.
ఎక్కడో స్విచ్ వేస్తే ఇంకెక్కడో బల్బు వెలుగుతుంది… రాజకీయాల్లో అదే విచిత్రం… సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ అండ్ కో ను పూర్తిగా డిఫెన్సులో పడేశాయి కదా… ఇప్పుడు ఆ ఇష్యూ కేంద్ర హోం శాఖ సహాయమంత్రి దాకా పాకింది… కరెంటు ప్రసారంలాగా…
సీఎం రమేష్ ఏమన్నాడు..? ‘‘ఏమోయ్ కేటీయారూ… కవిత జైలులో ఉన్నప్పుడు, నా ఇంటికి వచ్చి, నువ్వు రాయబారం చేయి, ఆమె రిలీజ్ కావాలి, అవసరమైతే మా పార్టీని విలీనం చేస్తాం అని అన్నావా లేదా..? ఇంకా ఏమైనా రహస్యాలు బయటపెట్టమంటావా చెప్పు’’ ఇదే కదా…
Ads
వోకే, వోకే, నువ్వూ, రేవంత్ కలిసి వస్తే బహిరంగ చర్చకు రెడీ అన్నాడు కదా కేటీఆర్… మధ్యలోకి రేవంత్‌ను లాగడం దేనికి..? బీజేపీకి కదా జవాబు చెప్పాల్సింది… ‘‘ఒరేయ్, నువ్వెవడ్రా, నా పార్టీ గౌరవాన్ని, నా గ్రేట్ డాడీ గౌరవాన్ని, నా గౌరవాన్ని, నా కేడర్ గౌరవాన్ని బీజేపీ కాళ్ల మీద తాకట్టు పెట్టను, పెట్టలేను, పెట్టే ప్రసక్తే లేదు, వాటీజ్ దిస్ నాన్సెన్స్… మోడీ కాదు, తన తాత వచ్చినా మేం తగ్గేదేలే…’’ అనాలి కదా…
అనలేదు… చర్చకు సిద్ధం అంటాడు… అవేవీ సాధ్యం కాదు అనేది తనకూ తెలుసు… మీరూ మీరూ తన్నుకొండి అని రేవంత్ రెడ్డి క్యాంపు చోద్యం చూస్తోంది… ఈలోపు బండి సంజయ్ బల్బు వెలిగింది…
‘‘బిఅర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరు మీరు… పూర్తిగా అవినీతిలో కూరుకపోయింది నీ పార్టీ… కేటిఅర్‌కి టికెట్ ఇవ్వకపోతే, తనకి టికెట్ ఇవ్వాలని సియం రమేష్‌ని కలిశాడు.. ఇది నిజం…’’ అని ఇంకేవో కొత్త పాత బాగోతాలు తవ్వుతున్నాడు సంజయ్… (అప్పట్లో మహాకూటమి అనే ఓ విఫల ప్రయోగం, చంద్రబాబుతో పొత్తులు గట్రా తెలిసిందే కదా… అదేమంటే, గొంగళిపురుగునైనా ముద్దాడతాం అన్నాడు కదా కేసీఆర్…) అవన్నీ బెడిసికొట్టాయి, అది వేరే సంగతి…
‘‘సియం రమేషే కెటిఅర్‌కి అర్థికసహాయం చేశాడు… బీఆర్ఎస్ నడిపే స్థితిలో లేకే బిజేపి లో వీలీనం చేస్తా అన్నారు… కానీ మేమేమో విలీనాలకు, వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం…’’ అంటున్నాడు బండి సంజయుడు… కిషన్ రెడ్డి తెలివైనోడు, వీటిల్లో ఇరుక్కోడు…
మేం విలీనాలకు, ఆ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటున్నాడు కదా బండి సంజయ్… వంద గొడ్లు తిన్న రాబందు సామెత తెలుసా మీకు..? సరే… ‘‘సియం రమేష్‌ని నేను తీసుకువస్తాను…. నీ సవాల్‌పై చర్చకి మీరు సిద్ధమా..? నీ భాష సరిగా లేదు… సంస్కారం లేని సంస్కారహీనుడు… ముఖ్యమంత్రిని హౌలే అనీ… వాడు, వీడు అనడం కరెక్ట్ కాదు…’’ అని కౌంటర్ దాడి స్టార్ట్ చేశాడు…
అంతేకాదు, ట్విస్టు ఏమిటంటే..? ‘‘కేటీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా ఇష్టమచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నాడు’’ అంటాడు… మధ్యలోకి ఆ హిమాంశును లాగడం దేనికి..? తనకూ పాలిటిక్సుకూ ఏం సంబంధం..? ‘‘కరీంనగర్ వేదికగా నేను సియం రమేష్‌ని తీసుకువస్తాను… కేటీఆర్ టైం, డేట్ ఫిక్స్ చెయ్యాలి’’ అంటాడు సంజయుడు…
హేమిటో… ఈ బహిరంగ చర్చలు మన్నూమశానం ఏవీ జరగవు… ఊదు కాలదు, పీరు లేవదు… ఏవో మీడియాలో కనిపించే సవాళ్లు, ప్రతిసవాళ్లు… అవునూ… సీఎం రమేష్ చెప్పిన సంగతులూ, కేటీఆర్ సోదరి కవిత మొన్నామధ్య చెప్పిన సంగతులూ సేమ కదా… కేటీఆర్ సర్, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎందుకు జరగలేదు..? మీరైనా కాస్త చెప్పొచ్చు కదా, మిమ్మల్ని ప్రేమించిన తెలంగాణ ప్రజలకు..?!
Share this Article