అయోధ్య గుడి వివాాదంలో ఉన్నప్పుడు… చీమ చిటుక్కుమన్నా కథలకుకథలు రాసేది మీడియా..! నెగెటివ్, కంట్రవర్సీ సబ్జెక్టులపై ఉన్నంత శ్రద్ధ, ఆసక్తి మీడియాకు సజావుగా సాగిపోయే విషయాలపై అస్సలు ఉండవు… ఎప్పుడూ పెట్రోల్ పోసే వార్తలే కావాలి దానికి… ఏ మీడియా సంస్థా దీనికి భిన్నం కాదు… ఉదాహరణకు అయోధ్య గుడినే తీసుకుందాం… ఏళ్లకేళ్లు దీనిపై వచ్చినన్ని వార్తలు అసంఖ్యాకం… అసలు ఈ వివాదం ఎప్పటికైనా తెగుతుందా..? రావణకాష్టంలా మండిపోతూనే ఉంటుందా అనుకునేవాళ్లు అందరూ… కానీ ఆ స్థలవివాదాన్ని సుప్రీంకోర్టు ముగించేసింది… ప్రధాని ఏడాది క్రితం భూమిపూజ కూడా చేశాడు… అయోధ్య గుడి నిర్మాణ ట్రస్టు దేశవ్యాప్తంగా వందల కోట్ల విరాళాలు కూడా వసూలు చేసింది… కానీ నిజంగా అక్కడ ఇప్పటివరకు జరిగిన పని ఎంత..? నిర్మాణం సాగుతోందా..?
దీనిపై ఏ మీడియాలోనూ ఏమీ కనిపించదు… అంతెందుకు, సాక్షాత్తూ ట్రస్టు విలేకరులను పిలిచి చూపించింది ఆలయ నిర్మాణంలో ప్రగతి ఎక్కడి వరకు వచ్చిందో… మీకు ఏదైనా తెలుగు పత్రికలో ఆ వార్తలు, ఆ ఫోటోలు వివరంగా కనిపించాయా..? ఒక్క టీవీలోనైనా ఈ ప్రసారం కనిపించిందా..? ఆ విరాళాల మీద, గుడి మీద టీఆర్ఎస్ నేతలు ఆమధ్య రాజకీయ కోణంలో సాగించిన విద్వేషపు రచ్చను మాత్రం అప్పట్లో విపరీతంగా హైలైట్ చేశారు…! ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమిటంటే..? గుడి నిర్మాణానికి అవసరమైన ఫౌండేషన్ పని పూర్తి చేశారు… అది కాస్త తేలికపాటి నేల కాబట్టి, ఈ బృహత్ నిర్మాణాన్ని తట్టుకునేలా… పునాదుల్ని పటిష్టంగా వేయాలనేది సంకల్పం… 50 అడుగుల వరకూ తవ్వి… కంకర, ఫ్లయ్ యాష్, సిమెంట్ గట్రా వాడుతూ… పన్నెండేసి అంగుళాల మందంతో పొరలుపొరలుగా నింపుతున్నారు… 400 * 300 విస్తీర్ణం… మొత్తం 48 లేయర్లు నింపేశారు… ఇక దీనిపై గుడి అసలు నిర్మాణాన్ని మొదలుపెట్టాల్సి ఉంది…
Ads
ఇప్పుడు రెడీ అయిన నేల మీద 4 లక్షల అడుగుల పింక్ స్టోన్ పరుస్తారు… దాన్ని మిర్జాపూర్ నుంచి సమీకరిస్తున్నారు… రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుంచి తెప్పించిన లక్ష అడుగుల మేరకు చెక్కబడిన శిలలు రెడీగా ఉన్నాయిప్పుడు… ప్రస్తుతం ప్రహరీ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు… ఇప్పుడప్పుడే అయిపోదు… 2023లో రాముడి దర్శనానికి వీలుగా గుడి రెడీ అవుతుంది… అనుకున్నమేరకు గుడి నిర్మాణం పూర్తి కావాలంటే 2025 వరకూ నిరీక్షణ తప్పదు అంటున్నారు Shri Ram Janmbhoomi Teerth Kshetra ట్రస్టు సభ్యులు… సో, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అయోధ్య రాముడి దర్శనాలు ప్రారంభించవచ్చునన్నమాట… శుభం…! అన్నట్టూ, గుడి మాత్రమే కాదు, అయోధ్య నగరాన్ని కూడా సుందరీకరిస్తున్నారు..!
Share this Article