Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా… నిశ్శబ్దంగా అయోధ్యలో ఓ ప్రధాన ఘట్టం…

March 20, 2026 by M S R

.

  • అయోధ్య గుడి నిర్మాణానికి మొదటి ఇటుక పేర్చింది ఒక దళితుడు… బీహార్‌కు చెందిన కామేశ్వర్ చౌపాల్… అయోధ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ ఉత్సవానికి కర్తగా ఒక ఓబీసీ… గుజరాత్‌కు చెందిన నరేంద్ర మోదీ… అయోధ్య నిర్మాణ పరిపూర్ణ సూచికగా శ్రీరామయంత్రాన్ని ప్రతిష్ఠించింది ఒక ఆదివాసీ, ఒక మహిళ… ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము… ఒకరు ఆలయ నిర్మాణ ట్రస్టు కార్యకర్త… మరొకరు ఈ దేశ ప్రధాని… ఇంకొకరు ఈ దేశ రాష్ట్రపతి…

 

  • బాలరాముడి విగ్రహాన్ని చెక్కింది ఓ విశ్వకర్మ, బీసీ… కర్నాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్… బాలరాముడు టెంట్ల కింద ఉన్నప్పటి నుంచీ 32 ఏళ్లుగా పూజలు చేస్తూ, ప్రస్తుతం అయోధ్య ప్రధాన అర్చకుడిగా ఉన్నది, గుడి నిర్మాణంలోని ప్రతి దశనూ పర్యవేక్షించింది ఆచార్య సత్యేంద్ర దాస్… ఆ అయోధ్యకే చెందిన బ్రాహ్మణుడు… వెరసి అయోధ్య రాముడు అందరివాడు… ప్రస్తుతం ఆధ్యాత్మిక భారతానికి అయోధ్య ప్రధాన కేంద్రం…

నిన్న ఉగాది పండుగపూట అయోధ్యలో జరిగిన విశేష ఘట్టం ఏమిటంటే… ఏళ్లుగా పూజలు అందుకుంటున్న శ్రీరామయంత్రాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠించారు… ఆలయ నిర్మాణం సంపూర్ణం అయ్యిందని గుడి బాధ్యులు ప్రకటించారు… 500 ఏళ్ల హిందూ జనవాహిని కోరిక ఇలా సాకారం అయ్యింది…

Ads

అయోధ్య

గుడి ఆక్రమణ, దానికై హిందూ సమాజం పోరాటం, కరసేవ, కూల్చివేత, న్యాయపోరాటం, కేసులు, జైళ్లు, కలహాల అధ్యాయాల్ని కాసేపు వదిలేస్తే… గుడి నిర్మాణం మొదలైన దగ్గర నుంచి అనేక దశల్లో హిందువుల్లోనే ధర్మవ్యతిరేకులు, రాజకీయ నాయకులు సృష్టించిన అపోహలు, అడ్డంకులు, అపచార ప్రచారాలు అన్నీ ఇన్నీ కావు… చివరకు రాగద్వేషాలకు అతీతంగా స్వాగతించాల్సిన పలువురు పీఠాధిపతులు కూడా…!

ఒకటి మాత్రం నిజం… బీజేపీ గనుక కేంద్రంలో అధికారంలోకి రాకుండా ఉంటే… అయోధ్య లేదు, బాలరాముడి గుడీ లేదు… అందుకే నిన్నటి ఆలయం సంపూర్ణమైనట్టు గోవింద దేవగిరి మహరాజ్ ప్రకటించడం, అదీ రాష్ట్రపతి చేతుల మీదుగా జరగడం కోట్లాది మంది హిందువులకు ఓ భావోద్వేగ క్షణం… ఇది హిందూ నవ భారత ఆత్మగౌరవ పునఃప్రతిష్ఠ!



రాముడి జన్మస్థలిని కాపాడుకుని గుడి కట్టుకోవడం ఒకెత్తు అయితే… స్వపక్షంలోని వ్యతిరేక శక్తుల ప్రచారాల్ని, అడ్డంకుల్ని దాటేయడం మరో ఎత్తు… ఎన్ని రకాల ద్వేషాన్ని గుమ్మరించడానికి ప్రయత్నించాయో కదా ఎన్నిరకాల శక్తులో..!

మోడీ పెళ్లాన్ని వదిలేశాడు, విగ్రహాన్ని తాకే అర్హత లేదంటాడు ఒకరు… అసలు జంటగా తప్ప ఈ తంతు ఒంటరిగా చేయకూడదు, అవమానం, అశాస్త్రీయం అంటాడు ఇంకొకరు… అసలు ఆ ముహూర్తమే కరెక్టు కాదంటాడు మరొకరు… ఇదంతా విగ్రహ ప్రాణప్రతిష్ఠ సమయంలో…

ఆ లింగం మీద తేళ్లను పీఠాధిపతులని కూడా చూడకుండా జాతి దులిపి పారేసింది… పరువు కోల్పోయారు శంకరాచార్యులు… అయోధ్య గుడి ఇంపార్టెన్స్ తెలిసిన మొహాలు కావు, పైగా వీళ్లేదో మతాన్ని ఉద్దరిస్తున్నట్టు బిల్డప్పులు… మతం వ్యక్తిగతం అని కొందరి సన్నాయినొక్కులు, రాముడు అందరివాడు, ఇది బీజేపీ ఈవెంట్, తరువాత వెళ్తాం అని కుంటిసాకులు… అవి అక్షింతలు కావు, రేషన్ బియ్యం అనే వ్యాఖ్యలు… ప్రాణప్రతిష్ఠకు కౌంటర్ కార్యక్రమాల్లో బీజేపీ వ్యతిరేక శిబిరాలు బిజీ బిజీ అప్పట్లో… (తెలంగాణ కాంగ్రెస్ ఏమీ శుద్దపూస కాదు, పింక్ క్యాంపయితే ద్వేషాన్ని గుమ్మరించింది)…

Ayodhya

చివరకు ఏ స్థాయికి ఈ విషప్రవాహం చేరిందంటే… మోడీ ఏదో తన వ్యక్తిగత నిబద్ధత, భక్తిని ప్రదర్శిస్తూ, ప్రాణప్రతిష్ఠ చేయడానికి తగిన నిష్ట కోసం 11 రోజుల ఉపవాస దీక్ష చేస్తే… అబ్బే, అన్నిరోజులు ఎలా బతుకుతారు ఆహారం లేకుండా, దేశమంతా తిరిగాడు, ఆ ఉత్సాహం ఎలా వచ్చింది, సో, అంతా అబద్దం అన్నాడు అప్పట్లో వీరప్ప మొయిలీ అనే ఓ పే-ద్ద తలతిక్క నేత… తనదేమైనా కేసీయార్ తెలంగాణ దీక్షా..?

అయోధ్య

మరో డౌటనుమానం… ఈ గుడిలో దళతులకు ప్రవేశం ఉందా అని సోషల్ మీడియాలో ప్రశ్న… కావాలనే దళితుల్లో గుడి వ్యతిరేకతను పెంచే కుటిల యత్నం… అసలు పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఆరుబయట కూర్చుని ఉంటే, గర్భగుడిలో ఓ దళితుడు కామేశ్వర్ చౌపాల్ ప్రాణప్రతిష్ఠ దగ్గరే ఉన్నాడని మరిచిపోయారు… ప్రాణప్రతిష్ఠ మరుసటిరోజు 5 లక్షల మంది దర్శించుకున్నారు… ఎవరినీ ఏ గుర్తింపు కార్డూ అడగలేదు… నీది ఏ రాష్ట్రం, ఏ మతం, ఏ కులం, ఏ వర్గం అనే ప్రశ్నల్లేవు… అయోధ్య రాముడు అందరివాడు…

సమాజ్‌వాదీ పార్టీ అయితే మరింత అసహనం… దాని నేత ప్రసాద్ మౌర్య అప్పట్లో ఎక్కడో వాగుతూ ‘ప్రాణప్రతిష్ఠతో రాయి సజీవం అవుతుందా…? మృతదేహాలు లేచి నడిచొస్తాయా..? ఇదంతా ఓ నాటకం… అని విరుచుకుపడ్డాడు… ఉత్తర ప్రదేశాన్ని మాఫియా రాజ్యంగా మార్చిన ప్రబుద్ధుల నుంచి ఇంకేం ఆశించేది… అఫ్‌కోర్స్, యోగికి భయపడి ఇప్పుడెవరూ కిక్కుమనడం లేదు…

ayodhya

(ఈ ఫోటోలో కామేశ్వర్ చౌపాల్ ఉన్నాడు…)

ఈ కామేశ్వర్ చౌపాల్ అయోధ్య ట్రస్టు సభ్యుడు… 1989లో గుడి పునాదికి మొదటి ఇటుక వేసింది తనే… 2002 నుంచి 2014 దాకా బిహార్ కౌన్సిల్ మెంబర్, తరువాత లోకసభకు పోటీచేశాడు… ఒక దశలో ఆ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిని చేస్తారని కూడా అనుకున్నారు… అదీ ఆయన నేపథ్యం…

మరొకరి నుంచి మరో ప్రశ్న… ఆర్య సంస్కృతిలో తెల్ల రాముడిని గాకుండా ద్రవిడ సంస్కృతిలో నల్ల రాముడిని ఎలా ప్రతిష్ఠించారు అట… అది 2- 300 ఏళ్ల నాటి కృష్ణశిల, కావాలనే ఆ శిలను ఎంచుకున్నారనీ, ఇంకెక్కడి నుంచో వచ్చిన పాలరాతి రాముడి విగ్రహాన్ని కాదని కర్నాటక శిల్పి యోగిరాజ్ శిల్పాన్నే ఎంపిక చేశారనీ మరిచిపోయారు… మరొక విమర్శ… అబ్బే, అయోధ్య పూర్తిగా ఉత్తరాది ఆస్తి… అసలు సౌత్ ఇండియా ప్రాతినిధ్యం, ప్రాధాన్యం, సొంతదనం ఏముందని..!

ఉడుపి సాధువు

(అయోధ్య అర్చనలో విశ్వప్రసన్న తీర్థ)

అసలు ఆ శిల్పమే దక్షిణాది ఆస్తి కదా… పైగా ఉడుపి పెజావర్ మఠం సాధువు విశ్వప్రసన్న తీర్థ ఆ ప్రాణప్రతిష్ఠ తంతులో స్వయంగా శాస్త్రోక్త విధుల్ని నిర్వర్తించిన అర్చక మండలిలో సభ్యుడు మాత్రమే కాదు, కొన్నాళ్లుగా ఆలయ నిర్మాణ పర్యవేక్షణను చూసుకున్న అయోధ్య ట్రస్టు సభ్యుడు కూడా… అంతేకాదు, ప్రాణప్రతిష్ఠ జరిగాక 48 రోజులపాటు మండలోత్సవం ఈయన మార్గదర్శకత్వంలోనే సాగింది… ఐనా చాలా దేశాలే ఓన్ చేసుకుంటుంటే మనమేమో ఉత్తర దేవుడా, దక్షిణ దేవుడా అని చిల్లర విమర్శల్లోకి జాారిపోయాం చాన్నళ్లు… క్షుద్ర వాదనలు, శుష్క సిద్ధాంతాలు, కుటిల రాజకీయాలు…

చివరగా… ప్రాణప్రతిష్ఠ వేళ, నైవేద్య సమర్పణ సమయంలో ఎవరూ చూడకూడదని కర్ణాటక మధ్వ పూజారుల పద్దతి… అందుకే నాడు గర్భగుడిలో మోడీ పక్కన నిల్చుని తన మొహం మీద వస్త్రం కప్పుకున్నది విశ్వ ప్రసన్న తీర్థ…

మీకు గుర్తుందా..? ఆదివాసీ కాబట్టి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్యకు దూరం పెట్టారనీ, పైగా ఆమె భర్త మరణించాడనీ, అందుకే ఆమెను ఈ కార్యక్రమాల్లో పాల్గొననివ్వలేదనీ కొందరు విమర్శించారు… అవన్నీ ఛేదిస్తూ ఆలయ ట్రస్టు ఆలయ సంపూర్ణ నిర్మాణ ప్రకటన వేళ, శ్రీరామయంత్ర ప్రతిష్ఠాపన ఆమె చేతులతో చేయించి… అన్నిరకాల చిల్లర ప్రచారాలకు తెరదించారు ఆలయ బాధ్యులు… శుభం… ఇంకా ఏమైనా మిగిలిందా అయోధ్య మీద ద్వేషం కక్కడానికి..?!

అయోధ్య

అవునూ, సోకాల్డ్ వీర సెక్యులర్ తెలుగు ప్రధాన నాయకులు జగన్ (ప్రస్తుతం హిందూ ధర్మపరిరక్షణ ప్రచారాల్లో ఉన్నాడు), ప్రపంచంలోకెల్లా పెద్ద హిందువు కేసీయార్, రేవంతుద్దీన్ రెడ్డి తదితరుల్లో ఎవరైనా అయోధ్యను దర్శించారా..? దర్శిస్తే తమ సెక్యులర్ పాతివ్రత్యం, పవిత్రత దెబ్బతిని మైలపడిపోతామని భావించారా..?!

ముగింపు: కుట్రల కోటలు కూలి.. కొలువుదీరిన కోదండరాముడు!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • నిన్న రాష్ట్రపతి చేతుల మీదుగా… నిశ్శబ్దంగా అయోధ్యలో ఓ ప్రధాన ఘట్టం…
  • పది దేశాలకు అంటుకున్న చమురు మంటలు… What Next ..?
  • ‘ఎల్లమ్మ’గా భాగ్యశ్రీ..? ఊదు కాలదు- పీరు లేవదు..! పాపం వేణు..!!
  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • జగన్ క్యాంప్ ఎంత డిఫన్స్‌లో పడిందంటే… ఇదుగో ఈ యాడ్ పక్కా రుజువు…
  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions