1971 లో పాకిస్థాన్ నుండి బంగ్లాదేశ్ విడిపోయి స్వంతంత్ర దేశంగా ఏర్పడినప్పుడు అప్పటి భారత ఆర్మీ అధికారి ఒకరు ఇలా వ్యాఖ్యానించాడు…..
‘బెంగాలీ మాట్లాడే వారు ఉర్దూ మాట్లాడే వారి నుండి వేరుపడ్డారు అనేది తాత్కాలికం !
కానీ మతం ఒకటే అన్నది విస్మరించ కూడదు.
ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే !
మహా అయితే ఒక 30 ఏళ్ళపాటు ప్రశాంతంగా ఉంటుంది బంగ్లాదేశ్ !
బంగ్లాదేశ్ మరో పాకిస్థాన్ అవుతుంది త్వరలో!
ముక్తి బాహిని (ముక్తి వాహిని) చేసిన త్యాగాన్ని మతం అనేది మరిచిపోయేట్లు చేస్తుంది.
భాష అనేది తాత్కాలిక భావోద్వేగం!
ఈ విషయాన్ని భారత దేశ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి!’
కానీ ఒక ఆర్మీ అధికారి ఇలాంటి వ్యాఖ్య చేయడాన్ని ఎవరూ పట్టించుకోలేదు, ఎందుకంటే అతను రాజకీయ నాయకుడు కాదు కదా! సరిగ్గా 54 ఏళ్ళ తరువాత సదరు ఆర్మీ అధికారి మాటలు నిజమయ్యాయి.
Ads
********
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశం వదిలి వెళ్ళిపోయింది! ఆసియా, ఆఫ్రికా ఇలా ఏ దేశ ప్రధాని అయినా, అధ్యక్షుడు అయినా తమ తమ దేశాలలో అధికారం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే చివరి మజిలీ ఇంగ్లాండ్ అవుతుంది అనేది చరిత్ర చెప్తున్న సత్యం!
********
అసలేంటి, ఉన్నట్లుండి బంగ్లాదేశ్ లో సంక్షోభం ఎలా సంభవించింది ! ఉన్నట్లుండి ఏమీ సంభవించలేదు! ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలను పరిశీలిస్తే గత పదేళ్ల నుండి ఈ రోజు ఈనాటి సంక్షోభానికి కావాల్సిన ముడి సరుకు నిల్వలు పేరుకుంటూ వచ్చాయి! షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా కొద్దో గొప్పో నిజాయితీగా పనిచేశారు అనేది సత్యం! కానీ మతాన్ని దేశ అభివృద్ధితో ముడి పెట్టి పాలన చేయలేదు ఇదీ అసలు సమస్య!
********
ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అంటే చరిత్రలోకి వెళ్లి టూకీగా ఒక ముఖ్య సంఘటన ను చెప్పుకోవాలి! 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత ముజిబర్ రెహమాన్ అలియాస్ బంగ బంధు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు!
1975 లో సైనిక తిరుగుబాటు జరిగి బంగ్లా ప్రధాని ముజిబుర్ రెహమాన్ ను హత్య చేసింది ఆర్మీ! 1975 ఆగస్టు 15 న ఆర్మీ ఢాకా లోని ముజిబుర్ రెహమాన్ అధికార నివాసం థన్ మోండి 32 (Dhanmondi 32) లోకి ప్రవేశించి షేక్ ముజిబూర్ రెహ్మాన్ తో పాటు అతని భార్య, ముగ్గురు కొడుకులు మరియి ఇద్దరు కోడళ్ళను కాల్చి చంపారు! ఒక కోడలు గర్భవతి!
ఇంతకీ సైన్యం అంటే ఏమిటో తెలుసా? జస్ట్, ఓ పది మంది జూనియర్ రాంక్ ఆర్మీ అధికారులు, మందుగుండు లేని 12 T-54 ట్యాంకులు, మెషిన్ గన్స్, గ్రనెడ్లతో పాటు రెండు యూనిట్ల సాధారణ సైనికులు.
ఆరోజు ఘటనలో మొత్తం 48 మంది చనిపోయారు. అప్పటి వాణిజ్యశాఖ మంత్రి అయిన ఖోండాకర్ ముష్టాక్ అహ్మద్ వెంటనే బంగ్లా ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు! ముజీబర్ రెహ్మాన్ హత్య జరిగినప్పుడు షేక్ హసీనా, చెల్లెలు షేక్ రెహానాతో కలిసి యూరోపులో ఉండడం చేత బ్రతికి పోయారు! తరువాత చాలా కాలం ఢిల్లీలో ఉంది షేక్ హసీనా!
షేక్ ముజిబుర్ రెహ్మాన్ ను ఎందుకు హత్య చేశారు?
కోల్డ్ వార్ పాలిటిక్స్! 1971 లో బంగ్లాదేశ్ విముక్తి పోరాటం సందర్భంగా భారత సైన్యం ముక్తి వాహిని కి శిక్షణ ఇచ్చి, ఆయుధాలు సరఫరా చేయడం అమెరికాకి ఇష్టం లేదు. అందుకే అమెరికా తన 7th ఫ్లీట్ నేవీని అరేబియా సముద్రం వైపు నడిపిస్తున్న సమయంలో అప్పటి సోవియట్ యూనియన్ తన జలాంతర్గాములను భారత్ కి మద్దతుగా పంపించింది.
అప్పటికే బ్రిటన్ తన నేవీని అరేబియా సముద్రంలో మోహరించి అమెరికన్ నేవీ కోసం ఎదురు చూస్తున్న సమయంలో, తమకంటే ముందు అక్కడికి సోవియట్ సబ్ మేరైన్లు చేరుకోవడం చూసి వెంటనే అమెరికాకి సమాచారం ఇచ్చింది… దాంతో అమెరికన్ నేవీ విరమించుకుంది!
So! పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్, మాల్దీవుల మీద మొదట్లో అమెరికా, బ్రిటన్ దేశాలు ప్రభావం చూపిస్తూ వచ్చాయి. మెల్లగా అన్నీ వాటి నుండి దూరంగా జరగడంతో చైనా వాళ్ళ స్థానాన్ని ఆక్రమించింది! కానీ అమెరికా, చైనాలు పాకిస్థాన్ ను ఇప్పటికీ పావులా వాడుకుంటున్నాయి!
పాకిస్ధాన్ కి కావాల్సింది బంగ్లాదేశ్ విభజన ఓటమికి కక్ష తీర్చుకోవాలి భారత్ మీద!
అయితే చైనా వైపు ఉంటుంది కాకపోతే అమెరికా, బ్రిటన్ ల వైపు ఉంటుంది పాకిస్ధాన్. ఎవరు సహకరించినా సరే బంగ్లా విభజనకి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది! అదే సమయంలో 1971 లో సోవియట్ యూనియన్ భారత్ కి సహకరించడం వల్ల అమెరికా, బ్రిటన్ లు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదీ ఎప్పటి నుండో పెండింగ్ లో ఉంది.
1975 నుండి 2011 వరకూ 29 సార్లు సైనిక కుట్రలు జరిగాయి బంగ్లాదేశ్ లో!
భారత్ ప్రోద్బలంతో బంగ్లాదేశ్ ఏర్పడ్డది కాబట్టి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండకూడదు అనేది అమెరికా, బ్రిటన్, పాకిస్ధాన్ ల లక్ష్యం .. అందుకే 19 సైనిక కుట్రలు జరిగాయి. ఇక చైనాకు అయితే సైనిక ప్రభుత్వం ఉంటేనే తనకి ప్రయోజనం ఉంటుంది బర్మా, పాకిస్ధాన్ లో లాగా బంగ్లాదేశ్ లో కూడా…. Contd….. part 2 [ పొట్లూరి పార్థసారథి ]
Share this Article