Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘తింటే తిన్నారు – ఏ గుడిలో దొంగలు లేరు – ఇవన్నీ దొంగ ఏడుపులు సర్’’

July 4, 2026 by M S R

.

పని మీద ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్లాలి… ఛలో ర్యాపిడో… ఆటో… దూరం బేరం కదా, వెంటనే వచ్చాడు, ఎక్కాను… ఆటో వెనుకాల అయోధ్య గుడి బొమ్మ అతికించి ఉంది, ప్రస్ఫుటంగా కనిపిస్తూ..! హ్యాండిల్‌కు పైవైపు హనుమంతుడి బొమ్మ… కాసేపాగి, అడిగాను… ఏం పేరు బ్రదర్?

రామ్మోహన్ సర్…

Ads

ఎక్కడ మీది?

చౌటుప్పల్ దగ్గర ఓ చిన్న ఊరు సర్…

అయోధ్య, హనుమంతుడు, ఏంటీ, రామభక్తుడివా?

అవును సర్…

అయోధ్య వెళ్లొచ్చావా?

లేదు, వెళ్లాలి, మొక్కు ఉంది… కానీ ఆల్రెడీ ఎప్పుడో బాల రాముడి రుణం తీర్చుకున్నా…

అదెలా..?

కరసేవకు వెళ్లాను, ముల్లాయంసింగ్ జరిపించిన కాల్పుల్లో తృటిలో తప్పించుకున్నా, మొత్తం పది మందిమి పోయినం అప్పట్లో…

కూలగొట్టిన టీమ్‌లో కూడా ఉన్నవా?

ఉన్నాను, ఆ కూలిన ఇటుకలు తెచ్చుకున్నాం తలా ఒకటి, ఇంట్లో ఉంది…

అందరూ గుడికి ఇటుకలు ఇస్తే, నువ్వు ఆ కూలిన భవనం ఇటుక తెచ్చుకున్నావా, వింతగా ఉంది… ఐనా ఆ గుడి పేరు మీద వందలు, వేల కోట్లు దోపిడీ చేశారట కొందరు, సిగ్గు అనిపించడం లేదా? వీళ్ల కోసమా మేం త్యాగాలు చేసింది, ప్రాణాలు పణంగా పెట్టి కరసేవకు వెళ్లిందని అనిపించలేదా..? దుర్మార్గం కాదా…

లేదు సర్, ఏ గుడిలో దొంగలు లేరు సర్, అయోధ్య గుడికి చందాలు వచ్చినవే 3500 కోట్లు, అందులో గుడి కట్టడానికే 2100 కోట్లు, మొత్తం 4 వేల కోట్ల కుంభకోణం అని యాంటీ మోడీ సెక్షన్ దుష్ప్రచారం చేస్తున్నారు…

ఐనాసరే, రాముడి గుళ్లో దొంగలు పడ్డారు అనేది రామభక్తులందరికీ ఇజ్జత్ ఖరాబే కదా…

కాదు, తినేవాడు తింటాడు… మా కలల అయోధ్య కళ్ల ముందు నిర్మాణమైంది, సోమనాథ్ తరువాత హిందువుల ఆత్మాభిమాన సింబల్ సర్… అది చాలదా మాకు? ఏం మీకు గర్వంగా లేదా?

ఇన్ని చెబుతున్నావు, ఏం చదువుకున్నావు? ఇదంతా ఎవరు ఎక్కించారు నీకు?

బీఏ… ఇంట్లో పరిస్థితి బాగాలేక, సిటీకి వచ్చి ర్యాపిడో నడుపుతున్నా సర్… రోజూ పాలిటిక్స్ ఫాలో అవుతాను సర్…

అంతటి ప్రిస్టేజియస్ గుడికీ దొంగల బెడద అంటే బాధనిపించడం లేదా..?

ఉంది, కానీ అందరూ దొరుకుతారు, క్లీనింగ్ జరుగుతుంది…

అఖిలేష్, కేజ్రీవాల్, రాహుల్ అందరూ మోడీని తిడుతున్నారు కదా…

నాకు మోడీ, యోగీ ముఖ్యం కాదు సర్, పైగా ఇదేమీ బీజేపీ గుడి కాదు, విమర్శించే వెధవలకు బుద్ధి లేదు… ఒక్కడూ అయోధ్యకు వెళ్లొచ్చిన పాపాన పోలేదు, దొరికింది  చాన్స్ అనుకుని తిడుతున్నారు…

అయోధ్యకు వెళ్లొస్తేనే దోపిడీపై ఎలుగెత్తాలా? ఇదేం లెక్క?

సర్, సీరియస్‌గా చెబుతున్నా… ఇదే అఖిలేష్ నాలాంటి బోలెడు మంది కరసేవకుల్ని పొట్టన పెట్టుకున్న ములాయం కొడుకు, అయోధ్యకు అడుగడుగునా అడ్డం పడ్డవాడు, ఆర్జీడీ లాలూ ఏమైనా తక్కువా? కేజ్రీవాల్ ఖలిస్థాన్ సపోర్టర్, రాహుల్ గాంధీ ముస్లిం సపోర్టర్, ఎవరు సుద్దపూసలు..? వీళ్లంతా దీన్ని బీజేపీ ఇష్యూలాగే చూస్తున్నారు…

నీలో ఓ హిందూ తీవ్రవాది ఉన్నట్టున్నాడు..? బీజేపీ కార్యకర్తవా?

కాదు, కానీ తీవ్రవాది అన్నారు కదా, ఆ ముద్ర పడితే గర్వకారణమే కదా సర్, తెల్లారిలేస్తే ఓల్డ్ సిటీ బజార్లలో కూడా ఈ బొమ్మ పెట్టుకునే ఆటో నడిపిస్తున్నాను. ఏమవుతుంది? నేను పోతే ఇంకా నలుగురున్నారు మా అయ్యకు… అలా అనుకునే కరసేవకు పోయాను…

(నా దగ్గర ప్రశ్నల్లేవు, మౌనం)

ఎవరు సుద్దపూసలు సర్, యాదగిరిగుట్ట మళ్లీ కట్టారు కదా, అక్రమాలు లేవా? ఇదే కేసీయార్ యాగాలు, హోమాలు అంటాడు, అయోధ్య మీద విషం కక్కాడు కదా… తిరుమలలో అక్రమాలు, శబరిమలలో అవినీతి… దొంగలు లేనిదెక్కడ? పుష్కర స్నానాలు, పంచాంగ శ్రవణాల జగన్ ఏమైనా తక్కువా? ఆ భూమన గురించి తెలియనిది ఎవరికి? కేదారనాథ్ బంగారం మీద కూడా ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు… ఏ దేవుడిని వదిలారు ఈ సెక్యులర్లు? ఇతర మతాల మీద ఒక్క మాట మాట్లాడమనండి, ఉరికించి చంపుతారు…

నువ్వు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్లేవాడివా?

మా ఊళ్లో శాఖ లేదు, మా ఊరు కమ్యూనిస్టుల అడ్డా, కరసేవకు వెళ్లినప్పుడే నాకు ఈ సెక్యులర్ బాగోతాల కథలు అర్థమయ్యాయి… యమునలో మురికి  చేరినట్టు, అయోధ్యలోనూ కొంత చేరి ఉండొచ్చు, క్లీనింగ్ జరుగుతుంది, వచ్చే నెలలో వెళ్తా, టికెట్లు బుక్ చేసుకున్నా సర్… మా పాత కరసేవ టీమ్ అంతా కలిసి వెళ్తున్నాం…

(సంభాషణ ఎక్కువగా తెలంగాణ డయలెక్టులోనే సాగింది… వరంగల్, నల్గొండ రూరల్ మాండలికం… అందరికీ సమజ్ కావాలని ఈ మీడియా భాషలో రాశాను… చివరగా, ఆటో ఫోటో తీస్తానంటే తీసుకొండి సర్ అన్నాడు… ఎందుకో నాకే వద్దనిపించింది)…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • AI పై సంచలనం… చూడబోతే కల్కి 2042…13 గంటల్లో 7 కోట్ల రీచ్ ట్వీట్ !!
  • ఇప్పటి ప్రపంచాన్ని ఏడు దశాబ్దాల క్రితమే ఊహించారు ఈ రచయితలు!
  • నోరా, నీది నోరేనా..? ఓ ఎయిర్‌లైన్స్ రుసరుస- 3 కోట్లకు కేసు !!
  • దొరహంకారం !! చావు డప్పుల బాటకు శుద్ధి !! ఇది మరింత అవమానకరం !!
  • శాసనసభకు స్పీకరే సుప్రీమ్ – చాలామందికి తెలియని ఓ ఇంట్రస్టింగ్ కేసు !!
  • నువ్వు చూడకపోవడమా..? ‘ఆమె’ కనిపించకపోవడమా..? ఏది బ్రహ్మచర్యం !!
  • బర్తరఫ్ వైపే ! లేటయినా గట్టిగానే కొట్టే ప్రొసీజరల్ అడుగులు !!
  • ముంతాజ్ పేరు మార్చుకుంది ! వైసీపీ ‘స్వరం’ మారింది ! అంతా మాయ !!
  • ఇదేమైనా అట్లాస్ సైకిలా..? 40 రోజులకు ఓ వార్‌షిప్ నిర్మించడానికి !!
  • ఖడే హనుమాన్ ! భారీ యంత్రాలెన్ని తెచ్చినా ఇంచ్ కదలని విగ్రహం !!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions