హళ్లికిహళ్లి సున్నాకు సున్నా… ఈసారి బిగ్‌బాస్ విజేతకు చిప్ప చేతికి ఇచ్చే స్థితే కనిపిస్తోంది… మొన్న వీకెండ్ షో అయిపోయాక, ఏదో గొప్ప విషయం ప్రకటిస్తాను అని నాగార్జున, అందరినీ అలాగే ఉంచేసి, చివరకు విజేతకు 50 లక్షలు ఇస్తాం అని ప్రకటించాడు… అందులో కొత్తేముందో అర్థం కాలేదు… గత సీజన్‌లో అదే కదా ప్రైజ్ మనీ…
ఓహో, ఈసారి సీజన్ దివాలా తీసింది, ప్రైజ్ మనీలో కోత ఉంటుందని అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పటిలాగే ఇస్తాం, గమనించగలరు అని ప్రకటించినట్టుగా ఉంది… నిజంగానే ఈసారి సీజన్ ఫుల్లు లాస్… రెవిన్యూ లేదు, యాడ్స్ లేవు… అసలు ఈ సీజన్‌ను పట్టించుకున్నవాడే లేడు… దీనికితోడు సదరు షో క్రియేటివ్ టీం ఇంకా తన పైత్యాన్ని రుద్దుతూనే ఉంది…
తాజాగా ఇమ్యూనిటీ పేరిట కంటెస్టెంట్ రాజ్ నుంచి 5 లక్షలు ఒప్పించారు… అంటే వరుసగా మూడుసార్లు నామినేషన్ల నుంచి ఇమ్యూనిటీ వస్తుందట… అక్కడివరకూ వోకే, ఎవడు పోయినా సరే ఈసారి ఫైనల్స్‌కు… కాకపోతే విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీలో ఆమేరకు కోత వేస్తారట… ఈ దరిద్రం ఏమిటో మరి ఆ టీంకే తెలియాలి… దీనికి ఆదిరెడ్డి లంబాచోడా ఏదో చెబుతూ పోతున్నాడు బుధవారం ఎపిసోడ్‌లో… తను ఏకుగా వచ్చి మేకై కూర్చున్నాడు అందరికీ… ఏమో, ఖర్మకాలి, తనే విజేత అయినా హాశ్చర్యపడాల్సిన పనిలేదు…
Ads
సరే, 50 లక్షల ప్రైజ్ మనీ అంటే… ఒకవేళ ఈ 5 లక్షలు తీసేస్తే… 45 లక్షలు… అందులో ముందస్తు ఆదాయపన్ను కోత దాదాపు 13 లక్షలు… అంటే చేతికి వచ్చేది 32 లక్షలు అన్నమాట… అబ్బే, ఇక్కడ అయిపోలేదు… టాస్కుల్లో ఫెయిల్ అయితే కటింగ్ అట… ఆల్రెడీ లక్ష కట్ చేశారు… ఇదెక్కడి దరిద్రం, దివాలా తీశాం, నో ప్రైజ్ money అని చెప్పేస్తే హుందాగా ఉంటుంది కదా… ఈ డాంబికాలు దేనికి..?
ఇంకా తిరకాసులున్నయ్… ఒక్కసారి గత సీజన్ గుర్తు తెచ్చుకొండి… అభిజిత్, అఖిల్, సొహైల్ టాప్ త్రీలో ఉన్నారు… సొహైల్‌కు నువ్వు మూడో ప్లేసులో ఉన్నావురా అనే హింట్ అందింది… ఫైనలిస్టులను టెంప్ట్ చేయడానికి సగం ఇచ్చేస్తాం, వదిలేసి వెళ్లిపోతావా అని అడుగుతారు కదా… సొహైల్ ఎంచక్కా సగం సొమ్ము తీసుకుని వెళ్లిపోయాడు… తీరా చూస్తే విజేత అభిజిత్‌కు 25 లక్షలు, అందులో 7.5 లక్షలు పన్ను కోత పోగా, మిగిలింది 17.5 లక్షలు…
ఇక సెకండ్ రన్నరప్ అఖిల్‌కు మిగిలింది ఏమీ లేదు… అంతెందుకు, మొన్నటి ఓటీటీ సీజన్‌లో అరియానా కూడా 10 లక్షలు మధ్యలోనే తీసుకుని డ్రాప్ అయిపోయింది… పొరపాటున ఈసీజన్లో నిజంగానే ఆదిరెడ్డి, శ్రీసత్య, రేవంత్ ఫైనలిస్టులు అనుకుందాం… ఫర్ డిబేట్ సేక్… ఎప్పటిలాగే మీరు 25 లక్షలు తీసుకుని వెళ్లిపోతారా అనడిగితే శ్రీసత్య నిక్షేపంగా సూట్‌కేసు తీసుకుని వెళ్లిపోతుంది… అంటే విజేతకు పన్ను, ఇమ్యూనిటీ సొమ్ము తీసేస్తే ఇక మిగిలేది 12.5 లక్షలు… అంటే మధ్యలో డ్రాపయ్యే శ్రీసత్యకు ఎక్కువ సొమ్ము అన్నమాట… (పన్ను వోకే, కానీ ఇమ్యూనిటీ కత్తెరకు తనకు సంబంధం లేదు కదా…)
మరిక పేరుకు 50 లక్షల ప్రైజ్ మనీ ప్రకటించడం దేనికి..? జనాల్ని, కంటెస్టెంట్లను పిచ్చోళ్లను చేయడానికి… ఫైనలిస్టులుగా శ్రీసత్య మాత్రమే కాదు, ఇనయ, ఫైమా… ఎవరున్నా ఈసారి సగం సొమ్ము తీసుకుని డ్రాప్ కావడానికి రెడీగా ఉంటారు… ఎందుకంటే, విజేతకన్నా ఎక్కువ డబ్బు వస్తుంది కదా… మరి బిగ్‌బాస్ క్రియేటీవ్ టీం బుర్రలు ఏమైపోయినట్టు..? ఏమో, మొదటి నుంచీ ఏదో ఇన్‌ఫెక్షన్‌కు గురై ఉన్నాయి… ఈ లెక్కల్లాగే…!!
Share this Article