Subramanyam Dogiparthi ……… బాలరాజు కథ… ఇది బాపు గారి సినిమా . బాగుంటుంది . సినిమా సింహ భాగం మహాబలిపురం నేపధ్యంలో సాగుతుంది . Feel Good Movie . మాస్టర్ ప్రభాకరే సినిమాకు కధానాయకుడు . ఆరిందాలాగా నటించాడు . Happy go lucky go character . బాల భారతంలో దుర్యోధనుడిగా నటించింది ఈ మాస్టర్ ప్రభాకరే . తమిళంలో హిట్టయిన వా రాజా వా సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా . బాపు గారి జోడీ ముళ్ళపూడి వెంకట రమణ సంభాషణలు వ్రాసారు . కాంస్య నంది అవార్డుని పొందింది .
కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు బయట కూడా బాగా హిట్టయ్యాయి . ముఖ్యంగా మహాబలిపురం మహాబలిపురం మహాబలిపురం పాట , అడిగానని అనుకోవద్దు చెప్పకుండా దాటేయొద్దు బాగా హిట్టయ్యాయి . మిగిలిన పాటలు చెప్పు చెప్పు భాయ్ , ఒకటీ రెండు మూడైతే ముద్దు అంతకు మించిన సంతానమయితే వద్దు , హిప్పీ హిప్పీ ఆడపిల్లలు వీళ్ళు చెప్పరాని తారాజువ్వలు కూడా బాగుంటాయి .
మాస్టర్ ప్రభాకర్ , మాస్టర్ విశ్వేశ్వరరావు , ధూళిపాళ , మిక్కిలినేని , హేమలత , నాగభూషణం , పుష్పకుమారి , సాక్షి రంగారావు , సూరేకాంతం , అల్లు రామలింగయ్య , అనిత , సంధ్యారాణి ప్రభృతులు నటించారు . ముఖ్యంగా ధూళిపాళ పాత్ర బాగుంటుంది . సప్త సూత్ర శాసనం మీద ఉన్న ఏడు సూక్తులను బాలరాజుకు వివరిస్తూ , వాటిని అన్నింటినీ నిజ జీవిత సంఘటనలతో వివరించటం సందేశాత్మకంగా ఉంటుంది . బాపు గారు కదా ! బాపు , విశ్వనాధులలో అదే గొప్ప విషయం . ప్రేక్షకులకు ఏదో ఒకటి చెప్పాలనే తపన , ఆలోచన ముచ్చట కలిగిస్తాయి .
Ads
(మాస్టర్ ప్రభాకర్ చిన్నప్పటి నుంచీ సినిమాల్లో నటించినా, దూరదర్శన్‌లో కూడా బాగానే కనిపించాడు… తెలుగు, తమిళ సినిమాల్లో నటనను పక్కన పెడితే హిందీలో లైట్ బాయ్ దగ్గర నుంచి అసిస్టెంట్ లైన్ మెన్ పని దాకా చేశాడు… కష్టజీవి… సౌరాష్ట్ర తల్లిభాష… పుట్టింది మధురైలో…)
పల్లవ రాజులు కట్టిన మహాబలిపురం అంటే చాలామందికి లాగానే నాకూ చాలా ఇష్టం . మొదటిసారి 1966/67 ప్రాంతంలో ఈ సినిమా రాక ముందు చూసా . తర్వాత చాలా సార్లే చూసా . సందర్శించని వారెవరయినా ఉంటే ఓపిక చేసుకుని వెళ్ళండి . మహాబలిపురం , మద్రాసు , వెల్లూరు , కంచి కలిపి చుట్టేసి రండి . Make life beautiful .
ఈ సినిమాను మా నరసరావుపేటలో నాగూర్వలి టాకీసులో చూసా . యూట్యూబులో ఉంది . చూడతగ్గ చక్కటి సినిమా #తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #telugumovies #telugucinema
Share this Article