Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!

November 9, 2025 by M S R

.

జూబ్లిహిల్స్ ఎన్నికల్లో పాదయాత్ర చేసిన అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్… ఇన్నాళ్ల ప్రచార తీరును, ప్రచారాంశాలను కూడా మార్చేసి, సోకాల్డ్ రాష్ట్ర బీజేపీ పెద్ద పెద్ద తలకాయలు దించుకునేలా… ప్రత్యేకించి కిషన్ రెడ్డి తలవంచుకునేలా…. ఈ ప్రచారం రూటే మార్చేశాడు…

కేసీయార్ కోసం… రహస్య దోస్తీ కోసం… కేసీయార్ పాదాల మీద పడి పాకే బతుకు కోసం… సంజయ్‌ను తప్పించేసి, కిషన్ రెడ్డిని రాష్ట్ర బీజేపీ హెడ్డును చేసిన అమిత్ షా, మోడీల మొహాలు పగిలేలా… తన ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది రెండు రోజులుగా…

Ads

ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని రేవంత్ రెడ్డి చెప్పాడు కదా… ఇక బండి సంజయ్ బ్యాటింగు స్టార్టయింది… (కేటీయార్ దగ్గర హిందూ ముస్లిం వాదన లేదు, రేవంత్ ఒక్కడే టార్గెట్… ఇష్టమొచ్చినట్టుగా…)

‘‘మళ్లీ చెబుతున్నా… బీజేపీ అంటేనే హిందువు… హిందువు అంటేనే బీజేపీ… 20 శాతం ముస్లింల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్… హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా ముఖ్యమంత్రే మాట్లాడుతున్నారంటే ఏమనాలి..?

  • 80 శాతం మంది హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీయే… హిందూ ఓటు బ్యాంకు దమ్మేందో జూబ్లిహిల్స్ ప్రజలు చూపబోతున్నారు… కేటీఆర్… ఎన్నడూ డ్రగ్స్ తీసుకోలేదని కుటుంబ సమేతంగా భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసే దమ్ముందా…? (కేటీయార్‌కు దేవుళ్ల మీద నమ్మకం లేదు భయ్యా, మరేం చేద్దామంటవ్..?)

రేపు ఉదయంలోపు ప్రమాణం చేయ్… అప్పుడు నేనే మీకు జూబ్లిహిల్స్ ప్రజల పక్షాన అప్పీల్ చేస్తా… అయ్య పేరు చెప్పి గెలిచిన బతుకు కేటీఆర్ ది…. అయ్య లేకుంటే ఆయనను కుక్కలు కూడా దేకవ్… 2014కు ముందే తెలంగాణ కోసం, హిందుత్వం కోసం పోరాడితే 60 కేసులు పెట్టారు… 7 సార్లు జైలుకు పోయి వచ్చిన… నీకు నాతో పోలికా?

గోపీనాథ్ జూన్ 8న చనిపోయారని చెప్పారు… అదే నెల 25న గోపీనాథ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదిగో ఆధారాలు… కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా… గోపీనాథ్ కొడుకును ఇండియాకు రాకుండా మాజీ మంత్రి పువ్వాడ నాగేశ్వరరావు బెదిరించిన మాట వాస్తవం… (ఓహ్, సేమ్ క్యాస్ట్, పువ్వాడ అంటేనే కేస్ట్ రాజకీయం కదా… బాగా తగులుతోంది దెబ్బ…)

వాటికి సంబంధించిన ఆడియో క్లిప్పింగ్ ను గోపీనాథ్ కుటుంబ సభ్యులు చూపించారు… మాగంటి సునీత తప్పుడు ఆధారాలు చూపించి ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకుంది… విచారణలో ఆమె తప్పుడు సమాచారమిచ్చినట్లు తేలడంతో ప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికేట్ రద్దు చేసింది… ఒక ఓటర్ కార్డులో సునీత భర్త పేరు సునీత మనోహర్ అని ఉంది… ఇంకో ఓటర్ కార్డులో సునీత భర్త పేరు మాగంటి గోపీనాథ్ అని ఉంది… ఇదిగో, ఆ ఓటర్ కార్డులను మీకు పంపిస్తున్నా… విచారణ జరపాలి…

  • 2023 ఎన్నికల అఫిడవిట్ లో మాగంటి సునీత చదువుకోలేదని రాసిచ్చారు… 2025లో ఎన్నికల అఫిడవిట్ లో టెన్త్ వరకు చదువుకున్నారని రాసిచ్చారు… ఇదిగో ఆధారాలు… విచారణ జరపాలి…

గోపీనాథ్ ఆస్తులపై సునీతతో కలిసి కేటీఆర్ కుట్ర చేస్తున్నారు… ఆ ఆధారాలను, నా దగ్గరున్న సమాచారాన్ని పోలీసులకు పంపించా… కన్నతల్లిని కూడా గోపీనాథ్ ను చూడనీయకుండా ఏఐజీ ఆసుపత్రి యాజమాన్యంతో నోటీసులిప్పించారు… గోపీనాథ్ పై బీఆర్ఎస్ కు ప్రేమ లేనేలేదు … గోపీనాథ్ ఆస్తులను కాజేసేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తోంది… అందుకే గోపీనాథ్ ఆస్తులను తారుమారు చేసేందుకు ఈ కుట్రలకు తెరదీశారు…

అదే ఆసుపత్రిలో 9వ ఫ్లోర్ లో కేటీఆర్, ఆయన సతీమణి తిష్టవేసి ఆస్తులను కాజేసే కుట్రకు తెరదీసింది నిజం కాదా? బీఆర్ఎస్ పాలనలో బిల్డర్ల వద్ద నుండి ఫ్లోర్ లకు ఫ్లోర్ లే తీసుకున్నరు… ఇదుగో ఇలా సాగిపోతోంది బండి సంజయ్ ప్రచారం…

అవునూ, సునీత రెండు ఆధార్‌లు ఏమిటి..? అందులో వేర్వేరు పేర్లు ఏమిటి..? మధ్యలో ఈ మనోహర్ ఎవరు..? కిషన్ రెడ్డికీ, కేటీయార్‌కూ సాన్నిహిత్యం కోణంలో ఇదేమీ తేలదు గానీ… రేవంత్ రెడ్డి ఏమైనా తేలుస్తాడా..? అబ్బో… చూడబోతే, తవ్వితే చాలా పెంకాసులు బయటపడేట్టు ఉన్నాయి..!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!
  • మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావి… ఈ నివేదిక చెప్పేదిదే…
  • ఈ నగలు దిగేసుకుంటే చాలు… ‘కళల వధువు’ కావడం ఖాయం..!!
  • చక్ దే ఇండియా..! ఆగిపోయిన ఈ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మళ్లీ కదిలింది..!!
  • అసలు ఆ పాత్రే తనకు నప్పలేదు..! దానికితోడు స్వీయ సమర్పణ..!!
  • ఎవరు విలన్లు..? మాగంటి గోపీనాథ్ మృతి మిస్టరీ కథలో మరో ట్విస్ట్..!
  • ఈ వీకెండ్ బిగ్‌బాస్ షో నచ్చింది… రాము రాథోడ్ మరింత నచ్చాడు..!
  • విరోధాభాస…! రాజకీయ భేతాళుడు – ఓ విక్రమార్కుడి పాత కథ…!!
  • చిరంజీవ..! ఆహా… ఎంత నాసిరకం సినిమా సమర్పించావు అభీ..!!
  • గోపీనాథ్ మరణ మిస్టరీ ఏమిటి..? కేటీయార్ మౌనం వెనుక మర్మమేంటి..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions