మామూలుగా మనకు మంచో చెడో జరిగే పక్షంలో… విధి కొన్ని సంకేతాలను పంపిస్తుంది… చాలామంది నమ్మరు, కానీ కొందరు బలంగా నమ్ముతారు… గతంలో తమ అనుభవాల్ని బట్టి వాళ్లలో ఆ నమ్మకం పెరిగి ఉంటుంది… ఉదాహరణకు కన్ను అదరడం మగవాళ్లకు ఎడమకన్ను, ఆడవాళ్లకు కుడికన్ను అదరడం ఏదో అశుభానికి సంకేతం అంటారు… అలాగే కలల్లో కొన్ని సంకేతాలు వస్తుంటాయి… చాలామంది తెల్లారేసరికి మరిచిపోతారు, కొందరికి గుర్తుంటాయి కానీ విశ్లేషించుకోలేరు…
అదే తెలుగు టీవీ సీరియళ్లు అనుకొండి, ఈ విధి సంకేతాలు కూడా ఓ విపరీత ధోరణిలో ఉంటాయి… ఉదాహరణకు… మనం కారులో వెళ్తుంటే దట్టంగా నామాలు పెట్టుకున్న ఎవరో ఓ ముసలాయన అడ్డం వచ్చి… ‘‘శివుడు నీపై కోపంగా ఉన్నాడు బిడ్డా, జాగ్రత్త, నీ ఇంటివాళ్లను అస్సలు నమ్మకు’’ అని ఏదేదో అరుస్తాడు… అలాగే ఓ సోది చెప్పే మహిళ నేరుగా ఇంట్లోకి వస్తుంది… ‘‘సోది చెబుతాను సోది, చెడు నీ ఇంటి చుట్టే తిరుగుతోంది, పైలంగ ఉండు తల్లీ’’ అని వెళ్లిపోతోంది… ఇలాంటివన్నమాట…
సోమవారం ఉదయం 10 గంటల నుంచి నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలిమ్ ఛాంబర్‌లో ఉంచారు… సినీ ప్రముఖులు, రాజకీయనేతలు తరలివచ్చి నివాళ్లు అర్పిస్తున్నారు… ట్విట్టర్‌లో బూతులు తిట్టుకునే విజయసాయిరెడ్డి, చంద్రబాబు దాాదాపు అరగంటపాటు మాట్లాడుకున్న అంశమే బాగా చర్చనీయాంశమైంది నిన్న… హాస్పిటల్‌లో చికిత్సల నుంచి డిశ్చార్జ్ అయి, అంత్యక్రియలు పూర్తయ్యా వరకూ బాలయ్య అక్కడే ఉన్నాడు… అన్నీ తానై నిర్వర్తించాడు… తారకరత్న పిల్లల బాధ్యతలు తాను తీసుకుంటాను అని చెప్పాడు… అందరూ బాలయ్య తన అన్న కుమారుడి పట్ల ప్రదర్శించిన కన్సర్న్ పట్ల తనను అభినందించారు…
Ads
కానీ హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన ఒకాయనకు మాత్రం ఇంకేదో కనిపించింది… మరేదో చెప్పాలనిపించింది… నేరుగా వచ్చి అందరు ప్రముఖుల్లాగే తారకరత్నకు నివాళి అర్పించాడు… తరువాత అక్కడే ఉన్న బాలయ్య వద్దకు వెళ్లాడు, పెద్దపెద్దగా ఏదో అరిచాడు… జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు అని వేలెత్తి మరీ చూపిస్తూ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు… తనేం చెబుతున్నాడో బాలయ్య కూడా అంతే శ్రద్ధగా విన్నాడు… అఖండ తరువాత కాస్త ఓపిక, సంయమనం పెరిగినట్టున్నాయి…
ఈలోపు అక్కడి పోలీసులు అలర్టయిపోయి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు… ఎవరో మతిస్థిమితం లేని వ్యక్తిగా ముద్రవేశారు… ఈ సినిమాటిక్ సన్నివేశం అక్కడున్న ప్రముఖుల్లో పెద్దగా చర్చనీయాంశమైంది కూడా… నందమూరి ఫ్యామిలీలో అవాంఛనీయ విపత్తులు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్న స్థితిలో పిచ్చోడిలా కనిపించే ఓ అపరిచితుడు వచ్చి బాలయ్యను హెచ్చరించడం దేనికి సంకేతం..? ఎవరికి ప్రమాదం..?
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు..? అంతమందిలో కేవలం బాలయ్యనే ఎందుకు హెచ్చరించాడు..? ఫిలిమ్ నగర్ పరిసరాల్లోనే ఏదేదో మాట్లాడుతూ తిరుగుతుంటాడనీ, పిచ్చోడిలా జమకట్టి ఎవరూ పట్టించుకోరనీ ప్రాథమిక సమాచారం… ఆ పిచ్చోడి మాటలకు ప్రాధాన్యం ఇవ్వడం అనవసరం అని కొట్టిపారేస్తున్నారు… ఏమో, విధి బాలయ్యకు ఏమైనా సంకేతాలు పంపిస్తోందా..? జాగ్రత్తగా ఉండాలని..!!
Share this Article