Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘ఎల్లమ్మ’గా భాగ్యశ్రీ..? ఊదు కాలదు- పీరు లేవదు..! పాపం వేణు..!!

March 20, 2026 by M S R

.

వినాయకుడి పెళ్లికి రోజుకో విఘ్నం అన్నట్టుగా… ఎల్లమ్మ సినిమా కథ..! పూటకో హీరో, రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తూ ఉంటుంది… ఏదీ తేలదు, ఊదు కాలదు, పీరు లేవదు, షూటింగుకు కొబ్బరికాయ కొట్టరు…

నిజానికి బలగం వేణు, దిల్ రాజు ఆలోచన పద్ధతే ఈ సినిమా పట్టాలెక్కకపోవడానికి ప్రధాన కారణం… వివరాల్లోకి వెళ్తే… బలగం సినిమా తీశాడు దర్శకుడిగా మారిన టీవీ కమెడియన్ యెల్దండి వేణు… చాలా చిన్న సినిమా…

Ads

పెద్ద పెద్ద సినిమాలపైనే కన్నేసే దిల్ రాజు ఈ సినిమాకు ఫైనాన్స్ చేయడం విశేషమే… కథ, ట్రీట్‌మెంట్, పక్కా ఎమోషన్స్, కుటుంబబంధాలు, నటుల సహజ నటన వెరసి సినిమా మంచి విజయాన్ని అందుకుంది… ప్రత్యేకించి ఈ సినిమా కథ ప్రతి తెలంగాణ, ప్రత్యేకించి ఉత్తర తెలంగాణ పల్లె కథ…

అందుకే సినిమాను ప్రత్యేకంగా ఊళ్లల్లో ఫ్రీగా షోలు వేశారు… వందల ఊళ్లలో కొత్తగా ‘ఎపెన్ థియేటర్లు’ వెలిశాయి అప్పటికప్పుడు… దీంతో దిల్ రాజు యెల్దండి వేణుకు మరో సినిమాకు చాన్స్ ఇస్తున్నాను అన్నాడు… ఎల్లమ్మ కథతో వేణు కూడా రెడీగానే ఉన్నాడు… కానీ సమస్య ఎక్కడొచ్చిందీ అంటే..?

balagam venu

సినిమా కమర్షియల్‌గా వర్కవుట్ కావాలంటే పెద్ద నటులు కావాలని దిల్ రాజు అనుకున్నాడు… అదే తప్పు… బలగంలో కాస్త పేరున్న ప్రియదర్శి తప్ప పెద్ద నటులు ఎవరున్నారని..? నిజానికి ఇలాంటి సినిమాలు, అంటే రొటీన్ కమర్షియల్ సినిమా పంథాలో వెళ్లని సినిమాలకు చిన్న నటులే కరెక్టు… పెద్ద నటులైతే పాత్రలు కనిపించవు, నటులు కనిపిస్తారు…

పేరున్న నటులైతే కథ మారుతుంది, పాత్రల ధోరణి మారుతుంది… కథకు ఏవేవో కృత్రిమ హంగులు అవసరం అవుతాయి… సరే, మొదట నాని హీరో అనుకున్నారు… అదీ కరెక్టు కాదు, తను అందరు కమర్షియల్ నటుల్లాగే హింస, రొటీన్ తెలుగు హీరో ఇమేజ్ ఫార్మాట్‌లోకి మారిపోయాడు… ఇలాంటి కథల్ని ఎందుకు అంగీకరిస్తాడు..? అదే జరిగింది…

 

balagam

సో, తనను అడగడమే వేస్ట్… తరువాత నితిన్ వచ్చాడు వార్తల్లోకి… వోకే అన్నట్టున్నాడు కూడా… తన ‘తమ్ముడు’ సినిమా మటాష్ అయ్యేసరికి దిల్ రాజు పునరాలోచనలో పడ్డాడు… అసలు తమ్ముడు వంటి కథలు ఎందుకు ఎంచుకుంటాడో నితిన్, అసలు తన కెరీర్ మాత్రం గాడితప్పటానికి ఇదుగో ఇలాంటి రాంగ్ స్టెప్సే కారణం…

సరే, నితిన్ వద్దనుకున్నారు, నెక్స్ట్… శర్వానంద్… మంచి చాయిస్… బాగా చేయగలడు… కానీ ఏమైందో ఏమో, అసలు తనను అడిగారో లేదో కూడా తెలియదు… కథ చెప్పారనీ, తను కూడా వోకే అన్నాడని వార్తలు కనిపించాయి…

balagam

కానీ ఆ పేరు కూడా మాయమైపోయి కొన్నాళ్లు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పేరు వినిపించింది… తను ఎల్లమ్మ తరహా కథకు ఆప్ట్ అవుతాడా..? తనకు ఎమోషన్స్ పలకవు… పైగా ఎల్లమ్మ సినిమా అంటే నాలుగు స్టెప్పులు, నాలుగు ఫైట్ల కథ కాదు కదా… ఏమైందో హఠాత్తుగా దేవిశ్రీప్రసాద్ వచ్చాడు ఈ ప్రాజెక్టులోకి… వేణు బాపతు డైరెక్షన్‌లోకి తను ఒదగగలడా..? ఏమో…! బేసిక్‌గా తను అసలు నటుడే కాదు…

ఎల్లమ్మ కాస్త వుమెన్ లీడ్ రోల్ సెంట్రిక్ కథ కదా… మొదట్లో సాయిపల్లవిని అనుకున్నారట… మంచి చాయిసే… కానీ ఆమె ఇప్పుడు బాలీవుడ్‌కే ప్రాధాన్యమిస్తోంది… రేంజ్ బాగా పెరిగింది… అందుబాటులో లేదు, రాదు… ఇప్పుడామె దృష్టి పెద్ద సినిమాలపై మాత్రమే…

nagadurga

తరువాత కీర్తి సురేష్ అనుకున్నారు, తనూ మంచి చాయిసే… మళ్లీ ఆ పేరూ మాయం… అసలు ఎల్లమ్మ సినిమాకు వుమెన్ లీడ్ రోల్ ఎవరు అనేది కదా ముఖ్యం..? మరి కథానాయకుడి గురించి దేవులాట దేనికి..? ఆమె ఎందుకు ఈ ప్రాజెక్టు నుంచి వైదొలిగింది..?

ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ పేరు ఖరారైనందుకేనా..? పెద్ద పెద్ద హీరోలతో చేస్తేనే తన కెరీర్‌కు బూస్టప్ అనుకోవడం వల్లేనా..? ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సె పేరు వినిపిస్తోంది… కానీ..? కొన్ని పాత్రలకు కొందరే సెటవుతారు… బలగం వేణు కథకు కేవలం గ్లామర్ ఒలకబోసే తారలు పనికిరారు…

భాగ్యశ్రీ

ఇలా నటీనటుల ఎంపికతోనే ఏళ్లు గడుస్తున్నాయి… మొదట్లో ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో ఈ సినిమాపై కనిపించిన ఆసక్తి ఇప్పుడు లేదు… బాగా జాప్యంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది… నటీనటుల ఎంపికపై నిజానికి ఇన్ని తర్జనభర్జనలు అనవసరం… కథానాయిక పాత్రకు యూట్యూబ్ స్టార్ నాగదుర్గ వంటి నటులైనా సరిపోతారు, కమిటెడ్‌గా పని చేస్తారు… టీవీ సీరియళ్లు చేసుకునే ఆషిక పడుకోన్ వంటి తారలైనా సరే…

కీర్తిసురేష్

వెరసి ఏదీ తేలదు… సినిమా పట్టాలెక్కదు… నిజానికి దిల్ రాజు కెపాసిటీకి అన్ని విషయాల్లో వేణుకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి, సినిమాను సరిగ్గా మార్కెటింగ్ చేసుకుంటే చాలు… టాలీవుడ్‌ను శాసించే ‘ఆ నలుగురి’లో ఒకడు కదా, తనకు సినిమాను ప్రమోట్ చేసుకోవడం చాలా ఈజీ… కానీ అలా చేస్తే తను దిల్ రాజు ఎలా అవుతాడు..? అందుకే ఎల్లమ్మ ఎంతకీ రానంటోంది..!! పాపం వేణు..!!

సరైన సమయంలో ఎల్లమ్మ షూటింగ్ స్టార్టయి ఉంటే... అదెప్పుడో పూర్తయిపోయి, తరువాత సినిమా ఏ దుర్గమ్మో, ఏ పెద్దమ్మో కూడా షూటింగ్ మొదలై ఉండేది...!!

venu

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘ఎల్లమ్మ’గా భాగ్యశ్రీ..? ఊదు కాలదు- పీరు లేవదు..! పాపం వేణు..!!
  • ఆదిత్య ధర్… యామీ గౌతమ్… వెరీ పాపులర్ బాలీవుడ్ జంట ఇప్పుడు…
  • జగన్ క్యాంప్ ఎంత డిఫన్స్‌లో పడిందంటే… ఇదుగో ఈ యాడ్ పక్కా రుజువు…
  • ఏది ఉషోదయం..? ఏది పరాభవం..? ఎవడి నవ్వు, ఎవడి ఏడుపు..?
  • సారీ గబ్బర్ సింగ్..! ఈ సనాతన సీక్వెల్‌లో ఏదో మిస్సయింది..!!
  • తొండల భాషకు స్వస్తి… సెటైర్లతో ఎద్దేవా… రేవంత్ స్టయిల్ మారింది…
  • ప్రస్తుతం తమిళనాడు పొలిటికల్ ముఖచిత్రం ఎలా ఉందంటే..? ఫుల్ పిక్చర్..!!
  • ఆ బూతు రోత పాటపై అందరూ లెంపలేసుకుంటున్నారు..! కానీ..?
  • ఎవరు ఈ లారీజానీ..? ఇరాన్ ‘మాస్టర్ మైండ్’నే లేపిన ఇజ్రాయిల్..!!
  • వైఎస్ విజయమ్మ ‘ఫరమ్’ అటాక్… ఆస్తుల పంచాయితీలో జగన్‌కు షాక్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions