Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఓటీటీలో రిలయెన్స్‌కూ వాటా… ఐనాసరే, కేంద్రం బ్యాన్..!

July 27, 2025 by M S R

.

అశ్లీలం, అసభ్యత నిండిన కంటెంటును ప్రసారం చేస్తున్నందుకు 25 ఓటీటీ యాప్‌లను, కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్ చేయాలని కేంద్ర I&B మంత్రిత్వ శాఖ ISPలను ఆదేశించింది… ఐటీ చట్టం సెక్షన్లు 67 & 67A, మహిళలను అసభ్యంగా చిత్రీకరించడాన్ని శిక్షించే మరికొన్ని సెక్షన్ల కింద ఈ చర్యలు తీసుకున్నారు…

( IT (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021… Section 294 of the Bharatiya Nyaya Sanhita, 2023.., Section 4 of The Indecent Representation of Women (Prohibition) Act, 1986 )

Ads

ఇదీ వార్త… కొంతమేరకు గుడ్… ఎందుకంటే..? సినిమాలకు సెన్సార్ ఉంటుంది… ప్రతి అంగుళం పరీక్షకు గురవుతుంది… హద్దు దాటితే కత్తెర… (ప్రింట్ మీడియాకు ప్రెస్ కౌన్సిల్ ఉంది, టీవీలకు..? డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారాలకు, యూట్యూబ్ వీడియోలకు…? ఇదంతా పెద్ద చర్చ… ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, దాని పరిమితుల మీద మళ్లీ ఓ చర్చను రేపుతుంది…)

the National Commission on Protection of Child Rights (NCPCR) కూడా ఇప్పటికే కొంత కంటెంటు మీద చర్యలు తీసుకుంది… Digital Publisher Content Grievances Council (DPCGC) అనే ఓ సెల్ఫ్ రెగ్యులేటరీ ఉంది… 40 ఓటీటీ ప్లాట్‌ఫారాలున్నాయి అందులో… ప్రత్యేకించి ULLU, ALTT ప్లాట్‌ఫామ్స్ మీద విపరీతమైన ఫిర్యాదులు… ULLU నుంచి బోలెడు కంటెంటును తీసివేయించింది ఈ రెగ్యులేటరీ, కానీ ఏదీ ఆగడం లేదు…

పర్‌ఫెక్ట్ సెన్సార్ లేదు కాబట్టే వెబ్ సీరీస్, ఇతర కంటెంటు ఓటీటీల్లో హద్దులు దాటుతోంది… రోత, వెగటు, మురికి… ఏ పేరైనా పెట్టండి, యథేచ్ఛగా ఇళ్లల్లోకి, మెదళ్లలోకి ప్రవహిస్తోంది… ఇప్పటికైనా కళ్లు తెరిచి కొన్ని ఓటీటీలపై కొరడా ఝలిపించడం వరకూ వోకే…

ఎప్పటికప్పుడు ఓటీటీ కంటెంటు మీద వచ్చే ఫిర్యాదులను పరిశీలించి, హద్దుల్లో పెట్టే అధికారిక సిస్టం అవసరం కదా… టీవీల్లో వచ్చే కంటెంటు మీద అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయడానికి ఓ వ్యవస్థ ఉంది కనీసం… ఓటీటీలకు అదీ లేదు కదా…

సరే, ఇక్కడ చెప్పుకోవల్సిన విశేషం ఏమిటంటే..? ఆ 27 ఓటీటీల్లో ప్రముఖమైనవీ ఉన్నాయి… అదీ విశేషం… ముందుగా ఆ 27 ఓటీటీల జాబితా ఇదీ…

ALTT
Ullu
Desiflix
Big Shots App,
Boomex,
Navarasa Lite,
Gulab App,
Kangan App,
Bull App,
Jalva App,
Wow Entertainment,
Look Entertainment,
Hitprime,
Feneo,
ShowX,
Sol Talkies,
Adda TV,
HotX VIP,
Hulchul App,
MoodX,
NeonX VIP,
Fugi,
Mojflix,
Triflicks.

ఇక్కడ చెప్పుకోవల్సింది ALTT… గతంలో ఇది AltBalaji… ఓనర్స్ బాలాజీ టెలిఫిలిమ్స్ సంస్థ… దీనికి వెటరన్ హీరో జితేంద్ర భార్య శోభాకపూర్, బిడ్డ ఏక్తాకపూర్ ఓనర్లు… తరువాత కొన్నాళ్లకు రిలయెన్స్ ఇందులో 25 శాతం వాటాలు కొనుగోలు చేసింది… సోవాట్, రిలయెన్స్ అయితేనేం అంటూ కొరడా ఝలిపించడం విశేషం… కాగా రిలయెన్స్ సొంత నెట్‌వర్క్ న్యూస్18 వెబ్‌సైట్లు కూడా తక్కువేమీ కాదు…

సో, ఈ వినోద మీడియాకు సంబంధించి ALTT బలమైన సంస్థ… ఈ నిషేధాల మీద కోర్టులో కొట్లాట తప్పదు… ఆసక్తికరమైన వాదనలూ మనం చూడాల్సి ఉంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యూట్యూబు డైట్ ఫ్లాన్లతో బీకేర్‌ఫుల్… ఓ యువకుడు కన్నుమూశాడు…
  • సీఎం రమేష్ స్విచ్ నొక్కితే… బండి సంజయ్ లైటు వెలిగింది…!!
  • పెద్ద ప్రక్రియ ద్వారా విధుల నుంచి తప్పిస్తే సరి… అంతేనా శిక్ష..?!
  • ఆ ఓటీటీలో రిలయెన్స్‌కూ వాటా… ఐనాసరే, కేంద్రం బ్యాన్..!
  • ఆ మోనిత మళ్లీ వస్తోంది… ఈసారి అంతకు మించిన నెగెటివ్ షేడ్స్‌తో..!!
  • ఏడాదిలో తెలుగు న్యూస్ చానెళ్ల రేటింగ్స్‌లో మార్పులు ఇవీ..!
  • షాకింగ్ కలెక్షన్లు… పొరుగు భాషల్లో పోయినట్టే… మరి తెలుగులో..?
  • పది అవతారాలు సరే… ఒకటీరెండు అవతారాలపై అదే సందిగ్ధత…
  • జొమాటో, స్విగ్గీ… ఏదైనా అంతే… ఫుడ్డు తక్కువ, రేట్లు ఎక్కువ…
  • హరిహరా..! ఇవేం కలెక్షన్లు నాయకా..? థియేటర్లు నిర్మానుష్యం..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions