.
కాగల కార్యం సంజయుడు తీర్చెన్… అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ కథ రక్తికడుతోంది… ఇప్పటిదాకా కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్నే బండి సంజయ్ తానూ చేశాడు… కాకపోతే తనదైన భాషలో ఘాటుగా…
దాంతో కేటీయార్‌కు మండుకొచ్చింది… ఎహె, ఏమిటిదంతా..? నీకసలు నిఘా సిస్టం ఎలా పనిచేస్తదో తెల్వద్, నీకు లీగల్ నోటీస్ పంపిస్తా, ఏమనుకుంటున్నావో, 48 గంటల్లో సారీ చెప్పు, లేకపోతే బజారుకు లాగుతా అని అగ్గిమండిపోయాడు…
Ads
ఈ విషయం తెలిసి సంజయుడు ఓ నవ్వు నవ్వుకుని లైట్ తీసుకున్నాడు… తను అనుకున్నట్టే బీఆర్ఎస్ నుంచి స్పందన వచ్చిందని..! వోకే, నిజంగానే కేటీయార్ లీగల్ నోటీస్ ఇస్తాడు అనుకుందాం… బండి టీమ్ బదులు ఇస్తుంది, పోనీ, కేటీయార్ నిజంగానే కోర్టుకు పరువు నష్టం దావా వేస్తాడు అనుకుందాం…
ఈ దేశ హోం వ్యవహారాలు చూస్తున్న మంత్రిగా తనకు తెలిసిన విషయాలే చెప్పాను, ఫోన్ ట్యాపింగ్ సాగిన తీరు అరాచకంగా ఉందని బండి సంజయ్ చెబుతాడు… రాష్ట్ర స్థాయి సిట్‌కు పరిమితులుంటయ్, ఫోన్ ట్యాపింగ్ ద్రోహులు విచారణకు సహకరించడం లేదు, సీబీఐకి అప్పగిస్తే బెటర్ లేదా కోర్టే స్వీయ పర్యవేక్షణలో విచారణ జరిపిస్తే బెటర్ అంటాడు…
అప్పుడు కథ రసకందాయంలో పడుతుంది… ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నేను తన పార్టీ జాతీయ కార్యదర్శికీ, అధ్యక్షుడికీ, కేంద్ర హోం మంత్రికీ చేసిన కాల్స్‌కూ రికార్డు చేశారనీ, కేసు తీవ్రత దృష్ట్యా ఇది కేంద్ర విచారణ పరిధిలోకి వస్తే బెటర్ అంటాడు… అమిత్ షా, జేపీ నడ్డా, సంతోష్ ఫోన్లే కాదు, జడ్జిల ఫోన్లు కూడా ట్యాపింగ్ అనేది సీరియస్ మ్యాటరే కదా…
అసలు ధ్వంసం చేసిన ఫోన్ ట్యాపింగ్ రికార్డుల హార్డ్ డిస్కుల్లో ఇంకా ఏముంది..? అది తేలాలంటే ట్యాపింగ్ బాధ్యులు నోళ్లు విప్పాలి… వాళ్లూ పోలీసులే కదా… వాళ్ల నోళ్లు తెరిపించాలంటే మరీ ఓ సాధారణ క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించి, ఆ ‘పోలీసు మర్యాద’లు చేయలేరు కదా… మరేమిటి మార్గం..?
అసలు టెలికాం రెగ్యులేటరీ అథారిటీని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయాలి… ట్యాపింగ్ మార్గదర్శకాలు ఏ రీతిలో తుంగలో తొక్కారో బయటపడాలి… ఇదుగో, ఈ దిశలోనే బండి సంజయ్ మాటలకు వాల్యూ వచ్చింది… సో, బండి సంజయ్ మీద నిజంగానే కేటీయార్ కేసు పెట్టించగలిగితే… కేసు దర్యాప్తు కొత్త దశ తీసుకునే చాన్స్ ఉంది…
ఎన్నికల్లో పట్టుబడిన డబ్బును పక్కదోవ పట్టించారనే మరో సీరియస్ ఆరోపణ చేశాడు సంజయ్… ఎస్ఐబీ ముసుగులో కొల్లగొట్టిన సొమ్ము ఏమైందని అడగడమే కాదు, దేశభద్రతకు సంబంధించిన వ్యవహారాలూ ముడిపడి ఉన్నాయనేది తన ఆరోపణ…
బండి సంజయ్‌తోపాటు తన వ్యక్తిగత సిబ్బంది నుంచి వెళ్లిన కాల్స్ ఎలా రికార్డయ్యాయో కూడా సిట్ వాళ్లకు చూపించిందని ఆంధ్రజ్యోతి వార్త చెబుతోంది… సిట్ గనుక తాము కనుగొన్న విషయాలన్నీ వెల్లడిస్తే… ఇంకా ఎన్ని లోగుట్టు వ్యవహారాలు తెలుస్తాయో… బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రయత్నాలు వంటి రాష్ట్ర రాజకీయాల కథ కూడా మారుతుందేమో..!!
కేసులో సీరియస్‌నెస్ ఉంది కాబట్టే ప్రధాన బాధ్యుడు ప్రభాకరరావు అమెరికా పారిపోయి, అక్కడే స్థిరనివాసం కోసం, రాజకీయ ఆశ్రయం కోసం ప్రయత్నించాడు… సో, కేటీయార్ దావా వేస్తే ఈ కేసు కొత్త దిశను తీసుకునే చాన్స్ అయితే ఉంది..!! రేవంత్ రెడ్డి, ప్రభుత్వం, కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు, వ్యక్తం చేస్తున్న సందేహాలకు బండి సంజయ్ రంగప్రవేశంతో మరింత బలం చేకూరింది..!!
Share this Article