షేక్ హసీనా జులై 10 న చైనా పర్యటనకు వెళ్ళింది!
ఆ పర్యటన మూడు రోజులుగా ముందే షెడ్యూల్ ప్రకటించారు!
చైనా అద్యక్షుడు జీ జింగ్ పింగ్ తో పాటు లీ కీయాంగ్ తో కూడా సమావేశం అయ్యారు!
రెండు దేశాలు మొత్తం 21 ఒప్పందాల మీద సంతకం చేశాయి! మరో రెండు MoU లని రెన్యువల్ చేసింది!
అయితే షేక్ హసీనా 5 బిలియన్ డాలర్ల అప్పు కోసమే చైనా పర్యటనకి వెళ్ళింది!
చర్చలలో అప్పు విషయం ప్రస్తావనకు వచ్చింది!
ఏమైందో ఏమో కానీ చైనా 100 మిలియన్ డాలర్ల ఋణం మాత్రమే ఇస్తాను అని అన్నది!
మూడో రోజు పర్యటన పూర్తి కాకుండానే షేక్ హసీనా పర్యటన రద్దు చేసుకొని ఢాకా వచ్చేసింది!
దీని మీద చాలా విధాలుగా వార్తలు వచ్చాయి! చైనా 5 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడానికి బదులుగా ఢాకా పోర్టు లో తమ నావీ బేస్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని కోరినట్లు దానికి షేక్ హసీనా గట్టిగానే నిరాకరించినట్లు తెలుస్తున్నది!
మరో వాదన ఏమిటంటే….
బంగ్లాదేశ్ చైనా ల మధ్య వర్తక వాణిజ్య ఒప్పందం అనేది ఏక పక్షంగా ఉంటూ వచ్చింది.
చైనా నుండి బంగ్లాదేశ్ చేసుకునే దిగుమతులు నెలకి 8 మిలియన్ డాలర్లుగా ఉంటున్నది.
బంగ్లాదేశ్ దాదాపుగా దివాళా తీసే స్థితిలో ఉంది డాలర్ రిజర్వ్ లేక!
కనీసం దిగుమతులు తగ్గిస్తేనైనా డాలర్ రిజర్వ్ ను కాపాడుకోవచ్చని ఆలోచన చేసి, చైనా నుండి చేసుకునే దిగుమతులు నెలకి 5 మిలియన్ డాలర్ల కంటే మించకూడదు అని పరిమితి విధించింది హసీనా!
Ads
కానీ అప్పు కోసం చైనాకి వెళ్ళినప్పుడు దిగుమతుల మీద ఆంక్షలు తీసేసి కనీసం నెలకి 10 మిలియన్ డాలర్ల దిగుమతులు చేసుకుంటాము అనే హామీ ఇస్తేనే 5 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని షరతు పెట్టింది చైనా!
హసీనా బంగ్లాదేశ్ దివాళా తీయకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో మరింత దిగుమతులు పెంచితే అది ఒక చేతితో తీసుకుంటూ మరో చేతితో యిచ్చినట్టు అవుతుంది, చివరికి అప్పు అలానే ఉంటుందని భావించి చైనా ప్రతిపాదనని తిరస్కరించింది!
చైనా భావన ఏమిటంటే షేక్ హసీనా భారత్ వైపు మొగ్గు చూపుతున్నది అని!
మన దేశంలో మాత్రం షేక్ హసీనా చైనా వైపు మొగ్గు చూపుతున్నది అని!
ఈ రెండూ నిజాలు కావు.
మనదేశం బంగ్లాదేశ్ తో రూపీ టాకా రూపంలో డీల్ చేస్తున్నది కానీ డాలర్ల రూపంలో కాదు!
మరి అప్పు కోసం చైనా ఎందుకు మన దేశమే అప్పు ఇవ్వవచ్చు కదా అనే సందేహం రావొచ్చు.
బంగ్లాదేశ్ అనేది ఇప్పటి వరకూ 19 సార్లు సైనిక కుట్రలకు గురయ్యింది! ఈపొద్దున్న సైనిక నియంత అధికారంలోకి వస్తే మనకి కట్టాల్సిన అప్పు దేవుడు ఎరుగు, తిరిగి మన మీద ఉగ్రవాదులను ఉసిగొల్పుతుంది! అంచేత డాలర్లు అప్పుగా ఇవ్వదు భారత్. వర్తక వాణిజ్య రూపంలో అప్పు ఇస్తున్నది ఇప్పటికే!
తీస్తా వాటర్ ప్రాజెక్ట్: ఇది భారత్, బంగ్లా సరిహద్దులో ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా 1 బిలియన్ డాలర్ల ఋణం ఇచ్చి తానే కడతాను అన్నది కానీ భారత్ అదే 1 బిలియన్ డాలర్లు అప్పుగా ఇచ్చి ఆ ప్రాజెక్ట్ ను కడుతున్నది. దీనివలన సున్నితమైన బంగ్లా భారత్ సరిహద్దు ప్రాంతంలో చైనా గూఢచర్యం చేయకుండా ఆపగలిగింది! ఈ విషయంలో షేక్ హసీనా భారత్ వైపు ఉంది! ఇవేవీ తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారు Paytm బాచ్!
********************
అందుకే ఒక రోజు ముందే చైనా పర్యటన ముగించుకుని వచ్చింది!
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా షేక్ హసీనా ఆందోళనగా ఉన్నది మాత్రం నిజం!
5 బిలియన్ డాలర్లు ఉంటేనే రాబోయే 6 నెలల కాలం పాటు బంగ్లాదేశ్ ఇబ్బంది పడకుండా ఉండగలుగుతుంది! కానీ అలా జరగలేదు.
మరోవైపు విద్యార్థుల ఆందోళన షేక్ హసీనాకి ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చింది కూడా, అదేమిటంటే బంగ్లాదేశ్ లో తన 15 ఏళ్ళ పాలనకి సమయం దగ్గర పడబోతున్నది అని!
ఎందుకు?
************************
తన సమీప బంధువు అని వకెర్ – ఉజ్ – జమాన్ ( Waker – uz- Zaman) ను చీఫ్ ఆఫ్ ఆర్మీ గా నియమించింది షేక్ హసీనా!
దాదాపుగా 30 ఏళ్ళ నుండీ బంగ్లాదేశ్ ఆర్మీలో వివిధ ర్యాంకులలో పనిచేస్తూ షేక్ హసీనాకి నమ్మకంగా ఉంటూ వచ్చాడు వకేర్ జమాన్. అందుకే నమ్మి చీఫ్ ఆఫ్ ఆర్మీగా నియమించింది షేక్ హసీనా!
లండన్ నుండి వచ్చిన ఆదేశాల మేరకు ప్రధాని షేక్ హసీనాకి 45 నిముషాలు సమయం ఇచ్చి దేశం వదిలి వెళ్ళిపొమ్మని డిమాండ్ చేశాడు!
తన తండ్రి విషయంలో ఆర్మీ ఎలా ప్రవర్తించిందో షేక్ హసీనాకి అనుభవం ఉంది కాబట్టి వెంటనే బంగ్లాదేశ్ వదిలి C130 సైనిక రవాణా విమానంలో భారత్ లోని హిండన్ ఎయిర్ బేస్ లో దిగింది.
ఢిల్లీకి దగ్గరలో ఉన్న హిండన్ ఎయిర్ బేస్ ఉత్తర ప్రదేశ్ లో ఉంది!
హిండన్ ఎయిర్ బేస్ లో మొదట NSA చీఫ్ అజిత్ దోవల్ గారు కలిసి షేక్ హసీనాతో చర్చలు జరిపారు!
అనంతరం EAM జై శంకర్ గారు షేక్ హసీనాతో చర్చలు జరిపారు!
అనంతరం షేక్ హసీనా గారిని ఢిల్లీలో ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు!
అఫ్కోర్స్! షేక్ హసీనా కూతురు కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు కొంతకాలంగా!
షేక్ హసీనా కూతురు సైమా వాజెద్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO) లో ఆసియా విభాగంలో పనిచేస్తున్నది.
హసీనా కొడుకు సజీబ్ వాజేద్ బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు లండన్ లో ఉంటాడు!
నిజానికి షేక్ హసీనా రాజకీయ శరణార్ధిగా లండన్ వెళ్ళాలి అని అప్లై చేస్తే వెంటనే అనుమతి ఇవ్వడం కష్టం అంటూ బ్రిటన్ విదేశాంగ మంత్రి అన్నాడు.
బ్రిటన్ నుండి అనుమతి వచ్చేవరకూ హసీనా ఢిల్లీ లోనే ఉండాల్సి వస్తుంది అన్నమాట!
ఇదొక ఎత్తుగడ!
Contd… part 4 [ పొట్లూరి పార్థసారథి ]
Share this Article