ఒక టీవీ చానెల్ మీద నిషేధం వేటు పడింది… మీడియావన్ అనే మలయాళం టీవీ బ్యాన్ అయిపోయింది… అయ్యో, దారుణం, దుర్మార్గం, భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం, ఈ సిగ్గుమాలిన కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి ఉందా..? ఇదేమైనా ప్రజాస్వామ్యమా..? అని ది గ్రేట్ కమ్యూనిస్ట్ సెక్షన్ ప్లస్ కాంగ్రెస్ ఏడుస్తోంది… కేరళ ప్రభుత్వం శోకాలు పెడుతోంది… ఆ పార్టీ ప్రేమించే, ఆరాధించే, ఆధారపడే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వ హయంలో చైనా ఏం జరుగుతున్నదో దానికి అక్కర్లేదు…
ఇప్పుడు వేటుపడింది ఎవరి మీద… మీడియా వన్ అనే చానెల్ మీద… నిజానికి ప్రతి టీవీ న్యూస్ చానెల్ పదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలి… గత సెప్టెంబరుతో ఈ గడువు ముగిసిపోయింది… అది రొటీన్‌గా రెన్యువల్ దరఖాస్తు చేసుకుంది… అప్పటికే ఆ చానెల్ ప్రసారాల మీద ఓ అంచనా ఉన్న కేంద్ర హోం వ్యవహారాల శాఖ ‘సెక్యూరిటీ క్లియరెన్స్’ ఇవ్వలేదు… ఆ చానెల్ బోర్డు డైరెక్టర్లలో అధికులు ఎవరయ్యా అంటే… ఓనర్‌షిప్ మాధ్యమం బ్రాడ్‌కాస్టింగ్ లిమిటెడ్… జమాతే ఇస్తామీ హింద్‌కు చెందినవాళ్లే అందులో మెజారిటీ…
Ads
ఆమధ్య ఓసారి ఢిల్లీ రైతు ఆందోళనల మీద ఇష్టారాజ్యంగా ప్రసారాలు చేసిందంటూ దీనిపైనా ప్లస్ ఆసియానెట్ పైన కొన్నాళ్ల నిషేధం వేటు వేసింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పుడు సెక్యూరిటీ క్లియరెన్సే ఇవ్వలేదు… ఇక్కడ విశేషం ఏమిటంటే… భారత వ్యతిరేక ప్రసారాలకు, ప్రచారాలకు దిగే ‘ఇన్ కంట్రీ’ మీడియా మీద ఎప్పుడూ కేంద్రం కఠినంగా వెళ్లిన దాఖలాలు లేవు… మొదటిసారిగా ఓ చానెల్‌కు పర్మిషన్స్ ఇవ్వలేదు…
దీంతో ప్రసార మంత్రిత్వ శాఖ ఆ చానెల్ మీద బ్యాన్ అస్త్రం ప్రయోగించింది… ప్రసారాలు ఆగిపోయాయి… మనది అసలే గొప్ప ప్రజాస్వామిక దేశం కదా… వాళ్లు అడగడమే ఆలస్యం, కేరళ హైకోర్టు సింగిల్ జడ్జి స్టే ఇచ్చేశాడు… అనుమతులు వచ్చేదాకా ప్రసారాలు ఉండబోవని చానెల్ వెబ్‌సైట్ ఓ ప్రకటనను పోస్ట్ చేసింది…
హైకోర్టు నోటీసులు జారీచేసింది, ఆ లీగల్ ప్రాసెస్ సంగతి పక్కన పెడదాం… వెంటనే ఇది కేంద్రం కుట్ర అని కేరళ అధికార కూటమి లెఫ్ట్, అనగా ఎల్డీఎఫ్ విమర్శలకు దిగింది… అంటే ఆ చానెల్ చేసే ప్రసారాల్ని ఎండార్స్ చేస్తున్నదా..? ఏం అర్థం చేసుకోవాలి..? సరే, ప్రధాన ప్రతిపక్ష కూటమి యూడీఎఫ్… అనగా కాంగ్రెస్ నేతృత్వం… కాంగ్రెస్ అంటే తెలుసు కదా, దానికి దేశం మీద ఓ స్థిరమైన పాలసీ ఉండదు… గుడ్డెద్దు చేలో పడ్డట్టు..!!
ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? ఈ దేశ భద్రతకో, సమగ్రతకో నష్టం వాటిల్లజేసే ప్రసారాల్ని ఈ సమాజం సహించాలా..? నిజానికి మోడీ ప్రభుత్వానికి ఇలాంటి చానెళ్లు, సైట్ల మీద ఓ పాలసీ లేదు… ఆ కార్యాచరణ కూడా లేదు… కేరళ సీఎం పినరై విజయన్‌కు మరో ప్రధాన ప్రశ్న… ఇలాంటి చానెళ్లను చైనా ప్రభుత్వం అంగీకరిస్తుందా..? మరి ఈ దేశంలోనే ఈ అలుసు ఎందుకుండాలి..? ఈ అలసు ఇచ్చి, ఇప్పుడు కెనడా ప్రదాని భయంతో పారిపోయి, దాక్కున్నాడు… ఐనా సీపీఎం నుంచి నైతిక, స్వచ్ఛ జవాబును ఆశించడం సబబు కాదు… కానీ ఇంకా ఇలాంటి విషయాల్లో వెంటనే చురుకుగా స్పందించే ఎడిటర్స్ గిల్డ్, ఐజేయూ వంటివి రంగంలోకి దిగినట్టు అనిపించలేదు… కారణం ఏమిటో…!!
Share this Article