Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాబాలకూ కనిపించని బాధలేవో ఉంటయ్… కోటరీల బందిఖానాల్లో బతుకులు…

May 3, 2023 by M S R

Murali Buddha……..  వ్యతిరేకంగా రాయండి ప్లీజ్ ….బాలసాయిబాబా…….. ఓ జ్ఞాపకం

….

మ్యూజియంలో ఓ పుర్రెను చూసి విద్యార్థులు ఆసక్తిగా అడిగితే గైడ్ అది హిట్లర్ పుర్రె అని చెబుతాడు … మరో చిన్న పుర్రె కనిపిస్తే అది హిట్లర్ చిన్నప్పటి పుర్రె అంటాడు … ఇది చిన్నప్పుడు చదివిన జోక్ … ఈ జోక్ ప్రాణం పోసుకొని కళ్ళ ముందు కనిపిస్తే ?

Ads

1987లో ఆంధ్రభూమి రిపోర్టర్ గా సంగారెడ్డిలో … అప్పుడే అయూబ్ ఖాన్ అనే మిత్రుడికి కర్నూల్ రిపోర్టర్ గా నియామకం … ఓ రోజు కర్నూల్ వెళితే నేను వెళ్లిన సమయానికి ఆంధ్రభూమి ఆఫీస్ లో అయూబ్ ఖాన్ ఓ క్యాసెట్ వింటున్నాడు. వినడం పూర్తయ్యాక క్యాసెట్ లో మార్పులు చేర్పులు సూచించాడు …

అప్పుడే భక్తులను కరుణించేందుకు అవతరించిన బాలసాయిబాబా ఉపన్యాస తొలి క్యాసెట్ అది … ఒకవైపు సాయిబాబా అవతారం అని పుట్టపర్తి సాయిబాబా ఉండగా , అదే టైంలో బాలసాయి బాబా ఏంటి అన్నాను .. పైగా ఇతను ఇంటిల్లిపాది ఉర్దూ మాట్లాడే ముస్లిం … బాలసాయి ఉపన్యాసాన్ని ఇతనికి పంపి సలహాలు అడుగుతున్నాడు … కొత్తగా మొదలు పెట్టాడు… నాకు అనుకూలంగా రాయమని అడగడం లేదు .. వ్యతిరేకంగానే రాయండి అని అడుగుతున్నాడు … అని చెప్పాడు ..

అనుకూలంగానే కాదు బాబాలు , తమకేవో శక్తులు ఉన్నాయి అని ప్రచారం చేసుకొని సంపాదించే వారు .. వ్యతిరేక ప్రచారం ద్వారా కూడా సంపాదిస్తారనే మొదటిసారి అర్ధమైంది …

1992-93 లో నల్లగొండ రిపోర్టర్ గా మీడియా టూర్ లో మార్గమధ్యంలో బాలసాయి ఆశ్రమానికి వెళ్ళాం … అప్పుడప్పుడే కార్యకలాపాలు పెరుగుతున్నాయి … మేనేజర్ పేరు రామారావు అని గుర్తు. పుట్టపర్తి సాయిబాబా అంత ఉదృతంగా మీ ఆశ్రమం పెరగడం లేదేమిటి అంటే పుట్టపర్తి ఒకేసారి పెరగలేదు, సమయం పడుతుంది, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాం అన్నాడు . నేను ఒక వ్యాపారం గురించి అడిగినట్టే అడిగాను, అతను ఓ వ్యాపారంలానే చెప్పాడు ..

1995 లో తిరిగి తిరిగి హైదరాబాద్ వచ్చాను … కొద్ది రోజులకు బాలసాయి తన సామ్రాజ్యాన్ని హైదరాబాద్ కు కూడా విస్తరించాడు … కర్నూల్ లో కొందరు జర్నలిస్ట్ లకు బాల సాయి అన్ని రకాలుగా సహాయం చేశారు … ఒకరిద్దరు సొంత చిన్న పత్రికలు పెట్టుకొంటే సహాయం కూడా చేశారు.

ఈ విషయం తెలిసి పత్రిక పెడుతున్నాం అని ప్రకటనల రూపంలో సహాయం కోసం ఒకరు వెళ్లారు … ముదిగొండ శివ ప్రసాద్ లాంటి చారిత్రక నవలా రచయిత బాలసాయి భక్తి గీతాల ఆలాపనలో అక్కడ ఉండడం చూసిన వారికి వింతగా అనిపించింది … చిన్నప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో నన్నయ్య , తిక్కనలతో పాటు ఉప వాచకంలో ముదిగొండ శివ ప్రసాద్ నవల చదివిన జీవితం కాబట్టి అక్కడ ఆయన బాలసాయి కీర్తనలు ఆలాపనలో ఉండడం వింతగా అనిపించింది …

సహాయం కోసం వెళ్లిన వ్యక్తికి వెంటనే ప్రత్యేక దర్శనం లభించింది .. ఓ వెండి ఉంగరం కూడా లభించింది …

నేనేదో సుఖ పడిపోతున్నాను … నేను సాయంత్రం రెడీ అయి దర్శనం ఇస్తే… వీళ్లంతా పాటలు పాడుతూ నన్ను కీర్తిస్తుంటే నా అంత అదృష్టం లేదు అనుకుంటారు . కానీ నా అంత దురదృష్టవంతుడు లేడు … ఒక గ్రూప్ చేతిలో నేను బందీని, వాళ్ళు చెప్పినట్టు నడుచు కోవాలి అని బాలసాయి తన గోడు వెళ్ళ బోసుకున్నాడు …

ఆ సమయంలో ఏమి మాట్లాడకుండా మరోసారి వెళితే బాలసాయి చుట్టూ ఉన్న బృందం అడ్డుకున్నారు . ప్రత్యేక దర్శనాలు మళ్ళీ మళ్ళీ ఉండవు అని బాలసాయి వద్దకు వెళ్లనివ్వలేదు … మిత్రులు బాలసాయి సహాయంతో పత్రిక పెట్టాలి అనే ఆలోచన కార్యరూపం దాల్చలేదు కానీ ఇలాంటి స్వామిజీల జీవితం ఎంత నరకప్రాయం, వాళ్ళను ఎలా బంధీలుగా చేస్తారు అనేది అర్థమైంది …

చాట్ జిపిటితో ఐటితో సహా ఏ ఉద్యోగానికి భరోసా లేదు అంటున్నారు …. నిజమే, ఏ ఉద్యోగానికైనా ప్రమాదం ఉండవచ్చు … కానీ జ్యోతిష్యం , మంత్రాలూ , మహిమలు , వాస్తు వ్యాపారాన్ని ఏమీ చేయలేరు .. మనిషి ఉన్నంత వరకు ఈ వ్యాపారాలు ఉంటాయి…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హిందుత్వ ప్రసంగాలు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై కేసు…
  • ‘మెగా దాడి’… రచ్చ… ఆఖరికి లెంపలేసుకున్న దిల్ రాజు సోదరుడు..!!
  • రేవంత్ రెడ్డి ప్రదర్శించిన అరుదైన గౌరవం… రోశయ్యకు ఘన నివాళి…
  • మార్గన్..! ఆ ‘బిచ్చగాడు’ గుడ్డిగా ఓ దర్శకుడిని నమ్మి మునిగిన కథ..!!
  • అవునూ హరీషూ… కొండగట్టు బస్సు ప్రమాద మృతులు గుర్తున్నారా..?!
  • సైన్స్, ఎమోషన్, సంప్రదాయం ఆస్తికత్వం, హేతువాదం… హేట్సాఫ్ టి.కృష్ణ..!!
  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions