Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆటో డ్రైవర్‌గా వృత్తి… కానీ తను ఓ కార్పొరేట్ గురు… ఓ కాలేజీ డ్రాపవుట్ కథ…

October 4, 2023 by M S R

అతను వృత్తి రీత్యా ఓ ఆటో డ్రైవర్… అంతకుమించి ఆర్థిక పరిస్థితులనుకూలించక 12వ తరగతికే చదువాపేసిన ఓ కాలేజీ డ్రాపవుట్. కానీ… ఆయన్ను కదిలిస్తే చాలు… నూతన ఆవిష్కరణలు, స్టార్టప్ లు, వైరల్ మార్కెటింగ్ జిమ్మిక్కులు… చరిత్ర, వర్తమానం, స్టీఫెన్ హాకింగ్, ఎకనామిక్ టైమ్స్ కథనాలు, ఫ్రంట్ లైన్ స్టోరీస్… ఇలా ఏదైనా చకచకా మాట్లాడేయగల అతడి సమర్థత ముందు పైచదువులు కూడా చిన్నబోయాయి. అందుకే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకు, ఐఐటీ, ఐఐఎం వంటి విద్యాసంస్థలకూ ఓ కార్పోరేట్ గురువయ్యాడు అన్నాదురై. మాజీ ముఖ్యమంత్రి పేరు పెట్టుకున్నందుకు… ఓ సామాన్యుడిగా ఉంటూనే వార్తల్లో వ్యక్తయ్యాడు 37 ఏళ్ల అన్నా.

అన్నా ఆటో అంటే చెన్నైలో ఫేమస్. మరెందుకు ఆటో అన్న.. టెడ్ టాక్ షోలో మాట్లాడే వ్యక్తయ్యాడు… బడా కార్పోరేట్ కంపెనీలకు గురువయ్యాడంటే… ఇతగాడి కస్టమర్ సర్వీస్ తో పాటు… ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అకాడమిక్ గా చదువాపేసినా, నేర్చుకోవాలనే తపనే అందుకు ప్రధాన కారణం. అన్నా ఆటో ఎక్కితే చాలు కస్టమర్స్ కి వెనుక దినపత్రికలు, వారపత్రికల వంటివాటితో పాటు… స్నాక్స్, ల్యాప్టాప్, ట్యాబ్లెట్స్, రిఫ్రెష్ అయ్యేందుకు పానీయాలు, మంచినీళ్లు, చాక్లెట్లు, వేఫర్స్, ఓ చిన్న టీవి సెట్, వైఫై కనెక్టివిటీ, స్వైపింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి.

అందరిలా మీటర్ పై రేటుకే… వీటన్నింటినీ కస్టమర్స్ కు అందిస్తూ… వాటి గురించి వినియోగదారులడుగుతుంటే విసుక్కోకుండా చెబుతూ.. కస్టమర్ సర్వీస్ లో తనకంటూ ఓ ప్రత్యే’కథ’య్యాడు అన్నా. అందుకే ఇప్పుడీ అన్నా సేవలను ఉపయోగించుకుంటున్న కార్పోరేట్ సంస్థలు, ఐఐటీల వంటి సంస్థలు… వినియోగాదారుడి పట్ల సేవలిందించేవాళ్ల వ్యవహారశైలి ఎలా ఉండాలనే దాని గురించి పాఠాలు చెప్పిస్తున్నాయి. అలా 2013లో తన ఆటోరిక్షాలో వినియోగదారుల కోసం అందిస్తున్న సేవల గురించి తనదైన శైలిలో అన్నా ఇచ్చిన ప్రసంగం ఆయన్ను ఓవర్ నైట్ స్టార్ గా మార్చేసింది.

Ads

ఆటో గురు

అలా వొడాఫోన్, హ్యుందాయ్, టయోటా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి పెద్ద సంస్థల్లో తన అనుభవాలను పంచుకుంటూ… IIT, ISB వంటి విద్యాసంస్థల్లోనూ తన జీవన ప్రస్థానాన్ని అక్కడి విద్యార్థుల కళ్లముందుంచుతూ… TEDx వంటి టాక్ షోస్ లోనూ పాల్గొని ఆశ్చర్యపర్చాడు ఈ ఆటోడ్రైవర్. నిజాయితీ… నేర్చుకోవాలనే తపన ఉంటే… ఆటోడ్రైవరైనా అట్నుంచి ఇటు, ఇట్నుంచటు స్టీరియోటైపిక్ ట్రిప్పులకే పరిమితం కాకుండా… అంతకుమించి జీవన ప్రయాణం చేయొచ్చని నిరూపించాడు అన్నా.

ఆటో గురు

తమిళనాడు తంజావూరు జిల్లా పెరవురాని అన్నా జన్మస్థలం. నాలుగేళ్ల వయసులో తన కుటుంబంతో చెన్నైకి తరలివెళ్లాడు. తండ్రీ, అన్నయ్య ఇద్దరూ ఆటో డ్రైవర్లే. అందుకే అన్నా కూడా దాన్నే బతుకుదెరువు చేసుకున్నాడు. ఓ బడా వ్యాపారవేత్త కావాలనే కలగనేవాడట అన్నా. కానీ ఆర్థిక సంక్షోభంతో… 12వ తరగతిలోనే చదువు మానేసి.. ఆటో ఎక్కేలా చేసింది బతుకుచిత్రం. మనకు ఎల్ఐసీ ఆఫీసులకు వెళ్లినప్పుడుగానీ… ఇంకా పలు కార్యాలయాల్లో వినియోగదారుడే దేవుడనే మహాత్ముడు చెప్పిన కోట్ తో కొన్ని సైన్ బోర్డులెలాగైతే కనిపిస్తాయో… అదే మోటో అన్నాది.

ఆటో అంటే కేవలం ప్యాసింజర్స్ ని తరలించడమే కాదు… అంతకుమించి అని ఓ కొత్త దారిని సృష్టించాడు. ఐటీ కారిడార్స్ లో ఆటోలో వెళ్లినప్పుడు ట్రాఫిక్ జామైతే… ఆటోల్లో సాఫ్ట్వేర్ స్యావీలు చూపించే అసహనాన్ని అర్థం చేసుకుని ఆటోలోనే వైఫై సేవలనూ అందిస్తున్నాడు అన్నా. అంతేకాదు.. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్సూ ఆటోలో ఎప్పుడూ రెడీ. అలా ఆటోలో వచ్చే కస్టమర్లతో తానందిస్తున్న సేవల తాలూకు ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండటంతో.. అన్నా ఇప్పుడు అన్నాదురై అంత ఫేమస్సయ్యాడు.

ఆటోగురు

అన్నా ఆటో అంటే కంప్లీట్ లేటెస్ట్. నేటి టెక్నాలజీ ఈరాకు తగ్గట్టుగా కనిపిస్తుంది. వర్షం పడితే ఛత్రీలు కూడా రెగ్యులర్ గా తన ఆటోలో ప్రయాణించేవారికిస్తుంటాడు. వాళ్లూ అంతే విశ్వాసంగా తమ పని ఐపోగానే తెచ్చిస్తుంటారని చెబుతాడు. అసలు బిజినెస్ టైకూన్స్ కూడా ఆశ్చర్యపోయే టాక్టిజం అన్నా సొంతం. తన ఆటోలో 20 ట్రిప్పులు ప్రయాణిస్తే… 250 రూపాయల మీటర్ రేట్ వరకూ మళ్లీ వాళ్లకు ఫ్రీ సర్వీసివ్వడం…

40 నుంచి 50 ట్రిప్పులైతే… 500 నుంచి 1000 రూపాయల వరకూ మీటర్ పై ఫ్రీగా తిప్పడం… చిల్డ్రన్స్ డే, ఉమెన్స్ డే వంటి అకేషన్లప్పుడు ఫ్రీగా తీసుకెళ్తుండటం.. ఒకవేళ ఎవరైనా చెన్నైలో టీచర్ గా పనిచేస్తుంటే వారికి వారంలో ఒకరోజు ఫ్రీగా సర్వీసివ్వడం వంటివి చేస్తుంటాడు. ఎందుకంటే ఇంజనీర్లైనైనా, డాక్టర్లనైనా, ఐఏఎస్ లనైనా తీర్చిదిద్దేది గురువులే కాబట్టి ఈ సౌకర్యమంటాడు.

నెలకు ఆటోడ్రైవర్ అన్నా సంపాదన లక్షా పద్దెనిమిది వేలైతే… ఆటోలో ఇతను కల్పించే అన్ని సౌకర్యాలకు ఖర్చయ్యేది కేవలం 19 వేల రూపాయలు మాత్రమే. ఇదంతా చేస్తుంటే… మొదట్లో కుటుంబసభ్యులు, మిత్రులు ఇంత లగ్జరీ సౌకర్యాలేంటి అంత డబ్బులు ఖర్చుపెట్టి అని లొల్లి పెట్టారట. కానీ బిజినెస్ ట్రిక్స్ ని అంచనావేయగల్గిన అన్నా.. తన పంథాలో ఆటో ఎక్కి ప్రయాణించాడు.

ప్యాండమిక్ సమయాన… పైన చెప్పుకున్న సౌకర్యాలకు తోడు… శానిటైజర్సూ, మాస్కులూ కూడా వచ్చి అప్పుడు అన్నా ఆటోలో చేరాయి. అందుకే అన్నాదురై వార్తల్లో వ్యక్తై… ఓ ప్రత్యేకథై.. ఇప్పుడు యూట్యూబ్ లో నిత్యం 5జీ సేవలకు సంబంధించిన ఓ అడ్వర్టైజ్ మెంట్ లో కీలకపాత్రై.. తన కథపై జనంలో ఓ క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు….. By… రమణ కొంటికర్ల

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions