.
బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్… ఓ బజ్ లేదు, ఎవరిలోనూ ఆసక్తి లేదు… అంతకుముందు రెండుమూడు సీజన్లు మొహం మాడిపోయిన బిగ్‌బాస్ క్రియేటివ్ టీమ్ ఈసారి ఏవేవో పిచ్చి ప్రయోగాలను పూనుకుంది… కామనర్స్‌కు పెద్దపీట మన్నూమశానం… అది మనం చెప్పుకున్నాం…
కానీ సోకాల్డ్ నవదీప్, శ్రీముఖి, అభిజిత్ ఎట్సెట్రా జడ్జిలు కామనర్స్ కోసం పెట్టిన నానా పైత్యపు పరీక్షల గురించీ చెప్పుకున్నాం… నిజానికి అదే ఈ సీజన్‌కు పెద్ద మైనస్… చెత్తా టాస్కులు… అవి ఎంత దరిద్రపు ఎంపికలో చెప్పుకోవాలంటే మనం ఓసారి హరిత హరీష్ అనబడే మాస్క్ మ్యాన్ గురించి చెప్పుకోవాలి… షో మొత్తం గుండుతోనే కనిపించాలట, అదో వెర్రి టాస్క్…
Ads
ఆ మాస్క్ ఏమిటో, ఆ మన్నూమశానం ఏమిటో గానీ… తనను బిగ్‌బాస్‌కు ఎంపిక చేసినవాళ్లెవరో గానీ అసలు రియాలిటీ షోలకు అన్‌ఫిట్… హౌజులోకి వచ్చింది మొదలు, తనే కెప్టెన్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు… డామినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు… ఇమ్మూ, తనూజ ఎట్సెట్రా అందరినీ నానా మాటలూ అంటున్నాడు…
ఇమ్మూ ఏదో అన్నాడు, సారీ చెప్పాడు, కానీ ఈ ఫేక్ కామనర్ దాన్ని రిసీవ్ చేసుకోడు, పైగా తను రెడ్ రోజ్ అని వెక్కిరిస్తాడు, అదేమంటే నా తప్పు లేదు అంటాడు… వెరీ క్రూడ్ కేరక్టర్… శనివారం షోలో నాగార్జున నిలదీస్తే మొక్కుబడిగా, ఫాఫం, నాగార్జున నానాకష్టాలూ పడ్డాక సారీ అని ముక్తసరిగా చెప్పాడు ఇమ్మూకు… పెడసరం జవాబులు, నిజంగానే నాగార్జున పిటీ… ఇలాంటి కేరక్టర్లను డీల్ చేయలేక…
ఈ మాస్క్ హరీష్ మరీ ఘోరం, నాగార్జున ఏదో మాట్లాడుతుంటే కూడా అడ్డదిడ్డం జవాబులు చెబుతున్నాడు, పైగా ఎవరైనా మాట్లాడితే బెదిరించినట్టు ఎదురుదాడికి దిగుతున్నాడు… ఉంటే ఉంటాను, పోతే పోతాను, హరిత హరీష్ అని మాత్రమే పిలవాలి అని డిమాండ్ చేస్తున్నాడు… హేమిటో… ది వరస్ట్ అగ్నిపరీక్ష… అండ్ ఎంపిక… ఎవడ్రా ఈ సారును ఎంపిక చేసింది..? (డెమోన్ పవన్, మర్యాద మనీష్, దమ్ము శ్రీజ… ఏం పేర్లురా భయ్ ఇవి..? అందరూ అతి కేరక్టర్లే…)
మొదటి టాస్కులోనే తల పగులగొట్టుకున్న ది గ్రేట్ కంట్రవర్సీ కేరక్టర్ రీతూ చౌదరి ఒక్కతే హరీష్‌కు మద్దతు… తన స్థాయి అంతే… ఎటొచ్చీ… కామనర్స్‌లో ఒక్క శ్రీజ దమ్ము తప్ప ఎవరూ పెద్దగా ఇంప్రెసివ్ లేరు… పూర్ సెలక్షన్స్… ఇక వీళ్లను పట్టుకుని ఈ సీజన్ నడిపిస్తారట… ఫాఫం, అసలే బజ్ లేదు, పూర్ కంటెస్టెంట్లు… ఫాపం స్టార్‌మా…
సరే, సెలబ్రిటీలను చూద్దాం… సుమన్ శెట్టి హోప్‌లెస్… దేభ్యం మొహం వేసుకుని ఎప్పుడోఓసారి కనిపిస్తున్నాడు తెరమీద… దాదాపు భరణి సేమ్… ఇక జానీ మాస్టర్ కేసులో కంట్రవర్సీ కేరక్టర్ శ్రష్టి వర్మ మరీ పూర్… సరే, ఆమె హౌజు వీడితే… ఇక మిగిలినవాళ్లలో…
తనూజ ఒక్కతి బెటర్ అనిపిస్తోంది, హంబుల్, వర్కర్, సైలెంట్… రాము రాథోడ్, ఇమ్మూ కూడా బెటరే… సంజన ఓవరాక్షన్… అది గమనించి బిగ్‌బాస్ టీం పుల్లలు పెట్టడానికి ఆమెను ఎంకరేజ్ చేస్తోంది, సూపర్ పవర్స్ ఇచ్చింది… కొన్నాళ్లు ఉంటుంది హౌజులో… ఫ్లోరా షైనీ… ఉందంటే ఉంది…
వెరసి పూర్ సెలెక్షన్స్, పూర్ సీజన్… ఇంకా వివరంగా చెప్పాలంటే బార్క్ రేటింగ్స్ వచ్చేదాకా ఆగండి, అవీ చెప్పుకుందాం…
Share this Article