బస్తర్… ది నక్సల్ స్టోరీ… ఈ సినిమా చూశాక ఒక్కసారి వ్యూహం, శపథం, రాజధాని ఫైల్స్ వంటి రాజకీయ ప్రచార చిత్రాలతో పోల్చాలని అనిపించింది… అంతకు ముందు కూడా కొన్ని పొలిటికల్ చిత్రాలు వచ్చినయ్, త్వరలో వివేకా బయోపిక్ కూడా వస్తుందట… హేమిటో…
కేసీయార్, చంద్రబాబు తదితరులపై కూడా సినిమాలు ఏమైనా వచ్చాయా..? వచ్చినట్టు కూడా తెలియకుండా మాయమయ్యాయా..? ప్రజలకు కనెక్టయ్యేలా సినిమా తీయకపోతే అంతటి ఎన్టీయార్ బయోపిక్స్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలనే జనం తిరస్కరించారు… అది బయోపిక్స్ నిర్మాతలకు బలమైన గుణపాఠం… ఐనా వస్తూనే ఉన్నాయి…
ప్రత్యర్థులపై విషాన్ని, ద్వేషాన్ని వెటకారంగా దట్టించడం రాజకీయ ప్రచారాల ప్రధాన మైనస్… అలాగే కథానాయకులను తోపు, తురుమ్ అని కీర్తించడం మరో మైనస్… మళ్లీ థియేటర్‌కు వెళ్లి చూడటం దేనికి..? రోజూ సాక్షి, ఏబీఎన్, టీన్యూస్, టీవీ5 చానెళ్లలో చూడటం లేదా ఏం..? ఈ పిచ్చి చిత్రాలతో ఒక్కసారి కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్, యురి, తాజాగా బస్తర్ సినిమాల్ని పోల్చి చూడండి…
Ads
పక్కాగా బీజేపీ భావజాలం విస్తరణకు తీయబడిన సినిమాలే ఇవన్నీ… కానీ సినిమా నిర్మాణంలో మోడీ తోపు, అమిత్ షా తోపు అని నేరుగా చెప్పవు ఇవి… కీర్తించవు… కొన్ని ఇష్యూస్ తీసుకుంటారు… పార్టీ యాంగిల్‌లో పవర్ ఫుల్‌గా ప్రజెంట్ చేస్తారు… వాళ్లకు కావల్సింది అదే… కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకార్, యురి అన్నీ వేర్వేరు కథాంశాలు… ఒకదానితో మరొకదానికి సంబంధమే ఉండదు… నెగెటివ్ పబ్లిసిటీ జరుగుతుంది, నిర్మాతలకూ అదే కావాలి…
ఫుల్లు కాషాయ భావజాలమే అయినా సరే, ఈ సినిమాలన్నీ బంపర్ హిట్లు… 10 రూపాయలు పెడితే వంద రూపాయలు వచ్చాయి… (రజాకార్ అంతిమ ఫలితం చూడాల్సి ఉంది…) కేరళ స్టోరీ ట్రెయిలర్‌లో వేలాది మంది మలయాళీ మహిళలు ఐసిస్‌లో చేరినట్టు చూపి, జనం బూతులు అందుకునేసరికి ట్రెయిలర్ వెనక్కి తీసుకుని, సినిమాలో దిద్దుబాటుకు పూనుకున్నారు… కానీ ఈలోపు జరగాల్సినంత ప్రచారం జరిగిపోయింది…
బస్తర్ సినిమా కూడా అంతే… కేరళ స్టోరీ టీమే… అదే ఆదాశర్మ ప్రధాన నాయిక… 76 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉదంతం తరువాత జేఎన్‌యూలో కొందరు సెలబ్రేట్ చేసుకున్నారనే వ్యాఖ్య ఆందోళనలకు దారితీసింది… సినిమా పూర్తిగా యాంటీ నక్సల్ లైన్ తీసుకుని నడుస్తుంది… రజాకార్ సినిమా తెలంగాణ సాయుధపోరాటానికి కాషాయ బాష్యం చెప్పినట్టే, ఆ కోణమే చూపినట్టే… బస్తర్ సినిమా కూడా అంతే…
నక్సలైట్లు దుర్మార్గులు, వాళ్లు ఉండటానికే వీల్లేదు అనే పంథాలో నడుస్తుంది… నిజానికి నక్సలైట్లు వెళ్తున్న పంథా మీద అభ్యంతరాలు ఉండొచ్చు, అంతిమంగా వాళ్లు ఏమీ సాధించలేరనే భావనలూ ఉండొచ్చు… మరీ ఇప్పుడు కొన్ని అటవీప్రాంతాలకే పరిమితమై, ఉనికి కోసం, రక్షణ కోసం తన్లాడుతున్న దుస్థితికి చేరుకుని ఉండొచ్చు… కానీ వాళ్ల నిబద్ధత, ఆశయం, త్యాగాలను ఎవరూ కించపరచాల్సిన పనిలేదు…
కానీ 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను బలిగొన్న ఉదంతం చుట్టూ ఓ కథను అల్లుకుని, యాంటీ నక్సల్ లైన్‌ను బలంగా ప్రొజెక్ట్ చేయగలిగింది సినిమా… సేమ్, రజాకార్ సినిమాలో రజాకార్ల ఆగడాలను, కశ్మీర్ ఫైల్స్‌లో వేర్పాటువాదుల అరాచకాల్ని చూపినట్టే..! ఇవేగాకుండా దేశభక్తి, ఆర్మీ సాహసాలకు సంబంధించి కొన్ని ఇతర సినిమాలు కూడా వచ్చాయి… సినిమా అత్యంత బలమైన మాధ్యమం… టీవీలు, పత్రికలు, సోషల్ మీడియాకన్నా జనంలోకి భావజాలాన్ని ఇంజక్ట్ చేయగలదు… కాషాయశిబిరం దాన్ని అంతే బలంగా వాడుకుంటోంది…!!
Share this Article