.
నో డౌట్… తెలంగాణలో గ్యాస్ సిలిండర్ల సమస్య తీవ్రంగా ఉంది… కఠోర నిజం… కానీ పనికిమాలిన అనేక ఇష్యూల మీద స్పందించే, దుమ్మెత్తిపోసే, నానా గాయిగత్తర చేసే సోకాల్డ్ ప్రతిపక్షాలు అలియాస్ బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు ఈ ఇష్యూలో మాట్లాడవు..? అది జనం కళ్లకు గంతలు కట్టే పొలిటికల్ గ్యాస్ మాఫియా బాగోతం గనుక… వ్యాఖ్య కటువుగా ఉందా..? వివరంగా చెప్పుకుందాం…
కమర్షియల్ సిలెండర్లు పక్కన పెట్టండి… ఆ కొరత దెబ్బకు చాలా హోటళ్లే మూతపడ్డాయి… డొమెస్టిక్ సిలెండర్ల సంగతి తీసుకుంటే… పైకి అంతా వోకే వోకే అని కేంద్రం చెబుతున్నా సరే… బుక్ చేయడమే కష్టం, చేసినా వారం, పదిరోజుల తరువాత డెలివరీ వస్తే మహాభాగ్యం… ఆటోలు గ్యాస్ స్టేషన్ల దాకా గంటల తరబడి నిరీక్షణలు అదో విషాదం…
Ads
ఒక్కరు మాట్లాడరు… కాళేశ్వరం మీద సీఆర్ పాటిల్ ఏదో అన్నాడట, బీఆర్ఎస్ సురేష్ రెడ్డి కౌంటర్లు రాజ్యసభలో… దానికి కిషన్ రెడ్డి ప్రతి కౌంటర్లు… అంతా నాటకం… రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుని 7 నెలలైనా సీబీఐ ఈ కేసు ఎందుకు నోటిఫై చేయలేదు కిషన్ రెడ్డీ..? మాట్లాడడు..!
వోకే… గ్యాస్ సిలిండర్లు, సరఫరా, కొరత ఇంత తీవ్రంగా వేధిస్తోంది కదా, కేంద్ర వైఫల్యమే కదా… మరి సోకాల్డ్ ‘బాధ్యత కలిగిన ప్రతిపక్ష’ నాయకులు కేటీయార్, హరీష్ మాట్లాడరేమిటి.? సరే, కేసీయార్ రాజకీయాల్లోనే లేడు, తనను వదిలేయండి, అదొక ఖర్మ బాగోతం… కేటీయార్ అమెరికాకు వెళ్లిపోయాడు కన్వీనియెంటుగా, ఈ తల్నొప్పులేవో హరీష్ పడతాడు అనుకుని…
మరి కాబోయే ముఖ్యమంత్రిని నేనే, మెల్లిగా పార్టీనే హైజాక్ చేసేస్తున్నాను అనుకునే హరీష్ రావు ఏదేదో మాట్లాడతాడు గానీ గ్యాస్ కొరత మీద స్పందించడు దేనికి..? ఎందుకంటే..?

హరీష్ రావు బీజేపీతో గోక్కోవడానికి సిద్ధంగా లేడు… ఏం గోకినా ముందు కాళేశ్వరం కేసులో తనను మూసేస్తారనే భయం, అదే జరిగితే మామ, బామ్మర్ది ఆనందిస్తారే గానీ ఆసరాగా నిలవరు, తెలుసు కదా, కాగల కార్యం కమలనాథులు తీర్చేశారు అనుకుంటారు… (గతంలో ఫామ్ హౌజు గడప కూడా తొక్కనివ్వలేదు తెలుసు కదా…)
కేటీయార్‌కు కూడా భయం… ఫార్ములా వన్, ఫోన్ ట్యాపింగ్ మాత్రమే కాదు, ఎక్కడ ఏ కేసు వెతికి తనను బుక్ చేస్తారో, నాకెందుకు బీజేపీతో గోక్కునే తల్నొప్పి అనే భయం… పైగా పార్టీ విలీనం, అవగాహన, పొత్తు మన్నూమశానం అని కవిత చెబుతున్న కథలు నడుస్తున్నవి కదా… అందుకని గ్యాస్ మీద సైలెన్స్… ప్రపంచం మీద ఏం జరిగినా రేవంత్ మెడలో వేద్దామనే వృథా ప్రయాస తప్ప మరో లోకమే లేని ప్రయాస…
అంటే… పరోక్షంగానో, ప్రత్యక్షంగానో… ఏ విషయమైనా సరే, బీజేపీతో గోక్కోవడానికి బీఆర్ఎస్ రెడీగా లేదు, ఎవరి భయం వాళ్లది… పోనీ, బీజేపీ వాళ్లు..? నెవ్వర్… సోకాల్డ్ బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి సహా ఒక్క ఎమ్మెల్యే గానీ, ఒక్క ఎంపీ గానీ గ్యాస్ కొరత మీద మాట్లాడారా..? నెవ్వర్… కిక్కుమంటే ఒట్టు… వాళ్లకూ తెలుసు సమస్య ఏమిటో…
పోనీ, బీఆర్ఎస్ మీద కూడా ఏ ఇష్యూ మీద కూడా ఏమీ అనరు… ఎందుకు..? వాళ్లకు బీఆర్ఎస్ పొత్తు కావాలి… అవగాహన కావాలి… అలా వచ్చే ఎన్నికల్ని గట్టెక్కాలి… అదీ తాపత్రయం… అందుకే సైలెంట్… బీఆర్ఎస్ను బీజేపీ ఏమీ అనదు, బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనదు… మోడీ మీద, అమిత్ షా మీద పరోక్ష ఒత్తిడి… బీఆర్ఎస్తో సంసారమే మనకు శరణ్యం అని స్పష్టీకరణ పరోక్షంగా… అందుకే కదా కవిత బయటికొచ్చింది…
మరి రేవంత్ రెడ్డి వైఫల్యం మాటేమిటి అంటారా..? ఎస్, లేకపోలేదు... అదీ చెప్పుకుందాం మరో కథనంలో..!! ప్రస్తుతానికి బీబీబీ... అనగా బీజేపీ, బీఆర్ఎస్ స్ట్రాండ్ జాన్ జిగ్రో దోస్త్‌కు పరిమితం అవుదాం ఈ కథనంలో..!!
Share this Article