Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నీటి గండాల శ్రీదేవి చివరికి ఆ నీటి టబ్బులోనే…!

May 22, 2024 by Rishi

(Dogiparthi Subramanyam )… బాల భారతం – పిల్లల భారతం . కౌరవ పాండవుల జననం నుండి ధర్మరాజు యువరాజ పట్టాభిషేకంతో సినిమా ముగుస్తుంది . ముఖ్యంగా మెచ్చుకోవలసింది పిల్లల్ని , దర్శకుడు కమలాకర కామేశ్వరరావుని . ఈ సినిమా లోని మొత్తం నట బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించాలి . ఈ సినిమాలో  దుశ్శల పాత్రను మిగిలిన కౌరవ పాండవుల కన్నా పెంచారు . తగ్గట్టుగానే అతిలోకసుందరి శ్రీదేవి చాలా బాగా నటించింది . బాగా నటించిన మరో పిల్లాడు దుర్యోధనుడి పాత్రలో మాస్టర్ ప్రభాకర్ . ప్రధాన పాత్రలయిన భీముడు , అర్జునుడు , కృష్ణుడు పాత్రల్లో నటించిన పిల్లలు కూడా చక్కగా నటించారు . పెద్దోళ్ళను డైరెక్ట్ చేయటమే కష్టం , ఇంక పిల్లల్ని అందులో ఇంత మంది పిల్లల్ని డైరెక్ట్ చేయటమంటే సాధారణ విషయం కాదు .

పెద్దోళ్ళలో భీష్ముడిగా SVR . ఈ ఒక్క సినిమాలోనే ఏమో ఆయన భీష్ముడిగా నటించింది . పాండురాజుగా కాంతారావు , కుంతి మాద్రిలుగా అంజలీదేవి , చంద్రకళ , ధృతరాష్ట్రుడిగా మిక్కిలినేని , గాంధారిగా యస్ వరలక్ష్మి , శకునిగా ధూళిపాళ , నారదుడిగా హరనాథ్ నటించారు .

ఈ సినిమాను సూపర్ హిట్ చేసింది యస్ రాజేశ్వరరావు  సంగీతం . ఆరుద్ర వ్రాసిన మానవుడే మహనీయుడు శక్తియుతుడు యుక్తిపరుడు , నారాయణ నీ లీలా నవరస భరితం నీ ప్రేరణచే జనియించే బాల భారతం పాటలు సూపర్ హిట్ . తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం దైవం నీవే తారంగం , విందు భోజనం పసందు భోజనం , వచ్చిండోయ్ వచ్చిండు కొండ దేవర వచ్చిండు , ఆడెనోయి నాగ కన్యక పాటలు , ఇతర పద్యాలు అన్నీ శ్రావ్యంగా ఉంటాయి , హిట్టయ్యాయి కూడా .

శ్రీదేవికి జల గండం ఈ సినిమా షూటింగులో తప్పించుకుంది . అవుట్ డోర్ షూటింగ్ తమిళనాడు లోని ఏదో జలపాతం వద్ద తీస్తున్నారట . పిల్లలు అందరూ సరదాగా జలపాతంలో ఆడుకుంటుంటే శ్రీదేవి కొట్టుకుపోయిందట . పిల్లల్లో స్విమ్మర్స్ వెంటనే కాపాడారట . పాపం ! బాలనటిగా రెండు మూడు ప్రమాదాలు తప్పించుకున్న శ్రీదేవి స్నానాల టబ్బులో ప్రాణాలు కోల్పోయింది . విధి బలీయం .

మళ్ళా సినిమా లోకి వద్దాం . ఇంత అందమైన సినిమా ఫస్ట్ రన్ లోనే కాదు ; రిలీజయిన ప్రతి సారీ కనక వర్షమే కురిపించింది . పౌరాణిక సినిమాలు తీయటంలో మన తెలుగు  వాళ్ళని మించిన వాళ్ళు లేరు . కానీ హిందీ వాళ్ళలాగా గొప్ప పౌరాణిక  సీరియల్స్ తీయలేకపోయారు . ఎందుకనో !

ఈ సినిమా రిలీజయి 52 ఏళ్ళు అయినా , ఈతరం వాళ్ళు కూడా చాలామంది చూసే ఉంటారు . చూడనివారు ఒకరూ అరా ఉంటే అర్జెంటుగా చూసేయండి . యూట్యూబులో ఉంది . It’s a classic and unmissable . టి విలో కూడా చాలా తరచుగా ఏదో ఒక చానల్లో పండుగలప్పుడు  వేస్తూనే ఉంటారు . మా నరసరావుపేటలో ఏ థియేటర్లో ఆడిందో గుర్తు లేదు కానీ అప్పుడే చూసా నేను .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మెట్రో విస్తరణపై కేసీయార్ స్క్రిప్టు – రేవంత్‌రెడ్డి కాళ్లల్లో కిషన్‌రెడ్డి కట్టెలు..!!
  • భలేవారే, యాంగ్రీ రాజశేఖర్‌ సాఫ్ట్ రొమాంటిక్ పాత్రలూ చేయగలడు తెలుసా..!!
  • భారత్ భాగ్య విధాత … ఫ్లాప్ … కంగనాపై నెగెటివిటీ తగ్గలేదు ప్రేక్షకుల్లో …
  • వైభవ్..! ఈ పేరంటేనే ఓ సంచలనం..! నడిసంద్రంలో కూడా..!!
  • శాంతి ఒప్పందం- యుద్ధవిరమణ… నో, మూడు దేశాల దోబూచులాట…
  • దివాళా అంచున దేశం… ఆ దిక్కుతోచని సర్కారు ఏం చేసింది…
  • మన పెట్రో బిల్లును ఎథనాల్ తగ్గించగలదా..? ఏమేం ప్రయోజనాలు..?!
  • రాజా రమేష్… సినిమా కథగా ఓ నిజ జీవిత థ్రిల్లర్… కానీ..?
  • పునర్జన్మ… మీరు నమ్మరా… పోనీ, ఈ రియల్ స్టోరీ ఓసారి చదవండి…
  • ఆకలి కడుపులకు అన్నపూర్ణ..! నచ్చిన రేవంత్ మరో పథకం..!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions