Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఓహో… బంగ్లా ప్రధాని నోబెల్ యూనుస్ వెనుకా చాలా పెద్ద కథే ఉంది…

August 17, 2024 by M S R

డామిట్ కథ అడ్డం తిరిగింది! మొహమ్మద్ యూనిస్ బంగ్లా కొత్త ప్రధాని! అందరూ గృహ నిర్బంధం నుండి విడుదల చేసి BNP ఖలీదా జియాను ప్రధానిని చేస్తారు అనుకున్నారు, కానీ అలా జరగలేదు!

నోబుల్ లారెట్ అమెరికా, బ్రిటన్ ల నమ్మకబంటు మొహమ్మద్ యూనిస్! మైక్రో ఫైనాన్స్ సిస్టం అయిన గ్రామీణ బ్యాంక్ ను నెలకొల్పి వెలుగులోకి వచ్చిన మొహమ్మద్ యూనస్ కి తరువాత నోబుల్ ప్రైజ్ ఇచ్చారు! జస్ట్ అమర్త్య సేన్ కి ఇచ్చినట్లు!

అమర్త్య సేన్, మొహమ్మద్ యూనస్ లు ఇద్దరూ బెంగాలీలు! అమర్త్యసేన్ అమెరికాలో సెటిల్ అయ్యాడు! మొహమ్మద్ యూనస్ లండన్లో సెటిల్ అయ్యాడు!

Ads

UPA 1, UPA 2 సమయంలో అమర్త్యసేన్ భారత్ లో ఉంటూ వచ్చాడు. షేక్ హసీనా రాజీనామా చేయగానే వెంటనే మొహమ్మద్ యూనస్ లండన్ నుండి ఢాకాలో లాండ్ అయ్యాడు!

మొహమ్మద్ యూనస్ పెద్ద ఫ్రాడ్!
409.69 కోట్ల టాకా ల ( 37.1 మిలియన్ డాలర్లు) కుంభకోణంలో ప్రధాన నిందితుడు యూనుస్! గ్రామీణ బ్యాంక్ లాగానే బంగ్లాదేశ్ లో గ్రామీణ టెలికాం కూడా ఉంది. గ్రామీణ టెలికాంలో పనిచేసే కాలంలో మనీ లాండరింగ్ కి పాల్పడ్డాడు మొహమ్మద్ యూనస్! మొహమ్మద్ యూనస్ మీద చీటింగ్, ఫోర్జరీ, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి!

*******
యూనస్ లండన్ లో ఉన్నప్పుడు రోజూ ఖలేదా జియా కొడుకుతో మరియు పాకిస్ధాన్ ISI తో చర్చలు జరుపుతూ వచ్చాడు! ఈ ముగ్గురితో జార్జ్ సోరోస్, అతని కొడుకు అలెగ్జాండర్ సారోస్, జో బిడెన్ కొడుకు హంటర్ బిడెన్ టచ్ లో ఉన్నారు! హిల్లరీ క్లింటన్ వెనుక ఉంటూ కథ నడిపింది. అఫ్కోర్స్! డీప్ స్టేట్ అనే మాట వినపడ్డప్పుడల్లా బరాక్ ఒబామా, జార్జ్ సోరోస్, హిల్ల రీక్లింటన్ పేర్లు బయట పడుతూ ఉంటాయి.

మొత్తం వ్యవహారంలో నిధులు సమకూర్చడం అనేది జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ ద్వారా జరిగింది! ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ తో మొహమ్మద్ యూనస్ కి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి!

*******
బంగ్లాదేశ్ న్యాయ వ్యవస్థని కొనేశారు! కొత్త విషయం బయటికి వచ్చింది. అదేమిటంటే 2018 లో కోటా సిస్టమ్ ను హసీనా రద్దు చేసింది! కానీ హఠాత్తుగా ఢాకా హై కోర్టు కోటా సిస్టమ్ పునరిద్ధరించింది!

అసలు ఢాకా హై కోర్టులో ఎవరు ఎప్పుడు పిటిషన్ వేశారో తెలియదు. కానీ ఆఘమేఘాల మీద హై కోర్టు తీర్పు ఇచ్చింది! హై కోర్టు తీర్పు వల్ల మళ్లీ హింస చెలరేగేలా చేశారు! So! మొత్తం సిస్టం కొనేశాడు జార్జ్ సోరోస్! ఇదంతా ఎందుకు అనే అనుమానం రావొచ్చు! మన దేశంలో కూడా కొన్ని అనూహ్యమైన కోర్టు తీర్పులు వస్తున్నాయి కదా!

*******
డామిట్ కథ అడ్డం తిరిగింది!
షేక్ హసీనా భారత్ రాగానే బ్రిటన్ విదేశాంగ మంత్రి హసీనాకి రాజకీయ శరణార్థి కింద వీసా ఇవ్వాలంటే కనీసం నెల రోజుల ముందు అభ్యర్ధన చేయాలి, అది రూల్ అని అన్నాడు!

మరోవైపు జో బిడెన్ హసీనాకి ఉన్న వీసా అనుమతి రద్దు చేశాడు! ఎందుకంటే హసీనా ప్రధాని కాదు అని! మరి ప్రజాస్వామ్యం రక్షించబడిందా?అసలు ఉద్దేశ్యం ఏమిటంటే… షేక్ హసీనాను భారత్ లోనే ఉండేట్లుగా చేసి బంగ్లాదేశ్ ప్రజలలో భారత్ పట్ల ద్వేషం పెంచాలి అని.

కానీ దొంగ ఉద్యమాన్ని ISI హై జాక్ చేసింది! షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళేవరకూ అది అమెరికా, బ్రిటన్ లతో బాగానే ఉంది! హసీనా భారత్ కి వెళ్ళగానే నకిలీ ఉద్యమకారులను తన చెప్పు చేతల్లోకి తీసుకుంది!

ఇప్పుడు వాళ్ళు మొహమ్మద్ యూనస్ ను ప్రధానిగా ఒప్పుకోవడం లేదు. పార్లమెంటును రద్దు చేసి ఎన్నికలు జరపాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు అంటూ జరిపితే మళ్ళీ అవామీ లీగ్ గెలుస్తుంది. 130 లక్షల మంది హిందువుల ఓట్లు అవామి లీగ్ పార్టీ కే పడతాయి! సాంప్రదాయ బంగ్లా ముస్లిం ఓటర్ల అండ అవామీ లీగ్ కి ఉండనే ఉంది!

అసలు అవామీ లీగ్ కి మొదటి నుండి బంగ్లా హిందువుల ఓట్ బ్యాంక్ స్థిరంగా ఉంటూ వచ్చింది! అమెరికాలో , బ్రిటన్ లలో షేక్ హసీనాకి మద్దతు రాను రాను పెరుగుతూ వస్తున్నది! మిగతా ప్రపంచ దేశాలలో కూడా షేక్ హసీనాకి మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు అంటే అది షేక్ హసీనాకి మళ్ళీ ప్రధాని పదవి కట్టబెట్టడమే!

ముఖ్యంగా బ్రిటన్ లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రిటన్ లేబర్ పార్టీ పాత్రని తక్కువ చేసి చూడాల్సిన పని లేదు!

మోడీ కౌంటర్ ఎటాక్! దాదాపుగా వారం పాటు మౌనంగా ఉన్న మోడీ చివరికి బంగ్లాదేశ్ ప్రభుత్వానికీ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు! మూడు రోజుల క్రితం ఢాకా సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ హసీనాను బంగ్లాదేశ్ కి అప్పచెప్పాలని డిమాండ్ చేసింది! బార్ అసోసియేషన్ కి ఇతర దేశాలతో ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ బంగ్లా సుప్రీం కోర్టు కోరినా భారత్ స్పందించదు!

మొహమ్మద్ యూనస్ భారత్ ను ఉద్దేశించి ప్రకటన చేస్తూ, పక్క దేశ మిత్రుడు బాంగ్లాదేశ్ కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవాలి అంటూ సన్నాయి నొక్కులు నొక్కాడు. అంతే! మోడీ వెంటనే స్పందించారు! ఎలా? భారత దేశ విద్యుత్ చట్టం సవరించారు.

కొత్తగా సవరించిన చట్టం ప్రకారం విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు తమకి రావాల్సిన బకాయిలని రాబట్టుకోవడానికి అవసరం అయితే ఆయా ప్రభుత్వాలకి సరఫరా చేసే విద్యుత్ ఆపేయవచ్చు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే! ఇది విదేశాలకి కూడా వర్తిస్తుంది!

అదానీ పవర్ జార్ఖండ్ లో ఉన్న గొడ్డా (Godda) పవర్ ప్లాంట్ నుండి 1600 MW కరెంట్ ను బంగ్లాదేశ్ కి సరఫరా చేస్తున్నది. ఇది భారత్- బంగ్లా ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం!

గత అయిదు నెలల నుండి బంగ్లాదేశ్ అదానీ పవర్ కి డబ్బులు కట్టడం లేదు. కాబట్టి అదానీ పవర్ బంగ్లాదేశ్ కి విద్యుత్ సరఫరా నిలిపివేయవచ్చు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా! ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అమెరికా, బ్రిటన్ లకు తాను భయపడబోను అని మోడీ గట్టిగానే సందేశం ఇచ్చారు!

ఎప్పుడైతే బంగ్లాదేశ్ లో హిందువులు 7 లక్షల మంది రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారో అప్పుడే తమ ప్లాన్ కి గండి పడింది అని అమెరికా, బ్రిటన్ లు భయపడ్డాయి.

హసీనా భారత్ లోనే ఉండేట్లుగా చేసి, బంగ్లాదేశ్ నుండి వత్తిడి తెచ్చి, మోడీని భయపెట్టాలని చూసిన అమెరికా, బ్రిటన్ లు ఇప్పుడు హసీనా భారత్ లోనే ఉంటేనే మేలు అన్న స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ద్రవ్యోల్బణం 11.6 శాతానికి చేరింది గత మూడు నెలలలో! ఈ దశలో విద్యుత్ సరఫరా ఆగిపోతే?

ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టకపోయినా బంగ్లాదేశ్ కి విద్యుత్ సరఫరా ఆపబోము అని అదానీ పవర్ ప్రకటించింది. ఇది ఒక్కటే ఊరట కలిగించే అంశం మొహమ్మద్ యూనస్ కి. కానీ ఇంకో రెండు నెలలు చూసి విద్యుత్ సరఫరా నిలిపివేయదు అన్న గ్యారంటీ ఏమీ లేదు!…. (పోట్లూరి పార్థసారథి )

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సార్, మా కరెంటు కనెక్షన్ తీసుకుంటారా..? బోలెడు ఆఫర్లున్నాయి..!!
  • Amitabh Bachchan: The Timeless Titan of Indian Branding
  • ఈ వయస్సులోనూ అత్యంత విలువైన బ్రాండ్ ప్రమోటర్… బిగ్ బీ..!!
  • The Cremator: One Woman’s Sacred Mission to Honor 4,000 Souls
  • భయాన్ని దహనం చేసిన మహిళ — 4 వేల శవాలకు అంత్యక్రియలు…
  • కొడుక్కి ఓ హిట్ కోసం… అల్లుడు నిర్మాతగా… అక్కినేని తెరప్రయత్నం…
  • శవాన్ని ఓవెన్‌లోకి తోశారు… ఏదో కాలుతున్న ధ్వని… ఖాళీ స్ట్రెచర్ బయటికి వచ్చింది…
  • డిస్టర్బింగ్ సీసీటీవీ ఫుటేజీ… కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు కూడా…
  • ‘‘నీ ఏడుపేదో నువ్వేడువు… నాకన్నా ఎక్కువ ఏడువు… నేనేమైనా వద్దన్నానా..?’’
  • అమ్మతనం అంటే అన్నీ సహించడం కాదు… కొన్ని వదిలించుకోవడం కూడా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions