కనీసం 16, 17 వేల కోట్ల వసూళ్లు ఉంటే తప్ప అవతార్-2 బ్రేక్ ఈవెన్ రాదు అన్నాడు కదా జెమ్స్ కామెరూన్… ప్రపంచ సినిమా చరిత్రలో బిజినెస్ కోణంలో అత్యంత చెత్తా ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ఈ సినిమాపై మంచి హైప్ అయితే వచ్చింది… ఇంకా పెరుగుతోంది… జాతర ఆరంభమైంది… ఇంకా 3 వారాల టైమ్ ఉన్నా సరే… ఇండియాలో అప్పుడే టికెట్ల బుకింగ్ స్టార్టయింది…
3 రోజుల క్రితం 45 స్క్రీన్లలో ప్రీమియం ఫార్మాట్ టికెట్లు అమ్మకానికి పెడితే అన్నీ అమ్ముడయ్యాయి… ఇండియాలో ఇది అతి పెద్ద ఓపెనింగ్… ది వే ఆఫ్ వాటర్ అని పేరు పెట్టిన ఈ అవతార్ సీక్వెల్‌ను ఇంగ్లిషు, హిందీ మాత్రమే కాదు, పాన్ ఇండియా భాషలుగా చెలామణీలో ఉన్న తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు…
త్రీడీ ఫార్మాట్ కోసం ఎక్కువ డిమాండ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి… ఎందుకంటే… అవతార్ వంటి హైలీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వాడిన ఇలాంటి గ్రాఫిక్స్ త్రీడీలోనే అలరిస్తాయి… ఈరోజు ఇతర షోలకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్టవుతున్నాయి… ఇక బాక్సాఫీసు కొత్త రికార్డుల వైపు అవతార్ పరుగు ఆరంభించబోతోంది… కరోనా అనంతరం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే అసలు సిసలు సినిమా అని ఎగ్జిబిటర్లు ఆనందంగా ఉన్నారు…
Ads
“జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్‌పై ఎల్లప్పుడూ మాయాజాలం సృష్టించాయి, ప్రేక్షకులు మరోసారి ఆ మాయను చూడటానికి ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన వచ్చింది, ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్‌లకు స్పందన, ఇక ఇతర అన్ని ఫార్మాట్‌లు ఈరోజు తెరుచుకోవడంతో, మేము భారీ సంఖ్యల్లో అడ్వాన్స్ బుకింగులను ఆశిస్తున్నాము’’
– PVR పిక్చర్స్ CEO కమల్ జియాంచందానీ
INOX లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా మాట్లాడుతూ, “ఈ అవతార్ సీక్వెల్ ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాబోతోంది… చాలా INOX ప్రాపర్టీలలో మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము సాధారణ 3D మరియు 2D ఫార్మాట్ బుకింగ్‌లు ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు ఇంకా గణనీయంగా పెరుగుతాయి’’ అంటున్నాడు…
సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ… “13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ చిత్రానికి వచ్చిన భారీ స్పందన చూసి మైమరచిపోయాం. అదే ఇంకా మరుపుకు రాలేదు… అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకుంటోంది. ఇక అవతార్-2 ఏం చేస్తుందో చూడాలి’’ అంటున్నాడు… అవతార్ కోసం చాలా థియేటర్లు పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసుకుంటున్నాయి… సౌండ్ బాక్సులను రిపేర్లు చేసుకుంటున్నాయి… థియేటర్లకు కూడా ఇది పండుగే మరి…!!
Share this Article