బహుశా ఈమధ్యకాలంలో ఇంతగా సూపర్ హిట్టయిన ఫోటో మరొకటి లేదేమో… అత్తారింటికి దారేదీ సినిమాలో హేమ ఆంటీ బుగ్గల్ని పిండుతూ ఏదో సెటైర్ వేస్తాడు బ్రాహ్మీ… ఆ పార్టీలో నేను లేను అని చెప్పడానికి బిర్యానీ వండుతూ, నేనిక్కడే ఉన్నానంటూ ఫేక్ వీడియోలు పెట్టింది కదా… ఆ ఫోటో వాడుతూ హేమ, రేవ్ పార్టీకి లింక్ పెడుతూ… మీమ్స్, సెటైర్లు, జోకులు, పోస్టులు భలే పేలుతున్నయ్… అబ్బే, ఆమె మామిడి కాయ పచ్చడి పెట్టడానికి పోయింది, కాదు, […]
Devara… జూనియర్‌పై సోషల్ మీడియా కుట్రలు నిజమేనా..?
ఒక వార్త… దాని సారాంశం ఏమిటంటే..? జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ కుట్రలకు పాల్పడుతున్నారు, దేవర సినిమాపై కావాలనే నెగెటివ్ చేస్తున్నారు, దేవర ప్రోమోకు చాలా త్వరగా లక్ష లైక్స్ వచ్చాయి, కానీ తర్వాత 60 వేలకు పడిపోయింది… కావాలనే కొందరు బాట్స్ (మెషిన్ జనరేటెడ్, ఆపరేటెడ్) ప్రయోగిస్తున్నారు, బాట్స్ ఆపరేటెడ్ అని తెలిసి ఎక్స్ వాటిని తొలగించింది, కావాలనే జూనియర్‌పై నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కొత్తేమీ కాదు, ప్రభాస్ మీద కూడా ఇలాగే జరిగింది… హమ్మయ్య, […]
ఒక సీఎంగా గుంపు మేస్త్రీ పనెలా ఉంది..? కేసీయార్‌కు ఏమిటి భిన్నం..?
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో చాన్నాళ్ల తరువాత అనుకోకుండా మాట్లాడుతుంటే, తను గమనిస్తున్న కొన్ని విషయాలు చెప్పాడు… ఇంట్రస్టింగ్ అనిపించాయి… కొన్ని ముఖ్యాంశాలు… ‘‘రేవంత్‌రెడ్డిని అందరూ గుంపు మేస్త్రీ అని వెక్కిరిస్తున్నారు కదా, నిజానికి ఆ పదం సీఎం పనికి కరెక్ట్ ఆప్ట్… అదే గుంపు మేస్త్రీ ఒక రాజకీయ నాయకుడిగా ఎలా వ్యవహరిస్తున్నాడో పక్కన పెట్టండి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేస్తున్నాడో మనకు ప్రధానం… నాకు తెలిసి ఒక దశలో కేసీయార్ దగ్గర పెండింగ్ […]
‘భార్యాబిడ్డల’ ‘బతుకుతెరువు’ కోసం ఓ అబద్ధం… సూపర్ హిట్…
Subramanyam Dogiparthi…… ఆకులు పోకలు ఇవ్వొద్దూ , నా నోరు ఎర్రగ చేయొద్దు , ఆశలు నాలో రేపొద్దు , నా వయసుకు అల్లరి నేర్పొద్దు . భార్యాబిడ్డలు సినిమా అనగానే ముందుగా గుర్తొచ్చేది ఆత్రేయ వ్రాసిన ఈ పాటే . నాకు చాలా ఇష్టమైన పాట . ఈ పాటలో నాగేశ్వరరావు , జయలలితల డాన్స్ కూడా నాకు భలే ఇష్టం . కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలన్నీ హిట్టే . ఈ […]
This is Not *Right…. ఈలయ రాజా స్వరం పూర్తిగా శృతి తప్పింది…
Aranya Krishna…. ఇదేం బుద్ధి రాజా! ఇళయరాజాకి అదేదో ఎక్కువైంది బాగా. లేకుంటే తాను కంపోజ్ చేసిన పాటల్ని ఎవరైనా ఓ ప్రదర్శనలో పాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేదా పరిహారం చెల్లించాలని చాలా కాలంగా షరతులు పెట్టడమే కాదు లీగల్ నోటీసులు కూడా పంపుతున్నాడు. ఇలా నోటీసులు అందుకున్న వారిలో గతంలో ఆయనకు అత్యంత ఆప్తుడైన, తనతోనే కలిసి ఎదిగిన, ఒరే అంటే ఒరే అని పిలుచుకునే ఎస్పీబి కూడా వున్నారు. అప్పటి నుండి ఎస్పీబి […]
మోడీ ఓ మానవాతీత వ్యక్తి అట… కాదు, దేవుడే పంపించని శక్తి అట…
ప్రధాని మోడీ… ఒకటి మాత్రం క్లియర్, ఆ హోదాలో తను ఏం చెప్పినా దానికి న్యూస్ వాల్యూ ఉంటుంది… ఐతే న్యూసెన్స్ వాల్యూ లేదంటే సెన్స్ వాల్యూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీ నేత, ఒక మంత్రి ఏం చెప్పినా సరే, వాటికి పెద్ద విలువ ఉండదు… కానీ మోడీ బీజేపీని సొంత మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చాడు, మరోసారి అధికారం కావాలని తిరుగుతున్నాడు… పదేళ్లుగా తను అంతర్జాతీయంగా కూడా భారతదేశ గళం… సో, తన […]
ఇళయరాజా చేస్తున్నది తప్పేనా..? నాణేనికి ఇది మరో కోణం…!
Sai Vamshi…… ఇళయరాజా పాటల మీద హక్కు ఎవరిది? తన అనుమతి లేకుండా స్టేజీలపై తన పాటలు పాడకూడదంటూ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ చరణ్, చిత్రలకు సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు పంపిన కొన్ని రోజుల తర్వాత ఓ తమిళ టీవీ ఛానెల్ ఓ నిర్మాతను ఇంటర్వ్యూ చేసింది. ఆయన పేరు గుర్తు లేదు. ఆయన తీసిన నాలుగు సినిమాలకు ఇళయరాజా సంగీతం అందించారని చెప్పారు. అందులో ‘నాయగన్’ ఒకటి. ఈ నోటీసుల విషయం గురించి […]
ఆ ఊరు దాటితే పాక్ ఆక్రమిత కాశ్మీరమే కానీ, పాకిస్థాన్ కాదు…
పాక్ ఆక్రమిత కాశ్మీర్… చైనా ఆక్రమిత అక్సాయ్ చిన్ వారం రోజులుగా భారత సరిహద్దు ప్రాంతం లడాఖ్ లో తిరుగుతుంటే విచిత్రమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. చిన్నప్పుడు బళ్లో మ్యాప్ పాయింటింగ్ మొదలు పెట్టినప్పటినుండి మనం చూస్తున్న భారతదేశ పటం; గీస్తున్న దేశ పటం; మదిలో నాటుకుపోయిన దేశ పటం అందరికీ తెలిసిందే. లేహ్ నుండి బయలుదేరి పాకిస్థాన్ సరిహద్దులో భారతదేశ చివరి గ్రామం థంగ్ ఒక చూడదగ్గ ప్రదేశంగా ఇక్కడికి వచ్చినవారందరూ పొలోమని వెళుతుంటే మేమూ వెళ్లాము. […]
కవి పరిచయం ఎవరైనా చేస్తారు… ఇలా చేయించుకోవడమే సార్థకత…
Taadi Prakash…. కాకినాడ వెన్నెల కెరటాలూ… తణుకు చెరుకు రసాస్వాదనా… ముళ్లపూడి శ్రీనివాసప్రసాదూ…. ……………………………………. A pure poet of sheer joy …………………………………… ముళ్లపూడి శ్రీనివాస్ ప్రసాద్ అనే పేరు మీకు తెలియదు కదా! కొంపలేం మునిగిపోవు. నాక్కూడా తెలీదు. పోనీ అతను రాసినవో, అనువాదం చేసినవో మీరు చదవలేదు కదా! ప్రపంచం తల్లకిందులేమీ అయిపోదు. నేనూ చదవలేదు. అయినా, ఈ అన్నోన్, అన్ సంగ్, అండర్ కవర్ రైటర్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. కవిత్వం […]
అన్నీ మోడీ శకునములే… పవర్ కుర్చీ ప్రాప్త సూచనలే…
మోడీ మళ్లీ ప్రధాని అవుతారు! బీజేపీకి స్వంతంగా 305 సీట్లు వస్తాయి! ఎవరో అనామకులు నుంచి వచ్చిన విశ్లేషణ కాదు ఇది! ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్తున్న విశ్లేషణ! (ఇండియాలోని ఫేమస్ సట్టా బజార్లు కూడా ఇవే అంచనాలతో బెట్టింగు రేట్లు ఫిక్స్ చేస్తున్నాయి… వాటి అంచనాలు చాలా లెక్కల్లో క్లిష్టంగా ఉంటాయి…) ఇయాన్ ఆర్థర్ బ్రెమ్మార్ (Ian Aurther Bremmer ) పొలిటికల్ సైంటిస్ట్, రచయిత, ఎంటర్, వ్యవస్థాపక అధ్యక్షుడు […]
మంచు కొండల మీదుగా… ఇది మన సైనికుల మరో యుద్ధం…
మంచు కొండల్లో రహదారి నిర్మాణాలు కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ లో లేహ్ నుండి నూబ్రా వ్యాలీకి 120 కిలో మీటర్ల దూరం. అయిదు గంటల ప్రయాణం. వేసవిలో కూడా మంచు కప్పుకున్న ఎత్తయిన పర్వతాల మీద, లోయల్లో దారి. ప్రపంచంలోనే వాహనాలు ప్రయాణించే అతి ఎత్తయిన దారి కర్దుంగా పాస్- సముద్ర మట్టానికి 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణం దానికదిగా ఒక అద్భుతం. ఆశ్చర్యం. కనువిందు. దక్షిణ భారతం నుండి వచ్చినవారికి కనుచూపు మేర పరచుకున్న […]
పరీక్ష పెట్టే పాత్ర దొరకాలే గానీ… ఎన్టీవోడు కంటతడి పెట్టిస్తాడు అక్షరాలా…
Subramanyam Dogiparthi…….. భీష్ముడిగా వయసు మళ్ళిన పాత్ర వేసిన తర్వాత పదేళ్ళకు అంటే 1972 లో బడి పంతులుగా NTR చాలా గొప్పగా నటించారు , మెప్పించారు . మధ్య వయసు మాస్టారిగా ప్రారంభమైన పాత్ర రిటైర్ అయి , వయసు మళ్ళిన పాత్రగా ముగుస్తుంది . బడి పంతులుగా బాధ్యత , తండ్రిగా బాధ్యత సంపూర్ణంగా నిర్వహించాక పుత్ర రత్నాల చేతిలో పడి దంపతులు ఎలా బాధపడ్డారో దర్శకులు పి చంద్రశేఖరరెడ్డి బాగా చూపారు . […]
సినిమా ప్రమోషన్లకు రాకపోతే… ఇక ఇండస్ట్రీ నుంచే బహిష్కరించేస్తారా..?!
సరే, హీరోయిన్ పాయల్ రాజపుత్ సదరు రక్షణ అనే సినిమా నిర్మాత ప్రణదీప్ ఠాకూర్‌కు 50 కాల్షీట్లు ఇచ్చింది… ఆయన గారు 47 వాడేసుకున్నారు… మరో 3 కాల్షీట్లు సినిమా ప్రమోషన్ కోసం అలాగే ఉంచుకున్నారు… ఆ సినిమా కంప్లీట్ అయ్యిందా లేదా తెలియదు,.. ఈమధ్యే ఏదో టీజర్ రిలీజ్ చేసినట్టున్నారు… ఇప్పుడు ప్రమోషన్లు ప్లాన్ చేశాం, వచ్చెయ్ అంటాడట… అదేమంటే 3 కాల్ షీట్లు వాడుకోలేదు కదా అంటాడట… ఇప్పుడు హఠాత్తుగా పాయల్ సోషల్ తెర […]
4 రోజులు మీడియా హడావుడి, అంతే… రూట్స్ జోలికి వెళ్లని నార్కొటిక్స్…
హైదరాబాద్ వ్యాపారి వాసు నిర్వహించిన రేవ్ పార్టీ… వోకే… పర్లేదు… బోలెడు మంది టీవీ, సినిమా నటీనటులు, రాజకీయ పార్టీల నాయకులు గట్రా హాజరయ్యారు… వోకే, అంతగా పరిచయాలు, సర్కిల్ ఉన్న బడా వ్యాపారి అన్నమాట… పర్లేదు… బెంగుళూరు శివారులోని బీఆర్ ఫామ్ హౌజు (ఓనర్ గోపాలరెడ్డి అట)లో జరిగిన ఆ రేవ్ పార్టీని బెంగుళూరు నార్కొటిక్ పోలీసులు భగ్నం చేశారు, వోకే… అబ్బే, మేమక్కడ లేనేలేం అని మాజీ హీరో శ్రీకాంత్, ఒకప్పటి నటి హేమ […]
అందరి మీదా వంగా ఎదురుదాడి… అనసూయ విమర్శపై సైలెన్స్…
చిత్రమైన పోస్టులు, ట్రోలర్స్‌కు బెదిరింపులు, ఆవేశం, వివాదాలకు తోడు ఆ డ్రెస్సులు, ఆ ఫోజులు… అసలు అనసూయ అంటేనే సోషల్ మీడియాలో అదొక డిఫరెంటు టైపు… కాకపోతే ఆవేశాన్ని ఆపుకోలేదు, సంయమనం తక్కువ, కడుపులో ఉన్నది కక్కేస్తుంది… అప్పట్లో అర్జున్ రెడ్డి సినిమా మీద తన అభిప్రాయం చెప్పేసరికి సోకాల్డ్ ఫ్యాన్స్ ఆమె మీద ఎగబడిపోయారు తెలుసు కదా… ఆంటీ అని ముద్రేశారు కదా… అప్పటి నుంచి ఆ అర్జున్‌రెడ్డి తాలూకు నెగెటివ్ ఒపీనియన్, తనను ట్రోలర్స్ […]
అక్షరాలా పదేళ్ల వయస్సు తగ్గిపోయింది ఆయనకు… ఇలా చేశాడు..!
జోసెఫ్ డిటూరి… ఆయన రిటైర్డ్ నేవీ ఆఫీసర్… సముద్రం మీద చాన్నాళ్లు డ్యూటీలు చేసినవాడు కదా… ఓ అధ్యయనం కోసం సహకరిస్తారా అనడిగారు సైంటిస్టులు… ఓఎస్, దానికేం భాగ్యం, కానీ ఏం చేయాలి అనడిగాడు తను… దేనికైనా రెడీ అన్నట్టుగా… ‘‘మూడు నెలలకు పైగా నీటి అడుగున ఉండాలి, మానవశరీరంపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూడాలనేది మా స్టడీ కాన్సెప్ట్… అంటే, సముద్రజలాల ఒత్తిడిలో గడపడం…’’ అన్నారు వాళ్లు… సరే, జలాంతర్గాముల్లో పనిచేసే సిబ్బంది మీద […]
ఆహా వాళ్లే మూలుగుతున్నారు… ఇక ఈటీవీ వచ్చి ఏం బావుకునేది…!!
ఒక వార్త కనిపించింది… ఇప్పటికే ఈటీవీ విన్ అని ఓ ఓటీటీ స్టార్ట్ చేసిన ఈటీవీ యాజమాన్యం త్వరలో మరో ఓటీటీ స్టార్ట్ చేయబోతోందని, 500 కోట్ల బడ్జెట్ పెట్టుకుందని ఆ వార్త సారాంశం… ఇన్నాళ్లూ ఈటీవీ విన్ కంటెంట్ విషయంలో పెద్ద దూకుడు చూపించని ఈటీవీ రెండో ఓటీటీని పలు భాషల్లో ఏకంగా నెట్‌ఫ్లిక్స్ రేంజులో డెవలప్ చేస్తుందని ఆ వార్త చెప్పింది… అరె, ఆ ఆహా ఓటీటీ వాడే అమ్ముకోలేక, కొనేవాడు లేక, వదిలించుకోలేక, […]
కామ్లిన్ జామెట్రీ బాక్స్.., మీకూ ఈ బాక్సులో దాచుకున్న జ్ఞాపకాలున్నాయా..?
Vijayakumar Koduri …. కామ్లిన్ జామెట్రీ బాక్స్ … పాఠశాల రోజులలో, ముఖ్యంగా 6/7 తరగతులలో వున్న రోజులలో ఒక కోరిక నన్ను సుదీర్ఘ కాలం వెంటాడింది. అది – కొత్త క్యామ్లిన్ కంపాస్ (జామెట్రీ) బాక్స్ ను కలిగి ఉండడం పేరుకు బ్యాగులో ఒక చిన్న నాసిరకం దీర్ఘ చతురస్రాకారపు అల్యూమినియం డబ్బా ఉండేది. అందులో విడి విడిగా కొనుక్కున్న నాసిరకం వృత్త లేఖిని, విభాగిని, కోణ మానిని స్కేలు వగయిరా అన్నీ ఉండేవి. వాటితో […]
ష్… ఈ వార్తను అంకుల్ శామ్ పిట్రోడాకు ఎవరూ చెప్పకండి ప్లీజ్…
సరే, ఎవరమూ అంకుల్ శామ్ పిట్రోడాకు చెప్పబోం, అధీర్ రంజన్ చౌదరికి అసలే చెప్పబోం కానీ ఏమిటది అంటారా..? డెయిలీ రికార్డ్, ది మిర్రర్ అనే అమెరికన్ మీడియా సైట్లలో కనిపించింది… ది హోబిట్ అని చరిత్రకారులు (ఆంత్రపాలజిస్టులు) ముద్దుగా పిలిచే హోమో ఫ్లోర్సైన్సిస్ అనే ఆదిమ జాతి మనుషులు ఇంకా ఈ భూమ్మీద కనిపించే చాన్సెస్ ఉన్నాయట… వాళ్లు మూడు ఫీట్ల 6 అంగుళాల ఎత్తు ఉండేవాళ్లు… కోతులు- చింపాంజీలకూ మనుషులకూ నడుమ పరిణామ దశ […]
ఎన్టీయార్ వియ్యంకుడి సినిమాలో నటించిన రామోజీరావు..!!
Bharadwaja Rangavajhala……. కంచుకోట విశ్వేశ్వర్రావు కు నివాళి… లయన్ యు. విశ్వేశ్వర్రావు అనో విశ్వశాంతి విశ్వేశ్వర్రావు అంటేనో తప్ప ఆయన్ను జనం గుర్తుపట్టరు. తెలుగు సినిమా రంగంలో కాస్త భిన్నమైన వ్యక్తిత్వం ప్రదర్శించిన నిర్మాత దర్శకుల్లో విశ్వేశ్వర్రావు ఒకరు. కోవిద్ సెకండ్ వేవ్ తీసుకెళ్లిపోయిన విశ్వేశ్వర్రావు తెలుగు సినిమా చరిత్రకు మిగిలున్న ఆఖరు సాక్షి. ఇప్పుడు వారూ వెళ్లిపోయారు. తెలుగు తెర మీద రాజకీయ చిత్రాలు తీసిన వారు చాలా అరుదు. ఆ కొద్ది మందిలో ఉప్పలపాటి […]
- « Previous Page
- 1
- …
- 97
- 98
- 99
- 100
- 101
- …
- 457
- Next Page »