Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మూడు భాషల్లో ఆడిన సినిమా… తెలుగులో ఫట్… అట్లుంటది మనతోని..!!

March 31, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. ఒక భాషలో హిట్టయిన సినిమా మరో భాషలో తీస్తే ఫట్టవుతుంది ఎందుకనో మరి ! మూడు భాషల్లో బాగా అడిన సినిమా తెలుగులో హిట్ కాకపోవడం హాశ్చర్యమే . తెలుగోళ్ళా మజాకా !

1982 నవంబర్ 26న వచ్చిన ఈ బంధాలు అనుబంధాలు సినిమా 1981 లో కన్నడంలో వచ్చిన అవలా హెజ్జేకి రీమేక్ . కన్నడ సినిమాకు మాతృక 1977 లో తమిళంలో వచ్చిన తూండి మీన్ . మూడింటిలోను లక్ష్మే హీరోయిన్ .

Ads

1978 లో తమిళ సినిమా ఆధారంగా హిందీలో తృష్ణ అనే టైటిలుతో ఒక సినిమా వచ్చింది . ఇందులో శశికపూర్ , సంజయ్ కుమార్ , రాఖీలు నటించారు .

కన్నడ , తమిళ సినిమాలకు రీమేక్ గా వచ్చిన ఈ బంధాలు అనుబంధాలు సినిమా చిరంజీవికి 50వ సినిమా . 1978లో అరంగేట్రం చేసిన చిరంజీవి 1982 కల్లా అంటే నాలుగేళ్ళలో 50 సినిమాలు నటించాడు . ఇప్పుడు ఆయన కుమారుడు రాంచరణ్ , అతని సమకాలికులు జూనియర్ యన్టీఆర్ , మహేష్ బాబు , అల్లు అర్జున్ , ప్రభాస్ ఎంత వెనుకపడి ఉన్నారో ఈజీగా తెలిసిపోతుంది .

శోభన్ బాబు ప్రధాన పాత్రలో నటించాడు . చిరంజీవి , శోభన్ బాబులు కలిసి నటించిన మూడో సినిమా ఇది . దీనికి ముందు చండీప్రియ , మోసగాడు సినిమాలలో మాత్రమే కలిసి పనిచేసారు . ఈ సినిమాయే ఆఖరుది వాళ్ళిద్దరికి . భార్గవ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో రంగనాధ్ , మాడా , జగ్గయ్య , పద్మనాభం , ప్రభృతులు నటించారు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలన్నీ శ్రావ్యంగానే ఉంటాయి . ఆత్రేయ , వేటూరి , రాజశ్రీ పాటల్ని వ్రాసారు . ఉన్నాడమ్మా దేవుడు- వాడున్నది వాడే ఎరగడు , పున్నమి జాబిలి నవ్వనిదెందుకో, ఏడు జన్మలెత్తనే ఏడు అడుగులే నడవనీ పాటలు శ్రావ్యంగా ఉంటాయి . పిచ్చాసుపత్రిలో ఎవడి పిచ్చి వాడికే ఆనందం అంటూ ఒక పాట ఉంటుంది . బాగుంటుంది . అంతేగా ! ఎవడి పిచ్చి వాడికి ఆనందం .

సస్పెన్స్ మరియు ఇన్వెస్టిగేటివ్ సినిమా . ఒక చిల్లర దొంగని మానరక్షణ కొరకు హీరోయిన్ షూట్ చేస్తుంది . ఆమె భర్త సైకియాట్రిస్ట్ . కాంపౌండర్ మాడా ప్రోద్బలంతో బాడీని బయటపడేస్తారు . విలన్ రంగనాధ్ చావకుండా మెమరీని కోల్పోతాడు .

ట్రీట్మెంట్ కొరకు పోలీసు ఇనస్పెక్టర్ చిరంజీవి రంగనాధుని హీరో శోభన్ బాబు వద్దకే తీసుకుని వస్తాడు . చిరంజీవికి ఆ షూట్ చేసింది లక్ష్మే అని అనుమానం . రుజువు చేయటానికి తిప్పలు పడుతుంటాడు . ఈలోపు విలన్ పేషంటుకి మెమరీ వస్తుంది . ఆ సైకియాట్రిస్ట్ తన తమ్ముడే అని తెలుసుకుంటాడు . మరదల్ని రక్షించేందుకు తనని తానే షూట్ చేసుకుని చనిపోతాడు . టూకీగా ఇదీ స్టోరీ .

సినిమా స్లోగా నడుస్తుంది . మన తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు . యూట్యూబులో ఉంది . ఆసక్తి కలవారు చూడవచ్చు . మరయితే ఈ సినిమా గురించి నేనెందుకు వ్రాసాను అని హాశ్చర్యం కలగొచ్చు .

మూడు భాషల్లో బాగా ఆడింది నాలుగో భాషలో ఎందుకు ఆడలేదో తెలుసుకోవాలనే ఆసక్తి కలవారి కోసం . #తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #గతించిన_తీపి_గతాలు …..

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions