Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మళ్లీ ఆహా అన్‌స్టాపబుల్… ఈసారి నాగార్జునతో స్టార్ట్… 23 నుంచి షూటింగ్…

August 19, 2024 by M S R

తెలుగు టీవీ, ఓటీటీలకు సంబంధించి టాక్ షోలలో సూపర్ హిట్ బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాపబుల్ షో… అప్పుడెప్పుడో ఆహా ఓటీటీలో 2021 నవంబరులో స్టార్టయింది కదా… పెద్దగా టీవీ ఇంటర్వ్యూలకు, టాక్ షోలకు రాని పెద్ద పెద్ద స్టార్లను కూడా తన పరిచయాలతో తీసుకొచ్చి, కూర్చుండబెట్టి, తనదైన స్టయిల్ ప్రశ్నలతో, సరదా సంభాషణలతో, ఆటలతో షోను రక్తికట్టించాడు బాలయ్య…

అసలు బాలయ్య ఆ షోను హోస్ట్ చేయడమే విశేషం… టీవీ, ఓటీటీ షోలను చిరంజీవి, నాని, జూనియర్, నాగార్జునలు కూడా చేసినా… హిందీ నటులతో పోలిస్తే మనవాళ్లు టీవీ షోలను హోస్ట్ చేయడం తక్కువే… మీలో ఎవరు కోటీశ్వరుడు ప్లస్ బిగ్‌బాస్ షోలను జూనియర్ హోస్ట్ చేశాడు… ప్రత్యేకించి బిగ్‌బాస్ షోను జూనియర్ బాగా రక్తికట్టించాడు… అన్‌స్టాపబుల్ షో విషయానికి వస్తే… ఫస్ట్ సీజన్ మొత్తం బాగా కొనసాగింది…

మంచు ఫ్యామిలీ, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, ప్రగ్యా, రాజమౌళి, కీరవాణి, బన్నీ, రష్మిక, సుకుమార్, రవితేజ, మలినేని గోపీచంద్, విజయ్ దేవరకొండ, రానా, పూరి, చార్మి, మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి తదితరులతో 10 ఎపిసోడ్లు బాగా ట్రెండింగ్‌లోకి వచ్చాయి… మధ్యలో గీతామాధురి, శ్రీకృష్ణలతో అఖండలోని ఓ పాట కూడా పాడించాడు…

Ads

సెకండ్ సీజన్‌కు వచ్చేసరికి కథ మారింది… సినిమా సెలబ్రిటీలే కాదు, పొలిటిషియన్స్ కూడా అన్నట్టుగా తన వియ్యంకుడు చంద్రబాబును, అల్లుడు లోకేష్‌ను తీసుకొచ్చాడు షోలోకి… సరదా షో కాబట్టి పెద్దగా పాలిటిక్సులోకి పోలేదు… తరువాత ఇక షో గాడి తప్పింది… విష్వక్సేన్, జొన్నలగడ్డ సిద్ధూ వరకు వోకే… అడవి శేషు, శర్వానంద్ కూడా వోకే… తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి, రాధిక, సురేష్‌రెడ్డి… ఈ ఇద్దరు నాయకుల నడుమ రాధిక ఎందుకొచ్చిందో బాలయ్యకే తెలియాలి… ఏ కోణంలోనూ వాళ్ల కాంబో కుదరదు, కుదరలేదు…

తరువాత సురేష్ బాబు, అరవింద్, రాఘవేంద్రరావు కాంబో జస్ట్ వోకే… ఒక దర్శకుడు, ఇద్దరు నిర్మాతలు… తరువాత జయప్రద, జయసుధ, రాశిఖన్నా… జయప్రద, జయసుధ సమకాలీనులు… మరి రాశీ ఖన్నా ఆ కాంబినేషన్‌లో ఎలా ఇమిడింది..? పైగా జయసుధ, జయప్రద అంటీముట్టనట్టుగా, ఏదో బాలయ్య అడిగాడు, వచ్చాం అన్నట్టుగా పార్టిసిపేట్ చేశారు… గోపీచంద్, ప్రభాస్ వోకే, ఇద్దరూ స్నేహితులు… (రెండు భాగాలు)…

హనీరోజ్, వరలక్ష్మి, దునియా విజయ్, గోపీచంద్ మలినేని షో పెద్దగా ఆకట్టుకోలేదు… తరువాత పవన్ కల్యాణ్, సాయితేజ షో వోకే… (రెండు భాగాలు)… హమ్మయ్య పది ఎపిసోడ్లూ పూర్తి చేశామనిపించారు… (మధ్య మధ్య గ్యాపులతో…) తరువాత ఇక థర్డ్ సీజన్ లేదు… మధ్యలో భగవంత్ కేసరి ప్రమోషన్ కోసం ఒక ఎపిసోడ్… శ్రీలీల, అనిల్ రావిపూడి, కాజల్ అగర్వాల్, అర్జున్ రాంపాల్… నెల తరువాత మళ్లీ యానిమల్ సినిమా ప్రమోషన్ షో… రష్మిక, రణబీర్, వంగా సందీప్… ఈ షో కూడా పర్లేదు… దాదాపు ఏడాదిగా ఇక ఏమీ లేదు…

ఇప్పుడు నాగార్జునతో థర్డ్ సీజన్ స్టార్ట్ చేయబోతున్నాడు బాలకృష్ణ… గుడ్ స్టార్ట్… వచ్చే 23న షూటింగ్ స్టార్ట్… ఇదయినా ఫస్ట్ సీజన్‌లాగే ఓ ఫ్లోలో కంటిన్యూ చేస్తాడా..? లేక కుదరని కాంబోలను మళ్లీ తీసుకొస్తాడా..? ఇప్పటికే ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్, సర్కారు షోలు బాగా ఆదరణ పొందాయి… (ఇండియన్ ఐడల్ ఈమధ్య కాస్త చెడగొట్టినా సరే…) ఇక అన్‌స్టాపబుల్‌తో వ్యూయర్‌షిప్ మరింత పెంచుకోవాలనేది ఆహా ఆశ… గుడ్, బెస్టాఫ్ లక్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions