అన్‌స్టాపబుల్ షో సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి బాలయ్య దాన్ని బాగా చెడగొట్టాడు… ఆ కారణాల విశ్లేషణ ఇక్కడొద్దు గానీ, ఆ షోకన్నా తను గెస్టుగా పాల్గొన్న ఇండియన్ ఐడల్ స్పెషల్ ఎపిసోడ్ మాత్రం అదరగొట్టాడు… బాలయ్య ప్రజెంట్స్ టాప్ 12 పేరిట, గాలా విత్ బాలా పేరిట ఈ ఎపిసోడ్స్‌లో రెండు రోజులపాటు బాలయ్య సమక్షంలో కంటెస్టెంట్లు 12 మంది 12 పాటలు పాడతారు…
బాలయ్యను గెస్టుగా పిలిచాం కదాని ఇండియన్ ఐడల్ టీం మరీ బాలయ్య భజనకే ఎపిసోడ్స్ అంకితం చేయలేదు… పైగా రాసిన స్క్రిప్టు బాగుంది… ఒక దశలో ఓ చిన్న పిల్ల కాళ్లకు పట్టీలు తొడిగిన సీన్ హృద్యంగా ఉంది… బాలయ్యలో కొత్త కోణం అన్‌స్టాపబుల్‌తో కాదు, నిజానికి ఇండియన్ ఐడల్‌తోనే..!
ఆమె పేరు సౌజన్య… భాగవతుల సౌజన్య… ఆల్‌రెడీ ఓ పిల్ల తల్లి… విశాఖపట్టణం… మొత్తం ఫ్యామిలీతో సహా వచ్చింది… ఆమె బిడ్డ కాళ్లకే బాలయ్య పట్టీలు తొడిగింది… ఆ ఫ్యామిలీలో హిందీ ఇండియన్ ఐడల్ గత సీజన్‌లో పార్టిసిపేట్ చేసిన భాగవతుల శిరీష కూడా ఉంది… బహుశా కజిన్స్ కావచ్చు… సిద్దిపేట నుంచి వచ్చిన లాస్యప్రియ నానమ్మో అమ్మమ్మో గానీ బాలయ్య, ఎన్టీయార్‌ల ఫ్యాన్‌ను అని చెప్పింది… ఆమెకు భక్ష్యాలు (బొబ్బట్లు) స్టేజీపై చేసి తినిపించాడు… బాగుంది…
Ads
నిజానికి ఇవన్నీ స్క్రిప్టే… కానీ దాన్ని బాలయ్య ఎంత బలంగా ప్రజెంట్ చేయగలిగాడు అనేదే ప్రశ్న… ఒకటికి రెండింతలు రక్తికట్టించాడు… ఇదంతా ఫన్ కోసమే కావచ్చుగాక… కానీ ఎక్కడా సింగింగ్ మెరిట్‌ను అంచనా వేయడంలో మాత్రం జడ్జిలు వెనక్కి పోలేదు… గెస్టు పాత్ర గెస్టుదే… జడ్జిల పాత్ర జడ్జిలదే… (ఇండియన్ ఐడల్ టీం స్క్రిప్ట్ వర్క్‌తో పోలిస్తే జీతెలుగు సరిగమప వాళ్లు చాలా చాలా వెనకపడిపోయారు…)
ఈ స్పెషల్ ఎపిసోడ్లకు కంటెస్టెంట్ల కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు… సాకేత్, మానస కూడా బాగా పాడారు… ఆడిషన్స్ సమయంలో పన్నెండు మంది ఎంపికలో కొన్ని రాంగ్ ఎంపికలు ఉన్నట్టు అనిపించింది కానీ ఈ ఎపిసోడ్స్‌లో ప్రతి ఒక్కరూ బాగా పాడారు… కరెక్ట్ చాయిసే… ఆర్కెస్ట్రా టీంలో గత సీజన్‌లో మంచి ప్రశంసలు పొందిన వయోలినిస్టు అంబడిపూడి కామాక్షి మళ్లీ కనిపించింది, సాకేత్ పాటలో మెరిసింది… ఈరోజు రాబోయే ఎపిసోడ్‌లో మిగతావాళ్లు పాడతారు… అందరూ బెంగుళూరు యుతి, అమెరికా శృతిల పర్‌ఫామెన్స్ కోసం ఎదురు చూస్తున్నారు…! ఏమాటకామాట, ఆ జడ్జి సీటులో గీతామాధురికన్నా నిత్యామేననే బాగుండేది..!!
ఆఫ్టరాల్, ఒక ఓటీటీలో ఒక మ్యూజిక్ షోకు ఈ కథనం అవసరమా..? ఇదే కదా ప్రశ్న… అవసరమే… తెలుగు టీవీల్లో రియాలిటీ షోలు నానాటికీ నాసిరకం అయిపోతున్నాయి… స్టార్‌మాటీవీ వాడికి బిగ్‌బాస్ తప్ప ఇంకేమీ చేతకాదు… ఈటీవీలో పాడుతా తీయగా షోను బాలు కొడుకు చరణ్ తనకు చేతనైనంతగా దెబ్బతీస్తున్నాడు… జీసరిగమపలో ఆ పనిని గేయరచయిత అనంత శ్రీరాం చేపట్టాడు… ఏ చానెల్‌కూ చేతకానిరీతిలో ఒక ఓటీటీ కాస్త నాణ్యంగానే ఈ షో నడిపిస్తోంది… థమన్, కార్తీక్, హేమచంద్ర… కరెక్టు టీం… బాగుంది…!!
Share this Article