Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫక్తు రొటీన్ మూస కథతో భానుప్రియ డబుల్ యాక్షన్

June 28, 2025 by Rishi

.

{ దోగిపర్తి సుబ్రహ్మణ్యం } ….. భానుప్రియ ద్విపాత్రాభినయం చేసిన మొట్టమొదటి సినిమా 1985 డిసెంబర్లో వచ్చిన ఈ బంగారు చిలక సినిమా . కధానాయికలు ద్విపాత్రాభినయం చేసే సినిమాలు తక్కువే హీరోలతో పోల్చి చూస్తే … ఏక్షన్ కింగ్ , బ్లాక్ బెల్ట్ కరాటే ఫైటర్ అర్జున్ నటించిన రెండవ సినిమా . మొదటిది మాపల్లెలో గోపాలుడు అని అందరికీ తెలిసిందే . సుందర విశాఖ , విశాఖ చుట్టుపక్కల షూటింగ్ చేసారు . లొకేషన్స్ అన్నీ చాలా అందంగా ఉంటాయి .

చాలా ద్విపాత్రాభినయం సినిమాలలో కధలాంటిదే ఇది కూడా . ఓ జమీందారు వద్ద గుంటనక్కలు వంటి ఇద్దరు బంధువుల రూపంలో బతుకుతుంటారు . ఆస్తిని చేజిక్కించుకుంటానికి జమీందారుని , కొడుకు కోడలిని బాంబు పెట్టి చంపేస్తారు .

Ads

జమీందార్ ఆస్తిని మనమరాలు పేరు మీద వ్రాస్తారు . రోడ్ మీద డాన్సులు చేస్తూ , జేబులు కొట్టేస్తూ జీవనం సాగించే చిలక అచ్చం జమీందార్ గారి మనమరాలులాగానే ఉంటుంది .

ఆ చిలకను బంగళాలో ప్రవేశపెట్టి మనమరాలిని నీళ్ళల్లో పడేస్తారు విలన్లు . అదృష్టవశాత్తూ ఆమె హీరో చేత రక్షించబడి వారి కుటుంబంలో కలిసిపోతుంది . ప్రేమించుకుంటారు . అసలు విలన్లను , మరో మూలవిరాట్టు విలన్ లాయర్ని తుదముట్టిస్తారు . ఇదీ కధ టూకీగా .

యస్ పి బాలసుబ్రమణ్యం సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాటలు శ్రావ్యంగా ఉంటాయి . ముఖ్యంగా చెలీ సఖీ మనోహరీ మందారమౌన హాసినీ పాట బాలసుబ్రమణ్యం , జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . వేటూరి వారి ముద్ర కనిపిస్తుంది .

సంగీత సాహిత్య ప్రియలు మిస్ కాకండి . యూట్యూబులో చూడండి . మరో డ్యూయెట్ వయ్యారి భామా వర్రగుంది కూడా బాగుంటుంది . వర్రగుంది అంటే ఏంటో మరి ! పెద్దలు ఎవరయినా వివరించాలి . చెప్పాల్సిన సంగీత దర్శకుడు లేడు, రాసిన రచయిత లేడు…

చల్ చలాకీ గజ్జెల గుర్రం అంటూ సాగే పాటతో హీరో పరిచయం చేయబడతాడు . ఈ పాటా బాగుంటుంది .

జి వి రమణ కధను నేయగా సత్యానంద్ మాటల్ని వ్రాసారు . బాగా వ్రాసారు . అనిల్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భానుప్రియ , అర్జున్ తో పాటు సుకుమారి , గిరిబాబు , నూతన్ ప్రసాద్ , శుభలేఖ సుధాకర్ , అంజలీదేవి , గుమ్మడి , రాళ్ళపల్లి , సుత్తి వేలు , కృష్ణవేణి , అల్లు రామలింగయ్య , ప్రభృతులు నటించారు .

It’s a feel good , entertaining , action movie . ఊరకూరకే మలుపులు గిలుపులు లేకుండా బారున సాగుతుంది సినిమా . సినిమా యూట్యూబులో ఉంది . చూడబులే . భానుప్రియ , అర్జున్ అభిమానులు ఇంతకుముందు చూడనట్లయితే ట్రై చేయవచ్చు .

#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…
  • శతృ సంతానం..! పాత జన్మ పగవాళ్లే ఈ జన్మలో పిల్లలుగా పుట్టి…!!
  • స్మి’తత్త్వమసి’… పాప్, ర్యాప్ అయిపోయాయి… ఇక తత్వ యాత్ర…
  • సరిహద్దుల్లో ఓ సైలెంట్ ఛేంజ్… India also Ready for AI War…
  • ‘మై జల్‌మురి ఖా రహాథా…’ బెంగాల్ గెలుపుపై అమెరికాలో సంబురాలు
  • ‘కాల్పనిక అమ్మతనం’… ఊహల ఉయ్యాలవే మనసా… మాయల దెయ్యానివే…
  • కేడీ, ది డెవిల్… ప్చ్, కంట్రవర్సీ ఎక్కువ- కంటెంటు తక్కువ…
  • అమెరికాలో ఆదానీ కేసు సెటిల్‌మెంట్..! ఆరోపణలన్నీ ఉఫ్…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions