కొద్ది నెలలు అద్దెకు ఉండాల్సి వచ్చింది . రాత్రి తొమ్మిది అయితే చాలు లైట్ బంద్ చేసేవారు […]
నిత్యామేనన్ Vs సాయిపల్లవి… సోషల్ మీడియా పెట్టిన పెంట పంచాయితీ..!!
. పెంట పంచాయితీలు పెట్టడంలో సోషల్ మీడియాను మించింది లేదు… కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి… ‘‘నిత్యామేనన్‌కు జాతీయ అవార్డు రావడంపై సాయిపల్లవిలో అసహనం పెరిగింది… ఆమెలో ఆగ్రహం, అసంతృప్తి మొదలైంది… అందుకే సోషల్ మీడియాలో సాయిపల్లవి ఫ్యాన్స్ నిత్యామేనన్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు… సాయిపల్లవి ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగ్ మీద నిత్యామేనన్ కూడా అసహనంగా ఉంది… పలు ఇంటర్వ్యూలలో ఆమె తన అసంతృప్తిని వెళ్లగక్కింది…’’ ఇలాంటి వార్తలు కనిపిస్తున్నాయి… ఆ ట్రోలింగ్ సారాంశం ఏమిటంటే..? ‘‘అసలు ఆమెకు […]
వివాదాల నుంచి అవిముక్తం… ఈ శంకరాచార్యుడి పేరూ తీరూ అవిముక్తం…
సనాతన ధార్మిక నేతృత్వం… విచిత్రంగా ద్వనించి, నిర్వచనం కష్టమైన పదం… సనాతన దర్మానికి ఒకరు నేతృత్వం వహించేది ఏమిటి..? అసలు హిందూ ధర్మానికి ఈ పీఠాలు ప్రాతినిధ్యం వహిస్తాయా..? నిజంగా హిందూ మతవ్యాప్తికి ఈ పీఠాధిపతులు చేస్తున్న కృషి ఏమిటి..? పాదపూజలు, సంభావనలు తప్ప ఇంకేం పట్టింది..? చేస్తున్నారనే అనుకుందాం సరే… బీజేపీ మాత్రమే ఎందుకు పట్టించుకోవాలి..? ఇదే ప్రశ్న సోకాల్డ్ సెక్యులర్ పార్టీలకు ఎందుకు వేయవద్దు..? ఈ ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయంటే… అత్యంత వివాదాస్పద స్వామి […]
ఓ సాదాసీదా మూస కథకు మల్లెమాల మార్క్ ట్రీట్‌మెంట్…
సోగ్గాడు శోభనాద్రి లాంటి సినిమా ఈ నాయుడుబావ సినిమా . ప్రముఖ నిర్మాత , దర్శకుడు , కవి మల్లెమాల యం యస్ రెడ్డే 1978 లో వచ్చిన ఈ సినిమాకు నిర్మాత , దర్శకుడు , మాటల పాటల స్క్రీన్ ప్లే రచయిత . కధ రొటీనే అయినా ఆయన బాణీలో ఆయన తీసారు . ఓ కోటీశ్వరుడయిన తాతగారు , ఆయనకో ముద్దుల మనమరాలు , ఆస్తి మీద హీరోయిన్ మీద కన్నేసిన ఓ […]
పసిపెదాలకు చనుబాలదాత… ఎందరో పిల్లలకు ఆరోగ్య‘రక్షా’ జైన్..!
అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల బెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ దన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మాయమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్! అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మకు నమస్కరిస్తూ.. మహాకాళీ, సరస్వతీ, మహాలక్ష్మిని కన్న తల్లిని చాలా బెద్దమ్మగా, అండపిండ బ్రహ్మాండ మహాశక్తిగా కొల్చారు పోతానామాత్యుడు. అయితే, ప్రస్తుత నాగరిక సమాజంలో అలా కొలవాల్సిన ఓ తల్లి గురించి మనం చెప్పుకోబోతున్నాం. […]
‘సినిమాల్లోకి వచ్చిందంటే చాలు… ఇక ఆ మహిళ నీచమైన పదార్థమేనా..?’
. జర్నలిజం చాలా గొప్ప వృత్తి.. కానీ Thankless Job కూడా.. ఎందుకంటే, జనాల మనసుల్లో ఉన్న వికృతమైన ప్రశ్నలన్నిటినీ తమ భుజాలకెత్తుకుని వాటికి జవాబులు బైటికి తీసుకొచ్చే ప్రయత్నంలో తమ ఇండివిడ్యువల్ ఇంటెగ్రిటీని, మానవతా వలువలను కూడా ఒక్కోసారి విడిచేయాల్సి రావడం.. చాలా దారుణమైన పరిస్థితి.. That’s why I respect them a lot.. మొన్న ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా అనన్య నాగళ్లను ఒక మహిళా విలేఖరి తెలుగు ఫిలిమిండస్ట్రీలో కమిట్‌మెంట్ గురించి […]
- « Previous Page
- 1
- …
- 90
- 91
- 92
- 93
- 94
- …
- 448
- Next Page »