Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కల్వకుంట్ల కాదు ఇప్పుడు… బహుజన కవిత… ప్లాన్‌డ్‌గా అడుగులు…

October 4, 2025 by M S R

.

సినిమా పేరు అబ్బాయి గారు అనుకుంటా… అప్పట్లో సూపర్ హిట్ సినిమా… అందులో అత్తకు ఎప్పటికప్పుడు చెమటలు పట్టిస్తూ ఆడించే కోడలి పాత్ర మీనాది…

బ్రహ్మానందం అంటాడు ఓ చోట… ఏమో అనుకున్నాం గానీ కంచు… కంచండీ నంబర్ వన్ కంచు బాబోయ్ అంటాడు… అత్తకు మరింత మంటెక్కేలా…

Ads

బండారు దత్తాత్రేయ ఏటా నిర్వహించే దసరా అలయ్ బలయ్‌లో కల్వకుంట్ల కవిత ఈసారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్… ఏ కేసీయార్ విమలక్క వంటి అభ్యుదయవాదుల్ని, తెలంగాణ ఉద్యమకారుల్ని, బహుజన గొంతులను దూరం పెట్టాడో… ఇప్పుడు కవిత అందరినీ కలుస్తోంది… కేసీయార్ దూరం పెట్టిన చాలామందితో కవిత మాట్లాడుతోంది… మద్దతు అడుగుతోంది…

ఆమే కాదు, తను ఎంచుకున్న బహుజన ఎజెండాకు తగినట్టుగా… తెలంగాణలో బహుజన నేతలుగా, గాయకులుగా, రచయితలుగా, మేధావులుగా, యాక్టివిస్టులుగా ఉన్న వారందరినీ కలుపుకుని పోతోంది…

kavitha

అంటే కేవలం ఈ సెల్ఫీలు, భేటీలతో ఏదో ఇప్పటికిప్పుడు తను పాపులర్ అయిపోతుందని కాదు… కానీ ఆమె అప్రోచ్, దూకుడు కనిపిస్తున్నాయి… అంత తేలికగా… మరీ మరీ చెప్పాలంటే ఈమె మరో షర్మిల కాదు, కాబోదు, కవిత కవితే అనుకునేలా ప్లాన్‌డ్‌గా వెళ్తోంది…

kavitha

పుట్టిన ఊరు చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మతో మొదలు పెట్టి, తనకు పొలిటికల్ కెరీర్ ఇచ్చిన బతుకమ్మతోనే పొలిటికల్ కొత్త జర్నీ స్టార్ట్ చేసింది… పోతూ పోతూ నందిని సిధారెడ్డిని కలిసింది… జాగృతి కార్యవర్గాన్ని విస్తరిస్తూ… బహుజనులకు పెద్ద పీట వేసింది… వర్కింగ్ ప్రసిడెంటుగా ఎస్టీ నేత రూప్ సింగ్ నాయక్‌ను నియమించింది… గోపి, శివారెడ్డి ఇళ్లకు వెళ్ళి పరామర్శించింది…

kavitha

80 శాతం దాకా పదవులు బడుగు వర్గాలకే ఇచ్చింది… త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనుంది… జిల్లా పర్యటనల్లో మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం ప్లాన్ చేస్తోంది… తనకు గతంలో అడ్డాగా ఉన్న సింగరేణి సంఘం నుంచి కేసీయార్ తనను తొలగిస్తే… హెచ్ఎంఎస్‌తో కూడి తన ప్లేసు పదిలం చేసుకుంది… ఆమె దానికి ఇప్పుడు గౌరవాధ్యక్షురాలు…

kavitha

మరోవైపు కేసీయార్ కోటరీలో ముఖ్యులైన హరీష్ రావు, సంతోష్ రావుల మీద అనేక ఆరోపణల్ని ఆమె పేరిట ఉన్న కవితక్క అప్‌డేట్స్ సంధిస్తోంది… బీఆర్ఎస్ క్యాంపు సైలెంట్… పార్టీ నుంచి, కుటుంబం నుంచి బహిష్కరించినా సరే, తన పంథా ఏమిటో తను రూపొందించుకుంటూ జాగ్రత్తగానే అడుగులు వేస్తోంది…

kavitha

ఏమో, టైమ్ డిక్టేట్ చేస్తే సిద్ధిపేట నుంచే తన పోటీ ఉండబోతుందనే సంకేతాలూ ఇచ్చింది… అంటే హరీష్ రావు మీద… ఇంట్రస్టింగ్… ఫిమేల్ పుష్పలాగా తగ్గేదేలే అంటోంది… ఐతే ఇల్లు అలకగానే పండుగ కాదు, అది తనకూ తెలుసు…

kavitha devanapalli

సొంత పార్టీయా..? వేరే పార్టీలతో అవగాహనా..? ఇప్పుడేమీ తేలదు… ఆమె చూపించబోయే ఇంపాక్ట్ ఆధారంగా భవిష్యత్తు సమీకరణాలు ఆధారపడి ఉంటాయి… కానీ బయటికి వెళ్లగొడితే ఇక ఆమె పని ఖతం అనుకున్న కేసీయార్, కేటీయార్‌లకు ఆమె చాలా తలనొప్పులు క్రియేట్ చేయబోతోంది… అది మాత్రం పక్కా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆహా… దక్షిణ వాగ్గేయకారులకూ అయోధ్య రాముడి చెంత చోటు…
  • గుడ్డు అంటేనే గుడ్డు… వెరీ గుడ్డు… అకారణ భయాలే నాట్ గుడ్డు…
  • కాంతారా చాప్టర్-1 … ఇది వనరుల దోపిడీ కథ… ఓ డిఫరెంట్ రివ్యూ…
  • భార్యను చంపాడని జైల్లో వేశారు… రెండేళ్లకు ఆ భార్య కనిపించింది…
  • కిిం కర్తవ్యం..? బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు..!!
  • స్వదేశీ విస్కీమేకర్లకు కిక్కిచ్చే అవార్డులు… అంతర్జాతీయ అమ్మకాలు…
  • బహుశా చాలామంది సినిమా సెలబ్రిటీలకు జీర్ణం కాని కథ..!!
  • రక్తికడుతున్న జుబ్లీహిల్స్ పోటీ… రేవంత్‌రెడ్డి ఎత్తులు ఇంట్రస్టింగ్..!
  • నాతూ పెళ్లాం తావాలి… మనిషి వైకల్యాల నుంచి పుట్టించే కామెడీ…
  • ఇంటిపేరు పూరీ ఐనా సరే… తనకు ఉప్మా అంటేనే అడిక్షన్ తెలుసా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions