Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అసలు కంటెస్టెంట్ల పోటీయే స్టార్ట్ కాలేదు… పరుగున బాలయ్య వచ్చేశాడు…

March 15, 2023 by M S R

రెండుమూడు పాపులర్ సైట్లలో కూడా కనిపించింది… బాలయ్యను అల్లు అరవింద్ తెగవాడేసుకుంటున్నాడు, ఇండియన్ ఐడల్ ఫినాలే కూడా షూట్ చేసిపారేశారు, బాలయ్య బాగానే టైమ్ ఇచ్చాడు అని..! ఇక్కడ బాలయ్య పిచ్చోడు కాదు, అరవింద్ పిచ్చోడు కాదు… బాలయ్య ఇప్పుడు ఆహాకు అస్థాన ఆర్టిస్టు… అన్‌స్టాపబుల్ షో ద్వారా ఒక భిన్నమైన పాపులారిటీని సంపాదించాడు… తనలోని భిన్నమైన బాలయ్యను ఆవిష్కరించుకున్నాడు…

మరోవైపు అరవింద్ ఓటీటీ బాగా పాపులరైపోయింది… ఐననూ… అసలు కంటెస్టెంట్ల నడుమ పోటీయే స్టార్ట్ కాలేదు, అప్పుడే ఫినాలే ఎలా షూట్ చేస్తారు..? ముందుగానే విజేతను ఎలా ప్రకటిస్తారు..? ఇక షోలో సరుకు ఏం మిగిలినట్టు..? ఎందుకు చూడాలి అనే ప్రశ్నలు తలెత్తాయి… షూట్ జరిగింది నిజం, కానీ ఫినాలే కాదు… ఆ పన్నెండు మంది సింగర్స్ పాల్గొనే ఎపిసోడ్ షూట్ చేశారు… దీని పేరు ‘Gala with Bala’… ఇదేమిటి అంటారా..? కాస్త వివరాల్లోకి వెళ్దాం…

బాలయ్య అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్ సూపర్ హిట్… కానీ సెకండ్ సీజన్ వచ్చేసరికి బాలయ్య ప్రయారిటీలు ముందుకొచ్చాయి… చంద్రబాబుతో స్టార్ట్ చేసి, ఎవరెవరినో ఇన్వాల్వ్ చేశాడు… అది పొలిటికలా..? ఫిలిమ్ బేస్‌డా..? అర్థం కాలేదు ఎవరికీ… ప్రభాస్, పవన్, చంద్రబాబు ఫీడ్ పెద్దగా ఉండటంతో రెండే భాగాలు ప్రసారం చేశారు… వినోదపు షో కాస్తా పొలిటికల్ షో అయిపోయింది… వీళ్లుగాక ఇద్దరు ముగ్గురు వేరేవాళ్లు గెస్టులుగా వస్తే, కరణ్ జోహార్ టైపులో అక్రమ సంబంధాలు, డేటింగుల ప్రశ్నలు వేసి ప్రేక్షకులను విసిగించాడు బాలయ్య…

Ads

balayya

సరిగ్గా అదే సమయంలో ఏదో ఫంక్షన్‌లో ‘అక్కినేని తొక్కినేని’ అని ఏవో పిచ్చి వ్యాఖ్యలు చేశాడు… అది నాగార్జున ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది… ఓ బాధ్యత కలిగిన పదవిలో ఉండి, ఇన్నేళ్ల వయస్సు మీదపడినా సరే బాలయ్య మాటలకు ఓ రీతిరివాజు లేదనే విమర్శలు జోరుగా వచ్చాయి… నిజానికి ఆ సమయంలో రాంచరణ్, కేటీయార్ ఎపిసోడ్ షూట్ చేయాల్సి ఉంది… ఈ వివాదంతో అల్లు అరవింద్ మొత్తం సీజన్-2 ఆపేశాడు… కానీ బాలయ్య ఇచ్చిన రెండుమూడు రోజుల కాల్‌షీట్స్ అలాగే ఉన్నయ్…

బాలయ్య ఏదో షూటింగులో మునిగిపోయి, ఇక కొద్దిరోజులు డేట్స్ కేటాయించేట్టు లేడు… దాంతో అరవింద్ తెలివిగా ఓ ఎపిసోడ్ షూట్ చేయించి వదులుతున్నాడు… అదీ అసలు సంగతి… ఆ కంటెస్టెంట్లతో ఆడతాడు, పాడతాడు… ఆ ప్రోమోలు కూడా జోరుగా ప్రసారం చేస్తోంది ఆహా ఓటీటీ…

నిజానికి ఫస్ట్ సీజన్‌లోలాగే ఫినాలేకు ముందు ఎపిసోడ్‌ను బాలయ్యతో, తరువాత తప్పనిసరై బావ చిరంజీవితో ఫినాలే చేయించాల్సి ఉంది అల్లు అరవింద్… కానీ అదిప్పుడు కుదరడం లేదు… సో, దాదాపు ఎప్పుడో ప్రిక్లైమాక్స్‌‌లో రావల్సిన బాలయ్యను సినిమా ఆరంభంలోనే రంగప్రవేశం చేయించారు… బాలయ్యకు ఓ పనైపోయింది, అరవింద్‌కు ఆ డేట్స్ ఇలా ఉపయోగపడ్డాయి… శుభం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions