Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చిన్నమ్మ కూతురు..! న్యూఢిల్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వారసురాలి ఎంట్రీ..!

March 3, 2024 by M S R

ఎవరీమె… చిన్నమ్మ కూతురు ఏమిటీ అనుకుంటున్నారా..? ఈమె పేరు బన్సూరి స్వరాజ్… ఢిల్లీలో లాయర్… కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ చిన్నమ్మగా పిలవబడే సుష్మా స్వరాజ్ బిడ్డ ఈమె… అందుకే చిన్నమ్మ కూతురు… తండ్రి పేరు స్వరాజ్ కౌశల్…

స్వరాజ్ పేరొందిన సుప్రీంకోర్టు సీనియర్ లాయర్, మిజోరం గవర్నర్‌గా కూడా చేశాడు… బరోడా బాంబు పేలుళ్ల కేసులో జార్జి ఫెర్నాండెజ్‌కు లాయర్ ఈయన… కేసు గెలిపించాడు… ఫస్ట్ నుంచీ పొలిటికల్ ఫ్యామిలీ… సుష్మా పొలిటికల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే… వాళ్ల బిడ్డ ఈ బాన్సురి… కృష్ణుడి భక్తురాలైన సుష్మా కృష్ణుడి ఫ్లూట్ పేరును తన బిడ్డకు పెట్టుకుంది…

ఈమె లండన్‌లో ఇంగ్లిషు లిటరేచర్‌లో గ్రాడ్యుయేషన్ చేసి, అక్కడే న్యాయవిద్యను కూడా పూర్తి చేసుకుని, 2007 నుంచే ప్రాక్టీస్ చేస్తోంది… అప్పట్లో లలిత్ మోడీ తరఫున వాదించిన లీగల్ టీంలో ఈమె కూడా ఓ సభ్యురాలు… పెళ్లి చేసుకోలేదు… వయస్సు 39 ఏళ్లు… ఇప్పుడీమె గురించి ఎందుకు అంటారా..?

Ads

మొన్నామధ్య ఢిల్లీ లీగల్ సెల్ కమిటీలో స్థానం కల్పించిన బీజేపీ ఈసారి ఏకంగా న్యూఢిల్లీ టికెట్టు ఇచ్చింది… ఎస్, సుష్మా స్వరాజ్ వారసురాలిగా ఇక పూర్తి రాజకీయ జీవితంలోకి వచ్చేసింది… అందుకే ఓసారి చెప్పుకోవడం… తెలంగాణ ఏర్పాటుకు సహకరించినందుకు గాను తెలంగాణ సమాజానికి ఈమె తల్లి మీద గౌరవభావం ఉంది… బెస్టాఫ్ లక్ సిస్టర్..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎవరు జర్నలిస్టు..? ఏది పత్రికాస్వేచ్ఛ..? ఓ దిక్కుమాలిన నిరర్థక చర్చ..!!
  • అక్కినేనితో ఒకటే – నందమూరితో ఒకటే – విజయశాంతితో లాస్ట్!
  • ఫామ్‌హౌజులో పశుపతి బందీ! – విమర్శలకు క్రియేటివిటీతో పదును!
  • తల్లిదండ్రుల ఓవర్ కంట్రోల్ అసలు సమస్య – చేతన్ భగత్ విశ్లేషణ!
  • ‘God Of War’… నాగవంశీ కొత్త మంట … ‘God Of South & North War’
  • భాగ్యరాజా సక్సెస్ స్టోరీలో కొన్ని ఫ్లాపుల కోణాలూ ఉన్నయ్!
  • ఆచితూచి యాదగిరిగుట్ట ట్రస్టు బోర్డు– ఎటొచ్చీ చిరంజీవి భార్య పేరుతోనే..!!
  • 95 ఏళ్ల వయస్సు దాకా… భారతీయ గుండెలకు అవిశ్రాంత సేవ..!!
  • “కొలై పండ్రాంగప్పో” – కరుణానిధి అరెస్టు రాత్రి అసలేం జరిగింది?
  • నిధి దొరికింది! ‘మనిషి ఆశ’ల్లో ఇరుక్కుంది! ఎవరు సొంతదారు!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions