Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పగలైతే దొరవేరా… ఇదీ మల్లీశ్వరిలా క్లాసిక్… వాణిశ్రీ ఇందులో షీరో…

February 24, 2024 by M S R

Subramanyam Dogiparthi….   మల్లీశ్వరి సినిమాలాగా మరో క్లాసిక్… 1969 ఉగాదికి విడుదలయింది ఈ బంగారు పంజరం సినిమా . ఇదే బీ యన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఆఖరి సినిమా . ఈ సినిమా గురించి చెప్పాలంటే ముగ్గురి గొప్పతనం గురించి చెప్పాలి . మొదటి వారు బి యన్ రెడ్డి , రెండవవారు ఈ సినిమాకు షీరో ( Shero ) అయిన వాణిశ్రీ , మూడవవారు దేవులపల్లి వారు .


ఆయన్ని అందరూ భావ కవి అంటారు . నాకయితే ఆయన హాయి కవి అనిపిస్తారు . ఈ సినిమాలో పాటలన్నీ ఆయనే వ్రాసారు . మల్లీశ్వరి సినిమాలోలాగా బయట కూడా అంతగా హిట్ అయ్యావో లేదో నాకు తెలియదు కానీ , సినిమాలో వింటున్నప్పుడు ఎంత హాయిగా ఉంటాయో రసజ్ఞులకు మాత్రమే అర్థం అవుతుంది . యస్ జానకి గాత్రం కూడా అద్భుతం.

గట్టు కాడ ఎవరో చెట్టు నీడ నీడ ఎవరో, నల్ల కనుల నాగస్వరం ఊదేరెవరో ,.. మనిషే మారేరా రాజా మనసే మారేరా, మనసులో నా మనసులో … పగలైతే దొరవేరా రాతిరి నా రాజువురా ,.. కొండల కోనల సూరీడు కురిసే బంగారం నీరు విరిసి ఉరకేసే ఏరు …, శ్రీశైల భవనా భ్రమరాంబా రమణా .., నీ పదములె చాలు రామ నీ పద ధూళులే పదివేలు … పాటలలోని హాయి, సాహిత్యం ఒక ఎత్తయితే సంగీతం ఒక ఎత్తు . ఈ భావ సాహిత్యానికి కుదిరిన సరయిన సంగీతం …

Ads

మా నరసరావుపేటలో కుర్రాడిగా చూసినప్పుడు బోర్ కొట్టింది . వయసు పెరిగేకొద్దీ ఈ సినిమా భావత్వం , హాయిత్వం అర్థం కావడం మొదలయింది . మల్లీశ్వరి కూడా అంతే . ఢిష్యూం ఢిష్యూం సినిమాల్లాగా స్పీడుగా పరుగెత్తదు . కొండల్లో కోనల్లో సన్నసన్నగా చిన్నచిన్నగా సాగే సెలయేరులాగా ఉంటుంది . నాకయితే కళా ఖండమే .

వాణిశ్రీ షీరోయిన్ అయ్యాక తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని చాలా సిన్సియర్ గా ఉపయోగించుకుంది . ఈ సినిమా కూడా అంతే . మొదట్లో చలాకీగా , తర్వాత బాధ్యత కలిగిన స్త్రీగా మరో సావిత్రిగా నటించింది . శోభన్ బాబు , శ్రీరంజని , రమణారెడ్డి , గీతాంజలి , రావి కొండలరావు , బేబీ రాణి ప్రభృతులు నటించారు .

ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ అవార్డ్ , తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డులు వచ్చాయి . నాలుగవ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది . మా ఊళ్ళో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో ఆడింది . స్లో అయినా ఫరవాలేదు, హాయయిన సినిమా చూద్దామని అనుకునేవారు యూట్యూబులో చూడవచ్చు . మనసు బాలేనప్పుడో , బాగా ఉన్నప్పుడో తప్పక చూడండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

మచ్చుకు ఈ పాట వినండి… పగలైతే దొరవేరా… పక్కనా  నువ్వుంటే ప్రతి రాత్రీ పున్నమిరా… అంటూ పండు వెన్నెలగా హాయిని కురిపించే పాట… https://www.youtube.com/watch?v=QZA4mCIG7AI&ab_channel=iDreamMedia

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
  • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
  • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!
  • చైల్డ్ ఆర్టిస్టు కాదు… డబుల్ రోల్‌లో మహేశ్ బాబే అసలు హీరో…
  • … ఫాఫం అంబానీ..! కంటెంట్ రైటర్ల పారితోషికాలకూ డబ్బుల్లేవ్..!!
  • తల్లి చెప్పింది… ‘సింహంలా పోరాడు… అంతేగానీ పిరికివాడివై తిరిగిరాకు’
  • రోగ్ ప్లానెట్ కాదు… దుష్ట గ్రహమూ కాదు… అదొక ఒంటరి జర్నీ… అంతే…
  • 1500 కోట్ల పణం..! ప్రేక్షకుడు ఎందుకెక్కువ చెల్లించాలి…? మళ్లీ అదే ప్రశ్న..!!
  • వెనెజులా..! ఇప్పుడు ట్రంపు దాడి… ఎప్పటి నుంచో ‘ఉచితాల’ దాడి..!!
  • ఈ బీరువా తలుపులు తెరవగానే… నా బాల్యం నన్ను నిండా కమ్మేస్తుంది…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions