.
మరొక తార నిష్క్రమించింది… బి.సరోజాదేవి 87 ఏళ్ల వయస్సులో బెంగుళూరులో మరణించింది… నేటి తరాలకు ఆమె తెలియకపోవచ్చు… చాలా ఏళ్లు ఆమె ఫిమేల్ సూపర్ స్టార్… తెలుగు, కన్నడం, తమిళం, హిందీ భాషల్లో స్టార్…
ఏడు దశాబ్దాలు… 200 సినిమాలు… భారతీయ సినిమా చరిత్రలో అత్యంత విజయవంతమైన తారల్లో ఆమె పేరూ ఉంటుంది… ఓ దశలో హైలీ పెయిడ్ ఆర్టిస్టు ఆమె… అంత డిమాండ్ ఉండేది… బెంగుళూరు కదా జన్మస్థలం… ప్రధానంగా ఆమె కన్నడ సినిమాల్లోనే ఎక్కువగా నటించేది…
Ads
17 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ ఆమె… 1955 మరియు 1984 మధ్య 29 సంవత్సరాలలో వరుసగా
161 చిత్రాలలో ప్రధాన కథానాయికగా నటించిన ఏకైక భారతీయ నటి ఆమె… తమిళం, కన్నడంతో పోలిస్తే తెలుగులో ఒకింత తక్కువే… 1957లోనే తెలుగులో పాండురంగ మహాత్యంతో ప్రవేశించింది… కానీ తమిళ ఇండస్ట్రీ మాత్రం ఆమెను ఓన్ చేసుకుంది… తమిళ సూపర్ స్టార్లు అందరూ ఆమెతో సినిమాలు చేసినవారే…
పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఆమె… తెలుగులో సినిమాలు అంటే దానవీరశూరకర్ణ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, దాగుడుమూతలు, జగదేకవీరుడి కథ, అమరశిల్పి జక్కన్న, పండంటి కాపురం, పెళ్లి కానుక, దాగుడుమూతలు, అల్దుడు దిద్దిన కాపురం వంటి సినిమాలు గుర్తొస్తాయి… 1967లో పెళ్లయ్యాక కూడా బిజీ నటిగానే ఉంది.., కానీ భర్త మరణం తరువాత తను అంతకుముందు సంతకాలు చేసిన సినిమాలు పూర్తి చేసి, చాలా ఏళ్లపాటు తెరకు దూరంగా ఉంది…
ఆమె తండ్రి భైరప్ప మైసూర్‌లో పోలీసు అధికారి.., సరోజా దేవి తన తండ్రితో తరచుగా స్టూడియోలకు వెళ్లేది, ఆమె నృత్యం చేసిన తర్వాత ఆమె వాచిన పాదాలకు మసాజ్ చేసేవాడు… అంతగా ప్రోత్సహించేది ఆ కుటుంబం… కాకపోతే తల్లి మాత్రం స్విమ్ సూట్లు, స్లీవ్‌లెస్ బ్లౌజులు ధరించకుండా నిషేధం విధించింది… కానీ నాలుగు భాషల్లో ప్రఖ్యాత హీరోలందరి సరసన నటించడానికి ఆ డ్రెస్ కోడ్డ అడ్డుపడలేదు…
1950లలో కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషలలో నటించిన అతి కొద్ది మంది నటీమణులలో ఆమె ఒకరు… చతుర్భాషా తార అని పిలిచేవాళ్లు… ఎంజీఆర్ చిత్రాలకు ఆమె ‘లక్కీ మస్కట్’… 26 సినిమాలు చేసింది ఆయనతో… ఫేమస్ తెరజంట… సేమ్, వాణిశ్రీ… మహిళలు ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌ను ఆరాధించారు… ఆమె చీరలు మరియు బ్లౌజ్‌లు, ఆభరణాలు, కేశాలంకరణను అమ్మాయిలు బాగా అనుసరించేవాళ్లు… ఓ ఫ్యాషన్ ఐకన్ 1960లలో…
శివాజీ గణేషన్‌తో కూడా ఆమె సక్సెస్‌ఫుల్ పెయిర్… 22 బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు చేశారు ఇద్దరూ కలిసి… జెమిని గణేషన్‌తో 17 సినిమాలు… అంటే అర్థమవుతోంది కదా తమిళంలో ఏ రేంజ్ సూపర్‌స్టారిజం అనుభవించిందో…
Share this Article