.
ఒకే రోజు ఇండియన్ క్రికెట్‌కు రెండు అవమానకర పరాభవాలు!! అవును, ఒకటి… ఐర్లాండ్ అనే పసికూన మీద వరుసగా రెండో పరాజయం… అదీ అవమానకరమైన రీతిలో..! రెండోది… వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ పోటీలో ఇండియా ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి, ఇంటి ముఖం పట్టింది..!
మొన్న ఐర్లాండ్ జట్టు చేతిలో ఫస్ట్ టీ20 మ్యాచ్ ఓడిపోవడం అంతా ఇండియన్ జట్టు స్వయంకృతమే అనీ, అడ్డగోలు వ్యూహాాలు, దిక్కుమాలిన ఆటతీరు, నిర్లక్ష్యం అని విమర్శిస్తే… చాలామంది భారతీయ క్రికెట్ అభిమానులకు మింగుడు పడలేదు, టీ20 మ్యాచుల్లో ఇలాంటివి సహజం, అలా జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు అని వెనకేసుకుని వచ్చారు…
Ads
కానీ ఇప్పుడు రెండో మ్యాచ్ కూడా అంతే దరిద్రంగా ఓడిపోయారు… మొన్న బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడం వల్లే ఓడిపోయామని సమర్థించుకున్నారు… దానికి తగినట్టే వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ కృష్ణను తీసేసి, సూర్యాంశ్, ప్రిన్స్ యాదవ్‌ను తీసుకొచ్చారు. ఐనా సరే, మొన్నటి మ్యాచు స్కోర్‌లాగే 154 రన్స్ చేసింది ఐర్లాండ్… 48 రన్స్‌కు 3 వికెట్ల నుంచి 154 దాకా తీసుకుపోయారు…
బ్యాటింగుకు దిగాక ఇండియన్ జట్టు బ్యాటింగులో మళ్లీ అదే నిర్లక్ష్యం, వికెట్లు టపటపా పారేసుకున్నారు… ఒక దశలో 4 ఫర్ 35… తరువాత కూడా నిలదొక్కుకోలేదు… ఫస్ట్ మ్యాచులోలాగే పేలవంగా, నిస్సారంగా ఆడి చివరకు 153 పరుగులకు చాప చుట్టేశారు… కేవలం ఒక రన్‌తో ఓడిపోయినా సరే, చివరి బాల్ దాకా జట్టు నానా యాతన పడిన తీరుతో మరోసారి ఇజ్జత్ ఖరాబ్… సంజూ శాంసన్, అభిషేక్ శర్మ డకౌట్స్… తిలక్ వర్మ ఒక్కడే కాస్త బెటర్. 55 రన్స్ చేశాడు…
క్రికెట్‌లో గెలుపూఓటములు సహజమే… కానీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరీ పసికూన ఐర్లాండ్… ఐపీఎల్ మ్యాచుల్లో చెలరేగి ఆడే మన తోపులు ఆ జట్టు మీద మాత్రం ఇలా చేతులెత్తేయడం క్షమార్హం కాదు, ఈరోజు కూడా వైభవ్ సూర్యవంశీని ఆడించకపోవడం చెత్త నిర్ణయం… తను ఆడి ఉంటే, బ్యాట్ ఝలిపించి ఉంటే కథ వేరే ఉండేది…
వరల్డ్ కప్ సంగతికొద్దాం… ఖచ్చితంగా ఆస్ట్రేలియా మీద గెలవాల్సిన మ్యాచ్… పర్లేదు, నిజానికి మనవాళ్లు బాగానే ఆడారు… కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ధాటి బ్యాటింగుతో 170 రన్స్ టార్గెట్ పెట్టారు… మంచి స్కోరే, చేజింగ్ కష్టమే. కానీ ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా కదా, సాధించేసింది… ఇండియన్ వుమెన్ టీమ్ ఇంటిముఖం పట్టింది… గత కప్ విజేత లీగ్ స్టేజ్‌లోనే పూర్తిగా నిరాశపరిచింది… వెరసి ఈరోజు ఇండియన్ క్రికెట్‌కు రెండు పరాజయాలు, రెండు పరాభవాలు… మరీ ఐర్లాండ్ మీద పరాజయం మాత్రం అవమానకరమే!!
Share this Article